ఫార్మసీ ఎడ్యుకేషన్‌లో ది బెస్ట్ ..ఫార్మ్.డి.
Sakshi Education
భారతదేశంలో ఫార్మసీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో అత్యున్నత స్థాయి పరిశోధనలు మనదేశంలో జరుగుతున్నాయి. బల్క్ డ్రగ్ ప్రొడక్షన్, ఫార్ములేషన్‌లో... భారత్ ఆసియా ఖండంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఫార్మసీ రంగంలో అత్యున్నత కోర్సులు చాలానే ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో పరిశ్రమ అవసరాలను తీర్చే కోర్సులకు కొరత తీవ్రంగా ఉండడంతో 2008లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఓ కొత్త కోర్సుని ప్రవేశపెట్టింది. అదే.. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మ్.డి).
ఎంబీబీఎస్ చదవకపోయినా డాక్టర్లకు సైతం సలహా ఇచ్చే నైపుణ్యం..రోగులకు కౌన్సెలింగ్ నిర్వహించే నేర్పరితనం..వైద్యుడికి, రోగికీ మధ్య కీలక అనుసంధానకర్త...డ్రగ్ డెవలప్‌మెంట్‌లో ప్రధాన పాత్ర పోషించే సామర్థ్యం.. ఇవన్నీ ఈకోర్సు ప్రత్యేకతలు. అందుకే అందుబాటులో ఉన్న ఫార్మసీ కోర్సులన్నింటిలోకి ది బెస్ట్‌గా నిలుస్తోంది..ఫార్మ్.డి.
ఫార్మ్.డి. ప్రత్యేకత:
ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఫార్మసీ కోర్సులన్నీ ఎక్కువ శాతం థియరీ బేస్డ్‌గా ఉంటున్నాయి. విద్యార్థులకు ఎంతో కీలకమైన ప్రాక్టీకల్ నాలెడ్జ్ అందటం లేదు. దీంతో అధిక శాతం మంది విద్యార్థులు ప్రొడక్ట్/ఫార్ములేషన్ అసిస్టెంట్లుగానే మిగిలిపోతున్నారు. అదే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో...డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌లో లోపాలున్నా..అనవసరంగా మందులు సూచించినా.. నిర్ద్వందంగా వెనక్కి పంపిస్తారు.. ఫార్మసిస్ట్‌లు వేరే మందులు రాయమని డాక్టర్‌కి సూచిస్తారు. అక్కడి ఫార్మాసిస్ట్‌లకు అంత అవగాహన ఉంటుంది. దీనికి కారణం అక్కడి ఫార్మసీ కోర్సులోని కరిక్యులం. అంతటి స్థాయిలో డాక్టర్లకు దీటుగా మన ఫార్మాసిస్ట్‌లను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఫార్మ్.డి. కోర్సుకు అంకురార్పణ జరిగింది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్లినికల్ థెరపీ, ఫార్మకోథెరపీ, క్లినికల్ రీసెర్చ్, కమ్యూనిటీ ఫార్మసీ వంటి కార్యకలాపాల్లో సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
కోర్సు స్వరూపం:
ఫార్మ్.డి. కోర్సు దాదాపు ఎం.ఫార్మ్.తో సమానమైదని చెప్పొచ్చు. ఆరేళ్ల ఈ కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంది. ఇందులో ఐదేళ్లు క్లాస్ రూం టీచింగ్, ప్రాక్టికల్స్ సమ్మిళితంగా ఉంటుంది. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్. ఈ కోర్సులో మొత్తం 35 థియరీ సబ్జెక్టులను బోధిస్తారు. ఫలితంగా... కోర్సు పూర్తయ్యేనాటికి ఎం.డి. లేదా ఎం.ఎస్. స్థాయి పరిజ్ఞానం ‘ఫార్మ్.డి.’ అభ్యర్థుల సొంతమవుతుంది. రెండో ఏడాదిలోనే ‘హ్యూమన్ అనాటమీ’ దిశగా కరిక్యులమ్‌ను రూపొందించారు. విద్యా ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో... ప్రతి ఫార్మ్.డి. కళాశాలకు తప్పనిసరిగా 300 పడకల ఆసుపత్రి ఉండాలని లేదా కనీసం అలాంటి ఆసుపత్రితో అవగాహన కుదుర్చుకోవాలనే నిబంధనను విధించారు. ప్రతి విద్యార్థి... పది మంది రోగులను ప్రాక్టికల్‌గా పరిశీలించాలి. కోర్సు నాలుగైదు సంవత్సరాల్లో వారానికి పది గంటలు వార్డుల్లో రౌండ్లు నిర్వహించడం తప్పనిసరి. ఐదో ఏడాది ఉదయం పూట క్లాసులు, మధ్యాహ్నం వార్డ్ రౌండ్లు తప్పనిసరి. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్. అందువల్ల సర్టిఫికెట్ పొందేనాటికి ప్రతి విద్యార్థి పూర్తి స్థాయి క్లినికల్ ఫార్మాసిస్ట్‌గా నైపుణ్యం సాధిస్తారు.
ప్రవేశం:
ఫార్మ్.డి. కోర్సులో ప్రవేశించడానికి అర్హత..ఇంటర్మీడియెట్(ఎంపీసీ, బైపీసీ). ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. బైపీసీ విద్యార్థులు(జనరల్) 4-5 వేల లోపు ర్యాంక్ సాధించాలి. ఎంపీసీ విద్యార్థులకు(జనరల్) 25-30 వేల లోపు ర్యాంకు వస్తే సరిపోతుంది.
ఆఫర్ చేస్తున్న కళాశాలలు:
ఫార్మ్.డి. కోర్సును దేశ వ్యాప్తంగా 65 కాలేజీల్లో అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 23 కళాశాలలు ఫార్మ్.డి. కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో 690 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి కాలేజ్‌లో ఉండే 30 సీట్లలో..బైపీసీ విద్యార్థులకు 11 సీట్లు, ఎంపీసీ విద్యార్థులకు 9 సీట్లను కే టాయించారు. మిగతా 9 సీట్లు మేనేజ్‌మెంట్ కోటాకు చెందినవి.
విధులు:
పేషెంట్‌ని కలవడం... వారి కేస్‌షీట్‌ను పరిశీలించి, మెడికల్ రిపోర్టులను తయారుచేయడం.. దీన్ని ‘డేటా బేస్’లో పొందుపరచడం.. కేస్ స్టడీ, రోగి ఇమ్యూనిటీ లెవల్ ఆధారంగా మందులు సూచించడం.. రోగులకు ఆహార నియమాలు తెలియజేయడం.. అవసరమైతే మందుల విషయంలో డాక్టర్లకు సలహాలివ్వడం వంటి విధులను ఫార్మ్.డి. అభ్యర్థులు నిర్వహించాల్సి ఉంటుంది.
అవకాశాలు :
ఫార్మ్.డి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. ఔషధ ప్రమాణాలు ఒకేవిధంగా ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధన కారణంగా ఫార్మ్.డి. అభ్యర్థులకు మరింత డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా 2013-14 నాటికల్లా ప్రతి హాస్పిటల్‌లో డిస్పెన్సరీలో ఫార్మ్.డి అభ్యర్థులను నియమించాలి. డ్రగ్ ఇన్ఫర్మేషన్ కేంద్రాలను నెలకొల్పి, వాటిలో ఫార్మ్.డి. కోర్సును పూర్తి చేసిన వారినే నియమించాలనే నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఫార్మ్.డి.అభ్యర్థుల అవసరం పెరుగుతోంది. ఈ కోర్సుతోపాటు క్లినికల్ రీసెర్చ్‌లో ‘ఎస్.ఎ.ఎస్.’, ఇతర సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటే ఎన్నో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆసుపత్రుల్లోనే కాకుండా.. క్లినికల్ రీసెర్చ్ సంస్థలు, డ్రగ్ డెవలప్‌మెంట్, క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఫార్మసీ విభాగాల్లోనూ వీరికి అవకాశాలుంటాయి. మన రాష్ట్రంలో యు.ఎఫ్.డి.ఎ. అనుమతి ఉన్న సంస్థలు 50 నుంచి 60 వరకు ఉన్నాయి. వాటన్నిటిలోనూ ఫార్మ్.డి. అభ్యర్థులకు అవకాశాలు లభిస్తాయి.
విదేశీ అవకాశాలు:
ఆరేళ్ల ఫార్మ్.డి.కోర్సు ప్రారంభించడానికి మరో ముఖ్య కారణం.. విదేశీ అవకాశాలు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ ఫార్మసీ (ఎన్‌ఏబీపీ) నిబంధనల ప్రకారం... ఐదేళ్ల వ్యవధి గల కోర్సు చేస్తేనే ఫారిన్ ఫార్మసీ గ్రాడ్యుయేషన్ ఈక్వలెన్సీ పరీక్ష (ఎఫ్‌పీజీఈఈ) రాసేందుకు అర్హత లభిస్తుంది. ఆ పరీక్ష ఉత్తీర్ణులైన వారికి మాత్రమే.. అమెరికాలో ఉద్యోగాలకు అవసరమైన ‘నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లెసైన్సర్ ఎగ్జామినేషన్ (నాప్‌లెక్స్)కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ రంగంలో అమెరికాలో ఉద్యోగం పొందే వీలు లభిస్తుంది. ఈ క్రమంలో మన ఫార్మసీ విద్యార్థులు విదేశాల్లోనూ అవకాశాలు పొందాలనే ఉద్దేశంతో ఆరేళ్ల ఫార్మ్.డి.కోర్సు రూపకల్పన జరిగింది.
వేతనాలు:
డాక్టర్లతో సమానమైన జ్ఞానాన్ని పెంపొందించే ఈ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు వేతనాలు సైతం ఆకర్షణీయంగా ఉంటాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్సు ప్రారంభించి నాలుగేళ్లే కావడంతో..మొదటి బ్యాచ్ బయటికి రావడానికి మరో రెండేళ్ల సమయం ఉంది. అప్పటి పరిస్థితులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనాలు, డిమాండ్ కారణంగా ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు దాదాపు రూ.40 వేలు వేతనం లభించే అవకాశం ఉంది. విదేశాల్లో మాత్రం ఫార్మ్.డి. నిపుణులకు అమెరికాలో గంటకు 50 డాలర్లు, బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల్లో గంటకు దాదాపు 40 పౌండ్లు వేతనం చెల్లిస్తున్నారు.
బీఫార్మ్‌తో.. ఫార్మ్‌డీ
ఎంసెట్ ర్యాంక్ ప్రాతిపదికపై కాకుండా బ్యాచిర్ ఆఫ్ ఫార్మసీ( బీఫార్మ్) విద్యార్థులకూ ఫార్మ్.డి. కోర్సు చేసే అవకాశం ఉంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్) ఆధారంగా ప్రవేశం కల్పించే ఈ కోర్సును ‘ఫార్మ్.డి.పోస్ట్ బ్యాకులారేట్ ప్రోగ్రామ్’గా వ్యవహరిస్తారు. ఆరేళ్ల ఫార్మ్‌డీ కోర్సులో లేటరల్ ఎంట్రీగా..కోర్సులోని నాలుగు, ఐదు, ఆరో సంవత్సరాలను చదివే అవకాశం బీఫార్మ్ విద్యార్థులకు ఉంటుంది. ఇందులో రెండేళ్లు క్లాస్ రూం టీచింగ్.. చివరి ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రవేశం కోరే విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా 70 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Published date : 24 Sep 2012 07:29PM