కళాత్మక కెరీర్‌కు మార్గాలు...
Sakshi Education
మనిషి హృదయానందానికి తోడ్పడే కళలు.. లలిత కళలు (Fine Arts)! ఒక చేత్తో ఇతరులకు ఆనందాన్ని పంచుతూ, మరో చేత్తో కెరీర్‌ను అందంగా మలచుకునే అవకాశాన్ని ఫైన్ ఆర్ట్స్ కల్పిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాలకు భిన్నంగా, కళాత్మక రంగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారికి వేదికలుగా నిలుస్తున్నాయి. వివిధ సంప్రదాయ, అధునాతన కోర్సులకు సంబంధించి ఉన్నత కళాశాలల్లో సీట్లు పొందడానికి, ఆపై కొలువులను సొంతం చేసుకునేందుకు విపరీతమైన పోటీ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ముందున్న ప్రత్యామ్నాయ కెరీర్ అవకాశాల్లో ఫైన్ ఆర్ట్స్ ముందు వరుసలో ఉన్నాయి.
ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్‌ప్చర్ (శిల్పం), అప్లైడ్ ఆర్ట్, సంగీతం, నృత్యం తదితర కోర్సులు ఫైన్ ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు కోర్సులున్నాయి. ఆఫర్ చేసే విద్యా సంస్థను బట్టి ప్రవేశ అర్హతలు, ఎంపిక విధానం, కాల వ్యవధి మారుతుంటాయి.
కళాత్మక విద్యకు కేరాఫ్ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ).. ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు పెట్టింది పేరు. ఇవి ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి అందిస్తున్న కోర్సులు..
బీఎఫ్‌ఏ
(రెగ్యులర్ ట్యూషన్ ఫీజు: ఏడాదికి రూ.10 వేలు)
నోట్: అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఫొటోగ్రఫీలతో పాటు యానిమేషన్ కోర్సులను సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ కింద కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫీజు ఏడాదికి రూ.35 వేలు.
ప్రవేశాలు: జేఎన్‌ఏఎఫ్‌ఏయూ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. బీఎఫ్‌ఏ (పెయింటింగ్, స్కల్‌ప్చర్, అప్లయిడ్ ఆర్ట్, యానిమేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు మూడు పేపర్లు ఉంటాయి. అవి ఆబ్జెక్ట్ డ్రాయింగ్, మెమరీ డ్రాయింగ్ కలరింగ్, కామన్ ఆబ్జెక్టివ్ పేపర్ (జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్, జనరల్ ఆర్ట్ ఓరియెంటెడ్). బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)కు కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్; ఆబ్జెక్టివ్ పేపర్లు రాయాలి. ఈ ఏడాది ఎంట్రన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 31 (అపరాధ రుసుం లేకుండా).
పీజీ కోర్సులు: ఎంఎఫ్‌ఏ అప్లయిడ్ ఆర్ట్, ఎంఎఫ్‌ఏ పెయింటింగ్, ఎంఎఫ్‌ఏ స్కల్‌ప్చర్, ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ కోర్సులున్నాయి. యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ ద్వారా మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) పరిధిలోని శ్రీ వేంకటే శ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
బీఎఫ్‌ఏ
ప్రవేశాలు: సాధారణంగా ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను మే చివరి వారం/జూన్ మొదటి వారంలో విడుదల చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్‌లకు వేర్వేరుగా నిర్వహించే పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ (స్కెచింగ్ నైపుణ్యాన్ని పరీక్షించే); కలర్ డిజైన్; సంబంధిత సబ్జెక్టుపై పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి పలు కోర్సులను అందిస్తోంది. అవి..
ఎంఏ మ్యూజిక్:
వీణ, గాత్రం(వోకల్) విభాగాల్లో 10 చొప్పున సీట్లున్నాయి.
అర్హత: వోకల్ మ్యూజిక్ లేదా వీణ మ్యూజిక్ ఒక ప్రధాన సబ్జెక్టుగా గుర్తింపు పొందిన డిగ్రీ/ ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు వోకల్ లేదా వీణ మ్యూజిక్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్/ ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు ఆలిండియా రేడియో క్లాసికల్ మ్యూజిక్ ఆడిషన్ బోర్డు నుంచి వోకల్ లేదా వీణలో గ్రేడింగ్.
కరిక్యులం: రెండేళ్ల కాల వ్యవధి కలిగిన కోర్సులో మ్యూజికాలజీ అండ్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్; మనోధర్మ సంగీత, రాగ ఆలాపన వంటి అంశాలు కరిక్యులంలో ఉంటాయి.
ఎంఏ (భరతనాట్యం):
ఎంఏ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఈ కోర్సులో మొదటి మూడేళ్లు మ్యూజిక్, డ్యాన్స్ సబ్జెక్టులు ఉమ్మడిగా ఉంటాయి. తర్వాత రెండేళ్లు వీణ/ వోకల్/ భరతనాట్యంలలో ఏదో ఒక స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2. డిగ్రీ ఉండి గురువు వద్ద శిక్షణ పొందుతున్న వారికి నేరుగా నాలుగో ఏడాదిలో ప్రవేశం కల్పిస్తారు.
ఎంపిక విధానం: యూనివర్సిటీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈవినింగ్ కోర్సులు: విశ్వవిద్యాలయం రెండేళ్ల కాల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అవి..
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ప్రముఖ విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయంలోని లలితకళా పీఠం వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
సంగీత శాఖ: పీహెచ్‌డీ- కర్ణాటక సంగీతం; కళాప్రవేశిక- కర్ణాటక సంగీతం (గాత్రం/మృదంగం/ వీణ/ వయోలిన్/ వేణువు/నాదస్వరం/డోలు); కళాప్రవేశిక- భక్తి సంగీతం; డిప్లొమా-లలిత సంగీతం; డిప్లొమా-హరికథ; ప్రాథమిక -మనోధర్మ సంగీతం; ప్రవీణ-మనోధర్మ సంగీతం.
నృత్య శాఖ: పీహెచ్‌డీ నృత్యం; డిప్లొమా- కూచిపూడి/ ఆంధ్ర నాట్యం; డిప్లొమా-యక్షగానం; డిప్లొమా- సాత్వికాభినయం; కళాప్రవేశిక- కూచిపూడి నృత్యం.
జానపద కళల శాఖ: పీహెచ్‌డీ జానపద కళలు; పీజీ డిప్లొమా-జానపద సంగీతం; పీజీ డిప్లొమా-జానపద నృత్యం; సర్టిఫికెట్- జానపద సంగీతం; సర్టిఫికెట్- జానపద నృత్యం; సర్టిఫికెట్- జానపద వాద్యం తదితర కోర్సులు.
దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ: మే 30, 2014.
ప్రవేశ పరీక్షల తేదీలు: జూన్ 23 నుంచి జూన్ 30 వరకు.
వెబ్‌సైట్: www.teluguuniversity.ac.in
ముఖ్య కోర్సులు - కెరీర్ అవకాశాలు
అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్
ఫొటోగ్ర ఫీ కోర్స్ చేసిన వారికి అవకాశాలకు కొదవ లేదు. ఫొటో జర్నలిస్టులకు వివిధ పత్రికలు, టీవీ చానెళ్లలో అవకాశాలుంటాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్స్‌ను బట్టి వివిధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ సంస్థలు తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. మంచి నైపుణ్యం ఉంటే నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌస్‌లలో కూడా అవకాశాలను అందుకోవచ్చు. సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కూడా పని చేయవచ్చు.
పెయింటింగ్
నైపుణ్యం, సృజనాత్మకతల ఆధారంగా వేతనాలు లభిస్తాయి. అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్/అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్/గ్రాఫిక్ డిజైనర్/విజువలర్స్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం లభిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ-లెర్నింగ్ బిజినెస్ సంస్థల్లో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది.
ప్రముఖ సంస్థలు
ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్‌ప్చర్ (శిల్పం), అప్లైడ్ ఆర్ట్, సంగీతం, నృత్యం తదితర కోర్సులు ఫైన్ ఆర్ట్స్ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రంలో జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ), ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు కోర్సులున్నాయి. ఆఫర్ చేసే విద్యా సంస్థను బట్టి ప్రవేశ అర్హతలు, ఎంపిక విధానం, కాల వ్యవధి మారుతుంటాయి.
కళాత్మక విద్యకు కేరాఫ్ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ).. ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు పెట్టింది పేరు. ఇవి ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి అందిస్తున్న కోర్సులు..
బీఎఫ్‌ఏ
కోర్సు | అర్హత | రెగ్యులర్ సీట్లు | కాల వ్యవధి |
అప్లైడ్ ఆర్ట్స్ | ఇంటర్/తత్సమానం | 35 | 4 సం. |
పెయింటింగ్ | ఇంటర్/తత్సమానం | 20 | 4 సం. |
స్కల్‌ప్చర్ | ఇంటర్/తత్సమానం | 10 | 4 సం. |
ఫొటోగ్రఫీ | ఇంటర్/తత్సమానం | 30 | 4 సం. |
నోట్: అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఫొటోగ్రఫీలతో పాటు యానిమేషన్ కోర్సులను సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్ కింద కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫీజు ఏడాదికి రూ.35 వేలు.
ప్రవేశాలు: జేఎన్‌ఏఎఫ్‌ఏయూ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. బీఎఫ్‌ఏ (పెయింటింగ్, స్కల్‌ప్చర్, అప్లయిడ్ ఆర్ట్, యానిమేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు మూడు పేపర్లు ఉంటాయి. అవి ఆబ్జెక్ట్ డ్రాయింగ్, మెమరీ డ్రాయింగ్ కలరింగ్, కామన్ ఆబ్జెక్టివ్ పేపర్ (జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్, జనరల్ ఆర్ట్ ఓరియెంటెడ్). బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)కు కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్; ఆబ్జెక్టివ్ పేపర్లు రాయాలి. ఈ ఏడాది ఎంట్రన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 31 (అపరాధ రుసుం లేకుండా).
పీజీ కోర్సులు: ఎంఎఫ్‌ఏ అప్లయిడ్ ఆర్ట్, ఎంఎఫ్‌ఏ పెయింటింగ్, ఎంఎఫ్‌ఏ స్కల్‌ప్చర్, ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ కోర్సులున్నాయి. యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ ద్వారా మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- జేఎన్‌ఏఎఫ్‌ఏయూ బ్రిడ్జ్ కోర్సు(ఫొటోగ్రఫీ)ను కూడా ఆఫర్ చేస్తోంది.
అర్హత: డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ. యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. దీంతో పాటు వర్సిటీ.. పార్ట్ టైం కోర్సులనూ ఆఫర్ చేస్తోంది.
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్) పరిధిలోని శ్రీ వేంకటే శ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
బీఎఫ్‌ఏ
కోర్సు | అర్హత | రెగ్యులర్ సీట్లు | కాల వ్యవధి |
ఫొటోగ్రఫీ, డిజిటల్ ఆర్ట్ | ఇంటర్/తత్సమానం | 50 | 3 సం. |
పెయింటింగ్ | ఎస్‌ఎస్‌సీ/తత్సమానం | 50 | 5 సం. |
అప్లైడ్ ఆర్ట్స్ | ఎస్‌ఎస్‌సీ/తత్సమానం | 60 | 5 సం. |
- 120 మార్కులకు ఫొటోగ్రఫీ కోర్సుకు నిర్వహించే ఆప్టిట్యూడ్ పరీక్షలో ఫొటోగ్రఫీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్, సౌండ్ పెర్‌సెప్షన్, హిస్టరీ అండ్ కల్చర్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ రీజనింగ్‌లతో పాటు కంపోజిషన్ అండ్ విజువలైజేషన్‌పై ప్రశ్నలుంటాయి.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి పలు కోర్సులను అందిస్తోంది. అవి..
ఎంఏ మ్యూజిక్:
వీణ, గాత్రం(వోకల్) విభాగాల్లో 10 చొప్పున సీట్లున్నాయి.
అర్హత: వోకల్ మ్యూజిక్ లేదా వీణ మ్యూజిక్ ఒక ప్రధాన సబ్జెక్టుగా గుర్తింపు పొందిన డిగ్రీ/ ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు వోకల్ లేదా వీణ మ్యూజిక్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్/ ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీతో పాటు ఆలిండియా రేడియో క్లాసికల్ మ్యూజిక్ ఆడిషన్ బోర్డు నుంచి వోకల్ లేదా వీణలో గ్రేడింగ్.
కరిక్యులం: రెండేళ్ల కాల వ్యవధి కలిగిన కోర్సులో మ్యూజికాలజీ అండ్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్; మనోధర్మ సంగీత, రాగ ఆలాపన వంటి అంశాలు కరిక్యులంలో ఉంటాయి.
ఎంఏ (భరతనాట్యం):
- విశ్వవిద్యాలయంలో మొత్తం పది సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: నాట్య విశారదతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డ్యాన్స్/ యూనివర్సిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ/ విశ్వవిద్యాలయం నిర్దేశించే తత్సమాన అర్హతలు.
- కరిక్యులంలో థియరీతో పాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధా న్యం ఉంటుంది. క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్‌లకు సంబంధించిన ఇతర వ్యవస్థల పరిజ్ఞానాన్ని అందిస్తారు.
ఎంఏ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఈ కోర్సులో మొదటి మూడేళ్లు మ్యూజిక్, డ్యాన్స్ సబ్జెక్టులు ఉమ్మడిగా ఉంటాయి. తర్వాత రెండేళ్లు వీణ/ వోకల్/ భరతనాట్యంలలో ఏదో ఒక స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2. డిగ్రీ ఉండి గురువు వద్ద శిక్షణ పొందుతున్న వారికి నేరుగా నాలుగో ఏడాదిలో ప్రవేశం కల్పిస్తారు.
ఎంపిక విధానం: యూనివర్సిటీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈవినింగ్ కోర్సులు: విశ్వవిద్యాలయం రెండేళ్ల కాల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అవి..
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వోకల్ (సెల్ఫ్ ఫైనాన్స్).
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వీణ(సెల్ఫ్ ఫైనాన్స్).
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ భరతనాట్యం (సెల్ఫ్ ఫైనాన్స్).
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కూచిపూడి (సెల్ఫ్ ఫైనాన్స్).
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ట్రెడిషనల్ ఫోక్ మ్యూజిక్ (సెల్ఫ్ ఫైనాన్స్).
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
- బీఎఫ్‌ఏ: నాలుగేళ్ల కాల వ్యవధి గల బీఎఫ్‌ఏ కోర్సుకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు అర్హులు. రెగ్యులర్‌లో 20, సెల్ఫ్ ఫైనాన్స్‌లో 10 మొత్తం 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎంపిక: యూనివర్సిటీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
- రెండేళ్ల వ్యవధి గల ఎంఎఫ్‌ఏ కోర్సుకు బీఎఫ్‌ఏ ఉత్తీర్ణులు అర్హులు. సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో 30 సీట్లుంటాయి. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
- ఎంఏ (డ్యాన్స్): ఈ కోర్సులో సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో పది సీట్లున్నాయి. ఇందులో ప్రవేశాలకు అర్హత: బీఏ డ్యాన్స్/ బీఏ/ బీకామ్/ బీఎస్సీ/ బీసీఏ/ బీఈ/ ఎంబీబీఎస్. డ్యాన్స్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
- ఎంఏ మ్యూజిక్: రెగ్యులర్‌లో ఐదు సీట్లు, సెల్ఫ్ ఫైనాన్స్ విభాగంలో ఐదు మొత్తం 10 సీట్లున్నాయి.
అర్హత: బీఏ మ్యూజిక్ లేదా బి.మ్యూజిక్/ ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మ్యూజిక్‌లో డిప్లొమా/సర్టిఫికెట్. లేదా డిగ్రీతో పాటు ఆల్‌ఇండియా రేడియో ద్వారా కర్ణాటక సంగీతంలో ఏదైనా గ్రేడ్ ఉన్న అభ్యర్థులు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ప్రముఖ విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయంలోని లలితకళా పీఠం వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
- బీఎఫ్‌ఏ (శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్): ఇందులో మొత్తం 25 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. 2011 మార్చిలో గానీ, ఆ తర్వాత గానీ ఇంటర్ ఉత్తీర్ణత/ దేవాదాయ శిల్పకళలో నాలుగేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసుండాలి.
- ఎంఏ- కర్ణాటక సంగీతం (గాత్రం/మృదంగం, వీణ, వయోలిన్): 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి రెండేళ్లు.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక సంగీతంలో డిగ్రీ/ ఏదైనా డిగ్రీతో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థ నుంచి సంగీతంలో (సంబంధిత అంశంలో) డిప్లొమా/ ఏదైనా డిగ్రీతో పాటు సంగీతంలో (సంబంధిత అంశంలో) ఆకాశవాణి బి గ్రేడ్ ఆర్టిస్టు అయుండాలి.
- ఎంపీఏ- కూచిపూడి నృత్యం/ ఆంధ్ర నాట్యం: ఇందులో 20 సీట్లున్నాయి. కోర్సు కాల వ్యవధి రెండేళ్లు.
అర్హత: కూచిపూడి నృత్యంలో డిగ్రీ ఉండాలి. లేదా ఏదైనా డిగ్రీతో పాటు కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సులో ఉత్తీర్ణత/ ప్రసిద్ధ నాట్య సంస్థలలో ఐదేళ్ల ప్రదర్శనానుభవం ఉన్నట్లు సర్టిఫికెట్/ సంబంధిత అంశంలో దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్టు అయి ఉండాలి.
- ఎంపీఏ-జానపద కళలు: ఇందులో 20 సీట్లున్నాయి. కోర్సు కాల వ్యవధి రెండేళ్లు.
అర్హత: జానపద కళల్లో బీఏ డిగ్రీ లేదా తెలుగు రెండో భాషగా బీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీఎఫ్‌ఏ/బీఏ (లాంగ్వేజెస్) ఉత్తీర్ణతతో పాటు జానపద కళలు, రంగస్థల కళలు, సంగీతం, నృత్యాలలో డిప్లొమా లేదా సర్టిఫికెట్/ రేడియో లేదా దూరదర్శన్‌లో జానపద సంగీతం లేదా నృత్యం సర్టిఫికెట్.
సంగీత శాఖ: పీహెచ్‌డీ- కర్ణాటక సంగీతం; కళాప్రవేశిక- కర్ణాటక సంగీతం (గాత్రం/మృదంగం/ వీణ/ వయోలిన్/ వేణువు/నాదస్వరం/డోలు); కళాప్రవేశిక- భక్తి సంగీతం; డిప్లొమా-లలిత సంగీతం; డిప్లొమా-హరికథ; ప్రాథమిక -మనోధర్మ సంగీతం; ప్రవీణ-మనోధర్మ సంగీతం.
నృత్య శాఖ: పీహెచ్‌డీ నృత్యం; డిప్లొమా- కూచిపూడి/ ఆంధ్ర నాట్యం; డిప్లొమా-యక్షగానం; డిప్లొమా- సాత్వికాభినయం; కళాప్రవేశిక- కూచిపూడి నృత్యం.
జానపద కళల శాఖ: పీహెచ్‌డీ జానపద కళలు; పీజీ డిప్లొమా-జానపద సంగీతం; పీజీ డిప్లొమా-జానపద నృత్యం; సర్టిఫికెట్- జానపద సంగీతం; సర్టిఫికెట్- జానపద నృత్యం; సర్టిఫికెట్- జానపద వాద్యం తదితర కోర్సులు.
దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ: మే 30, 2014.
ప్రవేశ పరీక్షల తేదీలు: జూన్ 23 నుంచి జూన్ 30 వరకు.
వెబ్‌సైట్: www.teluguuniversity.ac.in
ముఖ్య కోర్సులు - కెరీర్ అవకాశాలు
అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్
- బీఎఫ్‌ఏ కరిక్యులం: డ్రాయింగ్, కలర్ డిజైన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, హిస్టరీ ఆఫ్ విజువల్ ఆర్ట్, కంప్యూటర్ గ్రాఫిక్స్, గ్రాఫిక్ డిజైన్, టైపోగ్రఫీ, డిజిటల్ పేజ్ లే అవుట్, కంప్యూటర్ డ్రాయింగ్, బేసిక్ ఫొటోగ్రఫీ, అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్ తదితర అంశాలుంటాయి. వీటితో పాటు మినీ ప్రాజెక్టు, ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్ వంటివి ఉంటాయి.
- ఎంఎఫ్‌ఏ కరిక్యులం: హిస్టరీ ఆఫ్ గ్రాఫిక్ డిజైన్, లీగల్ యాస్పెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్, ఇలుస్ట్రేషన్ లేదా గ్రాఫిక్ డిజైన్, విజువలైజేషన్ తదితర అంశాలుంటాయి.
అవకాశాలు: కోర్సులు పూర్తిచేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ), ఐసీఎంఆర్, హోంమంత్రిత్వ శాఖ, డిఫెన్స్, నేషనల్ మ్యూజియమ్స్, సాంస్కృతిక శాఖ, సెన్సస్, విశ్వవిద్యాలయాలు, డీఆర్‌డీఎల్, ఇస్రో, సర్వే ఆఫ్ ఇండియా వంటి వాటిలో అవకాశాలుంటాయి.
- ప్రైవేటు రంగంలో అడ్వర్టైజింగ్ సంస్థలు, ప్యాకేజింగ్ యూనిట్లు, ప్రచురణ సంస్థలు, ఐటీ రంగం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, ఫిల్మ్- మీడియా రంగంలో అవకాశాలుంటాయి.
- ఆర్ట్ డెరైక్టర్
- విజువలైజర్
- గ్రాఫిక్ డిజైనర్, ఇలుస్ట్రేటర్
- వెబ్/ ఇంటరాక్టివ్ డిజైనర్
- క్రియేటివ్ ఆర్ట్ డెరైక్టర్
- సెట్ డిజైనర్..
- బీఎఫ్‌ఏ/ఎంఎఫ్‌ఏ కరిక్యులం: బేసిక్ ఫొటోగ్రఫీ, డిజిటల్ ఫొటోగ్రఫీ, అడ్వర్టైజింగ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, ట్రావెల్ ఫొటోగ్రఫీ, ఫొటో జర్నలిజం వంటి అంశాలుంటాయి.
- ఫొటోగ్రీఫీలో రాణించాలనుకునే వారికి సృజనాత్మకత అనేది చాలా ముఖ్యం. దృశ్యాన్ని అందంగా చిత్రీకరించడంలో కీలకమైన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, లైటింగ్ వంటి అంశాల్లో చక్కని అవగాహన ఉండాలి. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
ఫొటోగ్ర ఫీ కోర్స్ చేసిన వారికి అవకాశాలకు కొదవ లేదు. ఫొటో జర్నలిస్టులకు వివిధ పత్రికలు, టీవీ చానెళ్లలో అవకాశాలుంటాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్స్‌ను బట్టి వివిధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ సంస్థలు తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. మంచి నైపుణ్యం ఉంటే నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌస్‌లలో కూడా అవకాశాలను అందుకోవచ్చు. సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కూడా పని చేయవచ్చు.
పెయింటింగ్
- బీఎఫ్‌ఏ కరిక్యులం: కలర్ డిజైన్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, అప్లైడ్ ఆర్ట్, కంపోజిషన్, ల్యాండ్‌స్కేప్, లైఫ్ స్టడీ, మ్యూ రల్ డిజైన్ తదితర అంశాలుంటాయి. ప్రింట్ మేకింగ్‌లో లిథోగ్రఫీ, వుడ్‌కట్, లినోకట్, ప్లాటోగ్రఫీ, కోలోగ్రఫీ వంటి అంశాలుంటాయి.
- ఎంఎఫ్‌ఏ కరిక్యులం: క్రియేటివ్ పెయింటింగ్, హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్..
అవకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలుంటాయి. విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రచురణ రంగంలో ఇలుస్ట్రేటర్‌గా; ఫిల్మ్ రంగంలో ఆర్ట్ డెరైక్టర్‌గా చేరొచ్చు. ఆర్ట్ క్రిటిక్, ఆర్ట్ హిస్టోరియన్, ఫ్రీలాన్స్ ఆర్టిస్టు, కార్టూనిస్టు, యానిమేటర్, టెక్స్‌టైల్ డిజైనర్ వంటి అవకాశాలు ఉంటాయి.
- బీఎఫ్‌ఏ కరిక్యులం: 3డీ డిజైన్, హెడ్ స్టడీ, లైఫ్ స్టడీ, ఆబ్జెక్ట్ స్టడీ, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, టెర్రాకోట, డ్రాయింగ్, వుడ్‌కట్, స్టెన్సిల్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్, వుడ్ కార్వింగ్, స్టోన్ కార్వింగ్, మెటల్ వెల్డింగ్ వంటి అంశాలు.
- ఎంఎఫ్‌ఏ కరిక్యులం: క్రియేటివ్ స్కల్‌ప్చర్, మెటల్ కాస్టింగ్, సిరామిక్ స్కల్‌ప్చర్, ఆర్ట్ హిస్టరీ అండ్ యాస్థెటిక్స్.
అవకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
- బీఎఫ్‌ఏ కరిక్యులం: స్టోరీ డెవలప్‌మెంట్, డ్రాయింగ్, కలర్ డిజైన్, స్క్రిప్ట్ రైటింగ్, బేసిక్ మోడలింగ్, కంపోజిటింగ్, టెక్చరింగ్, లైటింగ్, ప్రొడక్షన్, రిగ్గింగ్, యాక్టింగ్ ఫర్ యానిమేషన్, క్యారెక్టర్ యానిమేషన్, ఫేషియల్ యానిమేషన్, సౌండ్ ఎడిటింగ్, వీడియో షూటింగ్ అండ్ ఎడిటింగ్ తదితర అంశాలుంటాయి.
కెరీర్ అవకాశాలు: ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ; అడ్వర్టైజింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అవకాశాలుంటాయి. ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ డిజైనింగ్; ప్రోడక్ట్ విజువలైజేషన్; ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్; ఫోరెన్సిక్ సైన్స్; గేమింగ్ సంబంధిత విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
- లే అవుట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ డిజైనర్.
- క్యారెక్టర్ డిజైనర్.
- ఫ్లాష్ అండ్ 3డీ యానిమేటర్.
- మోడలర్
- రిగ్గర్
- టెక్చర్ ఆర్టిస్ట్
నైపుణ్యం, సృజనాత్మకతల ఆధారంగా వేతనాలు లభిస్తాయి. అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలలో సాధారణంగా అసిస్టెంట్/అసిస్టెంట్ ఆర్ట్ డెరైక్టర్/గ్రాఫిక్ డిజైనర్/విజువలర్స్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ దశలో వీరికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం లభిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ-లెర్నింగ్ బిజినెస్ సంస్థల్లో గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది.
ప్రముఖ సంస్థలు
- సర్ జేజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్, ముంబై యూనివర్సిటీ.
- ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఎస్ యూనివర్సిటీ.
- ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్.
- జామియా మిలియా ఇస్లామియా.
- విశ్వభారతి (కోల్‌కతా).
- ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, లక్నో యూనివర్సిటీ.
- ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, అలహాబాద్ యూనివర్సిటీ.
- ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, పాట్నా యూనివర్సిటీ.
- రాజా రవివర్మ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, యూనివర్సిటీ ఆఫ్ కేరళ.
- గోవా కాలేజ్ ఆఫ్ ఆర్ట్.
కెరీర్ అవకాశాలకు కొదవలేదు
ఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి కళాత్మకమైన కెరీర్ అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. జేఎన్‌ఏఎఫ్‌ఏయూలోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్.. అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. కోర్సులు పూర్తిచేసిన వారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. తాజా నియామకాలను పరిశీలిస్తే ఐటీ కంపెనీలు అప్లైడ్ ఆర్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి రూ.25 వేల వేతనంతో జాబ్‌లను ఆఫర్ చేశాయి. ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు పబ్లిక్, ప్రైవేట్ రంగాల్లో డిమాండ్ బాగుంది. అడ్వర్టైజింగ్, మీడియా సంస్థలు, ఆర్ట్ స్టూడియోలు, ప్రచురణ సంస్థలు వంటి వాటిలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ కోర్సులు పూర్తిచేసిన కొందరు సొంతంగా స్టూడియోలను నెలకొల్పి ప్రాక్టీస్ చేసుకుంటూ, మరోవైపు ఉన్నత కోర్సులు చేస్తున్నారు.
కె.సుందర్ కుమార్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్,
కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ,
హైదరాబాద్.

Published date : 22 May 2014 09:37PM