Skip to main content

‘సైంటిఫిక్ ఆఫీసర్’ కెరీర్‌కు ఓసీఈఎస్-2016/డీజీఎఫ్‌ఎస్ -2016

సైన్స్ అండ్ టెక్నాలజీలో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవాలి! అణు విద్యుత్‌కు సంబంధించిన రీసెర్చ్ రియాక్టర్లు, యాక్సిలిరేటర్స్, న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ టెక్నాలజీస్ విస్తరణ కార్యక్రమాల్లో భాగస్వామిని కావాలి! ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసెన్సైస్, జియాలజీ, జియోఫిజిక్స్ విభాగాల్లో సృజనాత్మక పరిశోధనలు చేయాలి! ఇలాంటి ఆకాంక్షలు ఉన్నవారికి భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) సాదరంగా స్వాగతం పలుకుతోంది! బార్క్ శిక్షణ స్కూళ్లు.. రెండు రకాల కోర్సులను అందుబాటులో ఉంచాయి. అవి.. ఓరియెంటేషన్ కోర్సు ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ సైన్స్ పోస్టు గ్రాడ్యుయేట్స్ (OCES), డీఏఈ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ స్కీం ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫిజిక్స్ పోస్టుగ్రాడ్యుయేట్స్ (DGFS).
ఓసీఈఎస్/డీజీఎఫ్‌ఎస్‌కు అర్హతలు
  • ఇంజనీరింగ్ విభాగం
    బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. మెకానికల్, కెమికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, న్యూక్లియర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో ఏదైనా ఒక దాన్ని 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
    గేట్ ద్వారా ప్రవేశించాలంటే సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో చెల్లుబాటయ్యే (Valid) గేట్-2015 లేదా గేట్-2016 స్కోర్ ఉండాలి.
  • ఫిజిక్స్ విభాగం
    ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణత. ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా బీఈ/బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్). అర్హత డిగ్రీలో 60 శాతం మార్కులుండాలి.
    ఎంఎస్సీ (ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ మినహా) అభ్యర్థులకు బీఎస్సీలో కనీసం 60 శాతం మార్కులుండాలి.
    గేట్ ద్వారా ప్రవేశించాలంటే పీజీ అభ్యర్థులకు గేట్-2015 లేదా గేట్-2016 ఫిజిక్స్‌లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
    బీఈ/బీటెక్(ఇంజనీరింగ్ ఫిజిక్స్) అర్హతతో దరఖాస్తు చేసుకునేవారికి ఫిజిక్స్ లేదా ఇంజనీరింగ్ సైన్స్‌లో గేట్-2015/గేట్-2016లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
  • కెమిస్ట్రీ, బయోసెన్సైస్, రేడియాలజికల్ సేఫ్టీ ఇంజనీరింగ్, జియాలజీ, జియోఫిజిక్స్ విభాగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • వయసు: 2016, ఆగస్టు 1 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయసు 26 ఏళ్లు. ఓబీసీ-29 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ-31 ఏళ్లు. పీహెచ్‌సీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్లు సడలింపు ఉంటుంది.
డీజీఎఫ్‌ఎస్-ప్రవేశాలు
  • మెకానికల్, కెమికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు లేదా ఫిజిక్స్‌లో అర్హత డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగాల్లో పైన పేర్కొన్న అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. వీరు డీజీఎఫ్‌ఎస్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశం లభించిన వారు ఎంపిక చేసిన సంస్థలు, స్పెషలైజేషన్‌న్లలో ఎంటెక్/ఎం.కెమ్. ఇంజనీరింగ్ చేస్తారు.
ఎంపిక ప్రక్రియ
  • ఓసీఈఎస్/డీజీఎఫ్‌ఎస్-2016కు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో ఇంటర్వ్యూకు అర్హత సాధించే వారి జాబితా తయారీకి మొదట స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఈ స్క్రీనింగ్‌లో రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఆన్‌లైన్ టెస్ట్, గేట్ స్కోర్. వీటిలో అభ్యర్థులు ఏదో ఒకదాన్ని లేదా రెండింటినీ దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంపిక చేసుకోవాలి.
  • తొమ్మిది ఇంజనీరింగ్ విభాగాలు, ఐదు సైన్స్ విభాగాల్లో 2016, మార్చిలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  • గేట్-2015 లేదా గేట్-2016లో సాధించిన స్కోర్ ఆధారంగా కూడా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
  • న్యూక్లియర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఆన్‌లైన్ టెస్ట్ రాయాలి.
  • ఆన్‌లైన్ పరీక్ష ముగిసిన తర్వాతే ఇంటర్వ్యూకు అర్హత సాధించేందుకు గేట్ స్కోర్ కటాఫ్‌ను ఖరారు చేస్తారు. అందువల్ల అభ్యర్థులు రెండు రకాల స్క్రీనింగ్ విధానాలను ఎంపిక చేసుకోవడం మంచిది.
  • యూనివర్సిటీ ఆఫ్ ముంబై-డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ బేసిక్ సెన్సైస్ (యూఎం-డీఏఈ సీబీఎస్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండర్ రీసెర్చ్ (ఎన్‌ఐఎస్‌ఈఆర్-భువనేశ్వర్) నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, 7.5 జీపీఏ ఉన్నవారిని నేరుగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అయితే వారికి ఓసీఈఎస్/డీజీఎఫ్‌ఎస్‌కు నిర్దేశించిన అకడమిక్ అర్హతలు ఉండాలి.
  • సెలక్షన్ ఇంటర్వ్యూలు: జియాలజీ, జియోఫిజిక్స్ విభాగాలు మినహా మిగిలిన అన్నింటికీ ముంబైలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జియాలజీ, జియోఫిజిక్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు హైదరాబాద్‌లో ఉంటాయి. ఇంటర్వ్యూలు మే, జూన్‌లో ఉంటాయి. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
శిక్షణ వివరాలు
ఓసీఈఎస్
ఓరియెంటేషన్ కోర్సు ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ సైన్స్ పోస్టు గ్రాడ్యుయేట్స్ (OCES) కోర్సు ఏడాది వ్యవధిలో ఉంటుంది. దీనికి ఎంపికైన వారికి సబ్జెక్టును అనుసరించి ముంబై, కల్పకం, ఇండోర్, హైదరాబాద్‌లోని బార్క్ శిక్షణ స్కూళ్లలో ఏదో ఒకదాంట్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో అభ్యర్థిని ట్రెయినీ సైంటిఫిక్ ఆఫీసర్(టీఎస్‌వో)గా పిలుస్తారు. కనీసం 50 శాతం మార్కులతో శిక్షణను పూర్తిచేసిన వారిని ఏదైనా డీఏఈ యూనిట్‌లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా నియమిస్తారు.

డీఏఈ యూనిట్లు
  • బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)-ముంబై
  • ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్)-కల్పకం
  • రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (ఆర్‌ఆర్‌సీఏటీ)- ఇండోర్
  • వేరిబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (వీఈసీసీ), కోల్‌కత
  • హెవీ వాటర్ బోర్డ్ (హెచ్‌డబ్ల్యూబీ)-ముంబై
  • న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్‌ఎఫ్‌సీ)- హైదరాబాద్
  • బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ (బీఆర్‌ఐటీ)-ముంబై
  • న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)- ముంబై
  • భారతీయ నభీకియా విద్యుత్ నిగం లిమిటెడ్ (భావిని)- కల్పకం
  • యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)- జాదుగూడ
  • అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ)-హైదరాబాద్
  • డెరైక్టరేట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ (డీసీఎస్‌ఈఎం)-ముంబై
డీజీఎఫ్‌ఎస్
డీఏఈ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ స్కీం ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫిజిక్స్ పోస్టుగ్రాడ్యుయేట్స్ (DGF).. రెండేళ్ల కాల వ్యవధి గల కోర్సు. దీనికి ఎంపికైన వారు డీజీఎఫ్‌ఎస్ ఇన్‌స్టిట్యూట్లలో ఎం.టెక్/ఎం.కెమ్. ఇంజనీరింగ్ చేస్తారు. ఈ కోర్సు జులై/ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఏడాది కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత, ప్రాజెక్టు వర్క్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని డీఏఈ, ఇన్‌స్టిట్యూట్ గైడ్ సంయుక్తంగా పర్యవేక్షిస్తారు. ఎంటెక్/ఎంకెమ్ ఇంజనీరింగ్‌ను పూర్తిచేసిన వారిని డీఏఈ యూనిట్లలో సైంటిఫిక్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఒకవైపు పనిచేస్తుండగానే, మరోవైపు హోమీబాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌బీఎన్‌ఐ)లో పీహెచ్‌డీ చేయొచ్చు.

డీజీఎఫ్‌ఎస్ ఇన్‌స్టిట్యూట్లు
ఐఐటీ-బాంబే, ఢిల్లీ, గువహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ, వారణాసి(బీహెచ్‌యూ); నిట్-రూర్కెలా; ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ)-ముంబై.

అగ్రిమెంట్, పర్సనల్ బాండ్
ఓసీఈఎస్‌కు ఎంపికైనవారు శిక్షణ పూర్తయ్యాక అణుశక్తి విభాగంలో కనీసం మూడేళ్లు పనిచేస్తామని హామీ ఇస్తూ రూ.4.30 లక్షలకు బాండ్ సమర్పించాలి. డీజీఎఫ్‌ఎస్‌కు ఎంపికైన వారు రూ.5.10 లక్షలకు బాండ్ ఇవ్వాలి.

స్టైఫండ్, అలవెన్సులు
ఓసీఈఎస్ ట్రైయినీ సైంటిఫిక్ ఆఫీసర్‌కు నెలకు రూ.35 వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. ఒకేసారి రూ.10 వేలు బుక్ అలవెన్స్ కింద ఇస్తారు. డీజీఎఫ్‌ఎస్ ఫెలోస్‌కు నెలకు రూ.20 వేలు చెల్లిస్తారు. దీన్ని రూ.35 వేలకు పెంచే యోచనలో ఉన్నారు. వీరికి కూడా రూ.10 వేలు బుక్ అలవెన్స్ ఇస్తారు.

వేతనాలు
సైంటిఫిక్ ఆఫీసర్ వేతన స్కేలు రూ.15,600- రూ.39,100 (గ్రేడ్ పే రూ.5,400). డీఏ, హౌస్‌రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వంటి వాటితో కలుపుకొని, ప్రారంభంలో నెలకు రూ.64,000 వరకు ఉంటుంది. ఏడో వేతన కమిషన్ సిఫార్సులు అమల్లోకి వస్తే ఇది మరింత పెరగనుంది. లీవ్ ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్‌డేట్ అలవెన్స్ వంటివి ఉద్యోగులకు అందుతాయి.

దరఖాస్తు ప్రక్రియ, ముఖ్య తేదీలు
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ కేటగిరీల పురుష అభ్యర్థులకు రూ.500. మిగిలిన వారు ఫీజు చెల్లించనవసరం లేదు.
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2016
  • ఆన్‌లైన్ టెస్ట్ ఆప్షన్స్: 2016, ఫిబ్రవరి 16-ఫిబ్రవరి 22.
  • ఆన్‌లైన్ టెస్ట్ అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: 2016, ఫిబ్రవరి 26-మార్చి 10
  • ఆన్‌లైన్ టెస్ట్: 2016, మార్చి 12-మార్చి 20.
  • పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్; తిరుపతి, వైజాగ్.
  • గేట్ స్కోర్ అప్‌డేట్‌కు చివరి తేదీ: మార్చి 27. 2016.
  • సెలక్షన్ ఇంటర్వ్యూలు: 2016, మే 16-జూన్ 17
  • వెబ్‌సైట్:  www.barconlineexam.in
సైంటిఫిక్ ఆఫీసర్‌తో ఉన్నత కెరీర్
సాధారణంగా గేట్ పరీక్షలో ప్రాబ్లమ్స్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. బార్క్ ఆన్‌లైన్ పరీక్షలో టెక్నికల్ సబ్జెక్టుకు సంబంధించి థియరీ, లాజికల్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి. అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రిపరేషన్ కొనసాగించాలి. శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షల్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి ప్రయత్నించాలి. సంబంధిత యూనిట్‌లో పనితీరు ఆధారంగా పదోన్నతులు ఉంటాయి. ఎప్పటికప్పుడు నిర్వహించే ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపితే కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. లీవ్ ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ప్రొఫెషనల్ అప్‌డేట్ అలవెన్స్ వంటివి ఉంటాయి. ఆర్ అండ్ డీ లేదంటే ప్లాన్డ్ ఆపరేషన్స్ ఎందులోనైనా పనితీరు మెరుగుపరుచుకుంటూ వెళ్తే స్వల్ప వ్యవధిలోనే ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
- ఎ.పవన్, సైంటిఫిక్ ఆఫీసర్ (సీ), ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్)-కల్పకం.
Published date : 29 Jan 2016 11:33AM

Photo Stories