ఇంటీరియర్ డిజైనింగ్‌తో.. ఎన్నెన్నో అవకాశాలు
అందుబాటులో ఉన్న స్పేస్ (స్థలాన్ని) వినియోగదారుని అభిరుచికి అనుగుణంగా ప్రభావవంతంగా/అందంగా ఉపయోగించుకునే విధంగా డిజైన్‌ను రూపొందించడమే ఇంటీరియర్ డిజైనర్ ప్రధాన విధి. ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అవి..రెసిడెన్షియుల్ డిజైనింగ్‌లో భాగంగా కిచెన్, బాత్ రూమ్ డిజైన్, యునివర్సల్ డిజైన్ వంటి స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. కవుర్షియుల్ ఇంటీరియుర్ డిజైనింగ్‌లో భాగంగా.. ఫర్నిచర్ డిజైన్, హెల్త్‌కేర్ డిజైన్, హాస్పిటాలిటీ డిజైన్, రీటైల్ డిజైన్, వర్క్‌స్పేస్ డిజైన్ వంటి స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు.
ప్రవేశం:
ఇంటీరియుర్ డిజైనింగ్‌కు సంబంధించిన కోర్సులను ఎంచుకోవడం ద్వారా ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న కోర్సులు..
- బీఎస్సీ ఇన్ ఇంటీరియుర్ డిజైనింగ్
- ప్రొఫెషనల్ డిప్లొవూ ఇన్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియుర్ డిజైన్
- వూస్టర్ ఆఫ్ ఇంటీరియుర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్
- ఫౌండేషన్ డిప్లొవూ ఇన్ డి జైన్
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్
- డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్
ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. దానికితోడు ఆకర్షణీయుమైన రంగులు, అందమైన ఆకారాలను ఎంపికచేయుగల నైపుణ్యం ఉంటే.. అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది.
కావల్సిన స్కిల్స్:
ఇంటీరియుర్ డిజైనింగ్ కెరీర్‌లో రాణించాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు తప్పనిసరి. అవి..
- డిజైన్‌స్కిల్స్
- కమ్యూనికేషన్ స్కిల్స్
- మేనేజ్‌మెంట్ స్కిల్స్
- డ్రాయింగ్ అప్టిట్యూడ్
- కోఆర్డినేషన్ స్కిల్స్
- పరిశీలనా నైపుణ్యాలు
- జట్టుగా పని చేసే నేర్పు
- విశ్లేషణ సామర్థ్యం
- కలర్ సెన్స్
వీటికి తోడు (ఆటో క్యాడ్), 3డీ స్టూడియో మ్యాక్స్, ఫోటోషాప్, స్కెచప్, ఆడోబ్ ఇలస్ట్రేటర్ వంటి కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లలో నైపుణ్యం సాధిస్తే కెరీర్‌లో తొందరగా స్థిరపడొచ్చు. అంతేకాకుండా ఆర్కిటెక్చర్/ఇంటీరియర్ డిజైన్ ఫార్మ్ నుంచి అప్రెంటీషిప్ పూర్తి చేయడం కూడా లాభిస్తుంది.
అవకాశాలు:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగం ఊపు మీద ఉండడంతో రెసిడెన్షియుల్, కవుర్షియుల్ రంగాల్లో నిపుణులైన ఇంటీరియుర్ డిజైనర్లకు ఎంతో డివూండ్ ఏర్పడింది. లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల కారణంగా ఒకప్పుడు నగరాలకు పరిమితమైన ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్.. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించింది. దీంతో ఇంటీరియర్ డిజైనర్లకు అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు. ఇంటీరియుర్ డిజైన్ కోర్సులను పూర్తి చేస్తే పలు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో ఇంటీరియర్ డిజైనర్‌గా ఆకర్షణీయు వేతనంతో చక్కని ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇంటీరియుర్ డిజైనర్లు కేవలం ఇళ్లు/రెసిడెన్షియల్ వ్యవహారాలకే పరిమితం కాకుండా కవుర్షియుల్ స్పేస్‌లో డిజైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ల్యాండ్‌స్కేప్, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, విజువల్ మార్కండైజింగ్, షో రూమ్స్, ఎగ్జిబిషన్స్, హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్, హాస్పిటాలిటీ కంపెనీలు, వెల్‌నెస్ సెంటర్లు, ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ వంటి నిర్మాణాల్లో అందుబాటులోని స్థలాన్ని ప్రభావవంతంగా తీర్చిదిద్దడంలో ఇంటీరియర్ డిజైనర్స్ పాత్ర కీలకంగా ఉంటోంది.
జాబ్ ప్రొఫైల్స్:
- ఇంటీరియర్ డిజైనర్
- కన్సల్టెంట్
- ఎగ్జిబిషన్ డిజైనర్
- ఫర్నీచర్ డిజైనర్
- సెట్ డిజైనర్ (సినిమాలు, టీవీలు)
- రీటైల్ ఎన్విరాన్‌మెంట్ డిజైనర్
- బిల్డింగ్/కన్‌స్ట్రక్షన్ కంపెనీలు
- టౌన్ ప్లానింగ్/సిటీ ప్లానింగ్ బ్యూరోస్
- హోటల్స్/హెల్త్ రిసార్ట్స్
- డిజైన్ స్టూడియోస్/ఎగ్జిబిషన్ సొసైటీస్
- ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు
- ఆర్కిటెక్చర్ ఫార్మ్స్
- రియాల్టీ కంపెనీలు
- ఫిల్మ్/టీవీ ప్రొడక్షన్ హౌసెస్
వేతనాలు:
ఇంటీరియుర్ డిజైనర్ల వేతనాలు వ్యక్తిగత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయుంలో అనుభవం కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది. నెల వారీగా తీసుకుంటే రిక్రూట్ చేసుకున్న కంపెనీని బట్టి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు లభిస్తుంది. అనుభవం ఆధారంగా నెలకు రూ. 50 వేల నుంచి రూ. 75 వేల వరకు పొందొచ్చు. స్వయం ఉపాధి దిశగా ఆలోచన ఉంటే సొంతంగా ఇంటీరియర్ డిజైన్ స్టూడియో/కన్సల్టెన్సీని ప్రారంభించవచ్చు. రెసిడెన్షియుల్ ప్రాజెక్టుల విషయుంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ డిజైనర్లు పని గంటల ఆధారంగా వేతనం పొందుతారు. కొన్ని చోట్ల ఫర్నిచర్, లైటింగ్, ఆర్ట్‌వర్క్‌లతో పాటు ఇతన డిజైనింగ్ సామాగ్రి మొత్తం విలువలో కొంత శాతాన్ని కూడా చెల్లించాలని కోరుతుంటారు. కవుర్షియుల్ ప్రాజెక్టుల విషయుంలో కొన్నిసార్లు పనిగంటలపై ఆధారపడి చెల్లింపులు ఉంటాయి. లేదా మొత్తం ప్రాజెక్టుకు గానూ కొంత ఫీజును ముందే కేటాయిస్తారు.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
- జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ -హైదరాబాద్.
కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్) మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఇంటీరియర్ డిజైన్ స్పెషలైజేషన్)
వివరాలకు: www.jnafau.ac.in
- హమ్స్ టెక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్-హైదరాబాద్.
కోర్సులు: డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్
డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్.
వివరాలకు: www.hamstech.com
- లకోటియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్-హైదరాబాద్.
కోర్సులు: బీఎస్సీ ఇన్ ఇంటీరియర్ డిజైన్
బీఏ(ఆనర్స్) డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్
అడ్వాన్‌స్డ్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్
పీజీ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్
డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజై నింగ్ (స్పెషలై జేషన్)
వివరాలకు: www.lakhotiainstituteofdesign.com
- జాతీయ స్థాయిలో ఇన్‌స్టిట్యూట్‌లు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్
కోర్సులు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్)
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్)
వివరాలకు: www.nid.edu
- స్కూల్ ఆఫ్ ఇంటీరియుర్ డిజైనింగ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ టెక్నాలజీ (సీఈపీటీ), అహ్మదాబాద్.
వెబ్‌సైట్: www.cept.ac.in/
- జేజే స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్-ముంబై
వివరాలకు: jjiaa.org
- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ సెన్సైస్, కోల్‌కతా
వెబ్‌సైట్: www.birlainstitute.net