మరో `లా` ప్రవేశ మార్గం.. ఎల్‌శాట్
Sakshi Education
దేశంలోని ప్రముఖ ప్రైవేటు న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ -ఇండియా వీలు కల్పిస్తోంది. ఎల్‌శాట్‌గా వ్యవహరించే ఈ పరీక్షను అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ నేతృత్వంలో నిర్వహిస్తారు. ఈ స్కోర్ ఆధారంగా దేశంలో దాదాపు 60కు పైగా ప్రముఖ న్యాయ కళాశాలల్లో ‘లా’ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో అడుగు పెట్టొచ్చు. ఎల్‌శాట్-2016 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ వ్యూహాలు..
లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్‌ను అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ జీమ్యాట్, జీఆర్‌ఈ తరహాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది. అయితే ఇది కేవలం భారత్‌లోని లా ఇన్‌స్టిట్యూట్‌లు, వాటిలో బ్యాచిలర్స్, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేకంగా ఉద్దేశించింది. మన దేశంలో పియర్సన్ వీయూఈ ఇండియా ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా దేశంలోని ప్రముఖ న్యాయ కళాశాల్లో ప్రవేశం పొందొచ్చు.
పరీక్ష విధానం
ఎల్‌శాట్- ఇండియా పరీక్ష ఆఫ్‌లైన్ (పేపర్-పెన్సిల్) విధానంలో నాలుగు సెక్షన్లలో జరుగుతుంది. అవి అనలిటికల్ రీజనింగ్; ఫస్ట్ లాజికల్ రీజనింగ్; సెకండ్ లాజికల్ రీజనింగ్; రీడింగ్ కాంప్రహెన్షన్. సెక్షన్ల వారీగా ప్రశ్నల సంఖ్య పరంగా నిర్దిష్ట విధానం లేదు. అయితే గత పరీక్షలను పరిశీలిస్తే ప్రతి సెక్షన్ నుంచి దాదాపు 24 ప్రశ్నలు చొప్పున అడిగే అవకాశం ఉంది. మొత్తం సమయం రెండు గంటల 20 నిమిషాలు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నాలుగు సెక్షన్లలో నిర్వహించే ఎల్‌శాట్ ప్రధాన ఉద్దేశం అభ్యర్థుల్లోని తులనాత్మక పరిశీలన నైపుణ్యాలను పరీక్షించడం. ప్రశ్నలు కూడా ఈ తరహాలోనే ఉంటాయి.
విభాగాల వారీగా ప్రిపరేషన్ టిప్స్
అనలిటికల్ రీజనింగ్
ఈ విభాగంలో రాణించడానికి ఆయా ప్రదేశాలు, వ్యక్తులు, సంఘటనలు, పరిస్థితుల మధ్య సంబంధాన్ని లేదా ప్రభావాన్ని విశ్లేషించే నైపుణ్యాలు అవసరం. అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సమాధానం ఇవ్వగలిగే రీతిలో ప్రశ్నలు ఉంటాయి. ఏదైనా ఒక సమస్య లేదా సందర్భానికి సంబంధించి అంశాలను ఇచ్చి వాటి ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు కూడా ఇచ్చిన అంశాల మధ్య సంబంధాన్ని కనుగొనే విధంగా ఉంటాయి.
లాజికల్ రీజనింగ్
అభ్యర్థుల్లోని తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగమిది. ఇందులో ఏదైనా ఒక స్టేట్‌మెంట్ లేదా ఆర్గ్యుమెంట్‌ను ఇచ్చి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిర్దేశిత స్టేట్‌మెంట్ లేదా ఆర్గ్యుమెంట్‌ని విశ్లేషించే నైపుణ్యం, తులనాత్మకంగా పరిశీలించే నైపుణ్యాలు కలిగుండాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్
ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు డెరైక్ట్‌గా లేదా ఆ ప్యాసేజ్‌కు సంబంధించి ఇన్‌డెరైక్ట్‌గా ఉంటాయి. ఈ విభాగంలో రాణించాలంటే నిర్దిష్ట అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తూ అభ్యసించే నైపుణ్యం పొందాలి. అంతేకాకుండా సదరు ప్యాసేజ్‌లోని ముఖ్య సమాచారాన్ని, ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న అంశాలను, ప్యాసేజ్‌లోని కీలక పదాలను గుర్తించే నైపుణ్యాన్ని కూడా సొంతం చేసుకోవాలి. దీనికి మార్గం ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాలు చదవడం, వాటి సారాంశంతో సంక్షిప్త నోట్స్ రాసుకోవడం వంటివి ప్రాక్టీస్ చేయాలి.
పర్సంటైల్ విధానంలో స్కోర్లు
ఎల్‌శాట్ - ఇండియా స్కోర్లను కూడా లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ పర్సంటైల్ విధానంలో విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఆ స్కోర్ కార్డ్‌ను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా అభ్యర్థుల స్కోర్లను ఎల్‌శాట్ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పించే కళాశాలలకు కూడా లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ పంపుతుంది. అయితే అభ్యర్థులు ఆయా కళాశాలలకు వాటి నోటిఫికేషన్ల ప్రకారం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎల్‌శాట్- ఇండియా దరఖాస్తు విధానం
ఎల్‌శాట్ - ఇండియా ఔత్సాహికులు ఆన్‌లైన్ /ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలనుకుంటే పియర్సన్‌వీయూఈ ఇండియా వెబ్‌సైట్ (www.pearsonvueindia.com )లో లాగిన్ అయి తమ వివరాలు నమోదు చేసుకోవాలి. నిర్దేశిత ఫీజు (రూ. 3,800) చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలనుకుంటే వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేసి నిర్దేశిత చిరునామాకు ఫీజు డీడీతోపాటు పంపాలి.
కోర్సులు- అర్హతలు
ఎల్‌శాట్ స్కోర్‌తో ప్రవేశాలు కల్పించే ప్రముఖ న్యాయ కళాశాలలు
రిఫరెన్స్ బుక్స్
ఎల్‌శాట్ ఇండియా-2016 ముఖ్య తేదీలు

- ఈ స్టేట్‌మెంట్ భూతాపానికి / కాలుష్యానికి సంబంధించింది. దీనికి అనుగుణంగా కొన్ని కారణాలు, లేదా మినహాయింపులతో కూడిన ఆప్షన్లు ఇచ్చి వాటిలోంచి సరైన సమాధానాన్ని గుర్తించమని అడుగుతారు.
- ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే తులనాత్మక పరిశీలన సామర్థ్యం ఎంతో ముఖ్యం.
- సెకండ్ లాజికల్ రీజనింగ్ పేరుతో మూడు సెక్షన్‌లుగా ఉండే విభాగంలోనూ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలే. వీటి క్లిష్టత స్థాయి ఎక్కువగా ఉంటాయి.
రీడింగ్ కాంప్రహెన్షన్
ఏదైనా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు డెరైక్ట్‌గా లేదా ఆ ప్యాసేజ్‌కు సంబంధించి ఇన్‌డెరైక్ట్‌గా ఉంటాయి. ఈ విభాగంలో రాణించాలంటే నిర్దిష్ట అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తూ అభ్యసించే నైపుణ్యం పొందాలి. అంతేకాకుండా సదరు ప్యాసేజ్‌లోని ముఖ్య సమాచారాన్ని, ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న అంశాలను, ప్యాసేజ్‌లోని కీలక పదాలను గుర్తించే నైపుణ్యాన్ని కూడా సొంతం చేసుకోవాలి. దీనికి మార్గం ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాలు చదవడం, వాటి సారాంశంతో సంక్షిప్త నోట్స్ రాసుకోవడం వంటివి ప్రాక్టీస్ చేయాలి.
పర్సంటైల్ విధానంలో స్కోర్లు
ఎల్‌శాట్ - ఇండియా స్కోర్లను కూడా లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ పర్సంటైల్ విధానంలో విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఆ స్కోర్ కార్డ్‌ను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా అభ్యర్థుల స్కోర్లను ఎల్‌శాట్ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పించే కళాశాలలకు కూడా లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ పంపుతుంది. అయితే అభ్యర్థులు ఆయా కళాశాలలకు వాటి నోటిఫికేషన్ల ప్రకారం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎల్‌శాట్- ఇండియా దరఖాస్తు విధానం
ఎల్‌శాట్ - ఇండియా ఔత్సాహికులు ఆన్‌లైన్ /ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలనుకుంటే పియర్సన్‌వీయూఈ ఇండియా వెబ్‌సైట్ (www.pearsonvueindia.com )లో లాగిన్ అయి తమ వివరాలు నమోదు చేసుకోవాలి. నిర్దేశిత ఫీజు (రూ. 3,800) చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలనుకుంటే వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేసి నిర్దేశిత చిరునామాకు ఫీజు డీడీతోపాటు పంపాలి.
కోర్సులు- అర్హతలు
- కోర్సు: బీఏ ఎల్‌ఎల్‌బీ
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
- కోర్సు: ఎల్‌ఎల్‌బీ
అర్హత: 45 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
- కోర్సు: ఎల్‌ఎల్‌ఎం
అర్హత: 45 శాతం మార్కులతో బీఏ ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత.
ఎల్‌శాట్ స్కోర్‌తో ప్రవేశాలు కల్పించే ప్రముఖ న్యాయ కళాశాలలు
- జిందాల్ గ్లోబల్ లా స్కూల్
వెబ్‌సైట్: www.jgls.edu.in
- స్కూల్ ఆఫ్ లా - గీతం యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.gitam.edu
- జేఎస్‌ఎస్ లా కాలేజ్
వెబ్‌సైట్: https://jsslawcollege.in
- కాలేజ్ ఆఫ్ లీగల్ స్టడీస్-యూపీఈఎస్(డెహ్రాడూన్)
వెబ్‌సైట్: https://upes.ac.in/college-of-legal-studies
- రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, ఐఐటీ-ఖరగ్‌పూర్
వెబ్‌సైట్: https://rgsoipl.iitkgp.ernet.in
‘లా’ ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రామాణికం ప్రభుత్వ యూనివర్సిటీలు, అనుబంధ లా కళాశాలల్లో ప్రవేశానికి రాష్ట్రాల స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లలో లా కోర్సుల్లో ప్రవేశం కల్పించే దిశగా ఎల్‌శాట్ స్కోర్ ఇటు ఇన్‌స్టిట్యూట్‌లకు అటు అభ్యర్థులకు రెండు వర్గాలకు అనుకూలంగా ఉంటోంది. అందుకే ఏటేటా ఎల్‌శాట్ ఇండియా స్కోర్లను వినియోగించే లా ఇన్‌స్టిట్యూట్స్ సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా ఎల్‌శాట్ పరీక్ష విధానం పూర్తిగా న్యాయ విద్యార్థులు తాము అకడమిక్‌గా రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక అభ్యర్థులు క్రిటికల్ థింకింగ్, లాజికల్ అప్రోచ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. - ప్రొఫెసర్ వై.సత్యనారాయణ, డెరైక్టర్, స్కూల్ ఆఫ్ లా, గీతం యూనివర్సిటీ |
రిఫరెన్స్ బుక్స్
- కల్పన్ ఎల్‌శాట్
- ఎల్‌శాట్ రీడింగ్ కాంప్రహెన్షన్ బైబిల్ - పవర్‌స్కోర్
- క్రాకింగ్ ది ఎల్‌శాట్ - ప్రిన్స్‌టన్ రివ్యూ
- మెక్‌గ్రాహిల్ ఎల్‌శాట్-2016
- ది అఫీషియల్ ఎల్‌శాట్- ఇండియా హ్యాండ్‌బుక్
ఎల్‌శాట్ ఇండియా-2016 ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: నవంబర్ 9, 2015 నుంచి మే 1, 2016 వరకు
- ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్: నవంబర్ 9, 2015 నుంచి ఏప్రిల్ 28, 2016 వరకు
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: మే 8, 2016 నుంచి మే 14, 2016 వరకు
- పరీక్ష తేదీ: మే 15, 2016
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
- ఫలితాల వెల్లడి: జూన్ 3, 2016
- వివరాలకు వెబ్‌సైట్: www.pearsonvueindia.com/lsatindia
Published date : 27 Nov 2015 12:57PM