‘విజ్ఞానశాస్త్రం’లో వెలుగులీనే కెరీర్...
Sakshi Education
పరిశీలన, ప్రయోగం ద్వారా భౌతిక, సహజ ప్రపంచ నిర్మాణాన్ని, ప్రవర్తనను క్రమపద్ధతిలో అధ్యయనం చేసేదే సైన్స్! ఈ విజ్ఞాన శాస్త్రం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ, శాఖోపశాఖలుగా విస్తరిస్తూ మనిషి జీవితాన్ని సుసంపన్నం చేస్తోంది. ఈ రంగంలో కొత్త అవసరాలకు తగ్గట్టే, సరికొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత వివిధ స్పెషలైజేషన్లలో పీజీ, ఆపై పీహెచ్‌డీ చేసి, శాస్త్రవేత్తల స్థాయికి ఎదగొచ్చు. ఉజ్వల కెరీర్‌కు రాచబాట వేసుసుకోవచ్చు. సైన్స్‌లో అకడెమిక్,కెరీర్‌పరంగా ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం...
ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశ్రమలు, సంస్థలు సైన్స్ నేపథ్యమున్న వృత్తి నిపుణుల కోసం ఎదురుచూస్తున్నాయి. సైన్స్‌కు సంబంధించి ప్రస్తుతం అనేక కెరీర్ ఎంపికలు (options) ఉన్నాయి. కొన్నేళ్ల కిందటి వరకు 10+2 తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ-మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ; బీఎస్సీ- జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజక్స్; బీఎస్సీ- బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సంప్రదాయ గ్రూపులుండేవి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌ను అనుసరించి గ్రూపు సబ్జెక్టుల్లో ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, అప్లైడ్ న్యూట్రిషన్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, క్లినికల్ న్యూట్రిషన్ డైటీటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటివి చోటు సంపాదించాయి. వీటిలో దేన్ని ఎంపిక చేసుకొని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనేది అభ్యర్థులు స్వీయ అభిరుచులు, సామర్థ్యం, ఆర్థిక వనరులు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ అర్హతతో డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు కల్పిస్తున్నాయి.
సైన్స్‌లో ఉన్నత సంస్థ-ఐఐఎస్సీ
1909, మే 27న కేవలం రెండే విభాగాలు.. జనరల్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో టెక్నాలజీతో ప్రారంభమై నేడు బయో కెమిస్ట్రీ, మెటీరియల్స్, నానో సైన్స్, ఆస్ట్రానమీ-ఆస్ట్రో ఫిజిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ఉన్నత విద్య పరంగా, పరిశోధన పరంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ-బెంగళూరు) ప్రముఖ స్థానం సంపాదించింది. ఇందులో కోర్సు చేసే అవకాశాన్ని చేజిక్కించుకొని, ఉన్నత కెరీర్ దిశగా పయనించొచ్చు.
ఇష్టమైన సబ్జెక్టుపై మాత్రమే దృష్టి సారించి, అందులోనే ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకునేందుకు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) ఉపకరిస్తుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, నానో సైన్స్ తదితర అధునాతన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
దేశంలో అత్యున్నత విద్యా సంస్థలుగా భాసిల్లుతున్న ఐఐటీలు, ఐఐఎస్సీలోనూ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. దీనికోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్)లో ప్రతిభకనబరచాలి. ఈ పరీక్షను ఐఐటీలు 2004-05 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు ఉన్నత విద్యను అందించి, సైన్స్ కెరీర్‌ను ఎంపిక చేసుకునే దిశగా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.
ఎంఎస్సీతో పాటు పీహెచ్‌డీ పూర్తిచేసేలా కొన్ని సంస్థలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పరిశోధనల దిశగా కెరీర్‌ను మలచుకోవాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ-బెంగళూరు).. ఇగ్నో సహకారంతో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. దీనికోసమే బెంగళూరు ప్రధాన ప్రాంగణంలో ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రానిక్స్ లేబొరేటరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎంఎస్సీలో నిర్దేశ మార్కులు పొందిన వారు పీహెచ్‌డీలో కొనసాగవచ్చు.
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ..
సైన్స్ కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌తో ఫుల్‌స్టాప్ పెట్టేయకుండా పీహెచ్‌డీ చేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. పీజీలో నేర్చుకున్న అంశాల ఆధారంగా పరిశోధనలు చేపట్టేందుకు, కొత్త ఆవిష్కరణలకు పీహెచ్‌డీ వీలు కల్పిస్తుంది. యూజీసీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (డీబీటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) తదితర సంస్థలు ప్రోత్సహిస్తుండటంతో గతంలో కంటే ఇప్పుడు వివిధ అంశాల్లో పీహెచ్‌డీ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. బోధనా సిబ్బంది నియామకాలకు సంబంధించి యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెర్చ్ దిశగా వెళ్లడం మంచిది. ఇప్పుడు ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నీ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఉన్నత చదువుకు ‘ఉపకారం’!
ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్. యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్‌షిప్స్, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తోంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్‌డీ వంటి కోర్సులు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.
పరిశోధకులకు అండగా ఫెలోషిప్:
దేశంలో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతి నెలా ఫెలోషిప్ పొందుతూ పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు, దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు/ ఐఐటీలు, నిట్‌లలో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలనుకునే వారికి నిర్వహించే పరీక్ష జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
సీఎస్‌ఐఆర్ నెట్‌లో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ (ఎస్‌పీఎం) ఫెలోషిప్‌ను అందిస్తున్నారు. పరిశోధనలు చేసే విద్యార్థులను ప్రోత్సహించడం ఈ ఫెలోషిప్ ఉద్దేశం. దీనిద్వారా మొదటి రెండేళ్లకు నెలకు రూ.20 వేలు ఇస్తారు. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్ అందిస్తారు.
జాయింట్ స్క్రీనింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (జెస్ట్):
సైన్స్‌కు సంబంధించిన అంశాల్లో ఐఐఎస్‌ఈఆర్ వంటి ప్రముఖ సంస్థల్లో పీహెచ్‌డీ చేయాలనుకుంటే దానికున్న చక్కని మార్గం జెస్ట్. ఏడాదికి ఒకసారి ఒక్కో ఇన్‌స్టిట్యూట్ ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు ఫెలోషిప్ అందుకోవడంతోపాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న వివిధ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్‌డీ చేయొచ్చు.

- ఐఐఎస్సీ నాలుగేళ్ల కాల వ్యవధితో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. సైన్స్ ఔత్సాహిక అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మెటీరియల్స్, కెమిస్ట్రీల్లోని ఏదో ఒక స్పెషలైజేషన్‌తో బీఎస్ చేయొచ్చు. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఏఐపీఎంటీ ఆధారంగా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. 8 సెమిస్టర్లున్న ఈ కోర్సులో ఏడో సెమిస్టర్‌లో అడ్వాన్స్‌డ్ ఎలెక్టివ్ కోర్సుతో పాటు రీసెర్చ్ ప్రాజెక్టు ఉంటుంది. చివరి సెమిస్టర్ మొత్తం ప్రాజెక్ట్‌కే కేటాయించారు.
ఇష్టమైన సబ్జెక్టుపై మాత్రమే దృష్టి సారించి, అందులోనే ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకునేందుకు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) ఉపకరిస్తుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సంప్రదాయ స్పెషలైజేషన్లతో పాటు ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, నానో సైన్స్ తదితర అధునాతన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
- వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని సంస్థలు సంబంధిత అంశాల్లో పీజీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉదాహరణకు రసాయనాలు, ఎరువుల శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ).. ఎంఎస్సీ బయోపాలిమర్ సైన్స్ కోర్సును అందిస్తోంది. కెమిస్ట్రీ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్‌ను 50 శాతం మార్కులతో పూర్తిచేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా ఎంఎస్సీ (పాలిమర్ సైన్స్)కు కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/పాలిమర్ సైన్స్/అప్లైడ్ కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ పాలిమర్ కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు.
దేశంలో అత్యున్నత విద్యా సంస్థలుగా భాసిల్లుతున్న ఐఐటీలు, ఐఐఎస్సీలోనూ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. దీనికోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్)లో ప్రతిభకనబరచాలి. ఈ పరీక్షను ఐఐటీలు 2004-05 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు ఉన్నత విద్యను అందించి, సైన్స్ కెరీర్‌ను ఎంపిక చేసుకునే దిశగా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.
- జామ్ ద్వారా ఎంఎస్సీ (రెండేళ్లు); జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ; ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ; ఎంఎస్సీ-ఎంటెక్; ఎంఎస్సీ-ఎంఎస్ (రీసెర్చ్)/పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ వంటి కోర్సుల్లో ప్రవేశించొచ్చు.
- సంప్రదాయ సబ్జెక్టులతో పాటు ఎర్త్ సైన్స్; అప్లైడ్ జియో ఫిజిక్స్; ఎనర్జీ వంటి ప్రత్యేక అంశాల్లో పీజీ చేసే అవకాశాలూ ఉన్నాయి.
ఎంఎస్సీతో పాటు పీహెచ్‌డీ పూర్తిచేసేలా కొన్ని సంస్థలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పరిశోధనల దిశగా కెరీర్‌ను మలచుకోవాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ-బెంగళూరు).. ఇగ్నో సహకారంతో ఫిజిక్స్ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. దీనికోసమే బెంగళూరు ప్రధాన ప్రాంగణంలో ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రానిక్స్ లేబొరేటరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎంఎస్సీలో నిర్దేశ మార్కులు పొందిన వారు పీహెచ్‌డీలో కొనసాగవచ్చు.
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ..
సైన్స్ కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌తో ఫుల్‌స్టాప్ పెట్టేయకుండా పీహెచ్‌డీ చేయడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. పీజీలో నేర్చుకున్న అంశాల ఆధారంగా పరిశోధనలు చేపట్టేందుకు, కొత్త ఆవిష్కరణలకు పీహెచ్‌డీ వీలు కల్పిస్తుంది. యూజీసీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ (డీబీటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) తదితర సంస్థలు ప్రోత్సహిస్తుండటంతో గతంలో కంటే ఇప్పుడు వివిధ అంశాల్లో పీహెచ్‌డీ చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. బోధనా సిబ్బంది నియామకాలకు సంబంధించి యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెర్చ్ దిశగా వెళ్లడం మంచిది. ఇప్పుడు ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నీ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఉన్నత చదువుకు ‘ఉపకారం’!
ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్. యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్‌షిప్స్, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తోంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్‌డీ వంటి కోర్సులు చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.
పరిశోధకులకు అండగా ఫెలోషిప్:
దేశంలో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రతి నెలా ఫెలోషిప్ పొందుతూ పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు, దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు/ ఐఐటీలు, నిట్‌లలో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలనుకునే వారికి నిర్వహించే పరీక్ష జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది.
- నెట్‌లో మంచి ర్యాంకు సాధిస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పొందడంతో పాటు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ చేయడానికి మార్గం ఏర్పడుతుంది.
- జేఆర్‌ఎఫ్ సాధించిన అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ.16 వేలు చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా రూ.20 వేలు ఇస్తారు. ఆ తర్వాత పరిశోధనలో ప్రగతి, ఇంటర్వ్యూ ఆధారంగా మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) హోదా కల్పించి నెలకు రూ.18 వేలు ఇస్తారు. జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు కలిసి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్ లభిస్తుంది.
సీఎస్‌ఐఆర్ నెట్‌లో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ (ఎస్‌పీఎం) ఫెలోషిప్‌ను అందిస్తున్నారు. పరిశోధనలు చేసే విద్యార్థులను ప్రోత్సహించడం ఈ ఫెలోషిప్ ఉద్దేశం. దీనిద్వారా మొదటి రెండేళ్లకు నెలకు రూ.20 వేలు ఇస్తారు. విద్యార్థి ప్రతిభను బట్టి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఫెలోషిప్ అందిస్తారు.
జాయింట్ స్క్రీనింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (జెస్ట్):
సైన్స్‌కు సంబంధించిన అంశాల్లో ఐఐఎస్‌ఈఆర్ వంటి ప్రముఖ సంస్థల్లో పీహెచ్‌డీ చేయాలనుకుంటే దానికున్న చక్కని మార్గం జెస్ట్. ఏడాదికి ఒకసారి ఒక్కో ఇన్‌స్టిట్యూట్ ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు ఫెలోషిప్ అందుకోవడంతోపాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఉన్న వివిధ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫిజిక్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్‌డీ చేయొచ్చు.
ప్రాక్టికల్ నైపుణ్యాలు ప్రధానం ప్రస్తుతం సైన్స్‌లో అనేక సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో దేన్ని ఎంపిక చేసుకొని, జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనేది అభ్యర్థి స్వీయ అభిరుచి, సామర్థ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. నచ్చిన సబ్జెక్టులో పీజీ, ఆపై పీహెచ్‌డీ దిశగా వెళ్తే సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. ఉదాహరణకు మ్యాక్రో మాలిక్యులర్ కెమిస్ట్రీ, పాలిమర్ ఫిజిక్స్, పాలిమర్ క్యారెక్టరైజేషన్ వంటి ఉప విభాగాల సమ్మిళితంగా ఉన్న పాలిమర్ సైన్స్‌లో మంచి అవకాశాలున్నాయి. అయితే సంబంధిత కోర్సులు చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకొంటే సుస్థిర కెరీర్‌లో కుదురుకున్నట్లే! దేశంలో పాలిమర్, దాని అనుబంధ పరిశ్రమల అభివృద్ధిలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ).. కీలకపాత్ర పోషిస్తోంది. పరిశ్రమకు నిపుణులైన మానవ వనరులను అందించేందుకు వివిధ కోర్సులు అందిస్తోంది. వీటిలో పీజీ డిప్లొమా, పోస్టు డిప్లొమా, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఎస్సీ టెక్ తదితర ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు చేస్తున్నప్పుడు ప్రాక్టికల్స్ ఆధారంగా సబ్జెక్టును నేర్చుకోవడం, సంబంధిత సబ్జెక్టులతో ముడిపడిన వర్తమాన అంశాలపై పట్టు సాధించడం ప్రధానం. ప్రొఫెసర్ టి. పార్థసారథి, (పాలిమరైజేషన్‌లో పీహెచ్‌డీ చేశారు). |
Published date : 11 Sep 2014 03:18PM