Skip to main content

వీటి సాధన.. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ విజయంలో కీలక పాత్ర పోషిస్తుందిలా..

గత మూడేళ్ల ప్రశ్నపత్రాల సాధన... సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు హాజరయ్యే వారికి నా తొలి సలహా ఇది. గత ప్రశ్నపత్రాలు, టెస్టు సిరీస్‌ల సాధన–విశ్లేషణలతో పరీక్షపై అవగాహన వస్తుంది.
 ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్‌ను అనుసరించడం చాలా ముఖ్యమని గుర్తించాలి. ప్రిపరేషన్‌ పరంగా ఉండే ఒత్తిడిని జయించేందుకు రెండు గంటలకోసారి పది, పదిహేను నిమిషాలపాటు విరామం తీసుకోవాలి. ఆ సమయంలో అటూ ఇటూ నడవడం, మంచి నీళ్లు తాగడం వంటివి చేయొచ్చు. అలాగే వారంలో ఒక హాఫ్‌ డేను ఫన్‌ మూవీస్‌ చూడటం, మ్యూజిక్‌ వినడం, ఫ్యామిలీతో గడిపేందుకు వెచ్చించాలి. సివిల్స్‌లో ఆప్షనల్‌ ఎంత కీలకమో తెలిసిందే. దీన్ని ఎంచుకొనే క్రమంలో కొన్ని టిప్స్‌ను అనుసరించాలి. ఏకదాటిగా 8 గంటల అధ్యయనం తర్వాత సైతం ఏ సబ్జెక్టును తెరిస్తే ఇష్టంగా చదవగలమో సదరు సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకోవాలి. దీని తర్వాత జీఎస్‌తో ముడిపడిన సబ్జెక్టును ఎంచుకోవడం లాభిస్తుంది.
– కేశవరపు ప్రేమ్‌సాగర్, 2019 సివిల్స్‌ ర్యాంకర్‌
 
Published date : 27 Feb 2021 03:08PM

Photo Stories