Skip to main content

జెస్ట్.. ఫిజిక్స్ రీసెర్చ్ కు బెస్ట్

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 27 పరిశోధన సంస్థల్లో ఫిజిక్స్, థియొరెటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్‌లలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి మార్గం జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్). 2014 సంవత్సరానికి జెస్ట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పించే పరిశోధన సంస్థలు, కోర్సులు, అర్హతలు, ప్రిపరేషన్ ప్లాన్..


అర్హతలు..

  • పీహెచ్‌డీ ఫిజిక్స్: ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్. కొన్ని సంస్థల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు కూడా అర్హులే. బీఈ/బీటెక్/బీసీఏ/బీఎస్సీ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పీహెచ్‌డీ థియొరెటికల్ కంప్యూటర్ సైన్స్: కంప్యూటర్ సైన్స్.. సంబంధిత అంశాల్లో ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత.
  • పీహెచ్‌డీ న్యూరో సైన్స్: నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్‌బీఆర్‌సీ)లో ప్రవేశానికి కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్- పీహెచ్‌డీ ప్రోగ్రామ్: హెచ్‌ఆర్‌ఐ, ఐఐఎస్‌ఈఆర్-పుణే, తిరువనంతపురం, ఐసీటీఎస్-టీఐఎఫ్‌ఆర్, ఐఐఎస్సీ-బెంగళూరు, ఎన్‌సీఆర్‌ఏ-టీఐఎఫ్‌ఆర్, టీఐఎఫ్‌ఆర్-టీసీఐఎస్, టీఐఎఫ్‌ఆర్, ఎస్‌ఎన్‌బీఎన్‌సీబీఎస్‌ల్లో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ కోర్సుకు బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఎన్‌బీఆర్‌సీలో న్యూరోసైన్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్‌డీ కోర్సుకు బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్), బీఈ/బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులు అర్హులు.
ఎంపిక విధానం:
జెస్ట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా సంబంధిత ఇన్‌స్టిట్యూట్లు అభ్యర్థులను ఆహ్వానిస్తాయి. ఆయా సంస్థలు సొంత ఎంపిక ప్రక్రియ ద్వారా (గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ) ప్రవేశం ఖరారు చేస్తాయి.

పరీక్ష విధానమిదీ:
ప్రవేశ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. పరీక్ష రెండు విభాగాలుగా (మార్కులు 100) ఉంటుంది. మొదటి సెక్షన్లో 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మొత్తం 75 మార్కులు. రెండో విభాగంలో 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 25 మార్కులుంటాయి. 40 శాతం ప్రశ్నలను బీఎస్సీ (ఆనర్స్) నుంచి, 60 శాతం ప్రశ్నలను పీజీ (ఫిజిక్స్) సిలబస్ నుంచి ఇస్తారు.

స్కాలర్‌షిప్స్:
ఈ 27 పరిశోధన సంస్థల్లో ఎక్కడ చేరినప్పటికీ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది. దీంతోపాటు ఆయా సంస్థలకు సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.

అవకాశాలు.. అపారం:
ఈ సంస్థల్లో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి ఇస్రో, బార్క్, డీఆర్‌డీఓ, అణుశక్తి విభాగాలు, ఆర్ అండ్ డీ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలుంటాయి. దీంతోపాటు బోధన రంగం కూడా వీరికి ఆహ్వానం పలుకుతోంది. వివిధ కార్పొరేట్ కళాశాలల్లో.. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ ఫిజిక్స్ బోధించేవారు నెలకు రూ.లక్షల్లోనే సంపాదిస్తున్నారు. వీటితోపాటు వివిధ రాష్ట్ర, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరొచ్చు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు రుసుం రూ. 300 (ఎస్సీ/ఎస్టీలకు రూ. 150).
  • రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ముఖ్య తేదీలు:
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 11, 2013
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2013
  • జెస్ట్ రాత పరీక్ష: ఫిబ్రవరి 16, 2014
  • వెబ్‌సైట్: www.jest.org.in
ప్రవేశం కల్పిస్తున్న సంస్థలివే..

ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్ - నైనిటాల్.
వెబ్‌సైట్: www.aries.res.in

హోమీబాబా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ - ముంబై.
వెబ్‌సైట్:
www.hbni.ac.in

హరీష్-చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- అలహాబాద్.
వెబ్‌సైట్:
www.hri.res.in

ఐసీటీఎస్-టీఐఎఫ్‌ఆర్, బెంగళూరు.
వెబ్‌సైట్: www.icts.res.in

ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్- కల్పక్కం.
వెబ్‌సైట్:
www.igcar.gov.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్- బెంగళూరు.
వెబ్‌సైట్:
www.iiap.res.in

ఐఐఎస్‌సీ-బెంగళూరు.
వెబ్‌సైట్: www.iisc.ernet.in

ఐఐఎస్‌ఈఆర్- మొహాలి, పుణే, తిరువనంతపురం.
వెబ్‌సైట్:
www.iisermohali.ac.in,
www.iiserpune.ac.in,
www.iisertvm.ac.in

ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్- చెన్నై.
వెబ్‌సైట్:
www.imsc.res.in

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్- భువనేశ్వర్.
వెబ్‌సైట్:
www.iopb.res.in

ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్-గాంధీనగర్.
వెబ్‌సైట్:
www.ipr.res.in

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్- పుణే.
వెబ్‌సైట్:
www.iucaa.ernet.in

జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్- బెంగళూరు.
వెబ్‌సైట్:
www.jncasr.ac.in

నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్-టీఐఎఫ్‌ఆర్ - పుణే.
వెబ్‌సైట్:
www.ncra.tifr.res.in

నైసర్- భువనేశ్వర్.
వెబ్‌సైట్:
www.niser.ac.in

ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ - అహ్మదాబాద్.
వెబ్‌సైట్:
www.prl.res.in

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ - ఇండోర్.
వెబ్‌సైట్:
www.rrcat.gov.in

రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్- బెంగళూరు.
వెబ్‌సైట్:
www.rri.res.in

సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్- కోల్‌కతా.
వెబ్‌సైట్:
www.saha.ac.in

సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సెన్సైస్ - కోల్‌కతా.
వెబ్‌సైట్:
www.bose.res.in

టీఐఎఫ్‌ఆర్-టీసీఐఎస్- హైదరాబాద్.
వెబ్‌సైట్:
www.tifrh.res.in

యూజీసీ-డీఏఈ సీఎస్‌ఆర్-ఇండోర్
వెబ్‌సైట్:
www.csr.res.in

వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్- కోల్‌కతా.
వెబ్‌సైట్:
www.vecc.gov.in

ప్రిపరేషన్ ఇలా
జెస్ట్ సిలబస్‌లో ప్రధానంగా క్లాసికల్ మెకానిక్స్, ఈఎం థియరీ అండ్ ఆప్టిక్స్, క్వాంటం మెకానిక్స్, థర్మో డైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్, మ్యాథమెటికల్ మెథడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ డేటా అండ్ ఎర్రర్ ఎనాలిసిస్, అడ్వాన్స్‌డ్ టాపిక్స్ (అటామిక్, మాలిక్యులర్, న్యూక్లియర్ ఫిజిక్స్ మొదలైనవి) ముఖ్యమైనవి. ముందుగా గతేడాది జెస్ట్ పేపర్‌ను విశ్లేషిస్తే ఎక్కువ శాతం ప్రశ్నలు మ్యాథమెటికల్ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్, క్వాంటం మెకానిక్స్ అండ్ ఈఎం థియరీలపై ఇచ్చారు. మొత్తం 50 ప్రశ్నల్లో 37 ప్రశ్నలు ఈ నాలుగు చాప్టర్ల నుంచే అడిగారు. స్టాటిస్టికల్ మెకానిక్స్, థర్మో డైనమిక్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి ఆరు నుంచి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి. ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అటామిక్ ఫిజిక్స్, ఆప్టిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిజిక్స్‌లపై ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. 2012 జెస్ట్‌లో మాత్రం ఎలక్ట్రానిక్స్, ఎక్స్‌పెరిమెంటల్ డేటా, ఎర్రర్ ఎనాలిసిస్ నుంచి నాలుగు నుంచి ఆరు ప్రశ్నలు ఉన్నాయి. ఎక్కువ శాతం ప్రశ్నలు 2013లో మాదిరిగానే మ్యాథమెటికల్ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్, క్వాంటం మెకానిక్స్ అండ్ ఈఎం థియరీలపై అడిగారు. 2012, 2013 జెస్ట్ పాత ప్రశ్నపత్రాలను దృష్టిలో ఉంచుకుని 2014కు సిద్ధమవ్వాలి. వచ్చే జెస్ట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలంటే ప్రధానంగా ఐదింటిపై పట్టు సాధించాలి.
అవి..
  • మ్యాథమెటికల్ ఫిజిక్స్
  • క్వాంటం మెకానిక్స్
  • క్లాసికల్ మెకానిక్స్
  • ఈఎం థియరీ
  • స్టాటిస్టికల్ మెకానిక్స్ అండ్ థర్మో డైనమిక్స్
ఫిజిక్స్‌లో వివిధ విభాగాల్లో మ్యాథమెటికల్ మెథడ్స్‌పై 15 శాతం నుంచి 20 శాతం ప్రశ్నలడుగుతారు. ప్రాథమిక భావనలపై 10 నుంచి 15 శాతం ప్రశ్నలుంటాయి. కానీ గత ప్రశ్నపత్రాలను విశ్లేషించినప్పుడు ఎక్కువ శాతం ప్రశ్నలు అప్లికేషన్ ఓరియెంటెడ్ విధానంలో ఉన్నాయి. అంతేకాకుండా అభ్యర్థి విశ్లేషణాత్మక నైపుణ్యాలను, కాన్సెప్ట్‌లపై స్పష్టతను పరీక్షించేలా ప్రశ్నలడిగారు. కాబట్టి విద్యార్థులు ముందు ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్లను బాగా చదవాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లో ప్రాథమిక భావనలను నేర్చుకుంటూ, వాటిని అప్లికేషన్ ఓరియెంటేషన్ విధానంలో ఎలా వాడాలో తెలుసుకోవాలి. వీటితోపాటు కాన్సెప్ట్‌లపై మరింత దృష్టిసారించాలి. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు అభ్యర్థి ఇంటర్‌ప్రిటేషన్ స్కిల్స్‌ను తెలుసుకునేలా ఉంటాయి. ఉదా..
  1. A flat surface is covered with non overlapping disks of same size. What is the largest fraction of the area that can be covered?
  2. There are on Average 20 buses per hour at a point, but at random times. The probability that there are no buses in five minutes is closed to?

రిఫరెన్స్ బుక్స్:

  • క్వాంటం మెకానిక్స్ - సకురాయ్, మెర్జ్‌బెకర్
  • ఈఎం థియరీ - జేడీ జాక్‌సన్, డీజే గ్రిఫిత్స్
  • స్టాటిస్టికల్ థర్మో డైనమిక్స్ - పాత్రియా, శాలినాస్
  • మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ ఫిజిక్స్ - ఆర్ఫకెన్ అండ్ వెబర్, బోస్
  • క్లాసికల్ మెకానిక్స్ - గోల్డ్ స్టెయిన్, రానా అండ్ జోగ్
Bavitha





సీరియస్ రీసెర్చ్‌తోనే కెరీర్
ఫిజిక్స్‌లో పరిశోధన పరంగా కెరీర్‌కు పునాది వేసుకునేందుకు ‘జెస్ట్’ మంచి అవకాశం. అయితే సీరియస్‌గా దృష్టిసారించే విద్యార్థులు మాత్రమే ఈ మార్గం ఎంచుకోవాలని నా సూచన. జెస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలలో ఫిజిక్స్‌లో సీటు పొందే అవకాశం ఉంది. ముందు నుంచీ దీనిపై అవగాహన పెంచుకుంటే లక్ష్యసాధన చాలా సులువు. సీటు సాధిస్తే ఫెలోషిప్ కూడా ఉంటుంది. జెస్ట్ ద్వారా ప్రవేశం కల్పించే పరిశోధన సంస్థలన్నీ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నవే. వీటిల్లో విజయవంతంగా పీహెచ్‌డీ పూర్తిచేస్తే బయట మంచి అవకాశాలున్నాయి. కోర్సులో చేరిన మొదటిరోజు నుంచి సీరియస్‌గా పరిశోధనలపైనే దృష్టి కేంద్రీకరించాలి. బయో, నానో, ఆస్ట్రోఫిజిక్స్, రేడియోలజీ ఇలా ఎంచుకున్న ఏ విభాగమైనా పరిశోధనల్లో పట్టుసాధిస్తే దేశ, విదేశాల్లో అపారమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్నాయి. ఏ కోర్సు చేసినా విద్యార్థుల పరిజ్ఞానం, దాన్ని క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేయగల నేర్పు ఉన్నప్పుడు మాత్రమే అవకాశాలు తలుపు తడతాయి. దీనికోసం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఆప్టిట్యూడ్ తరహాలో పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి క్లాసురూంలో పాఠాలు వినడంతోపాటు పాఠ్యపుస్తకాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే సులువుగా విజయం సాధించొచ్చు.
- ఆచార్య డాక్టర్ జి.ప్రసాద్,
ఉస్మానియా యూనివర్సిటీ,
హైదరాబాద్

భవిష్యత్తంతా ఫిజిక్స్‌దే
Bavitha సోలార్ ఎనర్జీపై ప్రయోగాలు చేయాలన్నది నా లక్ష్యం. ఇప్పటికే సూర్యశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కొత్త ఆవిష్కరణలు జరగాలి. దీనికి ఫిజిక్స్ ఒక్కటే మార్గం. మున్ముందు జరగబోయే ప్రయోగాలు, పరిశోధనలన్నీ భౌతికశాస్త్రంపైనే ఆధారపడి ఉన్నాయి. కొంచెం కష్టపడితే జెస్ట్‌లో ర్యాంకు సాధించవచ్చు. ఫిజిక్స్‌లో పరిశోధనలు చేసేందుకు జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్) ఉం టుందనే విషయం చాలా మందికి తెలియదు. దీని ద్వారా దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఫెలోషిప్ పొందే అవకాశం ఉంది. నా స్నేహితుడు బార్క్‌లో సీటు సంపాదించాడు. అదే స్ఫూర్తితో నేనూ జెస్ట్‌కు ప్రిపేరవుతున్నా. తప్పకుండా విజయం సాధిస్తాననే ఆత్మవిశ్వాసం ఉంది.
-ఎన్.ఎం.ఎస్. కృష్ణకాంత్,
ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి,
ఓయూ, హైదరాబాద్.

Published date : 14 Nov 2013 02:40PM

Photo Stories