Skip to main content

కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్

కంబైన్‌‌డ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్‌‌డ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో గ్రూప్-ఎ హోదా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో సంబంధిత నోటిఫికేషన్ వివరాలు..

ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులను రెండు కేటగిరీలుగా విభజించారు. అవి..
కేటగిరీ-1:
(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్)
జియాలజిస్ట్ (గ్రూప్-ఎ)
100 పోస్టులు
జియోఫిజిస్ట్ (గ్రూప్-ఎ) 80 పోస్టులు
కెమిస్ట్ (గ్రూప్-ఎ) 80 పోస్టులు

కేటగిరీ-2:
(సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ వాటర్ రీసోర్సెస్)
జూనియర్‌హైడ్రాలజిస్ట్(సైంటిస్ట్-బి,గ్రూప్-ఏ) 5పోస్టులు

అర్హతలు:
  • జియాలజిస్ట్: మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజికల్ సైన్స్/ జియాలజీ/అప్లయిడ్ జియాలజీ/జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ఇంజనీరింగ్ జియాలజీ/మెరైన్ జియాలజీ/ఎర్త్ సైన్స్ అండ్ రీసోర్సెస్ మేనేజ్‌మెంట్ ఓషియానోగ్రఫి అండ్ కోస్టల్ ఏరియా స్టడీస్/పెట్రోలియం జియోసైన్స్/పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్/జియో కెమిస్ట్రీ/జియోలాజికల్/జియోఫిజికల్ టెక్నాలజీ.
  • జియోఫిజిస్ట్: ఎంఎస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/ జియోఫిజిక్స్/ అప్లయిడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్) లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్) లేదా ఎంఎస్సీ టెక్ (అప్లయిడ్ జియోఫిజిక్స్).
  • కెమిస్ట్: ఎంఎస్సీ (కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ)
  • జూనియర్ హైడ్రాలజిస్ట్: మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ/మెరైన్ జియాలజీ.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ అనే రెండు దశలాధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం ఎంపిక ప్రక్రియకు 900 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష 700 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్‌కు 200 మార్కులు కేటాయించారు.

రాత పరీక్ష ఇలా:
రాత పరీక్షను కన్వెన్షన్ (ఎస్సే) విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే రూపొందిస్తారు. సమాధానాలను తప్పనిసరిగా ఇంగ్లిష్ భాషలో మాత్రమే రాయాలి. ప్రశ్నల క్లిష్టత ఆయా పోస్టులకు అర్హతగా పేర్కొన్న డిగ్రీల స్థాయిలో ఉంటుంది. రాత పరీక్షను ఇంగ్లిష్, సబ్జెక్ట్ పేపర్ల కలయికగా నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ పేపర్ అన్ని కేటగిరీ పోస్టులకు ఉమ్మడిగా ఉంటుంది. పరీక్ష వివరాలు..

సబ్జెక్ట్ సమయం మార్కులు
జనరల్ ఇంగ్లిష్ 3 గంటలు 100
జియాలజిస్ట్
జియాలజీ పేపర్-1
3 గంటలు 200
జియాలజీ పేపర్-2 3 గంటలు 200
జియాలజీ పేపర్-3 3 గంటలు 200
జియోఫిజిస్ట్
జియోఫిజిక్స్ పేపర్-1
3 గంటలు 200
జియోఫిజిక్స్ పేపర్-2 3 గంటలు 200
జియోఫిజిక్స్ పేపర్-3 3 గంటలు 200
కెమిస్ట్
కెమిస్ట్రీ పేపర్-1
3 గంటలు 200
కెమిస్ట్
కెమిస్ట్రీ పేపర్-2
3 గంటలు 200
కెమిస్ట్
కెమిస్ట్రీ పేపర్-3
3 గంటలు 200
జూనియర్ హైడ్రాలజిస్ట్
జియాలజీ పేపర్-1
3 గంటలు 200
జియాలజీ పేపర్-2 3 గంటలు 200
హైడ్రాలజీ 3 గంటలు 200
ఇంగ్లిష్ భాషలో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం.. జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉండొచ్చు. ఇందులో అభ్యర్థి నిర్దేశించిన అంశంపై ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. మిగతా విభాగాల్లో పని చేసే సందర్భంలో ఎదురయ్యే సంఘటనలు, నిత్య జీవితంలో ఉపయోగించే భాష వంటి అంశాలాధారంగా ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఇంగ్లిష్‌లో కేవలం భావ వ్యక్తీకరణే కాకుండా వాక్య నిర్మాణ శైలిని పరిశీలిస్తారు. కాబట్టి వొకాబ్యులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి. ఇందులో మెరుగైన మార్కుల కోసం ప్రతి రోజూ ఆంగ్ల దినపత్రికలు, ప్రముఖ పత్రికలు చదవడం లాభిస్తుంది. అదేవిధంగా యూపీఎస్సీ వివిధ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లోని ఇంగ్లిష్ విభాగాన్ని పరిశీలిస్తూ ప్రిపేర్ కావడం ఉపయుక్తం.

సబ్జెక్ట్ పేపర్లు.. మాస్టర్ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. ఆయా సబ్జెక్ట్‌ల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. కన్వెన్షన్ పద్ధతిలో సమాధానాలు రాయాలి. కాబట్టి జవాబు రాసే క్రమంలో సమయోచితంగా వ్యవహరించాలి. ఇచ్చిన ప్రశ్న ఆధారంగా సమాచారాన్ని విశ్లేషిస్తూ, అర్థవంతంగా, తక్కువ పదాల్లో ఎక్కువ సమాధానాన్ని ప్రెజెంట్ చేయాలి. అప్పుడే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి. వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు.

అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్‌ల ఆధారంగా ఎస్సే రాయాలి. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఈ నేపథ్యంలో కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా గత ప్రశ్నపత్రాల ఆధారంగా.. సమాధానాలను ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. రిఫరెన్స్ కోసం అన్ని రకాల పుస్తకాలను సిలబస్‌ను పరిశీలిస్తూ.. ఆయా అంశాలకు సంబంధించి ప్రభావవంతమైన సమాచారం ఉన్న పుస్తకాలను ఎంచుకోవడం మంచిది.

ఇంటర్వ్యూ:
రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తర్వాతి దశ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందుకోసం 200 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థిలోని స్కిల్స్‌ను మాత్రమే పరీక్షిస్తారు. ఎంచుకున్న పోస్టుకు కావల్సిన లక్షణాలు ఉన్నాయా?, లేవా? నాయకత్వ లక్షణాలు, చొరవ, మేధో సామర్థ్యం, సామాజిక అవగాహన, మానసిక సామర్థ్యం తదితర అంశాలను పరీక్షిస్తారు.

నోటిఫికేషన్ సమాచారం:
వయసు:
కేటగిరీ-1 పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు (ఆగస్ట్ 1, 2014 నాటికి);
కేటగిరీ-2 పోస్టులకు 21 నుంచి 35 ఏళ్లు (ఆగస్ట్ 1, 2014 నాటికి).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2014.
రాతపరీక్షలు ప్రారంభం: మే 24, 2014.

వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 13 Mar 2014 03:49PM

Photo Stories