Skip to main content

సీడీఎస్‌ఈ(2)-2019విజయానికి వ్యూహాలు...

దేశ రక్షణ రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగానికి చక్కటి అవకాశం.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ). ఇది దేశ రక్షణను తమ భుజాల మీద మోస్తున్న త్రివిధ దళాల్లో ఆఫీసర్ కేడర్‌లో చేరేందుకు వీలుకల్పించే పరీక్ష. సీడీఎస్‌ఈ(2)-2019కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడుతున్న మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరాలనుకునే యువతకు సీడీఎస్‌ఈ స్వాగతం పలుకుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై న అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ కోర్సు ఉంటుంది. ఈ శిక్షణ 2020లో మొదలవుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ఆఫీసర్ కేడర్‌తో కెరీర్ ప్రారంభమవుతుంది. ఏటా క్రమం తప్పకుండా వెలువడే సీడీఎస్‌ఈ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గెడైన్స్ గురించి తెలుసుకుందాం...
కోర్సు-ఖాళీల వివరాలు...
మొత్తం ఖాళీలు:
417.
ఇండియన్ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్): 100.
ఇండియన్ నేవల్ అకాడమీ(ఎజిమలా): 45.
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్): 32.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై)(పురుషులు): 225
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(చెన్నై)(మహిళలు): 15

అర్హత:
ఇండియన్ మిలటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి:
మిలటరీ అకాడమీ:
1996, జూలై 2-2001, జూలై 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.
  • ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ: 1995, జూలై 2-2001 జూలై 1 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • నేవల్ అకాడమీ: బీటెక్/బీఈ ఉత్తీర్ణులు అర్హులు.
    వయసు: 1996 జూలై 2- 2001 జూలై 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.
  • ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
    వయసు: 1996, జూలై 2-2000, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ జారీచేసిన కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు ఉంటుంది.
  • నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
    గమనిక: చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఎలాంటి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు ఉండకూడదు. కోర్సు ప్రారంభానికి ముందు ఉత్తీర్ణత పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌కు మొదట ప్రాధాన్యమిచ్చేవారు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి ప్రొవిజినల్ సర్టిఫికెట్ చూపించాలి. మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం :
  • ఎంపిక ప్రక్రియలో మొదట అన్ని కోర్సుల విద్యార్థులకు రాత పరీక్ష ఉంటుంది. ఇండియన్ మిలటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే రాత పరీక్షలో రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు.
  • రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులు సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరవ్వాలి. ఇది అన్ని కోర్సుల విద్యార్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి టెస్టులను 6 రోజులపాటు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూకు 300 మార్కులు :
  • ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో వేర్వేరు పరీక్షలు నిర్వహించి.. ఆఫీసర్ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులను గుర్తిస్తారు. ఈ టెస్టులో మొదటి రోజు స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. ఇదే స్టేజ్-1 టెస్ట్. ఈ దశలో అర్హత సాధిస్తే స్టేజ్-2కు అనుమతిస్తారు.
  • స్టేజ్-1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ (ఓఐఆర్) టెస్ట్‌లు ఉంటాయి. స్టేజ్-2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్కులు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్సులు ఉంటాయి. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.
  • ఆ తర్వాత వర్డ్ అసోసియేషన్ టెస్ట్(డబ్ల్యూఏటీ), సిట్యువేషన్ రియాక్షన్ టెస్ట్ (ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా విద్యార్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. తుదిగా సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల అనంతరం రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్ టాస్కులు ఉంటాయి.
  • వీటన్నింటి తర్వాత బోర్డ్ ప్రెసిడెంట్ లేదా సీనియర్ సభ్యుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు. తుదిగా కాన్ఫరెన్స్ ఉంటుంది. ప్యానెల్ ముందు విద్యార్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్ బ్రాంచ్ వారికి పీఏబీటీ ఉంటుంది. ఫైనల్‌గా రికమెండ్ చేసిన విద్యార్థులకు శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా తుది మెరిట్ లిస్టు విడుదల చేస్తారు.

రాత పరీక్ష.. సన్నద్ధత :
రాత పరీక్షను ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
ఇండియన్ మిలటరీ, నేవల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కోర్సుల ప్రవేశ పరీక్ష స్వరూపం...

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్ నాలెడ్జ్

2 గంటలు

100

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్

2 గంటలు

100


ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ :

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్ నాలెడ్జ్

2 గంటలు

100

  • ప్రశ్నల క్లిష్టత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్‌‌జ పేపర్లకు డిగ్రీ స్థాయిలో; ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌కు పదో తరగతి స్థాయిలో ఉంటుంది.
ఇంగ్లిష్ :
అభ్యర్థుల ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం ఇది. 100 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ను అర్థం చేసుకునే నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌లో యాంటోనిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్సెస్‌లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెసెస్, క్టోజ్ టెస్టు, ఫిల్‌అప్స్, అనాలజీస్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్ ఎర్రర్స్ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్ రూల్స్ తెలుసుకోవాలి. అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెసెస్ కోసం సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.

జనరల్ నాలెడ్జ్ :
ఈ సెక్షన్‌లో 120 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ఇందులో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిఫెన్స్ కు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, జాయింట్ మిలిటరీ ఎక్సెర్‌సెజైస్ -అందులో పాల్గొన్న దేశాలు, ఆయా ఉమ్మడి సైనిక విన్యాసాల పేర్లు మొదలైన వాటిని తెలుసుకోవడం మేలు. కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ :
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్ విభాగం ఉంటుంది. 100 ప్రశ్నలతో ఒక్కోదానికి ఒక్కో మార్కు చొప్పున ఉండే విభాగం ఇది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా, లీనియర్ అండ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, ట్రిగనామెట్రీ, ఫ్యాక్టరైజేషన్ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. పదో తరగతి స్థాయి పుస్తకాలు ఒకటికి నాలుగుసార్లు చదవడం ద్వారా సన్నద్ధత లభిస్తుంది.

ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
జూలై 8, 2019.
రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 8, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://upsconline.nic.in
Published date : 26 Jun 2019 01:00PM

Photo Stories