Skip to main content

Resume Tips: రెజ్యూమే ఇలా సింపుల్‌గా.. కంపెనీలు గుర్తించేలా..

ఇంజనీరింగ్, ఎంబీఏ, డిగ్రీ.. ఇలా ఏ కోర్సు పూర్తిచేసుకున్నా.. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు రెజ్యూమ్‌ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే.. ఒక పోస్టు ఖాళీగా ఉంటే.. పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. అలాంటి సందర్భంలో చూడగానే మంచి అభిప్రాయం కలిగించిన రెజ్యూమ్‌ అభ్యర్థికే ఇంటర్వూకు ఆహ్వానం అందుతుంది.
Resume Tips
Resume Tips

అంతేకాకుండా రెజ్యూమ్‌ ద్వారానే అభ్యర్థి గురించి పూర్తి విషయాలు కొలువులిచ్చే కంపెనీలకు తెలుస్తాయి. ముఖ్యంగా అభ్యర్థి చదువు, అభిరుచులు, నైపుణ్యాల గురించి తెలిపే పత్రం రెజ్యూమ్‌ అని చెప్పొచ్చు.

రెజ్యూమ్‌లో చేర్చాల్సినవి..
ఉద్యోగానికి ప్రయత్నించే అభ్యర్థులు చక్కటి రెజ్యూమ్‌ రూపొందించుకోవాలి.

చదువు, పాఠశాల విద్య నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ దాకా.. జీపీఏతో సహా ముఖ్య వివరాలు పొందుపరచాలి.

కంప్యూటర్‌ కోర్సులు, టైపింగ్‌ వంటి నైపుణ్యాలు ఏమైనా నేర్చుకుంటే.. వాటి గురించి, ఖచ్చితంగా తెలిసిన భాషలు, అభిరుచుల గురించి స్పష్టంగా పేర్కొనాలి.

రెజ్యూమ్‌లో పేరు, చిరునామా, నగరం, రాష్ట్రం, ఫోన్ నంబర్, ఈమెయిల్‌తో సహా పూర్తి వివరాలను ఇవ్వాలి.

భిన్నంగా..
అభ్యర్థి చదువు నుంచి వ్యక్తిత్వం వరకూ.. అన్ని అంశాల సమ్మేళనమే ప్రొఫైల్‌. దీన్ని మీరు ఇతరుల కంటే భిన్నంగా రూపొందిస్తే.. అదే మీ ఉద్యోగ సాధనకు దోహదపడుతుంది.

ఇందులో చదువు, గ్రేడ్‌లు, ర్యాంక్‌లు, అకడెమిక్‌ నైపుణ్యాలతోపాటు కాలేజీలో చదువుతోపాటు సాధించిన ఇతర ఘనతలు, నేర్చుకున్న కంప్యూటర్‌ నైపుణ్యాలు, పాల్గొన్న ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ కార్యక్రమాలు, మీకు ఉత్సుకతను కలిగించే విషయాలు, భవిష్యత్‌ లక్ష్యాలు..ఇలాంటి వివరాలన్నీ చాలా సంక్షిప్తంగా, సింపుల్‌గా రాయాలి.

హైలెట్స్‌..
కాలేజీలో పాల్గొన్న డిబేట్‌లు, క్రీడలతోపాటు పూర్తి చేసిన ప్రాజెక్టులు; ప్రముఖ కంపెనీలో చేసిన ఇంటర్న్‌షిప్‌లు, అక్కడ నేర్చుకున్న ప్రొఫెషనల్‌స్కిల్స్‌ వంటి అంశాలను రెజ్యూమ్‌లో హైలెట్‌ చేయాలి.

మీరు పాల్గొన్న వర్క్‌షాప్‌లు, చేసిన ఇండస్ట్రియల్‌ టూర్స్, పూర్తి చేసిన సర్టిఫికేషన్స్‌ ప్రముఖంగా కనిపించేలా చూసుకోవాలి.

వీటితోపాటు చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్, కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు, టెక్నాలజీ పరంగా అప్‌డేట్‌గా ఉన్న విషయాన్ని ఇంటర్వూయ‌ర్‌కు రెజ్యూమ్‌ ద్వారా తెలిసేలా చేయాలి. అప్పుడే ఇంటర్వూ కాల్‌ రావడంతోపాటు ఉద్యోగ సాధనలో ఉపయోగపడుతుంది.


చ‌ద‌వండి: ఏ ఇంటర్వ్యూలోనైన.. విజయం సాధించాలంటే ఇవి త‌ప్ప‌నిస‌రి..!

Published date : 08 Jan 2024 05:54PM

Photo Stories