Skip to main content

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పరీక్ష ద్వారా మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ త్రివిధ దళాల్లో ఉన్నతమైన హోదాతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో అర్హత, పరీక్షా విధానం, సంబంధిత వివరాలు..

ఖాళీలు:

ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్)

200

ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమలా)

45

ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్)

32

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (పురుషులు)

175

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (మహిళలు)

12



ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు.

రాత పరీక్ష:
రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న విభాగాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది.

ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2గంటలు

100

జనరల్ నాలెడ్జ్

2గంటలు

100

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్

2గంటలు

100



ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ:

సబ్జెక్ట్

వ్యవధి

మార్కులు

ఇంగ్లిష్

2 గంటలు

100

జనరల్ నాలెడ్జ్

2 గంటలు

100


ఈ పరీక్షలో ప్రశ్నల క్లిష్టత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పదో తరగతి స్థాయిలో ఉంటుంది.

అర్హత:
అన్ని విభాగాలకు అవివాహితులైనవారు మాత్రమే అర్హు లు. ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నావల్ అకాడమీకి బీటెక్/బీఈ. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు.

వయోపరిమితి:
ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడెమీల కోసం జనవరి 2, 1992- జనవరి 1, 1997 మధ్య, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (పురుషులు, మహిళలు) పోస్టులకు జనవరి 2, 1991- జనవరి 1, 1997 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015.
వెబ్‌సైట్: www.upsc.gov.in

సిద్ధమవ్వండిలా..
మ్యాథ్యమెటిక్స్
పదో తరగతి స్థాయిలో ఉంటుంది. సీబీఎస్‌ఈ, లేదా స్టేట్ సిలబస్‌లో 9, 10 తరగతుల మ్యాథ్స్ పుస్తకాలు చదివితే సరిపోతుంది. అదనపు సమయం కేటాయిస్తే ఆర్ట్స్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించొచ్చు. ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్ చాప్టర్లకు ఎక్కువ సమయం వెచ్చించాలి. ఈ మూడు చాప్టర్ల నుంచే 40 శాతానికి తక్కువ కాకుండా ప్రశ్నలడుగుతారు. మిగతా చాప్టర్లకు సమానమైన వెయిటేజ్ ఉంటుంది. అర్థమెటిక్‌లో భాగంగా నంబర్ సిస్టమ్, సహజ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్‌రూట్స్, కాలం-దూరం, కాలం-పని, శాతాలు, వడ్డీ-చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు మొదలైనవాటిపై ప్రశ్నలడుగుతారు. ఇవన్నీ కూడా హైస్కూల్ స్థాయిలో 6 నుంచి పదో తరగతి మ్యాథ్స్‌లో ఉండేవే. అందువల్ల సంబంధిత తరగతుల పాఠ్యపుస్తకాల్లో ప్రశ్నలను సాధన చేయాలి. వీటితోపాటు ఆర్‌ఎస్ అగర్వాల్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ పుస్తకంలోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.

ఇంగ్లిష్
బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఇంగ్లిష్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో పరిశీలించే విధంగా ప్రశ్నలడుగుతారు. మార్కెట్లో దొరికే ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకంలో సిలబస్‌లోని అంశాల వరకు చదివితే చాలు. ఈ విభాగంలో 70 శాతం ప్రశ్నలు ప్రాథమిక వ్యాకరణం నుంచి, 30 శాతం ప్రశ్నలు కాంప్రహెన్సన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, అనాలజీ అంశాలపై అడుగుతారు. ఇంగ్లిష్ విభాగంలో ఎక్కువ మార్కులు పొందడానికి రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం, నార్మన్ లూయీస్ రాసిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ బాగా ఉపయోగపడతాయి.

జనరల్ నాలెడ్జ్
వర్తమాన వ్యవహారాల కోసం రోజూ ప్రామాణిక దినపత్రికలు చదవాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. పరిసరాలపై కాస్త అవగాహన ఉంటే జీకే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికే. భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల కోసం 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు చదవాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణల కోసం ఏదైనా ఇయర్ బుక్‌లోని కరెంట్ అఫైర్స్ సెక్షన్‌ను ఔపోసన పట్టాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ముఖ్యమైనవే. ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన వివిధ క్షిపణులు, వాటి పరిధి, అంతరిక్ష ఉపగ్రహాలు, వాటిని వేటి కోసం ఉద్దేశించారు? ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఇలా అన్ని కోణాల్లో సిద్ధమవ్వాలి.

ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్
రాత పరీక్ష, వైద్య, శారీరక పరీక్షల్లో విజయం సాధించిన వారిని ఖాళీలకనుగుణంగా పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని వ్యక్తిత్వ పరీక్షగా చెప్పుకోవచ్చు. ఇందులో విజయం సాధించడానికి ప్రతిరోజూ ఏదైనా పేపర్ చదవాలి. జాతీయ ఇంగ్లిష్ చానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాలు వినాలి. ఏదైనా టాపిక్ ఎంచుకొని అద్దం ముందు నిల్చొని కనీసం ఐదు నిమిషాలు మాట్లాడాలి. అలా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలి. ఇంటర్వ్యూలో భాగంగా ఇంకా వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్‌తోపాటు ఏదైనా సందర్భం చెప్పి దానికి అభ్యర్థి ఎలా స్పందిస్తారో తెలుసుకుంటారు. ఔట్‌డోర్ గ్రూప్ టాస్క్ కూడా ఉంటుంది. ఏదైనా అంశంలో ఉపన్యసించమని కూడా అడుగుతారు. ఎయిర్‌ఫోర్స్ అకాడెమీ అభ్యర్థులకు పైలట్ బ్యాటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీబీఏటీ)ను కూడా నిర్వహిస్తారు. వర్తమాన వ్యవహారాలతోపాటు వివిధ అంశాలపై ప్రశ్నిస్తారు. ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కుల కోసం అన్ని విషయాల్లోనూ ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు లాజికల్ థింకింగ్‌ను అలవర్చుకోవాలి.

రిఫరెన్స్ బుక్స్:
  • పాత్‌ఫైండర్ సీడీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్
  • చాప్టర్‌వైజ్-సెక్షన్ వైజ్ సీడీఎస్ సాల్వ్‌డ్ పేపర్స్-అర్హింత్ పబ్లికేషన్స్
  • ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ -ఉప్‌కార్ పబ్లికేషన్స్
Published date : 13 Nov 2014 04:36PM

Photo Stories