యువత ఉజ్వల కెరీర్‌కు వేదికగా...ట్రేడింగ్
Sakshi Education
మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనం సంపాదించిన డబ్బు పిల్లలు పెట్టాలంటారు అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. అందుకే సంపాదించిన డబ్బును రెట్టింపు చేసుకోవాలనే ఆలోచన ప్రజల్లో అధికమైంది. మరి ఎక్కడ పెట్టుబడి పెడితే ఆదాయం బాగుంటుంది? బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఆశాజనకంగా లేవు.
అందుకే ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్, స్టాక్‌మార్కెట్, ట్రేడింగ్‌వైపు దృష్టిసారిస్తున్నారు. దాంతో అలాంటి ఇన్వెస్టర్లకు సేవలు అందించే ట్రేడింగ్ కంపెనీలు, అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. ఇదే ఇప్పుడు యువతకు ఉజ్వల కెరీర్‌కు వేదికగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్‌మార్కెట్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు, అర్హతలు, ప్రత్యేక సర్టిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం...
మ్యూచువల్ ఫండ్స్.. హోదాలు అనేకం
ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల్లో కీలకమైన హోదా.. రీసెర్చ్ అనలిస్ట్. ఈక్విటీలకు సంబంధించి క్రయ-విక్రయాలపై అధ్యయనం చేయడం ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ ప్రధాన విధులు. రీసెర్చ్ అనలిస్ట్‌లు స్టాక్స్‌కు సంబంధించి రీసెర్చ్ చేసి ఫండ్ మేనేజర్లకు సలహాలు ఇస్తారు. అలాగే క్లయింట్లకు.. ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీస్ గురించి విశ్లేషిస్తారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ బ్రోకరేజ్ సంస్థలు ఎంబీఏ/స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ పీజీ ఉత్తీర్ణులను రీసెర్చ్ అనలిస్ట్‌లుగా నియమించుకుంటున్నాయి. వీరికి వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు అందుతోంది.
కస్టోడియన్/రిజిస్ట్రార్ :
ఇన్వెస్టర్ల నుంచి నగదును సమీకరించి ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే సంస్థలు..సదరు నగదును, ఫండ్ నిర్వహణను దుర్వినియోగం చేయకుండా చూడడం కస్టోడియన్/రిజిస్ట్రార్స్ విధులు. ఫండ్స్‌ను అందించే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, బ్రోకరేజ్ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. న్యాయ విద్యతోపాటు పని అనుభవం ఉన్నవారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కస్టోడియన్/రిజిస్ట్రార్‌గా కొలువు సొంతం చేసుకున్న వారికి వేతనాలు ఆకర్షణీయమని చెప్పొచ్చు.
ట్రస్టీ :
ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి మరో కీలకమైన ఉద్యోగం.. ట్రస్టీ. థర్డ్ పార్టీకి సేవలందిస్తున్న సంస్థలో.. సదరు థర్డ్ పార్టీ అసెట్స్‌ను సద్వినియోగం చేసేలా చూడడం, వాటికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ట్రస్టీ ముఖ్య విధులు.
ఫండ్ మేనేజర్ :
మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో అత్యంత కీలకమైన హోదా.. ఫండ్ మేనేజర్. ఇన్వెస్టర్ల సొమ్మును పెట్టుబడిగా పెట్టే విషయంలో ఆయా సంస్థల ప్రస్తుత పనితీరు, ఇటీవల కాలంలో సదరు కంపెనీల ఆర్థిక ఫలితాలు, లాభ నష్టాలు, అవి అందించిన డివిడెండ్స్, రానున్న రాజుల్లో సదరు సంస్థల పనితీరు ఎలా ఉంటుంది? వంటి అనేక అంశాలను పరిశీలించి ఇన్వెస్టర్లకు సరైన సలహాలివ్వడం ఫండ్ మేనేజర్ల ప్రధాన విధులు. నిర్దిష్టంగా ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుందో వివరించి ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను వీరు నిర్వహిస్తుంటారు. ఫండ్ మేనేజర్‌గా రాణించాలంటే.. క్యాపిటల్ మార్కెట్ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అదేవిధంగా విశ్లేషణ నైపుణ్యాలు తప్పనిసరి. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు కామర్స్, ఎకనామిక్స్, ఎంబీఏ, సీఏ, ఫైనాన్షియల్ ప్లానింగ్, స్టాటిస్టిక్స్ విభాగంలో పీజీ స్థాయి అర్హతలు ఉన్న అభ్యర్థులను ఫండ్ మేనేజర్లుగా నియమించుకుంటున్నాయి. వీరికి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు ఉంటుంది.
ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ :
ఇన్వెస్టర్ల తరఫున పలు సెక్యూరిటీ పోర్ట్‌ఫోలియోస్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ల ముఖ్య బాధ్యత. వీరు నిత్యం సెక్యూరిటీస్ క్రయ విక్రయాలు, పోర్ట్‌ఫోలియోల సమీక్ష, లావాదేవీల పరిష్కారం, సంబంధిత స్టాక్స్ పనితీరు, నియంత్రణ, క్లయింట్ల(ఇన్వెస్టర్లు)కు నివేదించడం వంటి విధులు నిర్వహిస్తుంటారు. సంస్థలు కామర్స్/ఫైనాన్స్/ఎకనామిక్స్‌తో బ్యాచిలర్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులను నియమించుకుంటున్నాయి. ప్రారంభంలో రూ.4లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.
ఫైనాన్షియల్ అడ్వైజర్ :
ఇన్వెస్టర్లను గుర్తించడం, వారి పెట్టుబడి లక్ష్యాల్ని తెలుసుకోవడం, అందుబాటులో ఉన్న ప్రొడక్ట్‌ల గురించి చెప్పడం వీరి విధులు. ఫైనాన్షియల్ అడ్వైజర్‌లకు క్లయింట్ల లక్ష్యాలు తెలుసుకోవడమే కాకుండా.. క్యాపిటల్ మార్కెట్లో ఆయా సంస్థల పనితీరు గురించి కూడా అవగాహన ఉండాలి. బ్రోకరేజ్ సంస్థలు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత నైపుణ్యాలున్న వారిని ఫైనాన్షియల్ అడ్వైజర్‌లుగా నియమించుకుంటున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులను క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకుంటున్నాయి. వీరికి కొద్ది రోజులు శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తున్నాయి.
మార్కెటింగ్ :
మ్యూచువల్ ఫండ్ విభాగానికి సంబంధించి బ్రోకింగ్ సంస్థలు క్షేత్రస్థాయిలో మార్కెటింగ్ విభాగాన్ని కీలకంగా భావిస్తున్నాయి. కారణం.. క్లయింట్లను సమీకరించడం, తద్వారా తమ టర్నోవర్ పెంచుకోవడం వంటి లక్ష్యాలు నిర్దేశించుకోవడం కోసమే. క్షేత్రస్థాయిలో రిలేషన్‌షిప్ మేనేజర్స్ లేదా అడ్వైజర్స్ పేరుతో మార్కెటింగ్ విభాగంలో నియామకాలు చేపడుతున్నాయి. వీరికి వార్షిక వేతనం రూ.3 లక్షల వరకు అందుతోంది.
ఇన్వెస్ట్‌మెంట్‌లో ఫిన్‌టెక్ :
ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ రంగంలోనూ టెక్నికల్ నైపుణ్యాలతో కార్యకలాపాలు నిర్వహించేలా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. బిగ్‌డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ అమలు చేస్తున్నాయి. రోబో ఇన్వెస్టరీ అడ్వైజింగ్, రోబో ఈక్విటీ అడ్వైజర్ వంటివి రానున్నాయి. కాబట్టి భవిష్యత్‌లో బీటెక్, ఎంటెక్ వంటి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో చక్కటి అవకాశాలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
స్టాక్ మార్కెట్ కొలువులు :
స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి పలు కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ప్రధానంగా బ్రోకింగ్ సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ సంస్థల్లో లభిస్తున్నాయి. వీటిలో స్టాక్ బ్రోకర్, స్టాక్ ట్రేడర్, వెల్త్ మేనేజర్ వంటివి ముఖ్యమైనవి.
స్టాక్ బ్రోకర్ :
క్షేత్రస్థాయి ఉద్యోగం ఇది. స్టాక్ బ్రోకర్.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తుల తరఫున ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని బ్రోకింగ్ సంస్థలు వీరిని డీలర్లుగా, ఏజెంట్లుగా పిలుస్తున్నాయి. డిగ్రీ, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో స్టాక్ బ్రోకర్‌గా మారొచ్చు. వీరు నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించే అవకాశముంది.
స్టాక్ ట్రేడర్ :
క్షేత్రస్థాయిలోని స్టాక్ బ్రోకర్స్‌తో సంప్రదిస్తూ వారు పేర్కొన్న ప్రకారం.. ఆన్‌లైన్ క్రయ విక్రయాలు నిర్వహించడం, వాటికి సంబంధించిన నివేదికలు రూపొందించడం స్టాక్ ట్రేడర్స్ విధులు.
వెల్త్ మేనేజర్ :
నిర్దిష్టంగా ఒక సంస్థ అందించే పలు ప్రొడక్ట్‌ల గురించి రిటైల్ కస్టమర్లకు తెలియజేయడం వెల్త్ మేనేజర్ ప్రధాన బాధ్యతలు. సంస్థలకు కొత్త క్లయింట్లు (ఇన్వెస్టర్లు) రావడంలో వీరిది కూడా కీలక పాత్రే.
ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు :
1. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ లెవల్-1, 2
2. కామన్ డెరివేటివ్స్ సీపీఈ
3. రీసెర్చ్ అనలిస్ట్ సీపీఈ
4. సర్టిఫికెట్ ఇన్ డెరివేటివ్ మార్కెట్ స్ట్రాటజీస్
5. మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ సర్టిఫికేషన్
6. ఈక్విటీ సేల్స్ సర్టిఫికేషన్
7. ఈక్విటీ డెరివేటివ్స్ సర్టిఫికేషన్
8. మ్యూచువల్ ఫండ్స్ ఫౌండేషన్ సర్టిఫికేషన్
వెబ్‌సైట్: www.nism.ac.in/certification/index.php/studentzone
బీఎస్‌ఈ సర్టిఫికేషన్స్ :
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలోని బీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్.. డెరివేటివ్, రిస్క్ మేనేజ్‌మెంట్, స్టాక్ మార్కెట్, ఈక్విటీ రీసెర్చ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, వెల్త్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లలో... సర్టిఫికెట్ కోర్సులను, స్మార్ట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అండ్ పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్, బిజినెస్ డేటాఅనలిటిక్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్‌లలో బేసిక్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.bsebti.com/programs/certifications_courses.html
విస్తరిస్తున్న సెక్టార్ :
ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ రంగం విస్తరిస్తోంది. 2004లో నాలుగు లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ ఈ ఏడాది జూన్ 30కి రూ.24.25 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రతి లక్ష మంది ఇన్వెస్టర్లకు యూకేలో 25.5 బ్రాంచ్‌లు, యూఎస్‌లో 35 బ్రాంచ్‌లు ఉంటే.. మన దేశంలో మాత్రం 10.9 బ్రాంచ్‌లే ఉన్నాయి. కెరీర్ అవకాశాలను పరిశీలిస్తే.. 2030 నాటికి 10 మిలియన్‌ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. మ్యూచువల్ ఫండ్ సంస్థలే కాకుండా.. వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు, ట్రస్టీ సంస్థలు, రిజిస్ట్రార్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, కేపీఓల్లో సైతం అవకాశాలు లభిస్తాయి. ఎన్‌ఎస్‌ఐఎం సర్టిఫికేషన్లు ఉంటే ఆయా అవకాశాలను మరింత త్వరగా అందుకోవచ్చు.
- డి.జయంత్ కుమార్, జనరల్ మేనేజర్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్.
మ్యూచువల్ ఫండ్స్.. హోదాలు అనేకం
- కొంతకాలం క్రితం వరకూ ప్రజలు తమ వద్ద ఉన్న నగదును పెంచుకోవడానికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకునేవారు. కానీ, బ్యాంకుల వడ్డీ రేట్లు తగ్గడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్స్‌లో పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
- మ్యూచువల్ ఫండ్ అంటే.. ఓ సంస్థ.. వ్యక్తుల (ఇన్వెస్టర్లకు)నుంచి డబ్బును సేకరించి.. రకరకాల మార్గాల్లో ముఖ్యంగా స్టాక్స్, బాండ్స్, ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం! పలు ఆర్థిక సంస్థలు మ్యూచువల్ ఫండ్స్‌ను నిర్వహిస్తూ.. ఇన్వెస్టర్ల నుంచి నగదును సమీకరించి వారి ఆసక్తి, భవిష్యత్తు రాబడి అంచనాలకు అనుగుణంగా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై అంతగా అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది బ్రోకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ రంగంలో యువతకు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల్లో కీలకమైన హోదా.. రీసెర్చ్ అనలిస్ట్. ఈక్విటీలకు సంబంధించి క్రయ-విక్రయాలపై అధ్యయనం చేయడం ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ ప్రధాన విధులు. రీసెర్చ్ అనలిస్ట్‌లు స్టాక్స్‌కు సంబంధించి రీసెర్చ్ చేసి ఫండ్ మేనేజర్లకు సలహాలు ఇస్తారు. అలాగే క్లయింట్లకు.. ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీస్ గురించి విశ్లేషిస్తారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ బ్రోకరేజ్ సంస్థలు ఎంబీఏ/స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ పీజీ ఉత్తీర్ణులను రీసెర్చ్ అనలిస్ట్‌లుగా నియమించుకుంటున్నాయి. వీరికి వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు అందుతోంది.
కస్టోడియన్/రిజిస్ట్రార్ :
ఇన్వెస్టర్ల నుంచి నగదును సమీకరించి ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే సంస్థలు..సదరు నగదును, ఫండ్ నిర్వహణను దుర్వినియోగం చేయకుండా చూడడం కస్టోడియన్/రిజిస్ట్రార్స్ విధులు. ఫండ్స్‌ను అందించే బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్, బ్రోకరేజ్ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. న్యాయ విద్యతోపాటు పని అనుభవం ఉన్నవారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కస్టోడియన్/రిజిస్ట్రార్‌గా కొలువు సొంతం చేసుకున్న వారికి వేతనాలు ఆకర్షణీయమని చెప్పొచ్చు.
ట్రస్టీ :
ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి మరో కీలకమైన ఉద్యోగం.. ట్రస్టీ. థర్డ్ పార్టీకి సేవలందిస్తున్న సంస్థలో.. సదరు థర్డ్ పార్టీ అసెట్స్‌ను సద్వినియోగం చేసేలా చూడడం, వాటికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ట్రస్టీ ముఖ్య విధులు.
ఫండ్ మేనేజర్ :
మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో అత్యంత కీలకమైన హోదా.. ఫండ్ మేనేజర్. ఇన్వెస్టర్ల సొమ్మును పెట్టుబడిగా పెట్టే విషయంలో ఆయా సంస్థల ప్రస్తుత పనితీరు, ఇటీవల కాలంలో సదరు కంపెనీల ఆర్థిక ఫలితాలు, లాభ నష్టాలు, అవి అందించిన డివిడెండ్స్, రానున్న రాజుల్లో సదరు సంస్థల పనితీరు ఎలా ఉంటుంది? వంటి అనేక అంశాలను పరిశీలించి ఇన్వెస్టర్లకు సరైన సలహాలివ్వడం ఫండ్ మేనేజర్ల ప్రధాన విధులు. నిర్దిష్టంగా ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుందో వివరించి ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను వీరు నిర్వహిస్తుంటారు. ఫండ్ మేనేజర్‌గా రాణించాలంటే.. క్యాపిటల్ మార్కెట్ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అదేవిధంగా విశ్లేషణ నైపుణ్యాలు తప్పనిసరి. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు కామర్స్, ఎకనామిక్స్, ఎంబీఏ, సీఏ, ఫైనాన్షియల్ ప్లానింగ్, స్టాటిస్టిక్స్ విభాగంలో పీజీ స్థాయి అర్హతలు ఉన్న అభ్యర్థులను ఫండ్ మేనేజర్లుగా నియమించుకుంటున్నాయి. వీరికి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు ఉంటుంది.
ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ :
ఇన్వెస్టర్ల తరఫున పలు సెక్యూరిటీ పోర్ట్‌ఫోలియోస్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ల ముఖ్య బాధ్యత. వీరు నిత్యం సెక్యూరిటీస్ క్రయ విక్రయాలు, పోర్ట్‌ఫోలియోల సమీక్ష, లావాదేవీల పరిష్కారం, సంబంధిత స్టాక్స్ పనితీరు, నియంత్రణ, క్లయింట్ల(ఇన్వెస్టర్లు)కు నివేదించడం వంటి విధులు నిర్వహిస్తుంటారు. సంస్థలు కామర్స్/ఫైనాన్స్/ఎకనామిక్స్‌తో బ్యాచిలర్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులను నియమించుకుంటున్నాయి. ప్రారంభంలో రూ.4లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.
ఫైనాన్షియల్ అడ్వైజర్ :
ఇన్వెస్టర్లను గుర్తించడం, వారి పెట్టుబడి లక్ష్యాల్ని తెలుసుకోవడం, అందుబాటులో ఉన్న ప్రొడక్ట్‌ల గురించి చెప్పడం వీరి విధులు. ఫైనాన్షియల్ అడ్వైజర్‌లకు క్లయింట్ల లక్ష్యాలు తెలుసుకోవడమే కాకుండా.. క్యాపిటల్ మార్కెట్లో ఆయా సంస్థల పనితీరు గురించి కూడా అవగాహన ఉండాలి. బ్రోకరేజ్ సంస్థలు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత నైపుణ్యాలున్న వారిని ఫైనాన్షియల్ అడ్వైజర్‌లుగా నియమించుకుంటున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులను క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకుంటున్నాయి. వీరికి కొద్ది రోజులు శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తున్నాయి.
మార్కెటింగ్ :
మ్యూచువల్ ఫండ్ విభాగానికి సంబంధించి బ్రోకింగ్ సంస్థలు క్షేత్రస్థాయిలో మార్కెటింగ్ విభాగాన్ని కీలకంగా భావిస్తున్నాయి. కారణం.. క్లయింట్లను సమీకరించడం, తద్వారా తమ టర్నోవర్ పెంచుకోవడం వంటి లక్ష్యాలు నిర్దేశించుకోవడం కోసమే. క్షేత్రస్థాయిలో రిలేషన్‌షిప్ మేనేజర్స్ లేదా అడ్వైజర్స్ పేరుతో మార్కెటింగ్ విభాగంలో నియామకాలు చేపడుతున్నాయి. వీరికి వార్షిక వేతనం రూ.3 లక్షల వరకు అందుతోంది.
ఇన్వెస్ట్‌మెంట్‌లో ఫిన్‌టెక్ :
ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ రంగంలోనూ టెక్నికల్ నైపుణ్యాలతో కార్యకలాపాలు నిర్వహించేలా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. బిగ్‌డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ అమలు చేస్తున్నాయి. రోబో ఇన్వెస్టరీ అడ్వైజింగ్, రోబో ఈక్విటీ అడ్వైజర్ వంటివి రానున్నాయి. కాబట్టి భవిష్యత్‌లో బీటెక్, ఎంటెక్ వంటి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో చక్కటి అవకాశాలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
స్టాక్ మార్కెట్ కొలువులు :
స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి పలు కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ప్రధానంగా బ్రోకింగ్ సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ సంస్థల్లో లభిస్తున్నాయి. వీటిలో స్టాక్ బ్రోకర్, స్టాక్ ట్రేడర్, వెల్త్ మేనేజర్ వంటివి ముఖ్యమైనవి.
స్టాక్ బ్రోకర్ :
క్షేత్రస్థాయి ఉద్యోగం ఇది. స్టాక్ బ్రోకర్.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తుల తరఫున ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని బ్రోకింగ్ సంస్థలు వీరిని డీలర్లుగా, ఏజెంట్లుగా పిలుస్తున్నాయి. డిగ్రీ, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో స్టాక్ బ్రోకర్‌గా మారొచ్చు. వీరు నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించే అవకాశముంది.
స్టాక్ ట్రేడర్ :
క్షేత్రస్థాయిలోని స్టాక్ బ్రోకర్స్‌తో సంప్రదిస్తూ వారు పేర్కొన్న ప్రకారం.. ఆన్‌లైన్ క్రయ విక్రయాలు నిర్వహించడం, వాటికి సంబంధించిన నివేదికలు రూపొందించడం స్టాక్ ట్రేడర్స్ విధులు.
వెల్త్ మేనేజర్ :
నిర్దిష్టంగా ఒక సంస్థ అందించే పలు ప్రొడక్ట్‌ల గురించి రిటైల్ కస్టమర్లకు తెలియజేయడం వెల్త్ మేనేజర్ ప్రధాన బాధ్యతలు. సంస్థలకు కొత్త క్లయింట్లు (ఇన్వెస్టర్లు) రావడంలో వీరిది కూడా కీలక పాత్రే.
ప్రత్యేక సర్టిఫికేషన్ కోర్సులు :
- మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్ నేపథ్యంతో బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులు అర్హులు. డిగ్రీ/పీజీలతోపాటు సంబంధిత విభాగంలో ప్రత్యేక కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం లభిస్తోంది.
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్‌ఐఎస్‌ఎం).. స్వల్పకాలిక వ్యవధిలో పలు సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తోంది. వీటిని పూర్తిచేయడం ద్వారా ఈ విభాగాల్లో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌గా జాబ్ మార్కెట్లో అడుగు పెట్టొచ్చు.
1. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ లెవల్-1, 2
2. కామన్ డెరివేటివ్స్ సీపీఈ
3. రీసెర్చ్ అనలిస్ట్ సీపీఈ
4. సర్టిఫికెట్ ఇన్ డెరివేటివ్ మార్కెట్ స్ట్రాటజీస్
5. మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ సర్టిఫికేషన్
6. ఈక్విటీ సేల్స్ సర్టిఫికేషన్
7. ఈక్విటీ డెరివేటివ్స్ సర్టిఫికేషన్
8. మ్యూచువల్ ఫండ్స్ ఫౌండేషన్ సర్టిఫికేషన్
వెబ్‌సైట్: www.nism.ac.in/certification/index.php/studentzone
బీఎస్‌ఈ సర్టిఫికేషన్స్ :
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలోని బీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్.. డెరివేటివ్, రిస్క్ మేనేజ్‌మెంట్, స్టాక్ మార్కెట్, ఈక్విటీ రీసెర్చ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, వెల్త్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లలో... సర్టిఫికెట్ కోర్సులను, స్మార్ట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అండ్ పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్, బిజినెస్ డేటాఅనలిటిక్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్‌లలో బేసిక్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.bsebti.com/programs/certifications_courses.html
విస్తరిస్తున్న సెక్టార్ :
ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ రంగం విస్తరిస్తోంది. 2004లో నాలుగు లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ ఈ ఏడాది జూన్ 30కి రూ.24.25 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రతి లక్ష మంది ఇన్వెస్టర్లకు యూకేలో 25.5 బ్రాంచ్‌లు, యూఎస్‌లో 35 బ్రాంచ్‌లు ఉంటే.. మన దేశంలో మాత్రం 10.9 బ్రాంచ్‌లే ఉన్నాయి. కెరీర్ అవకాశాలను పరిశీలిస్తే.. 2030 నాటికి 10 మిలియన్‌ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. మ్యూచువల్ ఫండ్ సంస్థలే కాకుండా.. వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు, ట్రస్టీ సంస్థలు, రిజిస్ట్రార్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, కేపీఓల్లో సైతం అవకాశాలు లభిస్తాయి. ఎన్‌ఎస్‌ఐఎం సర్టిఫికేషన్లు ఉంటే ఆయా అవకాశాలను మరింత త్వరగా అందుకోవచ్చు.
- డి.జయంత్ కుమార్, జనరల్ మేనేజర్, కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్.
Published date : 24 Jul 2019 12:16PM