రానున్న ఆరు నెలల్లో ఫార్మా రంగంలో రెట్టింపు కానున్న ఉద్యోగ నియామకాలు..!
ఇదే సమయంలో కంపెనీలకు నిపుణులైన అభ్యర్థుల కొరత సమస్యగా మారింది. దాంతో ఎంఫార్మసీ, లైఫ్ సైన్సెస్‌లో పీజీ పూర్తి చేసిన వారికి సంస్థలు పెద్దపీట వేయనున్నాయని కన్సల్టింగ్ సంస్థల అభిప్రాయం. రియల్‌టైమ్ నైపుణ్యాలతోపాటు క్రిటికల్ అనాలిసిస్ స్కిల్స్ ఉంటే ఆకర్షణీయ వేతనాలు అందుకునే వీలుంది.
డిమాండ్ నెలకొన్న విభాగాలు ఇవే..
ప్రస్తుతం ఫార్మా రంగంలో డ్రగ్ డిస్కవరీ, క్వాలిటీ అష్యూరెన్స్, కాంప్లెక్స్ ఇంజెక్టిబుల్ డెవలప్‌మెంట్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మకో విజిలెన్స్, లీగల్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ నెలకొంది.
ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్, సీనియర్ లెవల్, లీడర్‌షిప్.. ఇలా అన్ని స్థాయిల్లోనూ పోస్టుల భర్తీ జరుగుతుందని పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. నైపుణ్యాలుంటే ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఓ ప్రముఖ ఫార్మా సంస్థ ప్రకటించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఉత్పత్తి విభాగంలో నలభై శాతం..
మొత్తం రిక్రూట్‌మెంట్స్‌లో ఉత్పత్తి విభాగం(డ్రగ్ డిస్కవరీ, ఆర్ అండ్ డీ, క్లినికల్ రీసెర్చ్)లోనే 40శాతం నియామకాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో సేల్స్ అండ్ మార్కెటింగ్, లాజిస్టిక్స్ విభాగాలు నిలుస్తున్నాయి.
ప్రస్తుతం ఫార్మా రంగంలో.. లైఫ్ సైన్సెస్, హెల్త్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ అభ్యర్థులకు మంచి డిమాండ్ నెలకొంది. వీరికి సంస్థల్లో ఆర్ అండ్ డీ విభాగాల్లో రీసెర్చ్ అసోసియేట్స్, రీసెర్చ్ అసిస్టెంట్స్, రీసెర్చ్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.
ఫార్మసీ అభ్యర్థులకు ప్రస్తుతం అంతర్జాతీయంగానూ అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో ఆర్ అండ్ డీ నిపుణులకు బాగా డిమాండ్ నెలకొంది. అక్కడ వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నాయి.
ఇంకా చదవండి: part 3: ఫార్మా రంగంలో టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌కు సైతం ఉద్యోగాలు..!