సాయుధ దళాల్లో సాహస కొలువులో చేరాలకునే వారికి సదావకాశం.. సీఏఫీఎఫ్ 2021 నోటిఫికేషన్ విడుదల..
Sakshi Education
కోణంలో ఆయా దళాల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ లేదా అంతకంటే ఉన్నతమైన ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయికి చేరుకోవచ్చు
. కెరీర్‌లో అత్యంత ప్రతిభ చూపిన వారు ఆయా దళాల్లో అత్యున్నతమైన అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది.
అసిస్టెంట్ కమాండెంట్ కెరీర్.. ఇలా
- ఆరేళ్ల సర్వీసు తర్వాత డిప్యూటీ కమాండెంట్‌గా పదోన్నతి.
- ఆరు నుంచి 12 ఏళ్ల సర్వీసుతో రెండో ఇంచార్జ్ కమాండెంట్‌గా పదోన్నతి.
- 16 నుంచి 20 ఏళ్ల సర్వీసుతో కమాండెంట్ హోదా.
- 20 నుంచి 23 ఏళ్ల సర్వీసుతో డీఐజీగా పదోన్నతి.
- 23 నుంచి 26 ఏళ్ల సర్వీసుతో ఐజీ హోదా.
కెరీర్‌లో అత్యంత ప్రతిభా పాటవాలు చూపితే అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాను కూడా సొంతం చేసుకోవచ్చు.
ప్రిపరేషన్ టిప్స్..
ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన, రైటింగ్ ప్రాక్టీస్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు పెంచుకోవాలి. అలాగే ప్రిపరేషన్ పూర్తి చేశాక.. ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవడం పరీక్షకు ముందు రివిజన్‌కు ఉపయోగపడుతుంది. అలాగే మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా పరీక్షలో విజయానికి దోహదపడుతుందని చెప్పొచ్చు.
సీఏపీఎఫ్ (ఏసీ)–2021 ముఖ్య సమాచారం..
- దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: మే 5, 2021.
- దరఖాస్తుల ఉపసంహరణ అవకాశం: మే 12 నుంచి మే 18 వరకు.
- సీఏపీఎఫ్ రాత పరీక్ష తేదీ: ఆగస్ట్ 8, 2021.
- తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in
- ఆన్‌లైన్ దరఖాస్తుకు వెబ్‌సైట్: https://upsconline.nic.in/
Published date : 27 Apr 2021 03:14PM