Skip to main content

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019విజయానికి టిప్స్...

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో చేరేందుకు చక్కటి మార్గం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్‌కమిషన్ (యూపీఎస్సీ)-ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ). ఈ పరీక్షకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ తదితర కీలక విభాగాల్లో 581 గ్రూప్-ఏ, బి ఇంజనీరింగ్ పోస్టులను భర్తీచేస్తారు. దేశ వ్యాప్తంగా తీవ్రపోటీ ఉండే ఈఎస్‌ఈలో విజయానికి నిపుణుల సూచనలు, టాపర్స్ టిప్స్...
మొత్తం పోస్టులు : 581
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ ఈ) ద్వారా కేంద్ర ప్రభుత్వ ఇంజనీర్ ఉద్యోగాన్ని చేజిక్కించుకున్న వారు ప్రారంభంలోనే నెలకు రూ.70 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు.

అర్హతలు..
  • సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులను భర్తీచేస్తారు.
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 2019, జనవరి 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. (1989, జనవరి 2 - 1998, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి).
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్లు; రిజర్వేషన్లు వర్తించే ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. నిర్దేశిత ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి నిబంధలకు లోబడి వయోసడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం :
  1. మూడు దశల్లో అభ్యర్థి ప్రతిభను పరీక్షిస్తారు. అవి.. స్టేజ్ 1-ప్రిలిమ్స్, స్టేజ్ 2-మెయిన్స్, స్టేజ్-3 పర్సనాలిటీ టెస్ట్.
  2. స్టేజ్ 1-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2-మెయిన్స్ ఉంటుంది. ఈ పరీక్ష కన్వెన్షనల్ విధానంలో ఉంటుంది.
  3. స్టేజ్ 3.. చివరి దశలో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించి మెరిట్ జాబితా రూపొందిస్తారు.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం :

సబ్జెక్టు

సమయం

మార్కులు

పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్

2 గంటలు

200

పేపర్-2: సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టు

3 గంటలు

300

మొత్తం

500

  • ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు.
  • వాస్తవానికి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షల్లో ప్రిలిమ్స్‌ను కేవలం అర్హత పరీక్షగా భావిస్తారు. కానీ, ఈఎస్‌ఈలో ప్రిలిమ్స్ మార్కులను కూడా తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు.

మెయిన్ ఎగ్జామినేషన్

పేపర్

సబ్జెక్టు

మార్కులు

1

సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్

300

2

సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్

300

మొత్తం

600

  • ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం అందుబాటులోఉంటుంది.
  • తుది దశ పర్సనాలిటీ టెస్ట్ 200 మార్కులకు ఉంటుంది.

సన్నద్ధత వ్యూహాలు...
  1. ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష సిలబస్ విస్తృతంగా ఉంది. కాబట్టి అభ్యర్థులు సాధ్యమైనంత ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
  2. ఈఎస్‌ఈ పరీక్షలో ప్రిలిమ్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే.. ఇందులో సాధించే మార్కులను తుది జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకుంటారు.
  3. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గత ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించడం ద్వారా ప్రశ్నల తీరు, కాఠిన్యత స్థాయిపై అవగాహన పెంపొందించుకోవచ్చు. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ వ్యూహాలను సిద్ధం చేసుకోవచ్చు.
  4. ముందుగా ఎక్కువగా దృష్టిసారించాల్సిన ముఖ్యమైన అంశాలు.. అదేవిధంగా అధిక సమయం కేటాయించాల్సిన టాపిక్స్‌తో ప్రత్యేకంగా టైంటేబుల్ రూపొందించుకోవాలి. సమయం 3 నెలలే ఉంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ సాగించాలి.
  5. సిలబస్‌లో పేర్కొన్న అంశాలను క్రమపద్ధతిలో విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రణాళిక ప్రకారం పూర్తి ఏకాగ్రతతో చదివితే ఏకకాలంలో గేట్, ఈఎస్‌ఈలో విజయం సాధించొచ్చు. గేట్ ద్వారా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు పొందే వీలుంది.
  6. ప్రిలిమ్స్‌లో ఉండే జనరల్ స్టడీస్ కోసం కొంత సమయం కేటాయించాలి. జాతీయ, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ముఖ్య సంఘటనలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. అందుకోసం ఏదైనా ఒక ప్రామాణిక ఇంగ్లిష్ (హిందూ)/తెలుగు (సాక్షి) దినపత్రికను పోటీ పరీక్షల కోణంలో చదవడం లాభిస్తుంది.
  7. మెటీరియల్ ఎంపికలోనూ అప్రమత్తంగా ఉండాలి. ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని.. చదివిన వాటినే మళ్లీమళ్లీ చదవాలి. సిద్ధం చేసుకున్న సొంత నోట్స్‌ను రివిజన్ చేసుకోవాలి. ముఖ్యాంశాలు, ఫార్ములాలను కంఠతా చేయాలి.
  8. సమయపాలన కోసం మాక్‌టెస్టులు రాయడం తప్పనిసరి. సిలబస్‌ను పూర్తిచేశాక గ్రాండ్ టెస్టులు రాస్తే బలాలు, బలహీనతలను బేరీజు చేసుకోవచ్చు. ఫలితాలను పూర్తిస్థాయిలో సమీక్షిం చుకోవచ్చు. స్వీయ విశ్లేషణతో ప్రిపరేషన్ స్థాయిపై ఒక అంచనాకు రావొచ్చు.

సబ్జెక్టులు-ముఖ్యాంశాలు..
ఎలక్ట్రికల్ :
ఎలక్ట్రికల్ సర్క్యూట్లు, ఫీల్డ్స్, ఎలక్ట్రికల్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్; కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్‌సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిస్టమ్ అండ్ సిగ్నల్ ప్రాసెసర్స్.

మెకానికల్ ఇంజనీరింగ్ :
ఇంజనీరింగ్ మెకానిక్స్, మెటీరియల్స్; మెకానిజమ్స్ అండ్ మెషీన్స్; ఇండస్ట్రియల్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఐసీ ఇంజన్స్, టర్బో మెషినరీ, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, డిజైన్ ఆఫ్ మెషీన్ ఎలిమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్.

ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ :
కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్ సర్క్యూట్లు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, మెటీరియల్స్ సైన్స్, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, నెట్‌వర్క్ థియరీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ టాపిక్స్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్.

సివిల్ ఇంజనీరింగ్ :
సాలిడ్ మెకానిక్స్, జియోటెక్నికల్,హైడ్రాలజీ అండ్ ఇరిగేషన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, స్ట్ట్రక్చరల్ అనాలిసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ మ్యాసనరీ స్ట్రక్చర్స్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, సర్వేయింగ్, ట్రాన్స్‌పోర్టేషన్.

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
2018, అక్టోబర్ 22 (సాయంత్రం 6 గంటల వరకు).
దరఖాస్తు రుసుం: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి రుసుం లేదు).
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2019, జనవరి 6.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in

ప్రాథమిక భావనలపై పట్టుతో...
పాథమిక భావనలు తెలిసి కష్టపడే తత్వం ఉంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించొచ్చు. ప్రిలిమ్స్‌లో ఉత్తమ స్కోరు సాధించేందుకు కృషిచేయాలి. తుది ఫలితాల్లో ముందు నిలిచేందుకు ప్రిలిమ్స్ స్కోరు దోహ దం చేస్తుంది. మెయిన్స్ కోసం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈఎస్‌ఈ పోస్టులకు ఎంపికైతే మంచి హోదాతో పాటు నెలకు రూ.70 వేలకు తగ్గకుండా వేతనం అందుకోవచ్చు.
- పి.శ్రీనివాసులు రెడ్డి, సీఎండీ, వాణి ఇన్‌స్టిట్యూట్.

మాక్‌టెస్టులు.. రివిజన్ తో..
ఈఎస్‌ఈ రాయాలనుకునే వారు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా సిలబస్‌ను పూర్తిచేసి, రివిజన్ ప్రారంభించాలి. మాక్‌టెస్టులు రాయడం వల్ల పరీక్ష విధానంపై అవగాహనతోపాటు ఫార్ములాలు, కాన్పెప్టులపై పట్టు లభిస్తుంది. మాక్‌టెస్టుల ఫలితాలను లోతుగా సమీక్షించుకోవాలి. తప్పులు పునరా వృతం కాకుండా జాగ్రత్త పడాలి. సబ్జెక్టుల్లో సందేహాలుంటే.. ఎన్‌పీటీఈఎల్ ఐఐటీ అధ్యా పకుల వీడియోల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
- అవులూరి శ్రీనివాసులు, ఐఈఎస్ మూడో ర్యాంకు-2017, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్.

ఆబ్జెక్టివ్ అప్రోచ్ :
ఈఎస్‌ఈ ప్రిలిమ్స్‌కు మూడు నెలల సమయం ఉంది. దాని తర్వాత నెల రోజులకు గేట్ పరీక్ష ఉంటుంది. ఈ రెండూ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి కాబట్టి ఆ విధానం లోనే ప్రిపరేషన్ కొనసాగించాలి. దీంతో రెండు పరీక్షలకు ఒకేసారి సిద్ధమయ్యేందుకు అవకాశ ముంటుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్‌కు డిస్క్రిప్టివ్ విధానంలో చదవొచ్చు. గేట్ పరీక్షకు లాజిక్ ముఖ్యం. ఈఎస్‌ఈకి గుర్తించుకో వాల్సిన అంశాలు ఎక్కువగా ఉం టాయి. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగిం చాలి. అభ్యర్థులు ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి వాటిపై దృష్టిసారించాలి.
- ఎ.భరత్ కుమార్, ఐఈఎస్ 47వ ర్యాంకు, సివిల్ ఇంజనీరింగ్.
Published date : 11 Oct 2018 11:58AM

Photo Stories