Skip to main content

Job Interview Tips: జాబ్ ఇంటర్వ్యూల్లో తరచుగా అడిగే ప్రశ్నలు.. దీటైన సమాధానాలు!

మాటతో మంత్రం వేయవచ్చు. ఆ మాటలనే తూటాల్లా పేల్చి గాయాలు చేయవచ్చు..! అందుకే మాట పదిలంగా, పొందికగా, ఒద్దికగా, మధురంగా ఉండాలి. ఒక్కోమాట ఏర్చి.. కూర్చి.. పేర్చి.. నట్టుండాలి. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో ఈ మాటలే కీలక పాత్ర పోషించేది. సాధారణంగా ఇంటర్వ్యూ అనేది ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. అక్కడ ఇంటర్వ్యూవర్స్ ప్రశ్నలను అడగడం ద్వారా అభ్యర్ధుల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. జాబ్ ఇంటర్వ్యూ అనేది ఒక అభ్యర్ధి ఉద్యోగం కోరుతూ ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రక్రియ. తద్వారా ఇంటర్వ్యూవర్లు ఆ ఉద్యోగానికి అభ్యర్ధులు సరిపోతారోలేదో అంచనా వేస్తారు. అయితే, ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో.. ఏ విధమైన సమాధానాలు ఇవ్వాలో చాలా మందికి అవగాహనలేక ఇబ్బందుల్లో పడుతుంటారు. కాబట్టి ఇంటర్వ్యూల్లో తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు మీకోసం.
Job Interview Tips: Frequently Asked Questions and answers in Interviews
Job Interview Tips: Frequently Asked Questions and answers in Interviews

జాబ్ ఇంటర్వ్యూ టిప్స్:

  • అప్‌డేట్ చేసిన రెజ్యూమ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటి ఫొటోకాఫీలను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • కంపెనీ/సంస్థ గురించిన వివరాలను సాధ్యమైనంత వరకు తెలుసుకోవాలి.
  • సంస్థ యొక్క లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలను తెలుసుకోవాలి.
  • మీరు చేరదల్చుకున్న ఉద్యోగ వివరాలు తెలుసుకోవాలి. అదే విధమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తులతో కూడా మాట్లాడాలి. ఈ విధమైన సమాచారం మీ వద్ద ఉన్నట్లయితే, అవి మీకు ఇంటర్వ్యూలో సహకరిస్తాయి.
  • తగిన దుస్తులు ధరించాలి. మెరిసే లేదా డాంభికంగా ఉండే దుస్తులు ధరించకూడదు. నీట్‌గా, శుభ్రంగా ఉండేవి ధరిస్తే ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు.
  • ఇంటర్వ్యూ సమయం కంటే కనీసం 15 - 20 నిముషాలు ముందే చేరుకోవాలి.
  • ఇంటర్వ్యూ హాల్‌లోకి నెమ్మదిగా, కాన్ఫిడెంట్‌గా నడుస్తూ వెళ్లాలి.
  • నిటారుగా కూర్చోవాలి.
  • కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి.
  • మీ మాటలకు మీ ముఖకవళికలు సరితూగేలా చూసుకోవాలి.
  • కంగారుపడడం లేదా భయపడటం చేయకూడదు. కాన్ఫిడెంట్‌గా ఉండాలి.
  • సీరియస్‌గా కాకుండా నవ్వుతూ ఉండాలి.
  • నిరుత్సాహంగా ఉండకుండా కుతూహలంగా ఉండాలి.
  • మీరు కూర్చునే విధానం జాగ్రత్తగా ఉండాలి. బాగా వెనుకకు వాలిపోవడం లేదా ముందుకు వంగి కూర్చోకూడదు. మీరు ఆసక్తిని కనబరుస్తున్నట్టు కొంచెం ముందుకు వంగి కూర్చోవాలి.
  • సమాధానాలు జాగ్రత్తగా చెప్పాలి. శ్రద్ధగా వినడం ద్వారా ప్రశ్నను అర్ధం చేసుకోగలుగుతారు. మీకు ప్రశ్న సరిగ్గా అర్ధంకాకపోతే ఇంటర్వ్యూవర్‌ను మరొకసారి అడగడానికి సందేహించకండి.
  • పశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఆతురత పడకూడదు. సమాధానం చెప్పేముందు మీ ఆలోచనలను క్రోడీకరించి చెప్పాలి.
  • మాట్లాడేటప్పుడు స్వరం మరీ చిన్నగా లేదా పెద్దదిగా ఉండకూడదు. అలాగే వేగంగా లేదా నెమ్మదిగా కూడా మాట్లాడకూడదు.
  • మీ సమాధానం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. మీరిచ్చే సమాధానం ప్రశ్నకు అనుబంధంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఇంటర్వ్యూ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇంటర్వ్యూవర్లకు ధ్యాక్స్/ధన్యవాదాలు చెప్పాలి.


చ‌ద‌వండి: Interview Tips: కరెక్ట్ బాడీలాంగ్వేజ్‌తో ఇంటర్వ్యూలో విజయం సాధించే మార్గాలు..

ఇంటర్వ్యూల్లో తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూస్)
1. మీ గురించి పరిచయం చేసుకోండి?
మొట్టమొదటిది, చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నతోనే పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించేలా.. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఎంత కష్టపడి పనిచేసే వ్యక్తో చెబుతూ ఇంటర్వ్యూవర్‌కి బోర్ కొట్టించకుండ, మీ డిస్‌కషన్ ఇంటర్వ్యూ లోతుల్లోకి మళ్లించేలా మాట్లాడండి. ఇది మిమ్మల్ని ఇతర అభ్యర్ధుల నుంచి వేరు చేస్తుంది. ఇంటర్వ్యూవర్‌కు మీ యునిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ (యూఎస్పీ) గురించి చెప్పండి. యూఎస్పీఅనేది సంక్షిప్త సమాచార ప్రసారంగా పనిచేస్తుంది. అంటే మీరు ఎవరు, మీ బలాలు ఏమిటి, మీ బ లాలు కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడగలవో వివరిస్తుంది. మీరు చెపే్ప సమాధానాలుమీ చర్చకు లీడ్‌గా పనిచేయాలేగానీ, ఇంటరాగేషన్ ప్రాసెస్‌లా కొనసాగకూడదు.

2. మా కంపెనీ గురించి నీకు ఏమేమి తెలుసు ?
మీరు ఇచ్చే సమాధానం ఆ కంపెనీ గురించి తెసుకోవడానికి మీరు కనబరచిన ఆసక్తిని తెలియజేస్తుంది. ఆ కంపెనీకి సంబంధించిన అనుబంధ మరియు ప్రస్తుతసమాచారం ఇంటర్వ్యూవర్‌కు అందించండి. ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. వారి వెబ్‌సైట్‌లో ఎబౌట్ అజ్ సెక్షన్‌ను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో కంపెనీ ఉన్న ప్రదేశం, బ్లాగ్స్‌ను చదవడం ద్వారా ఆ కంపెనీ గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఆ కంపెనీ గురించి డిస్‌కషన్ బోర్డ్స్, సోషల్ నెట్‌వర్క్ సైట్స్‌లలో కూడా వెదకవచ్చు. గుర్తుంచుకోండి, వెదకడానికి టైమ్ తీసుకోవడం ద్వారా మంచి ఇంప్రెషన్ పొందుతారు.

3. ఈ ఉద్యోగానికి మీకున్న అర్హతలు ఏమిటి?
ఈ ఉద్యోగానికి జాబ్ పోస్టింగ్‌లో పొందుపరచబడిన విద్యార్హతలను వివరించడం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. మీ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ లను వాటికి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా వివరించడం ద్వారా మీకు ఈ జాబ్‌కు సంబంధించిన సమాచారం తెలుసునని, అంతేకాకుండా ఈ జాబ్‌కు అవసరమైన అర్హతలు మీకు ఉన్నాయని ఇంటర్వ్యూవర్ గుర్తిస్తారు.

4. మీ బలం (స్ట్రెంథ్) ఏమిటి?
మీ ఉద్యోగానికి సరితూగే విధంగా మీ బలాల (స్ట్రెంథ్స్) గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూవర్‌కు దానిని నిరూపించే, దృవీకరించే రుజువులను తెలియజేయండి.

5. మీ బలహీతలు ఏమిటి?
నిస్పాక్షికంగా మీ బలహీనతల గురించి చెబుతూ, వాటి ని అధిగమించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలను కూడా తెలియజేయండి.

6. మీరు స్వతంత్రంగా పని చేయడానికి మొగ్గు చూపుతారా? లేక టీమ్‌తో కలిసి పనిచేస్తారా?
గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంటర్వ్యూవర్ మీరు టీమ్ ప్లేయరా లేదా స్వతంత్రంగా పనిచేయడానికి మొగ్గు చూపేవారో తెలుసుకోవాలని అనుకుంటారు. కాబట్టి, మీరు టీమ్‌లో టీమ్ మెంబర్ గా, ఇంకా ఇండిపెండెంట్‌గా పనిచేయడానికి రెండింటికి సమానంగా మొగ్గు చూపుతున్నట్టు సమాధానం చెప్పాలి. మీరు చేసిన అసైన్‌మెంట్స్/టాస్క్స్/స్పోర్ట్స్ గురించి మాట్లాడండి. అవిఇండిపెండెంట్మరియు టీమ్ వర్క్‌ల ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి.

7. ఆఫీస్ వర్క్‌ను మీతోపాటు ఇంటికి తీసుకెళ్తారా?
అవసరం అయితే తీసుకెళ్తానని చెప్పాలి. అయితే మరీ సుదీర్ఘంగా సమాధానం ఇవ్వకూడదు.

8. ఒత్తిడిని మీరు ఏవిధంగా అధిగమిస్తారు?
ఉద్యోగ పరిస్థితులను బట్టి ఒత్తిడిని అధిగమిస్తానని చెప్పండి. మీ ఒత్తిడిని దూరం చేసే ఫిజికల్ ఎక్సర్‌సైజ్, యోగా, ఎయిరోబిక్స్‌ల గురించి చెప్పండి. అలాగే ఇటీవల కాలంలో మీరు ఒత్తిడిని జయించిన విధానాలను ఉదాహరణలుగా తెలియజేయండి.

10. మీరు ఏవిధమైన పొజిషన్‌ను కోరుకుంటున్నారు?
మీ అర్హతలు, అనుభవానికి తగిన ఏ స్థాయి ఉద్యోగాన్ని అయినా స్వీకరిస్తానని చెప్పండి.

11. ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ పొజిషన్‌పై మీకు ఆసక్తి ఉందా?
ఫుల్‌టైమ్ పొజిషన్ పట్ల మరింత ఆసక్తి కలిగి ఉన్నానని, పార్ట్ టైమ్ గురించి శ్రద్ధ లేదని తెలియజేయండి.

12. మీరు ఎప్పటి నుంచి మాతో పనిచేయడం ప్రారంభిస్తారు ?
వారికి అనుగుణంగా పనిచేస్తానని మీ సమ్మతిని తెల్పండి. కానీ ఎప్పుడు మీరు సంస్థలో జాయిన్ అవ్వగలరో కచ్చితంగా నిర్ధారించుకోండి.

చ‌ద‌వండి: ఏ ఇంటర్వ్యూలోనైన.. విజయం సాధించాలంటే ఇవి త‌ప్ప‌నిస‌రి..!

13. మిమ్మల్ని తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తే, ఎంత కాలం మాతో కలిసి పనిచేస్తారు?
ఎక్కువ కాలం పనిచేయడానికి సమ్మతిని తెల్పండి. అయితే ఖచ్చితమైన తేదీ కానీ, సంవత్సరం కానీ చెప్పకూడదు. వాళ్ల కోర్టులో బాల్ వదిలినట్టు ఉండాలి.

14. మా నుంచి ఎంత జీతం ఆశిస్తున్నారు?
కచ్చితమైన సంఖ్యకు బదులుగా విస్తృత పరిధిలో చెప్పండి.

ఇంటర్వ్యూల్లో తరచుగా అడిగే ఈ ఎఫ్‌ఎక్యూస్ మీ జాబ్ ఇంటర్వ్యూ స్కిల్స్‌ను వృద్ధి చేస్తాయని ఆశిస్తున్నాము. వీటితో పాటు ఇతర ప్రశ్నలకు కూడా సమాధానాలను తరచుగా ప్రాక్టీస్ చే యండి. మీ ఫ్రెండ్‌తో పాటు కూర్చుని, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా తరచూ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు సరిపడినంతగా కాన్ఫిడెంట్‌ను పొందుకుంటారు.

 

చ‌ద‌వండి: Interview Tips

Published date : 05 Feb 2022 01:46PM

Photo Stories