CBSE: సీబీఎస్‌ఈ బోధన... ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషలో
Sakshi Education
భువనేశ్వర్: ఉన్న సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) స్కూళ్లలో విద్యార్థులు ఇకపై తెలుగుతో పాటు 22 భారతీయ భాషల్లో చదువుకోవచ్చు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 23న ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం వాటిల్లో హిందీ, ఇంగ్లిష్ మీడియాల్లో మాత్రమే చదువుకునేందుకు వీలుంది. ఇకపై రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తించిన తెలుగు, బెంగాలీ, కన్నడ, కొంకణి, మరాఠీ, పంజాబీ, సంస్కృతం, తమిళం, మైథిలి, డోగ్రీ వంటి 22 భాషల్లో తమకిష్టమైన వాటిలో చదువుకోవచ్చు. పరీక్షలు కూడా ఆయా భాషల్లోనే జరుగుతాయి.
చదవండి:
CBSE Board Exams 2024: పరీక్షల షెడ్యూల్ విడుదల... ఈ సారి 55 రోజులు!
Published date : 24 Jul 2023 01:07PM