Skip to main content

సవాళ్ల కెరీర్‌కు సరైన దారి... సీడీఎస్‌ఈ

దేశ రక్షణలో పాల్పంచుకోవాలనే తపన.. సవాళ్లు స్వీకరించే తత్వం.. ఉన్నతస్థాయి ఉద్యోగంలో స్థిరపడాలనే లక్ష్యం ఉన్న యువతకు త్రివిధ దళాలు స్వాగతం పలుకుతున్నాయి.
శత్రువుల బారి నుంచి దేశాన్ని అహర్నిశలు కాపాడే మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరాలనుకునేవారి కోసం యూపీఎస్సీ ఏటా రెండుసార్లు కంబైన్‌‌డ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. డిగ్రీ అర్హతతో సీడీఎస్‌ఈ ద్వారా ఎంపికై న అభ్యర్థులు శిక్షణ అనంతరం ఆఫీసర్ హోదాతో కెరీర్ ప్రారంభించొచ్చు. శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేల వరకూ పొందే వీలుంది. సీడీఎస్‌ఈ (2)-2018 ప్రకటన విడుదలైన నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు, ప్రిపరేషన్ గెడైన్స్...

విభాగాలు-ఖాళీలు

మొత్తం ఖాళీలు : 414
ఇండియన్ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్): 100
ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమలా): 45
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్): 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై-పురుషులు): 225
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై-మహిళలు): 12

అర్హతలు...
విద్యార్హతలు:
  1. ఇండియన్ మిలటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
  2. నావల్ అకాడమీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత బీటెక్/బీఈ.
  3. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
వయసు:
  • ఇండియన్ మిలిటరీ అకాడమీ: 1995, జూలై 2-2000, జూలై 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష విద్యార్థులు అర్హులు.
  • ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ: 1994, జూలై 2-2000, జూలై 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • నావల్ అకాడమీ: 1995, జూలై 2-2000, జూలై 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష విద్యార్థులు అర్హులు.
  • ఎయిర్ ఫోర్స్ అకాడమీ: 1995, జూలై 2-1999, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ జారీచేసిన కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు ఉంటుంది.
  • నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే అర్హులు.
  • విద్యార్హత పరీక్షల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. కోర్సు ప్రారంభానికి ముందు సర్టిఫికెట్లు చూపించాల్సి ఉంటుంది. ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌కు మొదట ప్రాధాన్యం ఇచ్చేవారు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి ప్రొవిజినల్ సర్టిఫికెట్‌లు చూపించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం :
  1. ఎంపిక ప్రక్రియలో మొదట అన్ని కోర్సుల అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
  2. రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులు.. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరవ్వాలి. ఇది అన్ని కోర్సుల విద్యార్థులకు ఉమ్మడిగా ఐదు రోజుల పాటు ఉంటుంది.
  3. ప్రశ్నల కాఠిన్యత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్‌ సబ్జెక్టులకు గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌కు పదో తరగతి స్థాయిలో ఉంటుంది.
రాత పరీక్ష విధానం :
ఇండియన్ మిలటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలు
సబ్జెక్టు వ్యవధి మార్కులు
ఇంగ్లిష్ 2 గంటలు 100
జనరల్ నాలెడ్జ్‌ 2 గంటలు 100
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 గంటలు 100

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ
ఇంగ్లిష్ 2 గంటలు 100
జనరల్ నాలెడ్జ్‌ 2 గంటలు 100

సన్నద్ధమవ్వండిలా...
ఇంగ్లిష్ :
అభ్యర్థుల ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ముఖ్యంగా వొకాబ్యులరీ, ఇంగ్లిష్‌ను అర్థం చేసుకునే నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. 100 మార్కులకు ఉండే ఈ పేపర్‌లో 120 ప్రశ్నలు వస్తున్నాయి. వాక్యాల్లో పదాల జంబ్లింగ్ ఇస్తారు. వాటి సరైన క్రమాన్ని గుర్తించాలి. స్పాటింగ్ ద ఎర్రర్స్; సెంటెన్స్ ఆర్డరింగ్; సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్; రీడింగ్ కాంప్రెహెన్షన్; ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.

జనరల్ నాలెడ్జ్‌ :
120 ప్రశ్నలు ఉండే ఈ సెక్షన్‌కు 100 మార్కులు కేటాయించారు. ఇందులో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. రక్షణ రంగానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, అవార్డులు, ఉమ్మడి సైనిక విన్యాసాలు తదితరాలపై అవగాహన అవసరం. ప్రశ్నలు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్నారు. కాబట్టి గత ఆర్నెల్ల కాలంలో అంతర్జాతీయంగా, జాతీయంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలను తెలుసుకోవాలి.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ :
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా అకాడమీ పరీక్షల్లో మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. 100 ప్రశ్నలతో ఒక్కోదానికి ఒక్కో మార్కు చొప్పున ఉండే విభాగం ఇది. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ, అర్థమెటిక్, జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్ అధ్యాయాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు పదోతరగతి స్థాయి పుస్తకాలు చదివితే ఈ విభాగానికి పూర్తిస్థాయి సన్నద్ధత లభిస్తుంది.
  • ఆబ్జెక్టివ్ తరహాలోని రాత పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు.
ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ :
ఎస్‌ఎస్‌బీ నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో (స్టేజ్-1 టెస్ట్, స్టేజ్-2) ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్, సైకలాజికల్ పరీక్షల ద్వారా అంచనా వేస్తారు.
స్టేజ్-1: ఇందులో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ (ఓఐఆర్) టెస్ట్‌లు ఉంటాయి. విద్యార్థుల ను ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. వీరికి పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు (పీపీ అండ్ డీటీ) నిర్వహిస్తారు. ఇక్కడ బ్లర్ అయిన ఫోటో ఒక్కటి కనిపిస్తుంది, దాన్ని చూసి అర్థం చేసుకున్న విషయాన్ని కథగా రాయాల్సి ఉంటుంది. దాన్నే బోర్డు సభ్యుల ముందు వివరించాలి. అనంతరం గ్రూపు సభ్యులంతా కలిసి ఫోటో మీద రాసిన కథనాన్ని చర్చించి దానికో ముగింపు ఇవ్వాల్సి ఉంటుంది.
స్టేజ్ 2: స్టేజ్-1లో ఎంపికై న అభ్యర్థులకు స్టేజ్-2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూ, కాన్ఫరెన్సులు ఉంటాయి. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.
  • సైకాలజీ టెస్టుల్లో థీమాటిక్ టెస్ట్ (టీఏటీ) ఉంటుంది. ఇక్కడ 11 ఫోటోల స్లైడ్ షో ఉంటుంది. ప్రతి ఫోటో 30 సెకన్ల పాటు వచ్చిపోతుంది. దానిపై 4 నిమిషాల వ్యవధిలో స్టోరీ రాయాల్సి ఉంటుంది. వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ (ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా విద్యార్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. డబ్ల్యూఏటీలో ఒక్కో పదాన్ని 15 సెకన్ల పాటు చూపించి.. దానిపై స్పందన రాయాల్సి ఉంటుంది.
  • సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ (ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయులు, తన గురించి రాయాల్సి ఉంటుంది. ఈ టెస్టుల అనంతరం రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్ టాస్కులు.. జీడీ, గ్రూప్ ప్లానింగ్ ఎక్సెర్‌సెజైస్, ప్రొగ్రెసివ్ గ్రూప్ టాస్క్, గ్రూప్ అబ్‌స్టాకిల్ రేస్, హాఫ్ గ్రూప్ టాస్క్, లెక్చురెట్టె (ఇచ్చిన టాపిక్స్‌లో ఒకదాన్ని ఎంచుకొని మూడు నిమిషాల పాటు మాట్లాడాలి), ఇండివిడ్యువల్ ఆబ్‌స్టాకిల్స్, కమాండ్ టాస్క్, ఫైనల్ గ్రూప్ టాస్క్ ఉంటాయి.
  • వీటన్నింటి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడు ఇంటర్వ్యూ చేస్తారు. ఇది 35 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుంది. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలకు వెళ్లగానే విద్యార్థి పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్వశ్చనరీ (పీఐక్యూ) ఫామ్ నింపుతారు. దాని ఆధారంగా ఇంటర్వ్యూ సాగుతుంది.
  • అంతిమంగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్‌లో ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్, సైకాలజిస్టులు ఉంటారు. వీరి ముందు విద్యార్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లైయింగ్ బ్రాంచీ వారికి పీఏబీటీ ఉంటుంది. విద్యార్థులకు శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టు విడుదల చేస్తారు.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 3, 2018.
దరఖాస్తు రుసుం: రూ.200 (ఎస్సీ/ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రుసుం లేదు).
రాత పరీక్ష తేదీ: నవంబర్ 18, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://upsconline.nic.in
Published date : 20 Aug 2018 06:07PM

Photo Stories