Skip to main content

విదేశీ ‘లా’కు విలువైన మార్గాలు..

నేటి ప్రపంచీకరణ యుగంలో అంతర్జాతీయంగా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న వైనం! కార్పొరేట్ కంపెనీలు కొత్త ఉత్పత్తుల రూపకల్పనలో తీవ్రంగా పోటీపడుతున్న పరిస్థితి! ఈ క్రమంలో మేధో సంపత్తి హక్కుల కోసం కసరత్తు! మరోవైపు పెరుగుతున్న టెక్నాలజీ, ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఇంటర్నెట్ వినియోగం.. సైబర్ నేరాలకు దారితీస్తోంది.
ఇలాంటి పరిణామాల దృష్ట్యా అంతర్జాతీయ న్యాయ చట్టాలపై అవగాహన ఉన్నవారికి జాబ్ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. అందుకే విదేశాల్లో న్యాయవిద్యను అభ్యసించి, నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ‘లా’తో అవకాశాల గురించి తెలుసుకుందాం..

స్టడీ అబ్రాడ్ పరంగా లక్ష్యం ఏంటని అడిగితే.. విద్యార్థుల నుంచి వచ్చే సమాధానం.. ఎంఎస్ లేదా ఎంబీఏ. కానీ, ఇప్పుడు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులకు దీటుగా ‘లా’ చదివిన అభ్యర్థులు అంతర్జాతీయంగా అవకాశాలు అందు కునే వీలుంది. వివిధ దేశాల మధ్య బలపడుతు న్న వ్యాపార, వాణిజ్య సంబంధాలే దీనికి కారణం. తమ కార్యకలాపాలకు చట్టపర ఇబ్బం దులు తలెత్తకుండా.. అంతర్జాతీయ చట్టాలపై అవగాహన ఉన్న అభ్యర్థుల కోసం ఎంఎన్‌సీలు అన్వేషిస్తున్నాయి. దాంతో పేరున్న విదేశీ యూని వర్సిటీల్లో ‘లా’ కోర్సులు పూర్తిచేసిన వారు అటు విదేశాలతోపాటు స్వదేశంలోనూ ఉన్నత అవకాశా లు అందుకునే వీలుంది. ముఖ్యంగా బహుళజా తి కంపెనీలు విదేశీ యూనివర్సిటీల్లో చదువుకు న్న భారతీయ లాయర్ల కోసం అన్వేషిస్తున్నాయి. ఎందుకంటే విదేశీ లా పట్టా పొందిన భారతీయ న్యాయవాదులు ఇటు స్వదేశంతోపాటు అటు విదేశాల్లోనూ పనిచేయగలరు. అంతేకాకుండా విదేశీ న్యాయ సంస్థలు (లీగల్ ఫర్మ్స్) భారత్‌లోని కోర్టుల్లో కేసులను వాదించేందుకు భారతీయ లాయర్లనే నియమిస్తుంటాయి.

స్పెషలైజేషన్లు :
అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాల్లోని వివిధ యూనివర్సిటీలకు లా కోర్సులు అందించడంలో మంచి పే రుంది. క్రిమినల్ లా, ప్రాపర్టీ లా, కమర్షియల్ లా, సివిల్ లా, కార్పొరేట్ లా వంటివి టాప్ స్పెషలైజేషన్లుగా నిలుస్తున్నాయి. ఈ వర్సిటీలు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులతోపాటు మాస్టర్స్, డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ కోర్సులను సైతం అందిస్తున్నాయి.

ముఖ్యమైన కోర్సులు..
జ్యూరిస్ డాక్టర్ (జేడీ): న్యాయవాద వృత్తిలో ప్రవేశించాలనుకునే వారికి అమెరికా యూనివర్సిటీలు అందించే కోర్సు జ్యూరిస్ డాక్టర్. హార్వర్డ్ మొదలు ఎన్నో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. దీని కాల వ్యవధి మూడేళ్లు. జేడీ కోర్సులో చేరేందుకు కనీస అర్హత బ్యాచిలర్ డిగ్రీ. ఇదే తరహా కోర్సును కెనడా వంటి దేశాలు సైతం అందిస్తున్నాయి. జేడీతోపాటు ఎల్‌ఎల్‌ఎం, డాక్టర్ ఆఫ్ జ్యురిడికల్ సైన్స్ (ఎస్.జె.డి) కోర్సుల్లోనూ అమెరికన్ యూనివర్సిటీలు ప్రవేశం కల్పిస్తున్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ జ్యూరిస్‌ప్రుడెన్స్:
యూకేలోని యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ జ్యూరిస్‌ప్రుడెన్స్. ఈ కోర్సుకు మన దేశంలోని ఎల్‌ఎల్‌బీకి తత్సమాన కోర్సుగా గుర్తింపు ఉంది. యూకే, యూరోపియన్ యూనియన్‌లోని ఇతర దేశాల యూనివర్సిటీలు సైతం ఈ కోర్సును అందిస్తున్నాయి.

ఎల్‌ఎల్‌ఎం: మాస్టర్ ఆఫ్ లా కోర్సును అన్ని దేశాల్లోనూ మన దేశంలో మాదిరిగానే ఎల్‌ఎల్‌ఎంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఏడాది కోర్సు. ఇందులో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ‘లా’; ఎన్విరాన్‌మెంటల్ ‘లా’; కార్పొరేట్ ‘లా’; కమర్షియల్ ‘లా’ స్పెషలైజేషన్లతో మాస్టర్ ఆఫ్ లా కోర్సు పూర్తిచేసుకున్న వారికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయి.

ఎస్‌జేడీ/జేఎస్‌డీ: ఇది లాలో డాక్టోరల్ స్థాయి కోర్సు. దీన్ని పూర్తిచేసిన వారికి డాక్టర్ ఆఫ్ జ్యురిడికల్ సైన్స్ పేరుతో పీహెచ్‌డీ పట్టా చేతికందుతుంది.

ఎల్‌ఎల్‌డీ: న్యాయశాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టరేట్ స్థాయికి సమానమైన కోర్సు ఎల్‌ఎల్‌డీ. దీన్ని పూర్తిచేసిన వారికి అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా, డీన్స్‌గా అవకాశాలు లభిస్తున్నాయి.

ప్రవేశాలకు రెండు ప్రధాన పరీక్షలు :
అంతర్జాతీయంగా న్యాయవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రధానంగా రెండు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అవి.. ఎల్‌శాట్, ఎల్‌ఎన్‌ఏటీ.
  • ఎల్‌శాట్: లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎల్‌శాట్)ను అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 700 కేంద్రాల్లో జరిగే ఎల్‌శాట్ స్కోర్‌ను దాదాపు 200కుపైగా యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ పరీక్షలో మంచి స్కోర్ ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని యూనివర్సిటీల్లో బ్యాచిలర్ స్థాయి లా కోర్సుల్లో ప్రవేశించొచ్చు. మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.lsac.org

యూకే.. నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా (ఎల్‌ఎన్‌ఏటీ) :
యూకే, ఇతర యూరోపియన్ దేశాల్లోని యూనివర్సిటీల్లో ‘లా’ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ప్రామాణికంగా భావిస్తున్న పరీక్ష నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా (ఎల్‌ఎన్‌ఏటీ). ఈ పరీక్ష 2:15 గంటల వ్యవధిలో రెండు విభాగాల్లో (సెక్షన్-ఎ, సెక్షన్-బి) ఉంటుంది. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.lnat.ac.uk

ప్రవేశాలు: అన్ని దేశాల్లోనూ ఏటా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో అకడమిక్ సెషన్ ప్రారంభమవుతుంది. వీటిలో ప్రవేశాలకు నిర్దేశించిన టెస్ట్ స్కోర్స్ సొంతం చేసుకోవడం, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం కోణంలో ఏడాది ముందుగానే ఉపక్రమించాలి.

ఆర్థిక ప్రోత్సాహకాలు...
విదేశాల్లో లా డిగ్రీ ఔత్సాహికులకు ప్రత్యేకించి స్కాలర్‌షిప్‌లు లేకపోయినప్పటికీ.. అభ్యర్థులు ప్రవేశం పొందిన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు సదరు అభ్యర్థులు అకడమిక్ రికార్డ్ ఆధారంగా మెరిట్ కమ్ మీన్ అసిస్టెన్స్ పేరుతో స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. అదే విధంగా భారత హెచ్‌ఆర్‌డీ విభాగం ద్వారా కామన్వెల్త్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భారత్‌లో ప్రాక్టీస్‌కు బీసీఐ అనుమతి: విదేశాల్లో లా డిగ్రీ కోర్సులు పూర్తిచేశాక భారత్‌లో ఉన్నతవిద్య, కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి.
లా.. టాప్ టెన్ సంస్థలు :
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్-2018 ప్రకారం టాప్-10 లా ఇన్‌స్టిట్యూట్స్..
1. హార్వర్డ్ లా స్కూల్.
2. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ.
3. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్.
4. యేల్ లా స్కూల్.
5. స్టాన్‌ఫోర్డ్ లా స్కూల్.
6. న్యూయార్క్ యూనివర్సిటీ.
7. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్.
8. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా- బర్కిలీ.
9. కొలంబియా యూనివర్సిటీ.
10. యూనివర్సిటీ ఆఫ్ షికాగో.
Published date : 07 Apr 2018 02:18PM

Photo Stories