సివిల్స్ ప్రిలిమ్స్‌లో గెలుపు సొంతం కావాలంటే.. వీటిపై పట్టు సాధించాల్సిందే..
శాఖలు–సంస్థల అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించి.. వాటి నిర్మాణం, చరిత్ర, పనితీరు, కార్యక్రమాలు, మిషన్ల గురించి తెలుసుకోవాలి. లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకం చదవడం లాభిస్తుంది. అలాగే లీగల్ సర్వీస్ ఇండియా.కామ్, ప్రెస్‌బ్యూరో ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లను అనుసరించడం మేలు చేస్తుంది.
సైన్స్–టెక్నాలజీ..
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, 6–10 తరగతుల పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్‌ల అధ్యయనంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి మార్కులు పొందవచ్చు. సిలబస్‌లో 9 కీలక విభాగాలను పేర్కొన్నారు. వీటిలో బయోటెక్నాలజీ టాపిక్ అత్యంత ముఖ్యమైనది. ఈ విభాగం నుంచి ఏటా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో పాటు ఐఓటీ, 3డీ ప్రింటింగ్, హెల్త్‌కేర్, ఐఆర్‌ఎస్, రామ్సమ్‌వేర్, ఏపీఐ యాప్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ శాటిలైట్స్, నావిగేషన్ సిస్టమ్ తదితరాలు ముఖ్యమైనవి.
ఆర్థికం..
ఎకనామిక్స్‌లో స్టాటిక్ పార్ట్ నుంచి ప్రశ్నలు రావట్లేదు. అభ్యర్థుల రెపోరేటు, రివర్స్ రెపో, సీఆర్‌ఆర్ వంటి బేసిక్స్ అంశాల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎకనామిక్స్‌లో అడిగే ప్రశ్నలు ఫ్యాక్చువల్ ఆధారితంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ విభాగాన్ని పూర్తిగా కరెంట్ అఫైర్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. బడ్జెట్, తాజా ఎకనామిక్ సర్వే, న్యూస్ పేపర్లు ప్రిపరేషన్ పరంగా కీలక సోర్సులుగా నిలుస్తాయి. జాగ్రఫీలో అడిగే ప్రశ్నల్లో చాలావరకు అంచనాకు అందట్లేదు. ఎన్‌సీఈఆర్‌టీ ఇంటర్ పుస్తకాలు చదివితే జాగ్రఫీ 90 శాతం మేర కవర్ అవుతుంది.
పథకాలకు ప్రిపేరయ్యేటప్పుడు.. పథకం లక్ష్యం, అమలుచేసే మంత్రిత్వ శాఖలు/నోడల్ ఏజెన్సీలు, ప్రయోజనాలు, అర్హులు, పథకం కిందకు రాని వారు.. తదితరాల గురించి తెలుసుకోవాలి. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఆయుష్మాన్ భారత్, సంసద్ ఆదర్ష్ గ్రామ్ యోజన, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ సిస్టమ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ తదితర కేంద్ర కార్యక్రమాలు/పథకాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.