Skip to main content

కెరీర్ గైడెన్స్..బయోఇన్ఫర్మాటిక్స్

గత కొంత కాలంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో.. ఇప్పటి వరకు ‘ఇల్‌నెస్’ విభాగానికే పరిమితమైన పరిశోధనలు.. భవిష్యత్తులో ‘వెల్‌నెస్’ విభాగంలోనూ ఊపందుకోనున్నాయి..ఈ నేపథ్యంలో అవసరమైన మానవవనరులను తీర్చిదిద్దడం కోసం గత కొంత కాలంగా ఎన్నో కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయి. అలాంటి వాటిలో బయోఇన్ఫర్మాటిక్స్ ప్రత్యేకమైంది.

మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల కలయికతో రూపుదిద్దుకున్న కోర్సు బయోఇన్ఫర్మాటిక్స్. ఒక్క మాటలో చెప్పాలంటే స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అనువర్తనాలను మాలిక్యులర్ బయూలజీ విభాగంలో పరిశోధనలు, ఆవిష్కరణల్లో ఉపయోగించే శాస్త్రం బయోఇన్ఫర్మాటిక్స్.

దినదిన ప్రవర్దమానం:
బయోటెక్నాలజీ పరిశోధనల వల్ల లభ్యమవుతున్న సమాచారాన్ని భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సహకారంతో నిక్షిప్తం చేయాలి. ఈ అంశంలో బయోఇన్ఫర్మాటిక్స్‌ది కీలక పాత్ర. ఈ విధులను నిర్వర్తించేందుకు బయోఇన్ఫర్మాటిక్స్ చదివిన అభ్యర్థులు అవసరం. ఇందులో సంబంధిత డేటా సేకరణ, నిర్వహణ, అధ్యయనం, విశ్లేషణ, తదితర అవసరాల కోసం కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ విధంగా సేకరించిన బయలాజికల్ డేటాను మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉద్దేశించిన పరిశోధనల కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా ప్రస్తుత ఐటీ యుగంలో జీవ పరిశోధనల విషయుంలో బయోఇన్ఫర్మాటిక్స్ ప్రమేయం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. వ్యవసాయం, ఆరోగ్యం, బయోటెక్నాలజీ, పర్యావరణం, శక్తి రంగాల్లో బయోఇన్ఫర్మాటిక్స్ అనువర్తనాలను ఉపయోగించుకుంటారు. వివిధ వ్యాధులకు కారణాలు, వాటి నివారణకు ఉపయోగపడే నూతన ఔషధాలు, జీనోమ్ అసెంబ్లీ, ప్రొటీన్ స్ట్రక్చర్ వంటి అంశాలపై బయోఇన్ఫర్మాటిక్స్ నిపుణులు పరిశోధనలు చేస్తుంటారు.

స్కిల్స్ తప్పనిసరి:
ఈ రంగంలో స్థిరపడాలన్నా, ఉన్నత స్థానాలకు చేరాలన్నా.. విషయ పరిజ్ఞానంతో పాటు.. తార్కిక విశ్లేషణ, సునిశిత పరిశీలన, నలుగురితో కలసి పనిచేయడం వంటి స్కిల్స్ అవసరం కూడా ఎంతో ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా పరిశోధనల పట్ల ఆసక్తి, సమస్య పరిష్కారంలో ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి.

అందుబాటులోని కోర్సులు:
బయోఇన్ఫర్మాటిక్స్ సంబంధిత కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా ఇందులో కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ క్రమంలో సర్టిఫికెట్ నుంచి పీహెచ్‌డీ వరకు పలు రకాల కోర్సులను వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. అధిక శాతం కోర్సులు మాత్రం పీజీ స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి.

వివరాలు..
  • సర్టిఫికెట్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
  • బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
  • మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
  • పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
  • పీహెచ్‌డీ-బయోఇన్ఫర్మాటిక్స్
స్పెషలైజేషన్లు:
  • ఆర్కిటెక్చ్‌ర్ అండ్ కంటెంట్ ఆఫ్ జీనోమ్
  • కాంప్లెక్స్ సిస్టమ్స్ అనాలిసిస్/జెనెటిక్ సర్క్యూట్స్
  • మెటాబాలిక్ కంప్యూటింగ్
  • న్యూక్లిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ సీక్వెన్స్ అనాలిసిస్
  • డేటా మైనింగ్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అండ్ న్యూట్రల్ నెట్స్
  • డేటా స్టోరేజ్ అండ్ రిట్రివల్-డేటా స్ట్రక్చర్స్, ఎన్నోషన్
  • ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇన్ డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రోటీన్ సీక్వెన్స్ అండ్ స్ట్రక్చర్
  • అనాలిసిస్ ఆఫ్ జీనోమిక్/ప్రోటోమిక్/ఆధర్ హై త్రూపుట్ ఇన్ఫర్మేషన్
మన రాష్ట్రంలో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కూడా పీజీ స్థాయిలోనే ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. బ్యాచిలర్ స్థాయిలో మాత్రం బీఎస్సీ/బీటెక్ వంటి కోర్సుల్లోని బయోటెక్నాలజీ ఆప్షన్‌లో బయోఇన్ఫర్మాటిక్స్‌ను..ఒక కోర్ సబ్జెక్ట్‌గా అధ్యయనం చేయవచ్చు.

అవకాశాలు:
ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ విప్లవంలా చొచ్చుకుపోతున్న ప్రస్తుత తరుణంలో బయోఇన్ఫర్మాటిక్స్ అభ్యర్థులకు అవకాశాల పరంగా ఎటువంటి ఢోకా ఉండదని చెప్పొచ్చు. బయోఇన్ఫర్మాటిక్స్ చేసిన వారికి బయో మెడికల్ సెన్సైస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ కంపెనీలు, హాస్పిటల్స్, వివిధ పరిశోధన సంస్థలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి.

వేతనాలు:
గ్రాడ్యుయేషన్ అర్హతతో ఈ రంగంలో కెరీర్ ప్రారంభించిన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అర్హతతో అడుగు పెట్టిన వారు నెలకు కనీసం రూ.15 వేల వేతనం సంపాదించవచ్చు. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా సంవత్సరానికి రూ. 4.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు లభిస్తుంది.

జాబ్ ప్రొఫైల్స్:
  • డేటా బేస్ డిజైనర్
  • డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్
  • అప్లికెంట్ అనలిస్ట్
  • టెక్నికల్ సపోర్ట్
  • సైంటిస్ట్
  • బయో అనలిటిక్స్
  • ఇన్ఫర్మాటిక్స్ డెవలపర్
  • సిస్టమ్స్ ఇంజనీర్
  • ప్రోగ్రామర్
  • సాఫ్ట్‌వేర్ డెవలపర్
  • మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
టాప్ రిక్రూటర్స్: విప్రో, రిలయన్స్, జుబ్లియంట్ బయోసిస్, టీసీఎస్, ఐబీఎం లైఫ్ సెన్సైస్, బయో మెడ్ ఇన్ఫర్మాటిక్స్, సిలికాన్ జెనెటిక్స్ అండ్ టీసెల్లా, అక్లేర్స్, జీవీకే బయోసైన్స్, రాన్‌బాక్సీ

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్-హైదరాబాద్
వెబ్‌సైట్: https://www.oucwkoti.ac.in

ఐఐఐటీ -హైదరాబాద్
వెబ్‌సైట్: www.iiit.ac.in

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.uohyd.info

జేఎన్‌టీయూ-హైదరాబాద్.
వెబ్‌సైట్: https://jntu.ac.in

ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: https://www.andhrauniversity.info

కారుణ్య యూనివర్సిటీ-చెన్నై
వెబ్‌సైట్: www.karunya.edu

యూనివర్సిటీ ఆఫ్ పుణే
వెబ్‌సైట్: https://bioinfo.net.in

భారతీయార్ యూనివర్సిటీ-కోయంబత్తూర్
వెబ్‌సైట్:: www.bu.ac.in

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మెస్రా,రాంచీ
వెబ్‌సైట్: https://www.bitmesra.ac.in/

భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ-పుణే
వెబ్‌సైట్: https://www.bharatividyapeeth.edu

అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ
వెబ్‌సైట్: https://www.amity.edu

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ- బెంగళూరు.
వెబ్‌సైట్: https://www.ibab.ac.in/

మద్రాస్ యూనివర్సిటీ
వెబ్‌సైట్: https://www.unom.ac.in/

మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
వెబ్‌సైట్: https://www.manipal.edu

కీలకం ‘బీఐఎన్‌సీ’:
బయోఇన్ఫర్మాటిక్స్ అభ్యర్థులు తప్పకుండా హాజరు కావాల్సిన పరీక్ష.. బీఐఎన్‌సీ(బయోఇన్ఫర్మా టిక్స్ నేషనల్ సర్టిఫికేషన్) ఎగ్జామినేషన్. గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లోని బయోఇన్ఫర్మాటిక్స్ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పరీక్షించడం బీఐఎన్‌సీ ప్రధాన లక్ష్యం. ఇందులో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. సంబంధిత పరిశ్రమల్లో నియామకాల్లో ఈ సర్టిఫికెట్ హోల్డర్లకు ప్రాధాన్యం కల్పిస్తారు. అంటే బయోఇన్ఫర్మాటిక్స్ నియామకాల్లో బీఐఎన్‌సీ సర్టిఫికెట్ బెంచ్‌మార్క్‌లా ఉపయోగ పడుతుంది. బీఐఎన్‌సీ ద్వారా సర్టిఫికెట్‌తోపాటు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. బీఐఎన్‌సీకి హాజరయ్యే బయోఇన్ఫర్మాటిక్స్ పీహెచ్‌డీ ఔత్సాహికులకు ఫెలోషిప్స్ ఇస్తారు.

పరీక్ష ఇలా:
బీఐఎన్‌సీ పరీక్షలో అభ్యర్థులు మూడు పేపర్లలో ఉంటుంది. వివరాలు..
  • పేపర్-1 (ప్రశ్నలు-100, మార్కులు-100, సమయం-2 గంటలు, ఆబ్జెక్టివ్ విధానంలో)
  • పేపర్-2 (ప్రశ్నలు-20, మార్కులు-200, సమయం-3 గంటలు, షార్ట్ ఆన్సర్ విధానంలో)
  • పేపర్-3 (ప్రశ్నలు-1, మార్కులు-100, సమయం 2 గంటలు, ప్రాక్టికల్స్ విధానంలో)
పేపర్-1లో ఉత్తీర్ణత సాధిస్తేనే:
రెండు రోజులపాటు నిర్వహించే బీఐఎన్‌సీలో పేపర్-1 అర్హత పరీక్షగా నిర్దేశించారు. ఇందులో కనీసం 40 శాతం వూర్కులు సాధిస్తేనే రెండో రోజు నిర్వహించే పేపర్-2, పేపర్-3లకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. పేపర్-1 విషయం లో ప్రధానంగా గుర్తించాల్సింది నెగెటివ్ మార్కింగ్. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్క్ తీసేస్తారు. పేపర్-2, పేపర్-3లో కూడా 40 శాతం సొంతం చేసుకుంటేనే సర్టిఫికెట్ లభిస్తుంది.

వివరాలకు: https://binc.scisjnu.ernet.in
Published date : 19 Mar 2013 01:58PM

Photo Stories