కెరీర్ గైడెన్స్..సైన్స్
Sakshi Education
సైన్స్ లేని మానవ జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం.. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంటే.. జీవితంలో విజయం సాధించడానికి బాట వేసుకున్నట్టే.. సైన్స్ ఆధునిక కాలంలో ఎన్నో రూపురేఖలు మార్చుకుని శాఖోపశాఖలుగా విస్తరించింది.. సంప్రదాయ కోర్సులతోపాటు ఎన్నో రకాల నూతన కాంబినేషన్స్ ఈ విభాగంలో అందుబాటులోకి వచ్చాయి.. పీజీ, పీహెచ్‌డీల వంటి ఉన్నత విద్య కోర్సులను చదవడం ద్వారా భావి సైంటిస్టులుగా అత్యున్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఈ విభాగంతోనే సాధ్యం.. ఈ నేపథ్యంలో అకడెమిక్, కెరీర్ పరంగా సైన్స్ విభాగంపై విశ్లేషణ..
పదో తరగతి తర్వాత సైన్స్ స్ట్రీమ్‌ను ఎంచుకోవడానికి ఇంటర్మీడియెట్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి. అవి.. ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ). సైన్స్‌కు సంబంధించి వీటిని ప్రాథమిక కోర్సులుగా పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటి తర్వాత స్థాయిలో ఉండే యూజీ, పీజీ వంటి కోర్సుల రూపకల్పనలో ఈ గ్రూపు సబ్జెక్టులే పునాదిగా ఉంటాయి.
ఎన్నో కోర్సులు-కాంబినేషన్స్:
ఇంటర్మీడియెట్ తర్వాత డిగ్రీ స్థాయిలో బీఎస్సీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో గతంలో మ్యాథమెటిక్స్ విభాగానికి సంబంధించి బీఎస్సీ-మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి కాంబినేషన్లు మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం కంప్యూటర్ అప్లికేషన్స్/సైన్స్, స్టాటిస్టిక్స్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్ట్రియల్ మైక్రోబయాలజీ, జియాలజీ వంటి నూతన కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. బైపీసీ విద్యార్థుల కోసం బ్యాచిలర్ స్థాయిలో బోట నీ, జువాలజీ, కెమిస్ట్రీ వంటి సంప్రదాయ ఆప్షన్స్ ఉండేవి. ప్రస్తుతం పలు రకాల కాంబినేషన్స్‌తో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫారెస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్, న్యూట్రిషన్, హోమ్‌సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్/సైన్స్ తదితరాలు.
ఇంటిగ్రేటెడ్ కోర్సులు:
ఇంటర్మీడియెట్ అర్హతతో డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు కల్పిస్తున్నాయి. ఈ తరహా కోర్సులను కొన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. అవి.. ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్ (ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ-వెబ్‌సైట్: www.osmania.ac.in), ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం (ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ అప్లైడ్ కెమిస్ట్రీ, వెబ్‌సైట్: www.andhrauniversity.info ), సెంట్రల్ యూనివర్సిటీ-హైదరాబాద్ (ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమికల్ సెన్సైస్- వెబ్‌సైట్: www.uohyd.ac.in).
ఐఐఎస్‌సీ-బ్యాచిలర్ డిగ్రీ:
సైన్స్ విద్యార్థులకు మరో చక్కటి అవకాశం.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) ఆఫర్ చేస్తున్న బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) కోర్సు. బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మెటీరియల్స్ ఇందులోని మేజర్ డిసిప్లెయిన్స్. సిలబస్ కూడా ఎంఎస్సీ డిగ్రీకి సమానమైంది. దీని వల్ల అభ్యర్థులు తమ స్పెషలైజేషన్ లేదా సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), జేఈఈ-మెయిన్/అడ్వాన్స్‌డ్, నీట్-యూజీ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.iisc.ernet.in
స్పెషలైజేషన్స్.. పీజీ:
మాస్టర్స్ స్థాయి(పీజీ)లో సైన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్.. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ(ఇన్‌ఆర్గానిక్/ఆర్గానిక్/ఫిజికల్ ఆర్గానిక్/ఫిజికల్/అనలిటికల్/ఫార్మాస్యూటికల్/ఫార్మకోఇన్ఫర్మాటిక్స్), జియాలజీ, జాగ్రఫీ, ఫిజిక్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, అప్లైడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఫోర్సెనిక్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ, నానోసైన్స్ తదితరాలు. పీజీ తర్వాత పలు స్పెషలైజేషన్స్‌తో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ:
డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్‌డీ చేసే అవకాశాన్ని కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కల్పిస్తున్నాయి. ఈ కోర్సులనే ఇంటిగ్రెటెడ్ పీహెచ్‌డీలుగా వ్యవహరిస్తారు. వివరాలు.. ఐఐఎస్‌సీ-బెంగళూరు. బయలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్‌లలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం. వెబ్‌సైట్: www.iisc.ernet.in. జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(జెఎన్‌సీఏఎస్‌ఆర్)-బెంగళూరు, బయలజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. వెబ్‌సైట్: www.jncasr.ac.in. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ): ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ (ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్) కోర్సును ఇగ్నో సహకారంతో నిర్వహిస్తుంది. వెబ్‌సైట్: www.iiap.res.in
ఐఐటీల్లో:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో కూడా ఎంఎస్సీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) ఎంట్రెన్స్‌కు హాజరు కావాలి. దీనికి అర్హత సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్. ఈ పరీక్ష ఆధారంగా ఎంఎస్సీ, జాయింట్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ, ఎంఎస్సీ- పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను చదివే అవకాశం ఉంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) కూడా పలు పీజీ కోర్సులను ఆఫర్ చేస్తుంది (వెబ్‌సైట్: www.aiims.edu).
మంచి తరుణం:
ప్రస్తుతం సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు సంఖ్య తక్కువగా ఉంటోంది. దాంతో సంబంధిత విభాగాలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పలు రకాల స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై-www.kvpy.org.in), ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ (www.inspire&dst.gov.in), యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్‌షిప్స్ (www.ugc.ac.in)ను, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తుంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్‌డీ వంటి ఎన్నో ఉన్నత కోర్సులను చదవడానికి, పరిశోధనల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ స్కాలర్‌షిప్స్ ఉపయోగపడతాయి. దీన్ని బట్టి సైన్స్ స్ట్రీమ్‌కు ఎంత ప్రాధాన్యత లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సైన్స్ కోర్సులను చదివితే అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు.
నెట్:
పీహెచ్‌డీ ఔత్సాహికులు హాజరు కావల్సిన మరో కీలక పరీక్ష.. సీఎస్‌ఐఆర్-నెట్. ఇందులో జేఆర్‌ఎఫ్ సాధించడం ద్వారా ఐఐటీలు, నిట్‌లు, అన్ని పరిశోధనశాలలు, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీలో చేరవచ్చు. దీని ద్వారా ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. మొదటి రెండేళ్లు నెలకు రూ.16,000 చెల్లిస్తారు. ఏడాదికి ఒకసారి కాంటిన్‌జెన్సీ గ్రాంట్‌గా రూ. 20,000 చెల్లిస్తారు. ఆ తర్వాత మూడో సంవత్సరంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) హోదా కల్పించి నెలకు రూ. 18,000 చెల్లిస్తారు. అంతేకాకుండా సీఎస్‌ఐఆర్ నెట్ పరీక్షలో మంచి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ప్రత్యేక ఫెలోషిప్‌ను ఐదేళ్లు అందిస్తారు. దీనిద్వారా మొదటి రెండేళ్లు నెలకు రూ. 20,000 స్టైఫండ్ ఇస్తారు. మూడో ఏడాది నుంచి నెలకు రూ. 24,000 ఇవ్వడంతోపాటు ఏడాదికి రూ. 70,000 కాంటిన్‌జెన్సీ గ్రాంట్ కూడా చెల్లిస్తారు. ఇటీవల రాష్ట్రంలో ఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహిస్తున్నారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌గా కెరీర్ ప్రారంభించడానికి నెట్/సెట్‌లో అర్హత తప్పనిసరి.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్):
మరో అవకాశం.. బార్క్ అందించే ఓరియెంటేషన్ కోర్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ (ఓసీఈఎస్) ప్రోగ్రామ్. అర్హత: ఎంఎస్సీ (ఫిజిక్స్ / అప్లయిడ్ ఫిజిక్స్/కెమిస్ట్రీ). ఓసీఈఎస్ అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 20 వేల స్కాలర్‌షిప్ లభిస్తుంది. శిక్షణ ముగిశాక 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి భారత అణుశక్తి శాఖ పరిధిలోని యూనిట్లలో సైంటిఫిక్ ఆఫీసర్‌గా నియమిస్తారు. దీంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. అంతేకాక భవిష్యత్తులో హోమీ బాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంఫిల్, పీహెచ్‌డీకి అనుకూలించే క్రెడిట్స్ కూడా లభిస్తాయి. వెబ్‌సైట్: https://oces.hbni.ac.in
అవకాశాలు:
సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు ఇతర కోర్సుల విద్యార్థులతో పోలిస్తే అధికంగానే అవకాశాలుంటాయి. ఆయా అభ్యర్థుల విద్యా నేపథ్యం ఆధారంగా ఆర్ అండ్ డీ సెంటర్లు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, బెవరేజెస్ కంపెనీలు, వైల్డ్‌లైఫ్ సర్వీసెస్, బొటానికల్ గార్డెన్స్, నేచర్ రిజర్వ్స్, ఎన్విరాన్‌మెంట్ కన్సల్టెన్సీలు, హెల్త్ కేర్ వంటివి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా పీజీ/పీహెచ్‌డీ అర్హతతో శాస్త్రవేత్తలుగా, సైంటిఫిక్ అసిస్టెంట్‌గా అవకాశాలు ఉంటాయి. డిగ్రీ అర్హతతో క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ తదితర విభాగాల్లో స్థిర పడొచ్చు. ప్రభుత్వశాఖల్లో కూడా శాస్త్రవేత్తలుగా అవకాశాలుంటాయి. టీచింగ్‌పై ఆసక్తి ఉంటే బీఈడీ, డీఈడీ వంటి కోర్సులను చేయవచ్చు. పీజీ డిగ్రీ ఉంటే కార్పొరేట్ విద్యాసంస్థల్లో టీచర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ అర్హతతో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు హాజరు కావచ్చు.
వేతనాలు:
పీజీ/పీహెచ్‌డీ వంటి అర్హతలతో కెరీర్ ప్రారంభిస్తే నెలకు రూ. 30 వేలకు తక్కువ కాకుండా వేతనం లభిస్తుంది. డిగ్రీ తో మాత్రం ఎంట్రీ లెవల్, జూనియర్/ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి. వీరికి నెలకు రూ. 10 నుంచి 15 వేల వేతనం లభిస్తుంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో లెక్చరర్‌గా నెలకు రూ.20 వేలకు తగ్గకుండా ప్రారంభ వేతనం ఉంటుంది.
ప్రస్తుతం సైన్స్‌లో డిమాండ్ ఉన్న స్పెషలైజేషన్లు:

- బయోటెక్నాలజీ
- బయోఇన్ఫర్మాటిక్స్
- మైక్రోబయాలజీ
- ఫారెస్ట్రీ
- జెనెటిక్స్
- ఎర్త్‌సైన్స్
- ఎలక్ట్రానిక్స్
- ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
- హోమ్‌సైన్స్
- మాలిక్యులర్ బయాలజీ
- ప్లాంట్ పాథాలజీ
- బయోకెమిస్ట్రీ
- అగ్రికల్చర్ సెన్సైస్
- ఫోరెన్సిక్ సైన్స్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లు
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ (భువనేశ్వర్)
- బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ముంబై)
- రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బెంగళూరు)
- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీలు సైన్స్‌కు సంబంధించి యూజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
---------------------------------------------------------------------------------------------
అప్‌డేటెడ్‌గా ఉంటే.. అవకాశాలు
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే పరిశోధనలు సాగాలి. వీటికి మూలం ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ వంటి ప్యూర్ సైన్స్ కోర్సుల్లోనే ఉంటుంది. ఈ కోర్సుల్లో సుస్థిర భవిష్యత్తు కోసం కొంత కాలం వేచి చూడాలి. పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత అర్హతలను సంపాదించుకోవడం తప్పనిసరి. విద్యార్థులు ముఖ్యంగా పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. సీటు పొందడంతోనే పరిమితం కాకుండా సబ్జెక్టులో లోతైన అవగాహన పొందేందుకు కృషి చేయాలి. విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్, రెగ్యులర్ రీడింగ్, తమ విభాగంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై అప్‌డేటెడ్‌గా ఉంటే.. అవకాశాలు వాటంతటవే లభిస్తాయి. అప్లైడ్ సైన్స్ పీజీ కోర్సులకు కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ జరుగుతుండటం ఆశాజనక పరిణామం.
-ప్రొఫెసర్ టి. పార్థసారథి,
ప్రిన్సిపాల్, పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్,
ఉస్మానియా యూనివర్సిటీ .

Published date : 05 Aug 2013 06:33PM