Skip to main content

సైన్స్ విద్య, పరిశోధన కెరీర్‌కు... ఇన్‌స్పైర్

సి.వి.రామన్, సీఎన్‌ఆర్ రావు, శాంతి స్వరూప్ భట్నాగర్, ఎంఎస్ స్వామినాథన్, ఏపీజే అబ్దుల్ కలాం.. మొదలైన ఎంతోమంది భారత శాస్త్రవేత్తలు తమ మేధస్సుతో చేసిన ఆవిష్కరణలు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించాయి.
  వీరి పరిశోధనలు యావత్తు సమాజాన్ని, మానవాళిని అభివృద్ధి బాటపట్టించాయి. సైన్స్ పరిశోధనలే సమాజ ప్రగతికి మూలం. అందుకే స్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి కలిగించే ఉద్దేశంతో 2008లో కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్ (ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్)పథకానికి శ్రీకారం చుట్టింది. 2018-19 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇన్‌స్పైర్ పథకం పూర్తి వివరాలు...

ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్‌స్పైర్)ను ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్ (ఎంఏఎన్‌ఏకే-మిలియన్ మైండ్‌‌స ఆగ్‌మెంటింగ్ నేషనల్ యాస్పిరేషన్ అండ్ నాలెడ్‌‌జ)గా మార్చింది. ఇన్‌స్పైర్ ప్రోగ్రామ్.. సైన్స్ సబ్జెక్టుల్లో ప్రతిభ చాటే విద్యార్థులను గుర్తించి.. పాఠశాల నుంచి పీహెచ్‌డీ వరకు ప్రతి దశలోనూ ప్రోత్సాహం అందిస్తుంది. ఇన్‌స్పైర్ ప్రోగ్రాంను ఆరో తరగతి నుంచి పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ వరకు మూడు విభాగాలుగా, అయిదు సబ్ స్కీమ్‌లుగా వర్గీకరించారు.
1. ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్
2. ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్
3. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్
4. ఇన్‌స్పైర్ ఫెలోషిప్
5. ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ అవార్డ్స్

స్కీమ్ ఫర్ ఎర్లీ అట్రాక్షన్ ఆఫ్ టాలెంట్స్ ఫర్ సైన్స్ (ఎస్‌ఈఏటీఎస్)
ఇన్‌స్పైర్ అవార్డు -మనక్ :
ఈ స్కీమ్ స్కూల్ స్థాయిలోనే ప్రతిభావంతులను సైన్స్ వైపు మళ్లించేందుకు ఉద్దేశించినది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ.. చదివే విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌ను వర్తింపజేస్తున్నారు. ఈ పథకం కింద పదేళ్ల నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నవారికి ‘ఇన్‌స్పైర్ అవార్డు -మనక్’ అందజేస్తారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, సెమీ ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు.
  1. దేశవ్యాప్తంగా ఉన్న అయిదు లక్షల స్కూల్స్ నుంచి 10 లక్షల వినూత్న ఆలోచనలు (ఐడియాస్) ఈ స్కీమ్ లక్ష్యం. 10 లక్షల మంది విద్యార్థుల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో లక్ష మందిని ఎంపిక చేస్తారు.
  2. ఇలా ఎంపికై న వారు తమ ఆలోచనలకు సంబంధించిన ప్రాజెక్టు/మోడల్ తయారు చేసేందుకు ప్రతి ఒక్కరికి రూ.10వేల అవార్డు మొత్తాన్ని అందజేస్తారు. ఈ విద్యార్థులు తర్వాత దశల్లో 3 టైర్ పోటీల్లో.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పాల్గొంటారు.
  3. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే విద్యార్థులు.. స్టేట్ లెవల్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనడానికి అర్హత లభిస్తుంది. ఇక్కడ కూడా విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయిలో నిర్వహించే ఎగ్జిబిషన్లకు పంపిస్తారు. వీరికి దేశంలోని ప్రముఖ ైసైన్స్ అండ్ టెక్నాలాజికల్ సంస్థల సహకారంతో నమూనా అభివృద్ధికి సూచనలు, సలహాలు అందజేస్తారు.
  4. ఈ ప్రోగ్రాంకు ఎంపికలో పోటీపరీక్షలుగానీ, ఇతరత్రా నిబంధనలు కూడా ఉండవు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులే ప్రతిభావంతులను గుర్తించి అవార్డుకు నామినేట్ చేస్తారు.
  5. ముందస్తుగా పాఠశాలలోని విద్యార్థులందరికీ ఈ పథకం గురించి తెలియజేసేలా ప్రచారం చేయాల్సి ఉంటుంది. సంబంధిత పాఠశాల నుంచి 6, 7, 8, 9, 10 తరగతుల నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగిన వారి పేర్లను జిల్లా విద్యాశాఖాధికారికి పంపాలి. అక్కడ షార్ట్‌లిస్ట్ చేసి వారి పేర్లను రాష్ట్ర విద్యాశాఖాధికారికి పంపిస్తారు. వీరు రాష్ట్రం నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులను డీఎస్‌టీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)కి పంపుతారు.

ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ :
  1. ఎస్‌ఈఏటీఎస్ పరిధిలోనే ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ఉంటుంది. పదో తరగతి స్టేట్ లెవల్ బోర్డ్‌లో టాప్ 1 శాతంలో నిలిచి.. సైన్స్ వైపు వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంటారు.
  2. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ రంగంలో పరిశోధనలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలను విద్యార్థులు కలుసుకొని సైన్స్ పై ప్రేరణ పొందేలా చేయడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. సైన్స్ రంగంలో సమకాలీనంగా జరుగుతున్న పరిశోధనలపై ప్రముఖ శాస్త్రవేత్తలతో ఇంటరాక్షన్ సెషన్లు ఉంటాయి.
  3. దేశ వ్యాప్తంగా ఏటా 50 వేల మంది విద్యార్థులు ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. వేసవి లేదా శీతాకాలంలో ఈ క్యాంపులు జరుగుతాయి. ఇది అయిదు రోజుల పాటు ఉంటుంది. ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆచార్యులు విద్యార్థులకు విలువైన సూచనలు ఇస్తారు. ప్రస్తుత శాస్త్ర, సాంకేతిక రంగాలలో జరిగే పరిశోధనల గురించి తెలియజేయడం, వాటిపై ఆసక్తి పెంపొందించడం, యువ మేధావులు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహించడం ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం.

స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్‌హెచ్‌ఈ) :
ఈ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా 10 వేల మందిని ఎంపిక చేసి.. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలు చొప్పున ‘ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్’ అందిస్తారు.
  • ఇంటర్‌లో సెంట్రల్ బోర్డ్/స్టేట్ బోర్డ్‌లో టాప్ ఒక శాతం విద్యార్థులు.. బీఎస్సీ సైన్స్, ఇంటిగ్రేటెడ్ సైన్స్ కోర్సుల్లో చేరితే వీటికి అర్హత లభిస్తుంది.
  • లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ పరీక్షల్లో పదివేల ర్యాంక్‌లోపు వచ్చి నేచురల్ సైన్స్ అండ్ బేసిక్ సైన్స్ కోర్సుల్లో చేరినవారు కూడా అర్హులే.
  • ఐఐఎస్‌ఈఆర్, నైసర్‌లో చేరిన విద్యార్థులు, కేవీపీవై, ఎన్‌టీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లో పతకాలు సాధించినవారు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్‌లో చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.
  • 17-22 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులే దరఖాస్తు చేసుకో వాలి. పీజీ వరకు లేదా ఇంటిగ్రే టేడ్ కోర్సు (అయిదేళ్లు) పూర్త య్యే వరకు ఆర్థిక సహాయం కొన సాగిస్తారు. గరిష్టంగా అయిదేళ్ల వరకు ఇస్తారు.
  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఆస్ట్రోఫిజిక్స్, ఆ్ట్రానమీ, ఎల క్ట్రాని క్స్, బోటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, ఆంత్రో పాలజీ, మై క్రో బయాలజీ, జియోఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, ఓషియనిక్ సెన్సైస్ సబ్జెక్టు ల్లో... ఏదైనా ఒకదాంట్లో బీఎస్సీ/బీఎస్/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ చదివితేనే ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది.
  • విద్యార్థులు అకడమిక్ కోర్సులో భాగంగా వేసవిలో రీసెర్చ్ ప్రాజెక్టులు చేయాల్సి ఉంటుంది. మొత్తం స్కాలర్‌షిప్ రూ.80 వేలల్లో రూ.60 వేల స్కాలర్‌షిప్ రూపంలో విద్యార్థులకు అందుతుంది. మిగతా రూ.20వేలు మెంటార్‌షిప్ రూపంలో ఏటా చెల్లిస్తారు. అకడమిక్ ప్రతిభ సరిగా లేకుంటే మధ్యలోనే ఈ స్కాలర్‌షిప్‌ను రద్దు చేస్తారు.
అష్యూర్డ్ ఆపర్చ్యునిటీస్ ఫర్ రీసెర్చ్ కెరీర్స్ (ఏఓఆర్‌సీ) :
 1. ఇన్‌స్పైర్ ఫెలోషిప్:
 అర్హులు
: సైన్స్, బేసిక్ సెన్సైస్‌లో కనీసం 65 శాతం మార్కులతో పీజీ/ఇంటిగ్రేటేడ్ కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. పీజీలో విశ్వవిద్యాలయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినవారు లేదా మెడికల్‌లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, అగ్రికల్చరల్, వెటర్నరీ, ఫార్మాస్యూటికల్స్ సైన్స్‌ల్లో పీజీ పూర్తిచేసిన వారు ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు.
 డాక్టోరల్ స్టడీస్ కోసం ఈ ఫెలోషిఫ్ ఇస్తారు. 
 వయసు: 22-27 ఏళ్ల మధ్య ఉండాలి.  గరిష్టంగా అయిదేళ్ల వరకు ఫెలోషిప్ ఇస్తారు.
 
 2. ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ అవార్డ్స్ :
 ఈ స్కీమ్ కింద 27-32 ఏళ్ల వయసు ఉన్నవారు పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్స్ విభాగం కింద నెలకు దాదాపుగా రూ.80 వేలు పొందొచ్చు. బేసిక్, అప్లయిడ్ సెన్సైస్‌లో పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేసే ఔత్సాహికులకు ఫ్యాకల్టీ అవార్డ్ స్కీమ్ కింద ఎంపిక చేస్తారు. ఈ అవార్డుకు వెయ్యి మందిని ఎంపిక చేస్తారు.
 ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనక్ ఆన్‌లైన్ నామినేషన్లకు చివరి తేదీ: జూలై 31, 2018
 వెబ్‌సైట్స్: https://www.inspireawards-dst.gov.in, www.dst.gov.in
Published date : 18 Jul 2018 12:47PM

Photo Stories