సీడీఎస్‌ఈ-2014.. సన్నద్ధతకు మార్గాలు..
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఏడాదికి రెండుసార్లు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ)-2014 ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఇండియన్ నావల్ అకాడెమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీల్లో ప్రవేశం లభిస్తుంది. ఎంపికైనవారు సంబంధిత విభాగంలో ఉన్నత హోదాతో ఉద్యోగం పొందొచ్చు. ఈ నేపథ్యంలో సీడీఎస్‌ఈ అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ వివరాలు..
త్రివిధ దళాల్లో ఉద్యోగం సాధించి, మాతృభూమి సంరక్షణలో పాలుపంచుకోవాలనుకునే అభ్యర్థులకు అత్యుత్తమ అవకాశం సీడీఎస్‌ఈ. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌లో విజయం సాధిస్తే అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది. శిక్షణ తర్వాత ప్రారంభంలోనే నెలకు * 45 వేలకు పైగా అందుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
ఎంపిక విధానం:
ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ:
శారీరక, వైద్య పరీక్షలు:
ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. ఎస్‌బీఐ/అనుబంధ బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా * 200 ఫీజుగా చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2013
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 9, 2014
వెబ్‌సైట్: www.upsc.gov.in
సిద్ధమవ్వండిలా..
మ్యాథ్స్
ఇది పదో తరగతి స్థాయిలో ఉంటుంది. సీబీఎస్‌ఈ, లేదా స్టేట్ సిలబస్‌లో 9, 10 తరగతుల మ్యాథ్స్ పుస్తకాలు చదివితే సరిపోతుంది. అదనపు సమయం కేటాయిస్తే ఆర్ట్స్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించొచ్చు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ చాప్టర్లకు ఎక్కువ సమయం వెచ్చించాలి. ఈ మూడు చాప్టర్ల నుంచే 40 శాతానికి తక్కువ కాకుండా ప్రశ్నలడుగుతారు. మిగతా చాప్టర్లకు సమానమైన వెయిటేజ్ ఉంటుంది. అర్థమెటిక్‌లో భాగంగా నంబర్ సిస్టమ్, సహజ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్‌రూట్స్, కాలం-దూరం, కాలం-పని, శాతాలు, వడ్డీ-చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు మొదలైనవాటిపై ప్రశ్నలడుగుతారు. ఇవన్నీ కూడా హైస్కూల్ స్థాయిలో 6 నుంచి పదో తరగతి మ్యాథ్స్‌లో ఉండేవే. అందువల్ల సంబంధిత తరగతుల పాఠ్యపుస్తకాల్లో ప్రశ్నలను సాధన చేయాలి. వీటితోపాటు ఆర్‌ఎస్ అగర్వాల్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ పుస్తకంలోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్
బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఇంగ్లిష్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో పరిశీలించే విధంగా ప్రశ్నలడుగుతారు. మార్కెట్లో దొరికే ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకంలో సిలబస్‌లోని అంశాల వరకు చదివితే చాలు. ఈ విభాగంలో 70 శాతం ప్రశ్నలు ప్రాథమిక వ్యాకరణం నుంచి, 30 శాతం ప్రశ్నలు కాంప్రహెన్సన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, అనాలజీ అంశాలపై అడుగుతారు. ఇంగ్లిష్ విభాగంలో ఎక్కువ మార్కులు పొందడానికి రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం, నార్మన్ లూయీస్ రాసిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ బాగా ఉపయోగపడతాయి.
జనరల్ నాలెడ్జ్
వర్తమాన వ్యవహారాల కోసం ప్రతిరోజూ ప్రామాణిక దినపత్రికలు చదవాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. పరిసరాలపై కాస్త అవగాహన ఉంటే జీకే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికే. భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల కోసం 8,9,10 తరగతుల సోషల్ పుస్తకాలు చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణల కోసం ఏదైనా ఇయర్ బుక్‌లోని కరెంట్ అఫైర్స్ సెక్షన్‌ను ఔపోసన పట్టాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ముఖ్యమైనవే. ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన వివిధ క్షిపణులు, వాటి పరిధి, అంతరిక్ష ఉపగ్రహాలు, వాటిని వేటి కోసం ఉద్దేశించారు? ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఇలా అన్ని కోణాల్లో సిద్ధమవ్వాలి.
ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్
రాత పరీక్ష, వైద్య, శారీరక పరీక్షల్లో విజయం సాధించిన వారిని ఖాళీలకనుగుణంగా పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని వ్యక్తిత్వ పరీక్షగా చెప్పుకోవచ్చు. ఇందులో విజయం సాధించడానికి ప్రతిరోజూ ఏదైనా పేపర్ చదవాలి. జాతీయ ఇంగ్లిష్ చానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాలు వినాలి. ఏదైనా టాపిక్ ఎంచుకొని అద్దం ముందు నిల్చొని కనీసం ఐదు నిమిషాలు మాట్లాడాలి. అలా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలి. ఇంటర్వ్యూలో భాగంగా ఇంకా వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్‌తోపాటు ఏదైనా సందర్భం చెప్పి దానికి అభ్యర్థి ఎలా స్పందిస్తారో తెలుసుకుంటారు. ఔట్‌డోర్ గ్రూప్ టాస్క్ కూడా ఉంటుంది. ఏదైనా అంశంలో ఉపన్యసించమని కూడా అడుగుతారు. ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ అభ్యర్థులకు పైలట్ బ్యాటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీబీఏటీ) ను కూడా నిర్వహిస్తారు. వర్తమాన వ్యవహారాలతోపాటు వివిధ అంశాలపై ప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కుల కోసం అన్ని విషయాల్లోనూ ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు లాజికల్ థింకింగ్‌ను అలవర్చుకోవాలి.

ఇండియన్ మిలిటరీ అకాడెమీ (డెహ్రాడూన్) | 250 |
ఇండియన్ నావల్ అకాడెమీ (ఎజిమల) | 40 |
ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ (హైదరాబాద్) | 32 |
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (చెన్నై) (పురుషులు) | 175 |
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (చెన్నై) (మహిళలు) | 12 |
ఎంపిక విధానం:
- రాత పరీక్ష; శారీరక, వైద్య పరీక్షలు, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష విధానం:
- రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. సరైన సమాధానానికి ఇచ్చే మార్కుల నుంచి 0.33 శాతం మార్కులు తగ్గిస్తారు. మొత్తం మూడు పేపర్లలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పదో తరగతి స్థాయిలో ఉంటాయి.
ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ
సబ్జెక్ట్ | వ్యవధి | మార్కులు |
ఇంగ్లిష్ | 2 గంటలు | 100 |
జనరల్ నాలెడ్జ్ | 2 గంటలు | 100 |
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ | 2 గంటలు | 100 |
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ:
సబ్జెక్ట్ | వ్యవధి | మార్కులు |
ఇంగ్లిష్ | 2 గంటలు | 100 |
జనరల్ నాలెడ్జ్ | 2 గంటలు | 100 |
శారీరక, వైద్య పరీక్షలు:
- రాత పరీక్ష ఉత్తీర్ణులకు శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థులు నిర్దేశిత ఎత్తు, బరువు కలిగి ఉన్నారో.. లేదో పరీక్షిస్తారు. పరుగుపందెం, ఇతర పోటీలు ఉంటాయి. వైద్య పరీక్షలో భాగంగా దృష్టి లోపాలు, శారీరక వైకల్యాలను గుర్తించి అలాంటి వారిని తొలగిస్తారు.
శిక్షణలో:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారు ఎంచుకున్న ప్రాధాన్యం, మెరిట్, అవకాశాన్ని బట్టి ఏదో ఒక సర్వీస్‌కు ఎంపిక చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడెమీ-డెహ్రాడూన్, నావల్ అకాడెమీ-గోవా, ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ-హైదరాబాద్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ-చెన్నైల్లో ఆయా విభాగాల్లో శిక్షణ నిర్వహిస్తారు. రక్షణ దళాలకు అవసరమైనవన్నీ శిక్షణలో నేర్పుతారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అకాడెమీల్లో 18 నెలల శిక్షణ ఉంటుంది. ఓటీఏ అభ్యర్థులకు 11 నెలల శిక్షణ నిర్వహిస్తారు. ట్రెక్కింగ్, జంపింగ్, స్కిప్పింగ్, రైఫిల్ షూటింగ్ లాంటి సాహసకృత్యాలు, అందులోని మెలకువలు నేర్పుతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఆల్‌రౌండర్‌గా రాణించేలా తర్ఫీదునిస్తారు. శిక్షణలో నివాస సౌకర్యం, బుక్స్, యూనిఫామ్, వైద్య సౌకర్యాలు అందిస్తారు. అంతేకాకుండా నెలకు * 21000 స్టైపెండ్‌గా లభిస్తుంది.
ఉద్యోగంలో:
ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్ ఆరంభమవుతుంది. ఈ మూడూ సమాన హోదా ఉద్యోగాలే. హోదాకు తగ్గట్టుగానే బాధ్యతలుంటాయి. 24/7 పర్యవేక్షణ ఉంటుంది. బృందంతో కలిసి పనిచేయాలి. బృంద నేతగా సభ్యులకు మార్గనిర్దేశం చేయాలి. ఏ సర్వీస్‌లో చేరినప్పటికీ కెరీర్ ఆరంభంలోనే అన్ని అలవెన్సులూ కలుపుకొని నెలకు *45,000కు పైగా వేతనం లభిస్తుంది.
ఇవీ బెనిఫిట్స్:
ఉన్నతస్థాయి వసతులు, అన్నింటా రాయితీలు, సివిల్స్ లాంటి పరీక్షలకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల వరకు సడలింపు, జీవితాంతం కుటుంబమంతటికీ ఉచితంగా పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు, బీమా రక్షణ, సబ్సిడీ ధరల్లో ఆహార సామగ్రి, విమాన, రైలు ప్రయాణాల్లో తగ్గింపులు, బంజరు భూముల కేటాయింపు, తక్కువ వడ్డీకి రుణాలు, ఉన్నత చదువుల కోసం రెండేళ్లపాటు పెయిడ్ లీవ్ వంటి సదుపాయాలుంటాయి. పిల్లలకు ఉచిత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్, స్కాలర్‌షిప్‌లు ఇస్తారు.
పదోన్నతులిలా:
ప్రతి రెండు లేదా మూడేళ్లకు ప్రమోషన్లు ఉంటాయి. పదమూడేళ్లు సర్వీస్‌లో కొనసాగితే సంబంధిత విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్, కమాండర్, వింగ్ కమాండర్ హోదా పొందొచ్చు.
ప్రతికూలతలివీ:
మిగిలిన ఉద్యోగాల్లా నచ్చిన చోట పనిచేసే అవకాశం అన్ని వేళలా సాధ్యపడదు. దేశంలో ఏమూలైనా, ఏచోటైనా పనిచేయాల్సి రావడం... కొండలు, లోయలు, గుట్టలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఉద్యోగ విధులు నిర్వర్తించాలి. అనుకున్న వెంటనే సెలవు దొరకకపోవడం, కొన్నిచోట్ల క్వార్టర్స్ సదుపాయం లేకపోవడంతో కుటుంబానికి దూరంగా గడపడం లాంటివి ఉద్యోగంలో ఎదురవుతాయి. అద్భుతమైన అవకాశాల ముందు ఈ ప్రతికూలతలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన సెక్టార్లలోనూ బదిలీలు తప్పడం లేదు.
నోటిఫికేషన్ సమాచారం
అర్హత:

- అన్ని విభాగాలకు అవివాహితులైనవారు మాత్రమే అర్హులు.
- ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
- నావల్ అకాడెమీకి బీటెక్/బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఎయిర్‌ఫోర్స్ అకాడెమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా బీటెక్ ఉత్తీ ర్ణులు కూడా అర్హులే. ఫైనల్ ఇయర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్వ్యూ నాటికి సర్టిఫికెట్లను చూపాలి.
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీకి మాత్రమే మహిళలు అర్హులు. మిగిలిన విభాగాలకు అర్హులు కాదు.
- ఇండియన్ మిలిటరీ అకాడెమీ, నావల్ అకాడెమీల కోసం జనవరి 2, 1991- జనవరి 1, 1996 మధ్య
- ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ పోస్టులకు జనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య.
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (పురుషులు, మహిళలు) పోస్టులకు జనవరి 2, 1990- జనవరి 1, 1996 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. ఎస్‌బీఐ/అనుబంధ బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా * 200 ఫీజుగా చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు వెబ్‌సైట్:
www.upsconline.nic. in. - రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2013
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 9, 2014
వెబ్‌సైట్: www.upsc.gov.in
సిద్ధమవ్వండిలా..
మ్యాథ్స్
ఇది పదో తరగతి స్థాయిలో ఉంటుంది. సీబీఎస్‌ఈ, లేదా స్టేట్ సిలబస్‌లో 9, 10 తరగతుల మ్యాథ్స్ పుస్తకాలు చదివితే సరిపోతుంది. అదనపు సమయం కేటాయిస్తే ఆర్ట్స్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించొచ్చు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ చాప్టర్లకు ఎక్కువ సమయం వెచ్చించాలి. ఈ మూడు చాప్టర్ల నుంచే 40 శాతానికి తక్కువ కాకుండా ప్రశ్నలడుగుతారు. మిగతా చాప్టర్లకు సమానమైన వెయిటేజ్ ఉంటుంది. అర్థమెటిక్‌లో భాగంగా నంబర్ సిస్టమ్, సహజ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్‌రూట్స్, కాలం-దూరం, కాలం-పని, శాతాలు, వడ్డీ-చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు మొదలైనవాటిపై ప్రశ్నలడుగుతారు. ఇవన్నీ కూడా హైస్కూల్ స్థాయిలో 6 నుంచి పదో తరగతి మ్యాథ్స్‌లో ఉండేవే. అందువల్ల సంబంధిత తరగతుల పాఠ్యపుస్తకాల్లో ప్రశ్నలను సాధన చేయాలి. వీటితోపాటు ఆర్‌ఎస్ అగర్వాల్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ పుస్తకంలోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లిష్
బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఇంగ్లిష్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో పరిశీలించే విధంగా ప్రశ్నలడుగుతారు. మార్కెట్లో దొరికే ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకంలో సిలబస్‌లోని అంశాల వరకు చదివితే చాలు. ఈ విభాగంలో 70 శాతం ప్రశ్నలు ప్రాథమిక వ్యాకరణం నుంచి, 30 శాతం ప్రశ్నలు కాంప్రహెన్సన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, అనాలజీ అంశాలపై అడుగుతారు. ఇంగ్లిష్ విభాగంలో ఎక్కువ మార్కులు పొందడానికి రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం, నార్మన్ లూయీస్ రాసిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ బాగా ఉపయోగపడతాయి.
జనరల్ నాలెడ్జ్
వర్తమాన వ్యవహారాల కోసం ప్రతిరోజూ ప్రామాణిక దినపత్రికలు చదవాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. పరిసరాలపై కాస్త అవగాహన ఉంటే జీకే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికే. భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల కోసం 8,9,10 తరగతుల సోషల్ పుస్తకాలు చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణల కోసం ఏదైనా ఇయర్ బుక్‌లోని కరెంట్ అఫైర్స్ సెక్షన్‌ను ఔపోసన పట్టాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ముఖ్యమైనవే. ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన వివిధ క్షిపణులు, వాటి పరిధి, అంతరిక్ష ఉపగ్రహాలు, వాటిని వేటి కోసం ఉద్దేశించారు? ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఇలా అన్ని కోణాల్లో సిద్ధమవ్వాలి.
ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్
రాత పరీక్ష, వైద్య, శారీరక పరీక్షల్లో విజయం సాధించిన వారిని ఖాళీలకనుగుణంగా పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని వ్యక్తిత్వ పరీక్షగా చెప్పుకోవచ్చు. ఇందులో విజయం సాధించడానికి ప్రతిరోజూ ఏదైనా పేపర్ చదవాలి. జాతీయ ఇంగ్లిష్ చానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాలు వినాలి. ఏదైనా టాపిక్ ఎంచుకొని అద్దం ముందు నిల్చొని కనీసం ఐదు నిమిషాలు మాట్లాడాలి. అలా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలి. ఇంటర్వ్యూలో భాగంగా ఇంకా వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్‌తోపాటు ఏదైనా సందర్భం చెప్పి దానికి అభ్యర్థి ఎలా స్పందిస్తారో తెలుసుకుంటారు. ఔట్‌డోర్ గ్రూప్ టాస్క్ కూడా ఉంటుంది. ఏదైనా అంశంలో ఉపన్యసించమని కూడా అడుగుతారు. ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ అభ్యర్థులకు పైలట్ బ్యాటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీబీఏటీ) ను కూడా నిర్వహిస్తారు. వర్తమాన వ్యవహారాలతోపాటు వివిధ అంశాలపై ప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కుల కోసం అన్ని విషయాల్లోనూ ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు లాజికల్ థింకింగ్‌ను అలవర్చుకోవాలి.
Published date : 08 Nov 2013 03:53PM