ఓపెన్ ఎంబీఏ చదవాలనుకునే వారికి సదావకాశం.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఇగ్నో
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఓపెన్ మ్యాట్ పరీక్ష ద్వారా ఇగ్నో ఎంబీఏలో ప్రవేశాలను కల్పిస్తోంది. ఈ∙నేపథ్యంలో ఎన్టీఏ ఓపెన్ మ్యాట్ – 2020 పరీక్ష, దరఖాస్తు విధానం, సిలబస్ వివరాలు..
ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా..
సమాజంలోని అన్ని వర్గాల వారికి నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలను దూర విద్య ద్వారా అందించాలనే లక్ష్యంతో ఇందిరా గాం«ధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ని ఏర్పాటు చేశారు. 1985లో ఇగ్నో యాక్ట్ ద్వారా న్యూఢిల్లీ కేంద్రంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీదుగా ఈ యూనివర్సిటీని స్థాపించారు. ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీగా గుర్తింపు పొందిన ఇగ్నో పలు యూజీ, పీజీ, పీహెచ్‌డీ తదితర కోర్సులతో పాటు ఎంబీఏనూ అందిస్తోంది.
ప్రతిభ చూపినవారికి ప్రవేశం..
ఇగ్నో అందించే ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష..∙ఓపెన్ మ్యాట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇగ్నో రెండేళ్ల ఎంబీఏ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.
అర్హతలు ఇవి..
జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అందుబాటులో పలు రకాల స్పెషలైజేషన్స్
ఇగ్నో ఎంబీఏలో పలు రకాల స్పెషలైజేషన్స్‌ను అందిస్తోంది. వాటిలో హెచ్‌ఆర్‌ఎం, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ వంటి స్పెషలైజేషన్స్‌తో కోర్సులను అందిస్తోంది.
ఆన్‌లైన్‌లో పరీక్ష
ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్(కంప్యూటర్ బేస్ట్ టెస్ట్) విధానంలో ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల నుంచి 200 ప్రశ్నలకు 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ అవేర్‌నెస్ 30 ప్రశ్నలు–30 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, రీజనింగ్ 70–70 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవు.
సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి..
పరీక్ష ప్రిపరేషన్ మొదలు పెట్టేముందు అభ్యర్థులు సిలబస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ పరీక్ష సంబంధించి మొత్తం నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
జనరల్ అవేర్‌నెస్ :
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు, ప్రముఖుల పేర్లు, రాజ్యాంగం, చట్టాలు, రాష్ట్రాలు, చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక అంశాలు, శిఖరాలు, రాజకీయాలు, దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రముఖ నాయకులు, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ప్రాథమిక అంశాలు, విదేశాల నుంచి దిగుమతి, ఎగుమతి చేసే వస్తువులు, దేశ వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.
రీజనింగ్ :
సింబల్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ట్రీ, స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, అసెర్సన్ అండ్ రీజన్స్, కాస్ అండ్ ఎఫెక్ట్, విజువల్ రీజనింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, క్రిటికల్ రీజనింగ్ అంశాలపై దృష్టి పెట్టాలి.
క్యాంటిటేటివ్ ఎబిలిటీ :
నంబర్ సిస్టమ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఎల్‌సీఎమ్, హెచ్‌సీఎఫ్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, మీన్, మోడ్, మీడియన్, ఆల్‌జీబ్రా, స్టాటిస్టిక్స్, పర్ముటేషన్, కాంబినేషన్, అర్థమెటిక్, ప్రొగ్రెషన్, జామెట్రీ, జామెట్రిక్ ప్రొగ్రెషన్, ట్రిగ్నోమెట్రీ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ :
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, గ్రామర్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ ఫైండింగ్, జంబుల్డ్ సెంటెన్స్, ప్రిపోజిషన్, వన్ వర్డ్ సబ్స్‌ట్యూషన్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, సినోనియమ్స్, యాంటోనియమ్స్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రిపరేషన్ ఇలా..
ఓపెన్ మ్యాట్ పరీక్షకు అర్హత సాధించాలని కోరుకునే వారు మొదట పరీక్ష తీరుతెన్నులు తెలుసుకోవాలి. పరీక్ష సిలబస్ ప్రకారం అభ్యర్థులు వ్యక్తిగత ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ప్రతీ సబ్జెక్టుకు కొంత సమయం కేటాయించుకునేలా టైం టేబుల్ సిద్ధం చేసుకోవాలి. ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానం ఇచ్చే విధంగా సబ్జెక్టుపై పట్టు సాధించాలి. అలాగే ఆయా సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి వాటిని ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయడం మంచిది. జనరల్ అవేర్‌నెస్ సంబంధించి మంచి మార్కులు సాధించడానికి రోజు వార్తా పత్రికలు, టీవీలో వార్తలు చూడటం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. క్రీడలు, రాజకీయాలు, పుస్తకాలు–రచయితలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు వంటి వాటిపైన అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టీస్ చేసిన ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేయాలి. దీంట్లో నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మంచిది.
దరఖాస్తు ఫీజు ఇలా..
ఇగ్నో ఓపెన్ మ్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
- దరఖాస్తు చివరి తేదీ: 23 మార్చి 2020
- ఎడిట్ ఆప్షన్: 28–29 మార్చి 2020
- అడ్మిట్ కార్డ్‌ల జారీ: 09 ఏప్రిల్ 2020
- పరీక్ష తేదీ: 29 ఏప్రిల్ 2020
- ఫలితాలు: మే 2020
- వెబ్‌సైట్: www.ignou.ac.in
- https://ignouexams.nta.nic.in