Skip to main content

Ayurvedic System of Medicine: ప్రకృతి వైద్య లైబ్రరీ.. ఇక రీసెర్చ్‌సెంటర్‌

Acharya Gajjala Rameswaram

కేయూ క్యాంపస్‌: ఆయుర్వేద వైద్య విధానంలో ప్రకృతి వైద్య విధానం(నేచురోపతి) ఒక భాగం. 18వ శతాబ్దంలో పలు దేశాల్లో ప్రకృతి వైద్యం ఉన్నత స్థానంలో ఉండేది. సుమారు 25 భాషలలో ఈ వైద్యవిధానంపై పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి వైద్య సాహిత్య విజ్ఞానాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ రిటైర్డ్‌ ఆచార్యుడు గజ్జల రామేశ్వరం హనుమకొండ బ్యాంకు కాలనీలోని తన సొంత భవనంలో అంతర్జాతీయ ప్రకృతివైద్య గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 2018 జూలై 24న జాతీయ గ్రంథాలయంగా ఏర్పాటుచేసి 2020 జూలై 24న అంతర్జాతీయ నేచురోపతి లైబ్రరీగామార్చారు. ఈ క్రమంలో ఈనెల 24న లైబ్రరీ 5వ వార్షికోత్సవం నిర్వహించబోతున్నారు.అదే రోజు ఈ లైబ్రరీని నేచురోపతి రీసెర్చ్‌సెంటర్‌గా కూడా మార్పుచేసి ప్రారంభించబోతున్నారు. అలాగే, తానే రచించిన ‘ఇండెక్స్‌ టూది ఇండియన్‌ ఇండియన్‌ నేచురోపతి’ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు.

వృత్తి రీత్యా ఆచార్యుడు
గజ్జల రామేశ్వరం.. కాకతీయ యూనివర్సిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తూనే ఇతర సమయాల్లో ప్రకృతివైద్య సాహిత్యం సేకరణ చేస్తూ వచ్చారు. 2016 సెప్టెంబర్‌ 30న ఆచార్యుడిగా ఉద్యోగ విరమణ పొందాక తన సొంత భవనంలోనే ఈ నేచురోపతి లైబ్రరీని ఏర్పాటు చేశారు.

CBSE: సీబీఎస్‌ఈ బోధన... ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషలో

లైబ్రరీలో ‘ప్రకృతి’ పుస్తకాలు
ప్రకృతివైద్య సాహిత్యవిజ్ఞాన సంపద.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, కన్నడ, మలయాళీ, మరాఠీ బెంగాలి, మణిపురి , ఫ్రెంచ్‌ భాషల్లో ఉంది. వివిధ రకాల ప్రకృతివైద్యానికి సంబంధించిన పత్రికలు 30వరకు అందుబాటులోఉన్నాయి.

లైబ్రరీలోకి ఉచిత ప్రవేశం
ప్రకృతి వైద్యంపై అవగాహన పెంచుకోవాలనుకునే వారికి ఈలైబ్రరీలో ఉచిత ప్రవేశం ఉంది. ప్రస్తుతం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఎవరైనా లైబ్రరీలో చదువుకోవచ్చు.

పుస్తక ప్రదర్శనలు
రామేశ్వరం.. ప్రకృతివైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్‌ను ఎక్కడ ఈ వైద్యవిధానంపై సెమినార్లు జరిగినా ప్రదర్శిస్తారు. తొలుత 1992 నవంబర్‌లో హనుమకొండలో , 1995లో వరంగల్‌లో, 2022లో డిసెంబర్‌ 23,24తేదీల్లో విజయవాడలో ప్రదర్శించారు.

ప్రకృతివైద్యం.. డ్రగ్‌లెస్‌ థెరఫి

ప్రకృతి వైద్యం.. ఔషధ రహిత చికిత్స. మట్టివట్టీలు, తొట్టిస్నానాలు, జలచికిత్స, సూర్యకిరణ్‌ చికిత్స ఇలాంటి పదాలు ప్రకృతివైద్యంలో ఆచరిస్తారు. ప్రకృతివైద్యం అంటే నీరు, ఆహారం, యోగా, వ్యాయామం.

Arts College Alumni Generosity: ఆర్ట్స్‌ కళాశాల పూర్వ విద్యార్థుల ఔదార్యం

ప్రకృతి వైద్య గ్రంథాల కృషి తెలుగులోనే..
దేశంలో ప్రకృతివైద్య గ్రంథాల కృషి మొదట తెలుగులోనే ప్రారంభమైందని రామేశ్వరం తెలిపారు. ద్రోణంరాజు వెంకటాచలపతి శర్మ ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి అనువదించిన ప్రకృతివైద్యగ్రంథం 1887లో ముద్రణ అయింది.

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డు
హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ మెడికల్‌హెరిటేజ్‌లో 2016 మే 3న ప్రకృతివైద్య అరుదైన పుస్తకాల ప్రదర్శన చేసిన రామేశ్వరానికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు లభించింది. కాగా, ప్రకృతివైద్య సేవలకుగాను న్యూఢిల్లీలో 1999లో రామేశ్వరాన్ని గాంధీ స్మారక ప్రకృతి చికిత్స సమితి వారు సన్మానించి బ్రాంజిమెడల్‌ అందించారు.

నేడు అంతర్జాతీయ ప్రకృతి వైద్య లైబ్రరీ 5వ వార్షికోత్సవం ప్రకృతి వైద్య పరిశోధకుడు గజ్జల రామేశ్వరం.. సొంత ఇంటి భవనంలోనే లైబ్రరీ.. ఉచిత ప్రవేశం

ప్రకృతి వైద్యవిధానాన్ని విశ్వవ్యాప్తం చేయాలి
ప్రకృతివైద్య విధానాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతోనే ఈ అంతర్జాతీయ నేచురోపతి గ్రంథాలయం ఏర్పాటు చేశా. సామాన్య ప్రజానీకం మొదలు.. పరిశోధకులకు అందుబాటులో ఉంచేందుకు ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశా. భారతదేశంలోనే గొప్ప ప్రకృతివైద్య గ్రంథాలయంగా తీర్చిదిద్దేదందుకు రీసెర్చ్‌ సెంటర్‌గా మార్పు చేశా.
–ఆచార్య గజ్జల రామేశ్వరం, ప్రకృతి వైద్య లైబ్రరీ వ్యవస్థాపకుడు
 

 

Health Minister Harish Rao: మెడికల్‌ కాలేజీకి యాదాద్రీశుడి పేరు!

Published date : 24 Jul 2023 03:23PM

Photo Stories