న్యాయ శాస్త్రంలో కాంతులీనే కెరీర్‌కు మార్గం...క్లాట్- 2016
Sakshi Education
ఉన్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్ర నైపుణ్యాలను పెంపొందించుకొని, అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు మార్గం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)! జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ లా యూనివర్సిటీల్లో 5 ఏళ్ల లా కోర్సు (బీఏ ఎల్‌ఎల్‌బీ)లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. 2016-17 ప్రవేశాలకు సంబంధించి క్లాట్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష విధివిధానాలు, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై ఫోకస్...
- పరీక్ష వ్యవధి: రెండు గంటలు
ప్రిపరేషన్ ప్రణాళిక
ఇంగ్లిష్
క్లాట్ ఔత్సాహికులు ప్రధానంగా దృష్టిసారించాల్సిన విభాగం ఇది. జనరల్ నాలెడ్జ్ కోణంలో చరిత్రకు, భారత రాజ్యాంగానికి ప్రాధాన్యమివ్వాలి. చరిత్రలో ముఖ్యంగా జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టిసారించాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. గత మూడేళ్లుగా ఈ విభాగంలో అడిగే ప్రశ్నల తీరు మారుతోంది. కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. క్లాట్-2015లో 80 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి అడగడమే ఇందుకు నిదర్శనం. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి. ముఖ్యంగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు; అదే విధంగా అంతర్జాతీయ ప్రాధాన్యమున్న ఇతర సంఘటనలు (ఉదా: కాప్ సదస్సు-తీర్మానాలు, అంతర్జాతీయ ఉగ్రవాదం-దీనిపై పోరుకు ఆయా దేశాలు ఉమ్మడిగా చేపడుతున్న చర్యలు)పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ప్రిపరేషన్‌కు ప్రామాణిక జీకే పుస్తకాలతో పాటు దినపత్రికలు ఉపయోగపడతాయి. ముఖ్య పరిణామాలను నోట్స్‌గా రాసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్
ఈ విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి. ఇతర విభాగాలతో పోల్చితే ప్రశ్నల సంఖ్య తక్కువ. ప్రశ్నలు అభ్యర్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటున్నాయి. అర్థమెటిక్ ఆధారిత అంశాలు (శాతాలు, నిష్పత్తులు, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, లాభ- నష్టాలు, వర్గ మూలాలు) ముఖ్యమైనవి.
లాజికల్ రీజనింగ్
ఈ విభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజనింగ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటికి సంబంధించి అభ్యర్థులు సిలాజిజమ్, కోడింగ్- డీ కోడింగ్, డెరైక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. అదే విధంగా స్టేట్‌మెంట్/ఆర్గ్యుమెంట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో తులనాత్మక, తార్కిక నైపుణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి.
లీగల్ ఆప్టిట్యూడ్
క్లాట్ పరీక్షలో విభిన్నమైన విభాగం లీగల్ ఆప్టిట్యూడ్. సాధారణంగా ఈ పేరు వినగానే న్యాయ శాస్త్ర సంబంధ ప్రశ్నలు ఉంటాయనుకోవడం సహజం. అయితే న్యాయ శాస్త్ర సంబంధ ప్రశ్నల కంటే ఎక్కువగా అభ్యర్థుల్లో న్యాయపరమైన దృక్పథాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా రెండు సంఘటనలు పేర్కొని అందులో హేతుబద్ధమైన సంఘటనను గుర్తించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు జస్టిఫికేషన్ నైపుణ్యాలు పెంచుకోవాలి. అంటే.. ఏదైనా ఒక సంఘటన లేదా అంశంలో న్యాయపరమైన సమాధానం ఇచ్చే విధంగా నైపుణ్యం పొందాలి. దీనికి అదనంగా ముఖ్యమైన చట్టాలు, న్యాయ పదజాలం, ముఖ్యమైన ఒప్పందాల గురించి తెలుసుకుంటే ఈ విభాగంలో అడిగే 50 ప్రశ్నల్లో అత్యధికంగా 40 ప్రశ్నల వరకు సమాధానం ఇవ్వొచ్చు.
రిఫరెన్స్ బుక్స్
నల్సార్- హైదరాబాద్‌లో హోంస్టేట్ కోటా
దేశంలోని మొత్తం 17 నేషనల్ లా యూనివర్సిటీల్లో కొన్నింటిలో హోంస్టేట్ కోటా కింద మొత్తం సీట్లలో 20 శాతం సీట్లు సదరు ఇన్‌స్టిట్యూట్ ఉన్న రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో నల్సార్ హైదరాబాద్‌లో 13 సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు.
క్లాట్ పీజీ
ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు క్లాట్ పీజీ పేరిట పరీక్ష నిర్వహిస్తారు. క్లాట్ యూజీ తేదీల్లోనే పీజీ పరీక్షలు కూడా జరుగుతాయి.
అర్హత: ఎల్.ఎల్.బి. లేదా తత్సమాన కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం
క్లాట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో క్లాట్ - యూజీ, క్లాట్ - పీజీ అనే ఆప్షన్లు ఉంటాయి. క్లాట్-పీజీ ఆప్షన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- వెబ్‌సైట్: www.clat.ac.in
క్లాట్‌కు పెరుగుతున్న పోటీ..
క్లాట్ ఔత్సాహికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. న్యాయ విద్యపై అవగాహన పెరగడం, కెరీర్ అవకాశాలు మెరుగుపడటం దీనికి కారణం. న్యాయ విద్య అంటే కేవలం న్యాయవాద వృత్తిలో స్థిరపడడం అనే పరిస్థితులు మారాయి. ఈ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా కేపీఓలు, ఐపీఆర్ కన్సల్టింగ్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అదే విధంగా బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల లీగల్ డిపార్ట్‌మెంట్లలో అవకాశాల సంఖ్య పెరుగుతోంది. అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ విద్యార్థులైనా బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరొచ్చు. అయితే కోర్సులో చేరిన తర్వాత నిరంతర అధ్యయనం, న్యాయ విభాగంలో తాజా పరిణామాలు తెలుసుకోవడం, జస్టిఫికేషన్ నైపుణ్యాలు ఉంటే ఉజ్వల భవిత సొంతమవుతుంది.
- వి.బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్, నల్సార్-హైదరాబాద్.
దేశంలో 17 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలోని బ్యాచిలర్ లా డిగ్రీ కోర్సులో 2,097 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించేందుకు క్లాట్‌ను నిర్వహిస్తారు. 5ఏళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఏటికేడు పోటీ పెరుగుతోంది. క్లాట్- 2015కు జాతీయ స్థాయిలో దాదాపు 30వేల మంది అభ్యర్థులు పోటీపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, క్లాట్ ఔత్సాహికులు ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
పరీక్ష విధివిధానాలు
క్లాట్ యూజీ పరీక్షలో 5 విభాగాలుంటాయి. అవి.. ఇంగ్లిష్, జీకే/కరెంట్ అఫైర్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్షను ఆన్‌లైన్లో నిర్వహిస్తారు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలు నిర్దేశ సబ్జెక్టుకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని, తార్కిక ఆలోచనను పరీక్షించే విధంగా ఉంటున్నాయి. అందువల్ల సబ్జెక్టులకు సంబంధించి హైస్కూల్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేస్తూనే, ఆ అంశాలను జనరలైజ్ చేసే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.

విభాగం | ప్రశ్నలు | మార్కులు |
ఇంగ్లిష్ | 40 | 40 |
జీకే/కరెంట్ అఫైర్స్ | 50 | 50 |
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ | 20 | 20 |
లీగల్ ఆప్టిట్యూడ్ | 50 | 50 |
లాజికల్ రీజనింగ్ | 40 | 40 |
మొత్తం | 200 | 200 |
ప్రిపరేషన్ ప్రణాళిక
ఇంగ్లిష్
- ఈ విభాగంలో ఇంగ్లిష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాలు, గ్రామర్‌పై పట్టును పరీక్షించే విధంగా కాంప్రహెన్షన్ ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల బేసిక్ గ్రామర్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా వొకాబ్యులరీపై పట్టు సాధించాలి.
- టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కరెక్షన్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్ - ఇన్‌డెరైక్ట్ స్పీచ్‌లపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. దీనివల్ల కాంప్రహెన్షన్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించేందుకు వీలవుతుంది.
క్లాట్ ఔత్సాహికులు ప్రధానంగా దృష్టిసారించాల్సిన విభాగం ఇది. జనరల్ నాలెడ్జ్ కోణంలో చరిత్రకు, భారత రాజ్యాంగానికి ప్రాధాన్యమివ్వాలి. చరిత్రలో ముఖ్యంగా జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై దృష్టిసారించాలి. భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. గత మూడేళ్లుగా ఈ విభాగంలో అడిగే ప్రశ్నల తీరు మారుతోంది. కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. క్లాట్-2015లో 80 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి అడగడమే ఇందుకు నిదర్శనం. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి. ముఖ్యంగా భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు; అదే విధంగా అంతర్జాతీయ ప్రాధాన్యమున్న ఇతర సంఘటనలు (ఉదా: కాప్ సదస్సు-తీర్మానాలు, అంతర్జాతీయ ఉగ్రవాదం-దీనిపై పోరుకు ఆయా దేశాలు ఉమ్మడిగా చేపడుతున్న చర్యలు)పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ప్రిపరేషన్‌కు ప్రామాణిక జీకే పుస్తకాలతో పాటు దినపత్రికలు ఉపయోగపడతాయి. ముఖ్య పరిణామాలను నోట్స్‌గా రాసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్
ఈ విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి. ఇతర విభాగాలతో పోల్చితే ప్రశ్నల సంఖ్య తక్కువ. ప్రశ్నలు అభ్యర్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటున్నాయి. అర్థమెటిక్ ఆధారిత అంశాలు (శాతాలు, నిష్పత్తులు, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, లాభ- నష్టాలు, వర్గ మూలాలు) ముఖ్యమైనవి.
లాజికల్ రీజనింగ్
ఈ విభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజనింగ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటికి సంబంధించి అభ్యర్థులు సిలాజిజమ్, కోడింగ్- డీ కోడింగ్, డెరైక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. అదే విధంగా స్టేట్‌మెంట్/ఆర్గ్యుమెంట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో తులనాత్మక, తార్కిక నైపుణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి.
లీగల్ ఆప్టిట్యూడ్
క్లాట్ పరీక్షలో విభిన్నమైన విభాగం లీగల్ ఆప్టిట్యూడ్. సాధారణంగా ఈ పేరు వినగానే న్యాయ శాస్త్ర సంబంధ ప్రశ్నలు ఉంటాయనుకోవడం సహజం. అయితే న్యాయ శాస్త్ర సంబంధ ప్రశ్నల కంటే ఎక్కువగా అభ్యర్థుల్లో న్యాయపరమైన దృక్పథాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా రెండు సంఘటనలు పేర్కొని అందులో హేతుబద్ధమైన సంఘటనను గుర్తించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు జస్టిఫికేషన్ నైపుణ్యాలు పెంచుకోవాలి. అంటే.. ఏదైనా ఒక సంఘటన లేదా అంశంలో న్యాయపరమైన సమాధానం ఇచ్చే విధంగా నైపుణ్యం పొందాలి. దీనికి అదనంగా ముఖ్యమైన చట్టాలు, న్యాయ పదజాలం, ముఖ్యమైన ఒప్పందాల గురించి తెలుసుకుంటే ఈ విభాగంలో అడిగే 50 ప్రశ్నల్లో అత్యధికంగా 40 ప్రశ్నల వరకు సమాధానం ఇవ్వొచ్చు.
రిఫరెన్స్ బుక్స్
- వర్డ్ పవర్ మేడ్ ఈజీ: నార్మన్ లూయిస్
- ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్: ఆర్.ఎస్.అగర్వాల్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఆర్.ఎస్.అగర్వాల్
- లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్
- క్లాట్ ఎసెన్షియల్స్: అభినవ్ శ్రీవాత్సవ్
- అనలిటికల్ రీజనింగ్: ఎం.కె.పాండే
- లీగల్ ఆప్టిట్యూడ్: ఎ.పి.భరద్వాజ్
- నిర్వాహక ఇన్‌స్టిట్యూట్: రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా - పంజాబ్.
- బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష అర్హత: ఇంటర్మీడియెట్‌లో 45 శాతం. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో.
- ఆన్‌లైన్ దరఖాస్తు: జనవరి 1, 2016 - మార్చి 31, 2016.
- దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఎస్‌ఏపీ అభ్యర్థులకు రూ. 4,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 3,500.
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 2016, ఏప్రిల్ 15
- క్లాట్ పరీక్ష తేదీ: 2016, మే 8
- ఫలితాల వెల్లడి: 2016, మే 23.
- వివరాలకు వెబ్‌సైట్: www.clat.ac.in
ఇన్‌స్టిట్యూట్ | తొలి జాబితా | చివరి జాబితా |
ఎన్‌ఎల్‌ఐఎస్‌యూ (బెంగళూరు) | 139.5 | 139.5 |
నల్సార్ (హైదరాబాద్) | 136.5 | 136 |
డబ్ల్యూబీఎన్‌యూజేఎస్-కోల్‌కతా | 130 | 128.5 |
ఎన్‌ఎల్‌యూ (భోపాల్) | 129 | 125.5 |
జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్) | 124 | 121.75 |
హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్) | 122 | 120 |
ఆర్‌ఎంఎల్‌ఎన్‌ఎల్‌యూ (లక్నో) | 121.5 | 118.75 |
ఆర్‌జీఎన్‌ఎల్‌యూ (పాటియాల) | 120 | 117.5 |
ఎన్‌యూఏఎల్‌ఎస్-కోచి | 120 | 117 |
సీఎన్‌ఎల్‌యూ (పాట్నా) | 118.25 | 116 |
ఎన్‌ఎల్‌యూ (ఒడిశా) | 118.25 | 115.75 |
ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్-రాంచీ | 118 | 115.5 |
ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం) | 117.5 | 114.5 |
నల్సార్- హైదరాబాద్‌లో హోంస్టేట్ కోటా
దేశంలోని మొత్తం 17 నేషనల్ లా యూనివర్సిటీల్లో కొన్నింటిలో హోంస్టేట్ కోటా కింద మొత్తం సీట్లలో 20 శాతం సీట్లు సదరు ఇన్‌స్టిట్యూట్ ఉన్న రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో నల్సార్ హైదరాబాద్‌లో 13 సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు.
క్లాట్ పీజీ
ప్రతిష్టాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు క్లాట్ పీజీ పేరిట పరీక్ష నిర్వహిస్తారు. క్లాట్ యూజీ తేదీల్లోనే పీజీ పరీక్షలు కూడా జరుగుతాయి.
అర్హత: ఎల్.ఎల్.బి. లేదా తత్సమాన కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం
- ఆన్‌లైన్లో రెండు గంటల వ్యవధిలో ఉంటుంది. 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి.
- కాన్‌స్టిట్యూషనల్ లా, జ్యూరిస్ప్రుడెన్స్, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, లా ఆఫ్ టార్ట్స్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, ప్రాపర్టీ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా తదితర విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- వీటిలో కాన్‌స్టిట్యూషనల్ లా, జ్యూరిస్ప్రుడెన్స్ లా నుంచి 50 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇతర సబెక్టుల నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.
- అందుబాటులో ఉన్న సీట్లు: 602.
క్లాట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో క్లాట్ - యూజీ, క్లాట్ - పీజీ అనే ఆప్షన్లు ఉంటాయి. క్లాట్-పీజీ ఆప్షన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- వెబ్‌సైట్: www.clat.ac.in
క్లాట్‌కు పెరుగుతున్న పోటీ..
క్లాట్ ఔత్సాహికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. న్యాయ విద్యపై అవగాహన పెరగడం, కెరీర్ అవకాశాలు మెరుగుపడటం దీనికి కారణం. న్యాయ విద్య అంటే కేవలం న్యాయవాద వృత్తిలో స్థిరపడడం అనే పరిస్థితులు మారాయి. ఈ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా కేపీఓలు, ఐపీఆర్ కన్సల్టింగ్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. అదే విధంగా బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల లీగల్ డిపార్ట్‌మెంట్లలో అవకాశాల సంఖ్య పెరుగుతోంది. అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ విద్యార్థులైనా బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరొచ్చు. అయితే కోర్సులో చేరిన తర్వాత నిరంతర అధ్యయనం, న్యాయ విభాగంలో తాజా పరిణామాలు తెలుసుకోవడం, జస్టిఫికేషన్ నైపుణ్యాలు ఉంటే ఉజ్వల భవిత సొంతమవుతుంది.
- వి.బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్, నల్సార్-హైదరాబాద్.
Published date : 24 Dec 2015 05:22PM