సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి.. ఒకే పరీక్షతో..
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అన్ని నియామకాల్లో స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ టెస్ట్ విధానానికి స్వస్తి పలికింది. ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించి.. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. గ్రూప్స్ మొదలు అన్ని రకాల నియామక ప్రక్రియల్లో ప్రిలిమ్స్ విధానం నుంచి విముక్తి లభించనుంది. దీనివల్ల ఉద్యోగార్థులకు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుంది. అంతేకాకుండా ఏకకాలంలో తమకు అర్హత ఉన్న పలు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది.
సిలబస్‌ను పరిశీలించి..
ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం–ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ముందుగా తమ అర్హతకు సరితూగే పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంశాలను పరిశీలించాలి. పరీక్ష విధానం, సిలబస్‌పై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ సిలబస్‌లో వెయిటేజీ ఆధారితంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటికి సంబంధించి అకడమిక్ పుస్తకాలతోపాటు.. ప్రామాణిక స్టడీ మెటీరియల్‌ను అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి.
ఇంకా చదవండి: part 3: ప్రిపరేషన్ ఇలా చేస్తే.. కొలువు ఖాయం