Skip to main content

కొలువు కొట్టాలంటే ఆకట్టుకునే రెజ్యూమె ఎంతో ముఖ్యం.. రెజ్యూమెలో రకాలు ఇలా..

ఒక్క కొలువు... వందలు, వేలల్లో పోటీ! పైగా కరోనా కారణంగా రిక్రూట్‌మెంట్ తగ్గింది. ఇలాంటి సమయంలో ఉద్యోగం సాధించడం కత్తి మీద సామే...! ఎవరి ఉద్యోగాన్వేషణైనా సఫలం అవ్వాలంటే ముందుగా రెజ్యూమె.. రిక్రూటింగ్ మేనేజర్‌ను ఆకట్టుకునేలా ఉండాలి. కుప్పలుగా వచ్చిపడే రెజ్యూమెల్లో రిక్రూటర్ దృష్టిని ఆకర్షించే వాటికే విజయావకాశాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగార్థులు రెజ్యూమె రూపకల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తూ వేరే జాబ్‌కు మారాలనుకొనే వారు సైతం రెజ్యూమెలో తగు మార్పులు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో.. చక్కటి రెజ్యూమె రూపొందించుకోవడం ఎలా? రెజ్యూమె రకాలు? ఎవరికి ఏది సూటవుతుంది?! అనే అంశాలతోపాటు రెజ్యూమె రూపకల్పనలో డూస్, డోంట్స్ ఏమిటో తెలుసుకుందాం...

రెజ్యూమె... సులభంగా చదివేలా, ప్రొఫెషనల్‌గా ఉండాలి. ప్రధానంగా రెజ్యూమె రూపకల్పనలో మూడు రకాల పద్ధతులు(ఫార్మాట్) ఉన్నాయి. అభ్యర్థులు వీటిలో తమకు అనువైన ఫార్మాట్‌ను ఎంచుకోవాలి.

కొనలాజికల్ రెజ్యూమె..
పని అనుభవం కలిగిన వారంతా ఈ ఫార్మాట్‌ను ఎంచుకోవచ్చు. అలాగే ఇది ఒకే ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా పనిచేస్తూ పదోన్నతులు పొందుతూ వెళ్లిన వారికి చక్కగా సూటవుతుంది. సాధారణంగా అదే ఇండస్ట్రీ లేదా అనుబంధ రంగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు ఈ ఫార్మాట్‌ను ఎంచుకుంటారు. ఎంప్లాయ్‌మెంట్ పరంగా దీర్ఘకాలిక గ్యాప్‌లు ఉన్నా, కెరీర్స్ మారినా, గత వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌కు ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటున్న జాబ్ రోల్‌కు తీవ్ర వ్యత్యాసం ఉన్నా.. ఫంక్షనల్ లేదా కాంబినేషన్ రెజ్యూమెను ఎంచుకోవడం ఉత్తమం. క్రొనలాజికల్ రెజ్యూమె ఫార్మట్ కింది విధంగా ఉంటుంది.

  • కాంటాక్ట్ ఇన్‌ఫర్మేషన్
  • ఆబ్జెక్టివ్ లేదా సమ్మరీ స్టేట్‌మెంట్
  • రిలవెంట్ స్కిల్స్
  • పొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్
  • ఎడ్యుకేషన్
  • అడిషనల్ ఇన్‌ఫర్మేషన్(వలంటీర్ వర్క్, స్పెషల్ ఇంటెరస్టులు-ఆప్షనల్)


ఫంక్షనల్ రెజ్యూమె..
క్రొనలాజికల్ రెజ్యూమె ఫార్మాట్.. పని అనుభవాన్ని(వర్క్ ఎక్స్‌పీరియెన్స్) హైలెట్ చేస్తే.. ఫంక్షనల్ ఫార్మాట్ స్కిల్ సెట్‌పై ఫోకస్ చేస్తుంది. కెరీర్‌లో మల్టిపుల్ గ్యాప్‌లు, స్వల్ప అనుభవంతో కెరీర్ మార్పులు కలిగిన అభ్యర్థులకు.. ఈ ఫార్మాట్ సరితూ గుతుంది. ఈ రెజ్యూమె ఫార్మట్ కింది విధంగా ఉంటుంది.

  • కాంటాక్ట్ ఇన్‌ఫర్మేషన్
  • ఆబ్జెక్టివ్ లేదా సమ్మరీ స్టేట్‌మెంట్
  • సమ్మరీ ఆఫ్ రిలవెంట్ స్కిల్స్
  • వర్క్ ఎక్స్‌పీరియెన్స్
  • ఎడ్యుకేషన్ (చదువు)
  • అడిషనల్ ఇన్‌ఫర్మేషన్ (వలంటీర్ వర్క్, స్పెషల్ ఇంటెరస్టులు-ఆప్షనల్)


కాంబినేషన్ రెజ్యూమె..
ఈ ఫార్మాట్ మిగిలిన వాటి కంటే సౌలభ్యంగా ఉంటుంది. ఇది క్రొనలాజికల్, ఫంక్షనల్ ఫార్మాట్‌ల కలయికగా ఉంటుంది. వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌తోపాటు స్కిల్స్‌ను హైలెట్ చేస్తుంది. ఇందులో దరఖాస్తు చేస్తున్న కొలువును బట్టి అనుభవం, నైపుణ్యాల్లో ఏదో ఒకదాన్ని హైలెట్ చేసుకోవచ్చు. రెజ్యూమె ఫార్మాట్ ఆర్డర్ కింది విధంగా ఉంటుంది.

  • కాంటాక్ట్ ఇన్‌ఫర్మేషన్
  • ఆబ్జెక్టివ్ లేదా సమ్మరీ స్టేట్‌మెంట్
  • సమ్మరీ ఆఫ్ రిలవెంట్ స్కిల్స్
  • వర్క్ ఎక్స్‌పీరియెన్స్
  • ఎడ్యుకేషన్

ఇంకా చ‌ద‌వండి: part 2: జాబ్‌ను బట్టి రెజ్యూమె ప్రిపరేషన్ చేసుకోవాలి.. వాటికి టిప్స్ ఇవిగో..

Published date : 25 Dec 2020 02:34PM

Photo Stories