సైన్స్ పీహెచ్డీలో ప్రవేశాలకు `జెస్ట్`
Sakshi Education
దేశ వ్యాప్తంగా పరిశోధన రంగంలో ప్రసిద్ధి చెందిన 29 సంస్థల్లో ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్ విభాగాల్లో ఇంటెగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ ప్రోగ్రామ్ల్లో ప్రవేశించేందుకు ఉన్నత మార్గం జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్). 2016లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల జెస్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ క్రమంలో పరిశోధన సంస్థలు, కోర్సులు, అర్హతలు తదితర వివరాలపై స్పెషల్ ఫోకస్...
అర్హతలు
ఎంపిక విధానం
జెస్ట్ స్కోర్ ఆధారంగా సంస్థలు అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా అభ్యర్థులను ఆహ్వానిస్తాయి. ఇంటెగ్రేటెడ్ పీహెచ్డీ/పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు పరిశోధన సంస్థలు సొంత ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇండోర్లోని రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్సీఈటీ).. ఫిజిక్స్ విభాగానికి సంబంధించి జెస్ట్ స్కోర్ ఆధారంగా జాబితాను రూపొందిస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభకనబరిచిన వారికి పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తుంది. మొత్తంమీద రాత పరీక్ష, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి సంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
రాత పరీక్ష విధానం
ముఖ్య సంస్థలు- పరిశోధన విభాగాలు
ముఖ్య తేదీలు
కెరీర్
ప్రముఖ సంస్థల్లో పీహెచ్డీ ప్రవేశం లభిస్తే రూ. 28 వేల వరకు ఫెలోషిప్ లభిస్తుంది. పీహెచ్డీ పూర్తిచేసిన వారికి అవకాశాలకు ఆకాశమే హద్దు. ఇస్రో, డీఆర్డీవో, బార్క్ వంటి ఉన్నత సంస్థల్లోని ఆర్ అండ్ డీ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలు లభిస్తాయి. బోధన రంగంలోనూ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు తదితరాల్లో అధ్యాపకులుగా ప్రవేశించవచ్చు.
ప్రిపరేషన్
- ఇంటెగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్లకు బీఎస్సీ. పీహెచ్డీ ప్రోగ్రామ్లకు ఎంఎస్సీ. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా జెస్ట్-2016కు హాజరుకావచ్చు.
- కొన్ని సంస్థలకు సంబంధించిన ఇంటెగ్రేటెడ్ పీహెచ్డీ/పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు బీటెక్/బీఈ/ఎంఈ/ఎంటెక్/నాలుగేళ్ల బీఎస్ అర్హతలుగా ఉన్నాయి.
ఎంపిక విధానం
జెస్ట్ స్కోర్ ఆధారంగా సంస్థలు అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా అభ్యర్థులను ఆహ్వానిస్తాయి. ఇంటెగ్రేటెడ్ పీహెచ్డీ/పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు పరిశోధన సంస్థలు సొంత ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇండోర్లోని రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్సీఈటీ).. ఫిజిక్స్ విభాగానికి సంబంధించి జెస్ట్ స్కోర్ ఆధారంగా జాబితాను రూపొందిస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభకనబరిచిన వారికి పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తుంది. మొత్తంమీద రాత పరీక్ష, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి సంస్థలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
రాత పరీక్ష విధానం
- అభ్యర్థులు ఫిజిక్స్ లేదా థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి జెస్ట్ పరీక్షకు హాజరుకావొచ్చు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీకి ఉమ్మడిగా పరీక్ష ఉంటుంది.
- జెస్ట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పార్ట్-ఎలోని 25 ప్రశ్నల్లో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులుంటాయి. పార్ట్-బిలోని 25 ప్రశ్నల్లో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
- థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ప్రశ్నపత్రంలో స్వల్ప సమాధాన ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమస్య సాధన రాయాల్సి ఉంటుంది.
ముఖ్య సంస్థలు- పరిశోధన విభాగాలు
- ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్ (నైనిటాల్): ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్; అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్.
- ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సెన్సైస్, టీఐఎఫ్ఆర్ (బెంగళూరు): ఆస్ట్రో ఫిజికల్ రిలేటివిటీ; డేటా అసిమిలేషన్ అండ్ డైనమికల్ సిస్టమ్స్; స్టాటిస్టికల్ ఫిజిక్స్ అండ్ టర్బులెన్స్, స్ట్రింగ్ థియరీ అండ్ క్వాంటం గ్రావిటీ.
- ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (కల్పక్కం): సాలిడ్ స్టేట్ పేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్; సూపర్ కండక్టవిటీ, స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ ఆఫ్ సాఫ్ట్ కండెన్సెడ్ మ్యాటర్ తదితర అంశాలు.
- ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (అహ్మదాబాద్): థియరిటికల్ ఫిజిక్స్, ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్.
- టీసీఐఎస్ (హైదరాబాద్): కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్స్ సైన్స్ ఆఫ్ నాన్ ఈక్విలిబ్రియం; సాఫ్ట్ అండ్ లివింగ్ మ్యాటర్.
- ఐఐఎస్సీ (బెంగళూరు): కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ (ఎక్స్పెరిమెంట్స్ అండ్ థియరీ); ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ (థియరిటికల్).
- టీఐఎఫ్ఆర్ (ముంబై): ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్; కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్.
- రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (బెంగళూరు): ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్; లైట్ అండ్ మ్యాటర్ ఫిజిక్స్.
ముఖ్య తేదీలు
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.150, ఇతరులకు రూ.300.
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబరు 2, 2015.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 10, 2015.
- జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్: ఫిబ్రవరి 21, 2016.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
- వెబ్సైట్: www.jest.org.in
కెరీర్
ప్రముఖ సంస్థల్లో పీహెచ్డీ ప్రవేశం లభిస్తే రూ. 28 వేల వరకు ఫెలోషిప్ లభిస్తుంది. పీహెచ్డీ పూర్తిచేసిన వారికి అవకాశాలకు ఆకాశమే హద్దు. ఇస్రో, డీఆర్డీవో, బార్క్ వంటి ఉన్నత సంస్థల్లోని ఆర్ అండ్ డీ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలు లభిస్తాయి. బోధన రంగంలోనూ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు తదితరాల్లో అధ్యాపకులుగా ప్రవేశించవచ్చు.
ప్రిపరేషన్
- ఫిజిక్స్ సిలబస్లో మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ, క్వాంటం మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ తదితర అంశాలుంటాయి.
- గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, క్వాంటం మెకానిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ అంశాలు ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.
- అభ్యర్థులు ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. అప్లికేషన్ దృక్పథంలో ప్రిపరేషన్ను కొనసాగించాలి. కొన్ని ప్రశ్నలు అభ్యర్థి ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ను పరీక్షించేలా ఉంటాయి కాబట్టి వాటిపైనా దృష్టిసారించాలి.
- థియరిటికల్ కంప్యూటర్ ైసైన్స్కు సంబంధించి అభ్యర్థులు అనలిటికల్ రీజనింగ్ అండ్ డిడక్షన్; డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్; డిస్క్రియేట్ మ్యాథమెటిక్స్; గ్రాఫ్ థియరీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంశాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన రిఫరెన్స్ పుస్తకాల జాబితా, మోడల్ పేపర్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
Published date : 06 Nov 2015 11:18AM