మాతృభూమి సేవలో.. ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ
Sakshi Education
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్ అకాడెమీల్లో ప్రవేశానికి యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ) అండ్ నేవల్ అకాడెమీ (ఎన్‌ఏ) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో విజయం సాధించినవారు బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్‌కు బాటలు వేసే ఎన్‌డీఏ-ఎన్‌ఏ ఎగ్జామ్ వివరాలు..
రాత పరీక్ష విధానం:
ఇందులో రెండు పేపర్లుంటాయి. అవి.. 1. మ్యాథ్స్ (300 మార్కులు), 2. జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). రెండో పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా పార్ట్-ఏ, పార్ట్-బీ అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో ఇంగ్లిష్ 200 మార్కులకు, పార్ట్-బీలో జనరల్ నాలెడ్జ్ 400 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి రెండున్నర గంటలు.
మొత్తం ఖాళీలు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2014
పేపర్-1 మ్యాథ్స్
దీనికి మూడొందల మార్కులు ఉంటాయి. ఆల్జీబ్రాలో భాగంగా కాన్సెప్ట్స్ ఆఫ్ సెట్, వెన్ చిత్రాలు, డీ మోర్గాన్ లా, రిలేషన్, ఈక్వలెన్స్ రియాక్షన్స్‌పై ప్రశ్నలుంటాయి. కాంప్లెక్స్ నంబర్స్- బేసిక్ ప్రాపర్టీస్, మాడ్యూల్స్, ఆర్గ్యుమెంట్, కూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, బైనరీ సిస్టమ్స్ ఆఫ్ నంబర్స్, క్వాడ్రియాటిక్ ఈక్వేషన్స్, జియోమెట్రిక్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్‌ల నుంచి ప్రశ్నలడుగుతారు. మ్యాట్రిసెస్ అండ్ డెటర్మినెంట్స్‌లో భాగంగా బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మెంట్స్‌పై ప్రశ్నలుంటాయి. ఇంకా ట్రిగ్నామెట్రీ, ఎనలిటికల్ జియోమెట్రీ ఆఫ్ టూ అండ్ త్రీ డెమైన్షన్స్, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రెల్ కాలిక్యులస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబులిటీల నుంచి ప్రశ్నలడుగుతారు. ఈ పరీక్ష స్థాయి ఇంటర్మీడియెట్ కాబట్టి సంబంధిత తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన భావనలను, ప్రాథమిక అంశాలను, వివిధ సూత్రాలను బాగా చదవాలి. అదేవిధంగా వివిధ సూత్రాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం ప్రాక్టీస్ చేయాలి. రెండో పేపర్‌తో పోలిస్తే మొదటి పేపర్‌లోనే విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్, ఇతర ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లకు సిద్ధమయ్యేవారు ఈ ప్రశ్నలకు మిగిలినవారితో పోలిస్తే సులువుగానే సమాధానాలు గుర్తించొచ్చు. సిలబస్‌లో ఉన్న చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించి బాగా సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ ప్రశ్నపత్రాలను సేకరించి సాధన చేస్తే ప్రశ్నల సరళి తెలియడంతోపాటు ఏ చాప్టర్లకు ఎక్కువ వెయిటేజ్ ఉందో తెలుస్తుంది. అందుకనుగుణంగా విద్యార్థులు ప్రిపరేషన్ శైలిని మలచుకోవాలి.
పేపర్-2 జనరల్ ఎబిలిటీ టెస్ట్
పార్ట్-ఎ ఇంగ్లిష్:దీనికి 200 మార్కులు ఉంటాయి. అభ్యర్థికి ఇంగ్లిష్‌లో ఏమేరకు అవగాహన ఉందో తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. పదాలు ఉపయోగించడం, వ్యాకరణం, పదసంపద (వొకాబులరీ), కాంప్రహెన్షన్ అంశాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. సెంటెన్స్ కరెక్షన్, ఆర్టికల్స్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, డెరైక్ట్ ఇన్‌డెరైక్ట్ సెంటెన్సెస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ స్థాయిల్లో ఉండే జనరల్ ఇంగ్లిష్‌కు సంబంధిత తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఉన్న వివిధ వ్యాకరణాంశాలను సాధన చేయాలి.
పార్ట్-బీ జనరల్ నాలెడ్జ్: ఇందులో ఆరు సెక్షన్‌లు (సెక్షన్ ఎ నుంచి ఎఫ్ వరకు) ఉంటాయి. వీటికి 400 మార్కులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.
సెక్షన్-ఏ ఫిజిక్స్: 25 శాతం ప్రశ్నలు ఈ సబ్జెక్ట్ నుంచే అడుగుతారు. సూత్రాలు, నియమాలు, ప్రమాణాలు, పదార్థాల ధర్మాలు, ద్రవ్యరాశి, భారం, ఘనపరిమాణం, పీడనం, వేగం, త్వరణం, గురుత్వాకర్షణ శక్తి, న్యూటన్ నియమాలు, శక్తి, శబ్దతరంగాలు, లఘు లోలకం, కాంతి, పరావర్తనం, వక్రీభవనం.. ఇలా భౌతికశాస్త్రంలోని అన్ని ప్రాథమికాంశాలనూ బాగా చదువుకోవాలి. జేఈఈ మెయిన్స్, నీట్ మొదలైన పోటీపరీక్షల మెటీరియల్‌ను సిలబస్ ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో చదవడంతోపాటు ఇంటర్ రెండేళ్ల ఫిజిక్స్ పాఠ్యపుస్తకాల్లోని ప్రధాన సూత్రాలను, భావనలను చదివితే ఈ విభాగం నుంచి అధిక మార్కులు సాధించొచ్చు.
సెక్షన్-బీ కెమిస్ట్రీ: ఈ సబ్జెక్టుకు 15 శాతం మార్కులు కేటాయించారు. పదార్థ భౌతిక, రసాయన మార్పులు; సూత్రాలు, సంకేతాలు, సమీకరణాలు, ధర్మాలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, ఆక్సీకరణం, క్షయకరణం; కార్బన్, దాని రూపాంతరాలు; సహజ, రసాయన ఎరువులు; వివిధ పదార్థాల ఉత్పత్తికి అవసరమయ్యే ఇతర పదార్థాలు, పరమాణు సిద్ధాంతాలు మొదలైనవాటిని క్షుణ్నంగా చదవాలి. 9, 10 తరగతుల్లోని సంబంధిత టాపిక్స్‌లోని ప్రాథమిక అంశాలను చదువుతూ నోట్స్ రాసుకోవాలి. ఈ ప్రాథమిక భావనలను దగ్గర ఉంచుకుని ఇంటర్ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తే అధిక మార్కులు పొందొచ్చు.
సెక్షన్-సి జనరల్ సైన్స్: 10 శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచే అడుగుతారు. వీటిలో ఎక్కువ ప్రశ్నలు జీవశాస్త్రం నుంచే వస్తాయి. సజీవులు-నిర్జీవుల మధ్య భేదాలు, కణాల జీవనం, మొక్కలు, జంతువుల ఎదుగుదల, వాటి పునరుత్పత్తి, మానవ దేహం, అందులోని ముఖ్యావయవాలపై ప్రాథమిక పరిజ్ఞానం, సాధారణ రోగాలు- కారణాలు- నివారణ, ఆహారం, శక్తి కేంద్రకాలు, సమతులాహారం, సౌర కుటుంబం, ప్రముఖ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు..వంటి అంశాల్లో ప్రశ్నలొస్తాయి. 8, 9,10 తరగ తుల జీవ శాస్త్రం పాఠ్యపుస్తకాల్లో ముఖ్యాంశాలను సినాప్సిస్ రూపంలో రాసుకుని చదువుకుంటే ఈ విభాగంలో అధిక మార్కులు సాధించొచ్చు.
సెక్షన్-డీ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం: 20 శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచే వస్తాయి. భారతదేశ చరిత్ర, నాగరికత, సంస్కృతి, భారత స్వాతంత్య్రోద్యమం, భారత రాజ్యాంగం ప్రాథమికాంశాలు, కార్యనిర్వహణ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు- ప్రాథమిక అంశాలు, పంచాయతీరాజ్, గాంధీజీ బోధనలు, ఆధునిక ప్రపంచం, అమెరికా స్వాతంత్య్రోద్యమం, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, రష్యా విప్లవం, సమాజంపై సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావం, పంచశీల సూత్రాలు, ప్రజాస్వామ్యం, సోషలిజం, కమ్యూనిజం, ఆధునిక ప్రపంచంలో భారత్ పాత్ర... అంశాల నుంచి ఈ విభాగంలో ప్రశ్నలొస్తాయి.
సెక్షన్-ఈ జాగ్రఫీ: ఈ సెక్షన్‌కు 20 శాతం ప్రశ్నలు కేటాయించారు. భూమి, ఆకారం, పరిమాణం, అక్షాంశాలు, రేఖాంశాలు, టైమ్ కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ డేట్ లైన్; భూ భ్రమణం, భూ పరిభ్రమణం- వాటి ప్రభావాలు, శిలాజాలు-వాటి వర్గీకరణ, భూకంపాలు, వాతావరణం, పీడనం, గాలులు, తుపాన్‌లు, తేమ, భారతదేశ భూగోళం, దేశంలో లభించే ఖనిజాలు, ముఖ్య శక్తి కేంద్రకాలు, వ్యవసాయ, పారిశ్రామిక కేంద్రకాలు, దేశంలో రేవు పట్టణాలు, రోడ్డుమార్గాలు-రవాణావ్యవస్థ, ఎగుమతులు, దిగుమతులు అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.
సెక్షన్-ఎఫ్ కరెంట్ ఈవెంట్స్: ఈ విభాగానికి 10 శాతం మార్కులు కేటాయించారు. ఈ మధ్య కాలంలో మన దేశంలో జరిగిన వివిధ ముఖ్య సంఘటనలతోపాటు ప్రపంచంలో తాజా పరిణామాలు కూడా తెలుసుకోవాలి. వ్యక్తులు- అవార్డులు, క్రీడలు, సదస్సులు- ప్రదేశాలులాంటివాటిపై దృష్టిపెట్టాలి. పరీక్ష తేదీనాటికి ఆరు నెలల ముందు నుంచి ముఖ్యమైన సంఘటనలను ఒక వరుస క్రమంలో చదివితే ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు. మలయాళ మనోరమ ఇయర్ బుక్, ఏవైనా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లను చదవాలి.
శిక్షణ ఇలా..
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఏ సర్వీస్‌కి ఎంపికైనా మూడేళ్ల పాటు పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ నిర్వహిస్తారు. మొదటి రెండున్నరేళ్లు ఈ మూడు సర్వీస్‌లకూ శిక్షణ ఒకేవిధంగా కొనసాగుతుంది. డిగ్రీ తరగతులతోపాటు సంబంధిత ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత అభ్యర్థి ప్రాధమ్యాల ఆధారంగా బీఎస్సీ/ బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్), బీఏ డిగ్రీలను ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. ఆ తర్వాత ఆర్మీ క్యాడెట్లు ఇండియన్ మిలటరీ అకాడెమీ-డెహ్రాడూన్, నేవల్ క్యాడెట్లు ఇండియన్ నావల్ అకాడెమీ- ఎజిమల, ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లు ఎయిర్ ఫోర్స్ అకాడెమీ-హైదరాబాద్‌లో సంబంధిత అంశాల్లో ఏడాదిపాటు శిక్షణ పొందుతారు. ఈ ట్రైనింగ్‌లో నెలకు *21,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఎన్‌డీఏ ఎంపికైనవాళ్లకు నాలుగేళ్లపాటు అకడమిక్, ఫిజికల్ ట్రైనింగ్ ఇండియన్ నేవల్ అకాడెమీ-ఎజిమలలో కొనసాగుతుంది. శిక్షణ తర్వాత బీటెక్ డిగ్రీ అందిస్తారు. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లను వివిధ హోదాల్లో నియమిస్తారు. ఏ సర్వీస్‌కు ఎంపికైనా నెలకు *35,000కు పైగా పొందొచ్చు. దీంతోపాటు అలవెన్సులూ ఉంటాయి. భవిష్యత్తులో సంబంధిత విభాగానికి చీఫ్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్
సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహించే పర్సనాలిటీ టెస్ట్‌కు 900 మార్కులుంటాయి. వివిధ అంశాల్లో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెర్బల్, నాన్ వెర్బల్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, ఔట్ డోర్ గ్రూప్ టాస్క్స్, ఏదైనా సబ్జెక్ట్/అంశంలో ప్రసంగించమనడం... లాంటివన్నీ ఈ పరీక్షలో భాగమే. అభ్యర్థి మానసిక సామర్థ్యం, తెలివితేటలు, సమాజంపై అవగాహన, వర్తమాన వ్యవహారాలపై ఆసక్తి... ఇవన్నీ ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు.
ఫిజికల్ టెస్ట్
రాత పరీక్ష ఉత్తీర్ణులకు నిర్వహిస్తారు. నిర్దేశిత ఎత్తు, దానికి తగ్గ బరువు ఉండాలి. ఏ విధమైన శారీరక లోపాలు ఉండకూడదు. ఛాతీ విస్తీర్ణం కనీసం 81 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత వ్యత్యా సం 5 సెం.మీ.కు తక్కువ కాకూడదు. దృష్టిదోషాలు ఉండకూడదు. 2.4 కి.మీ. దూరాన్ని 15 నిమిషాల్లో పరుగెత్తాలి.
రిఫరెన్స్ బుక్స్

- నేషనల్ డిఫెన్స్ అకాడెమీ:
320 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-70) - నేవల్ అకాడెమీ
(10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్): 55
- ఆర్మీ వింగ్ (ఎన్‌డీఏ):ఏదైనా గ్రూప్‌తో 10+2 ఉత్తీర్ణత.
- ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలు (ఎన్‌డీఏ); 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడెమీ): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత.
- వయోపరిమితి: అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. వీరు జూలై 2, 1995- జూలై 1, 1998 మధ్య జన్మించి ఉండాలి. నోటిఫికే షన్‌లో పేర్కొన్న నిర్దేశిత శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
- ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2014
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2014
- వెబ్‌సైట్: upsconline.nic.in

- మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్యపుస్తకాలు,
- ఎంసెట్/జేఈఈ/నీట్ స్టడీ మెటీరియల్
- ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్, -నార్మన్ లూయీస్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ
- జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్,జాగ్రఫీ: ఎన్‌సీఈఆర్‌టీ 8, 9,10తరగతుల సోషల్, బయాలజీ పుస్తకాలు, అట్లాస్
- కరెంట్ ఈవెంట్స్: మనోరమ ఇయర్ బుక్
ఆర్మీ | నేవీ | ఎయిర్‌ఫోర్స్ |
లెఫ్టినెంట్ | సబ్ లెఫ్టినెంట్ | ఫ్లైయింగ్ ఆఫీసర్ |
కెప్టెన్ | లెఫ్టినెంట్ | ఫ్లైట్ లెఫ్టినెంట్ |
మేజర్ | లెఫ్టినెంట్ కమాండర్ | స్క్వాడ్రన్ లీడర్ |
లెఫ్టినెంట్ కల్నల్ | కమాండర్ | వింగ్ కమాండర్ |
కల్నల్ (సెలెక్షన్) | కెప్టెన్ (సెలెక్షన్) | గ్రూప్ కెప్టెన్ (సెలెక్షన్) |
కల్నల్ (సెలెక్షన్) | కెప్టెన్ (టైంస్కేల్) | గ్రూప్ కెప్టెన్ (టైంస్కేల్) |
బ్రిగేడియర్ | కమోడర్ | ఎయిర్ కమోడర్ |
మేజర్ జనరల్ | రేర్ అడ్మిరల్ | ఎయిర్ వైస్‌మార్షల్ |
లెఫ్టినెంట్ జనరల్ | వైస్ అడ్మిరల్ | ఎయిర్‌మార్షల్ |
జనరల్ | అడ్మిరల్ | ఎయిర్‌చీఫ్ మార్షల్ |
Published date : 10 Jan 2014 10:41AM