Skip to main content

త్వరలో సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2021 నోటిఫికేషన్‌.. ఏటా ఎంతమంది దరఖాస్తు చేస్తుంటారో తెలుసా?

సివిల్సే శ్వాసగా భావించే అభ్యర్థుల నుంచి మొదలు.. కార్పొరేట్‌ రంగంలో లక్షల రూపాయల జీతాలను సైతం వదులుకొని ఎంతోమంది.. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమవుతుంటారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి ఉన్నత పోస్టులే లక్ష్యంగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ఏటా 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటారు. కాగా, త్వరలో సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2021 నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నేపథ్యంలో.. సివిల్స్‌ అభ్యర్థులకు ఉపయోగపడేలా గత విజేతలు, నిపుణుల అభిప్రాయాలతో ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ 2021 పరీక్ష జూన్‌ 27న జరుగనుంది. అధికశాతం మంది అభ్యర్థులు ఇప్పటికే సీరియస్‌గా ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నారు. నేటికీ మరి కొంత మంది ప్రిపరేషన్‌ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు విజేతలు, నిపుణుల సలహాలు, సూచనలను పాటించడం ద్వారా.. ప్రిలిమ్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించొచ్చు.

తొందరపడొద్దు
ప్రిపరేషన్‌ పరంగా అభ్యర్థులు తొందరపాటు ధోరణి ప్రదర్శించరాదు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ అనేది అభ్యర్థులను బహుముఖ కోణాల్లో పరిశీలించే ఉన్నత ప్రమాణాల పరీక్ష. ఇందులో విజయం సాధించాలంటే.. నిర్మాణాత్మక ప్రిపరేషన్‌తోపాటు ఉన్నత వ్యక్తిత్వం, సహనం, స్థిరత్వం, నిర్విరామ కృషి తప్పనిసరి. అంతేకాదు.. ప్రభుత్వ కొలువుల కోసం నిర్వహించే ఇతర పోటీ పరీక్షలకు సివిల్స్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. సివిల్స్‌లో అడిగే ప్రశ్నలు వైవిధ్యంగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ముందుగా పరీక్ష స్వరూపం, తీరుతెన్నుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
 
Published date : 27 Feb 2021 02:34PM

Photo Stories