Skip to main content

ఫార్మా రంగంలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు సైతం ఉద్యోగాలు..!

ఫార్మా రంగంలో ప్రస్తుత నియామక సరళిని పరిశీలిస్తే.. టెక్నికల్‌ గ్రాడ్యుయేట్స్‌కు సైతం అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, డేటా అనలిటిక్స్‌ వంటి సాంకేతిక నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. సంస్థలు డ్రగ్‌ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్‌ పరంగా మానవ ప్రమేయం తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

డిమాండింగ్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌..
ఫార్మా రంగంలో.. ఆర్‌ అండ్‌ డీ హెడ్స్‌; రీసెర్చ్‌ అనలిస్ట్‌; రీసెర్చ్‌ అసోసియేట్‌; క్వాలిటీ అష్యూరెన్స్‌ ఆఫీసర్స్‌; క్వాలిటీ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌; సేల్స్, మార్కెటింగ్‌ ఆఫీసర్స్‌; సప్లయ్‌ చైన్‌ మేనేజర్స్‌ వంటి జాబ్‌ ప్రొఫైల్స్‌కు డిమాండ్‌ నెలకొంది.

స్పెషలైజేషన్స్‌..
ఫార్మా రంగంలో విభాగాలు, వాటికి అవసరమైన అర్హతలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా విభాగాలను బట్టి పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఫార్మకోగ్నసీ, మైక్రోబయాలజీ, వైరాలజీ, ఫార్మాస్యుటిక్స్, ఫార్మాస్యుటికల్‌ అనాలిసిస్, ఫార్మాస్యుటికల్‌ టెక్నాలజీ, టాక్సికాలజీ, క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మా మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌తో పీజీ చేసిన వారికి ఉన్నత స్థాయి హోదాలు లభిస్తున్నాయి. వీరికి ఆయా సంస్థల లేబొరేటరీస్‌లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బీఫార్మసీ, డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కెమిస్ట్, క్వాలిటీ కంట్రోల్‌ అసిస్టెంట్స్‌ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.

జాబ్‌ పోర్టల్స్‌ ద్వారా..
ఫార్మా సంస్థలు ప్రధానంగా జాబ్‌ పోర్టల్స్‌ ద్వారానే ఎక్కువ శాతం నియామకాలు చేపడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆయా జాబ్‌ పోర్టల్స్‌లో తమ ప్రొఫైల్‌ రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా అవకాశాలు అందుకోవచ్చు.

అకడమిక్‌ అర్హతలు..
ఫార్మసీ విభాగంలో డిప్లొమా ఇన్‌ ఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంసెట్‌ ద్వారా బీ ఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. అలాగే జీప్యాట్‌ స్కోర్‌ ద్వారా ఎం ఫార్మసీలో చేరే వీలుంది. నైపర్, ఐఐఎస్‌ఈఆర్, డీఎస్‌టీ తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో పీహెచ్‌డీ చేసేందుకు కూడా అవకాశం ఉంది.

ఇంకా చ‌ద‌వండి: part 4: ఈ రంగంలో ఫ్రెష‌ర్స్‌కు నెల‌కు రూ.30వేల వ‌ర‌కు వేత‌నాలు..!

Published date : 09 Nov 2020 02:34PM

Photo Stories