Skip to main content

JET: జెట్‌తో రంగుల ప్రపంచంలోకి..

చలన చిత్ర, టెలివిజన్‌(టీవీ) రంగాల్లో ప్రవేశించాలనుకునే యువత సంఖ్య పెరుగుతోంది. వీరి కలలను సాకారం చేసేలా పుణేలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ), కోల్‌కతాలోని సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) శిక్షణ అందిస్తున్నాయి. ఫిలిం, టీవీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వివిధ కోర్సులను రూపొందించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రంగుల ప్రపంచంలో రాణించేలా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఎఫ్‌టీఐఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐల్లో ప్రవేశాలకు ఏటా జాతీయ స్థాయిలో జాయింట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(జెట్‌)ను నిర్వహిస్తున్నారు. ఇటీవల జెట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో..జెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, ప్రవేశ విధానం, పరీక్ష స్వరూపం, ప్రిపరేషన్, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం..
JET
జెట్‌తో రంగుల ప్రపంచంలోకి..

దేశంలోని ప్రతిష్టాత్మక ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లు.. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ)–పుణే, సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ)–కోల్‌కతా. ఇవి అందించే పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి జెట్‌స్కోరు తప్పనిసరి. జెట్‌–2021లో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. తర్వాతి దశలో కోర్సులను అనుసరించి ఇంటర్వూ్య తదితర ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాయి. వాటిల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఫుల్‌టైం రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సులు

  • జెట్‌–2021 ద్వారా ఎఫ్‌టీఐఐ, ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ ప్రవేశాలు కల్పించే పీజీ డిప్లొమా/పీజీ సర్టిఫికెట్‌ కోర్సులను మూడు గ్రూపులుగా విభజించారు. అభ్యర్థులు ఒక్కో గ్రూపు నుంచి ఒక్కో కోర్సు చొప్పున గరిష్టంగా మూడు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు
  • గ్రూప్‌–ఎలో.. ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌(మూడేళ్లు), యానిమేషన్‌ సినిమా(మూడేళ్లు), ఆర్ట్‌ డైరెక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌(మూడేళ్లు), స్క్రీన్‌ యాక్టింగ్‌(రెండేళ్లు), స్క్రీన్‌ రైటింగ్‌(ఫిల్మ్, టీవీ, వెబ్‌ సిరీస్‌)(రెండేళ్లు), ఎలక్ట్రానిక్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌(రెండేళ్లు) ఉన్నాయి.
  • గ్రూప్‌–బిలో.. డైరెక్షన్‌ అండ్‌ స్క్రీన్‌ప్లే రైటింగ్‌    (మూడేళ్లు), సినిమాటోగ్రఫీ (మూడేళ్లు), ఎడిటింగ్‌(మూడేళ్లు), సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ డిజైన్‌(మూడేళ్లు) కోర్సులు అందిస్తున్నారు.
  • గ్రూప్‌–సిలో.. డైరెక్షన్‌ అండ్‌ ప్రొడ్యూసింగ్‌ ఫర్‌ ఈడీఎం(రెండేళ్లు), డైరెక్షన్‌(ఏడాది),సినిమాటోగ్రఫీ ఫర్‌ ఈడీఎం(రెండేళ్లు), ఎలక్ట్రానిక్‌ సినిమాటోగ్రఫీ(ఏడాది), ఎడిటింగ్‌ ఫర్‌ ఈడీఎం(రెండేళ్లు), వీడియో ఎడిటింగ్‌(ఏడాది),సౌండ్‌ ఫర్‌ ఈ డీఎం(రెండేళ్లు), సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజనీరింగ్‌(ఏడాది), రైటింగ్‌ ఫర్‌ ఈడీఎం (రెండేళ్లు) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు

  • ఆర్ట్‌ డైరెక్షన్, ప్రొడక్షన్‌ డిజైన్‌ కోర్సులు మినహా ఇతర కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్‌ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులే.
  • ఆర్ట్‌ డైరెక్షన్, ప్రొడక్షన్‌ డిజైన్‌ కోర్సులకు అప్లయిడ్‌ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఇంటీరియర్‌ డిజైన్‌/సంబంధిత విభాగాల్లో ఫైన్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసిన వారు లేదా తత్సమాన అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం

  • జాయింట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(జెట్‌)ను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. మొత్తం మార్కులు 100. రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరు కాలవ్యవధి 90 నిమిషాలు, ప్రతి పేపరుకు కేటాయించిన మార్కులు 50.
  • పేపర్‌–1: దీనిలో పార్ట్‌–ఎ, పార్ట్‌–బి ఉంటాయి.
  • పార్ట్‌–ఎలో..20 మార్కులకు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు(ఎంసీక్యూ) అడుగుతారు. ఆయా ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని సరైన సమాధానాన్ని గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
  • పార్ట్‌–బిలో..30 మార్కులకు 15మల్టిపుల్‌ సెలక్ట్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు(ఎంఎస్‌క్యూ) ఇస్తారు. ఈ విభాగంలో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్‌ను ఎంచుకొని సమాధానాలు గుర్తించాలి. అభ్యర్థి సమాధానాలను బట్టి ఒక్కో ప్రశ్నకు 0.5, 1, 1.5, 2 చొప్పున మార్కులను కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
  • ఎంసీక్యూ, ఎంఎస్‌క్యూలకు ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు రాయాలి.
  • పేపర్‌–2: ఈ పేపర్‌ను అభ్యర్థుల సినిమా వ్యక్తీకరణ సామర్థ్యాలను, నైపుణ్యాలను పరీక్షించేలా రూపొందిస్తారు. 50 మార్కులకు వివరణాత్మక సమాధాన తరహా(డిస్క్రిప్టివ్‌ ఆన్సర్‌ టైప్‌) ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది.

ప్రిపరేషన్

  • జెట్‌లో విజయం సాధించాలంటే.. సినిమా కళ, క్రాఫ్ట్, టీవీ, అనుబంధ కళలు, సాహిత్యంపై పూర్తిస్థాయి పట్టు పెంచుకోవాలి. వాటì తోపాటు పర్యావరణ అవగాహన, కళలు–సంస్కృతి, మీడియా మొదలైన అంశాలపై దృష్టిసారించాలి.
  • జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించడానికి జాతీయ /అంతర్జాతీయ పరిణామాలు, వార్తల్లో వ్యక్తులు, క్రీడలపై అవగాహన అవసరం. అంతేకాకుండా భారత చరిత్ర, ఇండియన్‌ పాలిటీ, భారత ఆర్థిక వ్యవస్థ, భారత భౌగోళిక శాస్త్రం, ప్రపంచ భూగోళశాస్త్రం, ఎకానమీ, పుస్తకాలు–రచయితలు, అవార్డులు, సైన్స్‌–ఆవిష్కరణలు, ముఖ్యమైన రోజులు, మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నలను సాధన చేయాలి.

కెరీర్‌ అవకాశాలు

దేశంలో చలనచిత్ర రంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కోవిడ్‌ పరిణామాల అనంతరం ఓటీటీ వేదికలపై చిత్రాలకు, డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. రానున్న పదేళ్లలో దేశంలో ఫిల్మ్‌ మేకింగ్‌ రంగంలో కెరీర్‌ అవకాశాలు 10 శాతం వరకు పెరుగుతాయని అంచనా. నైపుణ్యం, కొత్తదనం, కళాత్మక సామర్థ్యాలు ఉన్నవారికి ఈ రంగంలో అవకాశాలకు కొదవలేదు. అభిరుచులకు అనుగుణంగా చిత్ర నిర్మాణం, యానిమేషన్, ఆర్ట్‌ డైరెక్షన్, నటన, రచన, మీడియా మేనేజ్‌మెంట్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ విభాగాల్లో కోర్సులు అభ్యసించిన వారికి చిత్ర పరిశ్రమలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి.

జెట్‌–2021–ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 02.12. 2021
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: 2021 డిసెంబర్‌ 8 నుంచి 17 వరకు;
  • పరీక్ష తేదీ–గ్రూప్‌ ఎ: 2021 డిసెంబర్‌ 18
  • పరీక్ష తేదీ–గ్రూప్‌ బి: 2021 డిసెంబర్‌ 19
  • పరీక్ష తేదీ–గ్రూప్‌ సి: 2021 డిసెంబర్‌ 19
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
  • వెబ్‌సైట్‌: https://applyjet2021.in
  • ఎఫ్‌టీఐఐ వెబ్‌సైట్‌: www.ftii.ac.in
  • ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ వెబ్‌సైట్‌: www.srfti.ac.in/li>

చదవండి:

సంగీత సాగరంలో ఓలలాడించే.. డీజే

కళాత్మక కెరీర్‌కు మార్గాలు...

కాలు కదిపితే కాసులు రాల్చే కెరీర్.. డ్యాన్సింగ్

Published date : 29 Nov 2021 03:42PM

Photo Stories