కెరీర్ గెడైన్స్..బోటనీ
Sakshi Education
జీవశాస్త్రానికి చెందిన ప్రధాన విభాగం బోటనీ. ప్రకృతిని ఆస్వాదించే మనస్తతత్వం, అవుట్ డోర్‌లొకేషన్లలో పని చేయడంలో ఆసక్తి, వృక్షాల పెంపకం సంబంధిత అంశాల్లో ఉత్సాహం ఉన్న వారు బోటనీని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. దేశంలో సంప్రదాయ సైన్స్ కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న కోర్సుల్లో బోటనీ ఒకటి. వృక్షాలు, వాటి అభివృద్ధి తదితర అంశాల గురించి సమగ్రంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే బోటనీ. ఈ క్రమంలో వివిధ వృక్షాలు, వృక్షాల వర్గీకరణ, వాటికి సంభవించే వ్యాధులు, పెరుగుదల, జీవక్రియ, వివిధ సమూహాల మధ్య నిర్మాణం, ప్రత్యుత్పత్తి తదితర అంశాలు ఉంటాయి.
కీలక పాత్ర:
మానవ జీవితంలో వృక్షాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన ప్రాథమిక అవసరాలైన.. ఆహారం, దుస్తులు, ఆవాసం సంబంధిత వస్తువులు అన్నీ వృక్షాల నుంచే లభిస్తాయి. పర్యావరణ పరంగా కూడా వృక్షాలు కీలకమే. ఎందుకంటే కార్బన్ డై ఆక్సైడ్ వాయువును పీల్చుకుని మనకు కావల్సిన ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఆ విధంగా పర్యావరణ సమతుల్యతను పరిరక్షిస్తాయి. కాటన్, రబ్బర్, పేపర్, సిల్క్, నూనెలు వంటి వివిధ ఉత్పత్తులకు మూల కారణం కూడా వృక్షాలే.
విధులు:
బోటనీలో నిష్ణాతులైన వారిని బోటనిస్ట్‌గా వ్యవహరిస్తారు. వీరు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యాక్టీరియా, ఫంగే, ఆల్గే వంటి సజీవుల నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షాలైన రెడ్‌ఉడ్ వరకు వృక్షాలకు సంబంధించి అన్ని అంశాలపై వీరు సమగ్రంగా పరిశోధన చేస్తుంటారు. ఈ క్రమంలో వివిధ వృక్షాలు, వాటి మూలాలు, వర్గీకరణ, ఫిజియాలజీ, శీలింధ్రాలు, శిలాజాలు.. ఈ విధంగా ఒక మొక్కకు సంబంధించి క్రోమోజోమ్ దశ నుంచి పునరుత్పత్తి దశ వరకు ఉండే అన్ని రకాల దశలపై పరిశోధనలు చేస్తారు. నివేదికలు రూపొందిస్తారు. వీటి ఆధారంగానే ఎన్నో ఉపయోగకరమైన ఉత్పత్తుల ఆవిష్కరణ సాధ్యమవుతుంది. బోటనీలో పరిశోధనల కారణంగానే చాలా రకాల ఔషధాల ఉత్పత్తి సాధ్యమైందని చెప్పొచ్చు.
అందుబాటులోని కోర్సులు:
బోటనికి సంబంధించి పలు రకాలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో బైపీసీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్) గ్రూపు తీసుకోవడం ద్వారా బోటనీ సబ్జెక్ట్‌ను చదవచ్చు. ఆ తర్వాత ఉన్న అవకాశాలు..
బీఎస్సీ ( బోటనీ, పలు రకాల సబ్జెక్ట్‌ల కాంబినేషన్స్‌తో)
ఎంఎస్ ప్రోగ్రామ్
ఎంఎస్సీ ( బోటనీ)
ఇంటిగ్రేటెడ్ పీహ్‌చ్‌డీ
పీహెచ్‌డీ ( బోటనీ)
ఎంఫిల్( బోటనీ)
బోటనీలో ఉండే స్పెషలైజేషన్స్:
పైటో కెమిస్ట్రీ
ఫారెస్ట్రీ
ప్లాంట్ మార్ఫాలజీ
ఎథ్నో బోటనీ
ఫైకాలజీ
సైటోలజీ
ప్లాంట్ జెనెటిక్స్
హార్టికల్చర్
ప్లాంట్ ఫిజియాలజీ
అగ్రోనమీ
ఎకానమిక్ బోటనీ
లెకైనోలజీ
ప్లాంట్ అనాటమీ
ప్లాంట్ ఎకాలజీ
ప్లాంట్ పాథాలజీ
మన రాష్ట్రంలో ఇంటర్మీడియెట్, బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో బోటనీ కోర్సు అందుబాటులో ఉంది. అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఆయా స్థాయిల్లో బోటనీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివరాలకు ఆయా వర్సిటీల వెబ్‌సైట్లను చూడొచ్చు.
నెట్/సెట్:
బోటనీ పీహెచ్‌డీ ఔత్సాహికులు హాజరు కావల్సిన మరో కీలక పరీక్ష.. సీఎస్‌ఐఆర్-నెట్. ఇందులో జేఆర్‌ఎఫ్ సాధించడం ద్వారా ఐఐటీలు, నిట్‌లు, అన్ని పరిశోధనశాలలు, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో చేరవచ్చు. దీని ద్వారా ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000 చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా రూ. 20,000 చెల్లిస్తారు. ఆ తర్వాత మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) హోదా కల్పించి నెలకు రూ.18,000 చెల్లిస్తారు. అంతేకాకుండా సీఎస్‌ఐఆర్ నెట్ పరీక్షలో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ప్రత్యేక ఫెలోషిప్‌ను ఐదేళ్లు అందిస్తారు. దీనిద్వారా మొదటి రెండేళ్లు నెలకు రూ. 20,000 స్టైఫండ్ ఇస్తారు. మూడో ఏడాది నుంచి నెలకు రూ.24,000 ఇవ్వడంతోపాటు ఏడాదికి రూ.70,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కూడా చెల్లిస్తారు. గతేడాది నుంచి రాష్ట్రంలో ఏపీసెట్(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహిస్తున్నారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌గా కెరీర్ ప్రారంభించడానికి నెట్/సెట్‌లో అర్హత తప్పనిసరి.
అవకాశాలు:
బోటనీ అభ్యర్థులకు విత్తనాల కంపెనీలు, నర్సరీలు, ప్లాంట్ రీసోర్సెస్ లేబొరేటరీస్, ఆయిల్ పరిశ్రమలు, ఫారెస్ట్ సర్వీసెస్, ల్యాండ్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీస్, నేషనల్ పార్క్‌లు, రసాయన పరిశ్రమలు, బయలాజికల్ సప్లై హౌసెస్, బోటానికల్ గార్డెన్స్, బయోటెక్నాలజీ ఫర్మ్స్, ఆహార సంబంధిత పరిశ్రమలు, ఆర్కియాలాజికల్ మ్యూజియంలు, పేపర్ కంపెనీలు, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు, జెనెటిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఫెర్మినేషన్ పరిశ్రమలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి.
ఈ క్రమంలో ఉండే జాబ్ ప్రొఫైల్స్..
ప్లాంట్ ఎక్స్‌ప్లోర ర్స్
ఎకాలాజిస్ట్
ఎన్విరాన్‌మెంట్ కన్సల్టెంట్
ప్లాంట్ బయోకెమిస్ట్
నర్సరీ మేనేజర్
మాలిక్యులర్ బయాలజిస్ట్
టాక్సానమిస్ట్
ప్లాంట్ పాథాలజిస్ట్
ఫార్మింగ్ కన్సల్టెంట్
మైకాలజిస్ట్
ఫారెస్ట్రర్
హార్టికల్చరిస్ట్
ప్లాంట్ సైంటిస్ట్
ప్లాంట్ జెనెటిస్ట్
వీడ్ సైంటిస్ట్
-ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే.. బోటనీ అభ్యర్థులకు మెడికల్ ప్లాంట్ రీసెర్చ్, ప్లాంట్ డిసీజెస్, ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ జెనెటిక్స్ రంగాల్లో డిమాండ్ అధికంగా ఉంటోంది.
-బయాలాజికల్ సప్లై హౌసెస్, ఫార్మస్యుటికల్ కంపెనీలు, విత్తనాల్లో కంపెనీల్లోని మార్కెటింగ్ విభాగంలో కూడా వీరికి అవకాశాలు ఉంటున్నాయి.
-సంబంధిత పరిశ్రమల్లో సైంటిఫిక్ రైటర్స్ కూడా స్థిర పడొచ్చు.
-ప్రభుత్వ పరంగా బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బోటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సెన్సైస్ వంటి పరిశోధన సంస్థల్లో ప్లాంట్ సైంటిస్ట్‌లుగా కూడా అవకాశాలుంటాయి.
-ఆసక్తి ఉంటే ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా స్థిర పడొచ్చు.
-ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావచ్చు.
వేతనాలు:
వేతనాల విషయానికొస్తే..పని చేస్తున్న ఆర్గనైజేషన్, హోదా ఆధారంగా వేతనాలు ఉంటాయి. పీజీ/పీహెచ్‌డీ వంటి అర్హతలతో కెరీర్ ప్రారంభిస్తే నెలకు రూ. 30 వేలకు తక్కువ కాకుండా వేతనం లభిస్తుంది. డిగ్రీతో మాత్రం ఎంట్రీ లెవల్, జూనియర్/అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. వీరికి నెలకు రూ. 10 నుంచి 15 వేల వేతనం లభిస్తుంది. ఐదేళ్ల అనుభవం ఉంటే నెలకు రూ. 25 వేల వరకు సంపాదించవచ్చు. టీచింగ్ రంగంలో కార్పొరేట్ స్కూల్స్/ కాలేజీలు/ విద్యా సంస్థల్లో లెక్చరర్‌గా నెలకు రూ.20 వేలకు తగ్గకుండా ప్రారంభ వేతనం ఉంటుంది.
టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు
వెబ్‌సైట్: www.iisc.ernet.in
జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్-బెంగళూరు
వెబ్‌సైట్: www.jncasr.ac.in
సెంటర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ-హైదరాబాద్
వెబ్‌సైట్:www.ccmb.res.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-భువనేశ్వర్
వెబ్‌సైట్: www.niser.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-క్యాంపస్‌లు
పుణే-వెబ్‌సైట్: www.iiserpune.ac.in
త్రివేండ్రం-వెబ్‌సైట్: www.iisertvm.ac.in
మొహాలీ-వెబ్‌సైట్: www.iisermohali.ac.in
భోపాల్-వెబ్‌సైట్: www.iiserbhopal.ac.in
కోల్‌కతా-వెబ్‌సైట్: www.iiserkol.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www. osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.uohyd.ac.in
బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
వెబ్‌సైట్: www. bhu.ac.in
ఢిల్లీ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.du.ac.in
పుణే యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.unipune.ac.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
వెబ్‌సైట్: www.kakatiya.ac.in

Published date : 10 Jun 2013 07:21PM