ఈ రంగంలో ఫ్రెషర్స్‌కు నెలకు రూ.30వేల వరకు వేతనాలు..!
ఇప్పటికే కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారికి సైతం సంస్థలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఆయా సంస్థల్లో సీనియర్, మిడిల్ లెవల్‌లో ఉద్యోగులకు 30 శాతం మేర వేతనాలు పెరిగినట్లు పలు కన్సల్టింగ్ సంస్థలు పేర్కొన్నాయి.
ఫార్మా రంగం... ముఖ్యాంశాలు
కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ నియామకాలు.
టాప్–5 రిక్రూటర్స్ జాబితాలో ఫార్మా సెక్టార్.
రానున్న రోజుల్లోనూ నియామకాల్లో ముందంజలో నిలిచే అవకాశం.
ప్రారంభం నుంచి ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్న వైనం.
ఆర్ అండ్ డీ, డ్రగ్ డిస్కవరీ విభాగాల్లో 40 శాతం మేర కొత్త నియామకాలు.
బీఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వారికీ అవకాశాలు.
రియల్ టైమ్ నైపుణ్యాలుంటేనే..
ఫార్మారంగంలో నియామకాలు పెరుగుతున్న మాట వాస్తవం. సంస్థలు కేవలం అర్హతల ఆధారంగానే ఆఫర్లు ఇవ్వడం లేదు. అభ్యర్థుల్లో రియల్ టైమ్ నైపుణ్యాలు ఉన్నాయా? లేదా? అని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు రియల్ టైమ్ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు కృషి చేయాలి.
–డాక్టర్.టి.సతీశ్, చైర్మన్, ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ ఇంటరాక్షన్ కమిటీ (ఇండియన్ డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్)
ఇంకా చదవండి: part 1: ఉద్యోగాల కల్పనలో టాప్-5లో ఫార్మా రంగం.. అవకాశాలు ఇవిగో..