Skip to main content

సులువుగా కొలువు ... జాబ్ ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు

నేడు లాంగ్‌టర్మ్ కోర్సులకంటే జాబ్ ఓరియెంటెడ్ కోర్సులవైపే యువత మొగ్గుచూపుతోంది. కారణం.. తక్కువ వ్యవధి, స్వల్ప ఖర్చుతోనే పూర్తయ్యే కొన్ని డిప్లొమా కోర్సులు తక్షణమే ఉద్యోగావకాశాలు కల్పిస్తుండటమే.
అలాంటి వాటిలో హోటల్ మేనేజ్‌మెంట్, జ్యూయలరీ డిజైనింగ్, కంప్యూటర్ హార్‌‌డవేర్/ఐటీ కోర్సులు, క్లినికల్ రీసెర్‌‌చ, ఆప్టోమెట్రీ, ఫారెన్ లాంగ్వేజెస్, యానిమేషన్ అండ్ మల్టీమీడియా, టీచింగ్, స్టాక్ ఎనలిస్ట్, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి డిప్లొమా కోర్సులు విద్యార్థుల దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జాబ్ ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు.. అర్హతలు, అందిస్తున్న సంస్థలు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక ఫోకస్...

ఇంటీరియర్ డిజైనింగ్
మధ్యతరగతి ప్రజల నుంచి అత్యున్నత ఆదాయ వర్గాల ప్రజల వరకు తమ ఇళ్లను అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నారు. ఇక కార్పొరేట్ సంస్థలు, ఇతర కార్యాలయాలు తమ షోరూమ్‌లను, ఆఫీసులను, షాప్‌లను వినియోగదారులను ఆకట్టుకునేలా డిజైనింగ్ చేయించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన కోర్సు.. ఇంటీరియర్ డిజైనింగ్. నేడు ప్రపంచవ్యాప్తంగా ఇంటీరియర్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున ఈ కోర్సులను అభ్యసిస్తున్నారు. రెసిడెన్షియుల్, కవుర్షియుల్ రంగాల్లో నిపుణులైన ఇంటీరియుర్ డిజైనర్లకు దేశీయుంగా ఎంతో డివూండ్ ఉంది. రెసిడెన్షియుల్ డిజైనింగ్‌లో భాగంగా కిచెన్ అండ్ బాత్‌రూమ్ డిజైన్, యుూనివర్సల్ డిజైన్ వంటి స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నారుు. కవుర్షియుల్ ఇంటీరియుర్ డిజైనింగ్‌లో భాగంగా.. ఫర్నీచర్ డిజైన్, హెల్త్‌కేర్ డిజైన్, హాస్పిటాలిటీ డిజైన్, రిటైల్ డిజైన్, వర్క్‌స్పేస్ డిజైన్ వంటి స్పెషలైజేషన్‌లు ఎంచుకోవచ్చు.
కోర్సులు, అర్హత: ఇంటీరియుర్ డిజైనింగ్‌లో డిప్లొమా నుంచి పీజీ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (వెబ్‌సైట్: www.nid.edu), యూనివర్సిటీ ఆఫ్ ముంబై (www.mu.ac.in ) మొదలైన సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.
అర్హత: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. దానికితోడు వినియోగదారులను ఆకట్టుకునేలా ఆకర్షణీయుమైన రంగులు, అందమైన రూపాలను, డిజైన్లను ఎంపిక చేయుగల నైపుణ్యం ఉండాలి.

కావాల్సిన స్కిల్స్:
  • డిజైన్ స్కిల్స్
  • కమ్యూనికేషన్ స్కిల్స్
  • మేనేజ్‌మెంట్ స్కిల్స్
  • కోఆర్డినేషన్ స్కిల్స్
  • పరిశీలనా నైపుణ్యాలు

ఇంటీరియుర్ డిజైనింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే అవకాశంతోపాటు ఇంటీరియుర్ డెకరేషన్ సంస్థలలో ఉపాధి అవకాశాలు పొందొచ్చు.
వేతనాలు: వ్యక్తిగత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటారుు. ప్రారంభంలో నెలకు * 15,000 వేతనం ఉంటుంది. ఆ తర్వాత అనుభవం పొంది, మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకుంటే నెలకు లక్షల్లోనే సంపాదించొచ్చు.

జ్యూయలరీ డిజైనింగ్
కొత్తగా, మరింత నాజూగ్గా, మిరుమిట్లు గొలిపే ఆభరణాలను సృష్టించగల ఊహాశక్తి, అభిరుచి, ఆసక్తి కలిగిన వారికి అపార అవకాశాలను అందించే కోర్సు.. జ్యూయలరీ డిజైనింగ్. కార్పొరేట్ సంస్థలు సైతం ఈ రంగంలో అడుగుపెట్టడంతో జ్యూయెలరీ డిజైనింగ్‌లో మంచి అవకాశాలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో జ్యూయలరీ డిజైనర్ల పాత్ర ఎంతో కీలకం. ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని మగువల మనస్సు దోచే ఆభరణాలు రూపొందిస్తున్నారు నేటి డిజైనర్లు. బంగారంతో మాత్రమే కాకుండా వివిధ లోహ మిశ్రమాలను ఉపయోగించి కళ్లు చెదిరే నగలను తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యూయలరీ డిజైనింగ్ కోర్సులు చేసినవారికి జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగావకాశాలున్నాయి.
కావాల్సిన నైపుణ్యాలు: ఈ రంగం పట్ల మక్కువతో పాటు ఆభరణాల డిజైనింగ్‌కు సంబంధించి సృజనాత్మక ఆలోచనలు, ఇలస్ట్రేషన్ నైపుణ్యం, సాంకేతిక నైపుణ్యం, లోహాలు, లోహ మిశ్రమాలకు సంబంధించిన రసాయన శాస్త్ర అవగాహన జ్యూయలరీ డిజైనర్‌కు ఉండాలి.
అర్హత: జ్యూయలరీ డిజైనింగ్‌లో సర్టిఫికేట్ స్థాయి నుంచి డిప్లొమో వరకూ అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. +2 (ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణులైనవారు సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులకు అర్హులు.
వేతనం: జ్యూయలరీ రంగంలో ప్రైవేటు సంస్థలే అధికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అందువల్ల డిజైనర్ల వేతనాలు సంస్థ ఆదాయం ప్రాతిపదికగా మారుతుంటాయి. డిజైనర్ నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా వేతనాలు ఉంటాయి. ప్రారంభ వేతనం నెలకు రూ.15,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. తర్వాత పనితీరు, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా మరింత సంపాదించవచ్చు.

కోర్సులను అందిస్తున్న సంస్థలు:
నోయిడా (యూపీ)లోని జ్యూయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (జేడీటీఐ), ముంబైలోని జెమలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సూరత్‌లోని డైమండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు జ్యూయలరీ డిజైనింగ్‌లో కోర్సులను అందిస్తున్నాయి. ఇవి జ్యూయలరీ డిజైనింగ్‌తోపాటు సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.

ఫారెన్ లాంగ్వేజెస్
ప్రపంచీకరణ తెచ్చిన అవకాశాలతో.. బహుళజాతి సంస్థలు భారత్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. అదేవిధంగా స్వదేశీ కంపెనీలు జాయింట్ వెంచర్స్ పేరిట విదేశాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఫలితంగా విదేశీ నిపుణులతో సంప్రదింపులు, డాక్యుమెంటేషన్ నిత్యకృత్యమయ్యాయి. దాంతో ఏవైనా విదేశీ భాషలు నేర్చుకున్నవారికి డిమాండ్ ఏర్పడుతోంది. ఇక్కడి నిపుణులు అక్కడ పనిచేయాలన్నా.. అక్కడి వారు ఇక్కడ విధులు నిర్వర్తించాలన్నా సంబంధిత భాషలు వచ్చి ఉండాలి. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు ఫారిన్ లాంగ్వేజెస్ కోర్సులను వివిధ స్థాయిల్లో అందిస్తున్నాయి.
కోర్సులు: అరబిక్/ ఫ్రెంచ్/ రష్యన్/జర్మన్/పర్షియన్/జపనీస్/స్పానిష్‌లలో డిప్లొమా/అడ్వాన్‌‌సడ్ డిప్లొమా/పీజీ డిప్లొమా మొదలైనవి. ఈ కోర్సులను ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ -హైదరాబాద్(www.efluniversity.ac.in), ఉస్మా నియా యూనివర్సిటీ-హైదరాబాద్ (వెబ్‌సైట్: www.osmania.ac.in), రామకృష్ణ మఠం-హైదరాబాద్ (వెబ్‌సైట్: rkmath.org) ఆఫర్ చేస్తున్నాయి.
అర్హత: కోర్సును బట్టి పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు.
కెరీర్: విదేశీయులకు టూరిస్ట్ గైడ్‌గా వ్యవహరించొచ్చు. పెద్ద హోటళ్లలోనూ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
వేతనాలు: ప్రారంభంలో కనీసం నెలకు * 20,000 వరకు అందుకోవచ్చు. అనుభవం ఆధారంగా నెలకు 40,000కు పైగా సంపాదించొచ్చు.

క్లినికల్ రీసెర్చ్
వివిధ రకాల వ్యాధుల నివారణలో ఉపశమనం కలిగించే ఔషధాలను ఉత్పత్తి చేయడం వెనుక భారీ కసరత్తే జరుగుతుంది. ఈ ఔషధాల ఉత్పత్తి ప్రక్రియను క్లినికల్ రీసెర్చ్ లేదా ట్రయల్స్ అని అంటారు. ఒక ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టే ముందు.. సంబంధిత ఔషధాన్ని వ్యక్తులపై ప్రయోగిస్తారు. వారిలో కనిపించే ప్రతిస్పందనలు, ఫలితాన్ని, లోటుపాట్లను బేరీజు వేసి.. దాని ఆధారంగా ఔషధ పనితీరును పరిశీలించడం క్లినికల్ రీసెర్చ్‌లో ప్రధాన ప్రక్రియ. ఒక ఔషధంలో ఏ మోతాదులో ఏ మిశ్రమాన్ని వినియోగించాలనే నిర్ణయానికి వస్తారు. తర్వాత మార్కెట్లో ప్రవేశపెడతారు. ఈ మొత్తం ప్రక్రియను క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఔషధాన్ని ప్రయోగించే సమయంలో ప్రతి దశ లోనూ.. క్షుణ్నంగా పరిశీలించడం, పర్యవసానాలకు కారణాలను వెతకడం, నివేదికలు తయారు చేయడం... ఈ విభాగంలో పనిచేసే వారి విధులు. ఈ నేపథ్యంలో క్లినికల్ రీసెర్చ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు అపార అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి.
కోర్సులు.. కాలేజీలు: మన దేశంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, బిల్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్ అకాడెమీ.. క్లినికల్ రీసెర్చ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో చేరడానికి బీఎస్సీ లైఫ్‌సెన్సైస్, బీఫార్మసీ, బయోటెక్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు అర్హులు.
కెరీర్: మన రాష్ట్రం ఫార్మా హబ్‌గా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఫార్మాస్యూటికల్ కంపెనీలు డ్రగ్ డెవలప్‌మెంట్, తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ కంపెనీల్లో క్లినికల్ రీసెర్చ్ కోర్సుల పూర్తిచేసినవారికి అవకాశాలు పుష్కలం.
వేతనాలు: కంపెనీని బట్టి ప్రారంభంలో నెలకు *15,000 నుంచి 20,000 వరకు వేతనాలు అందుకోవచ్చు. తమ నైపుణ్యాలతో ఒకటి, రెండేళ్లలోనే నెలకు లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారు.

కంప్యూటర్/ఐటీ కోర్సులు
సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్) నిరుద్యోగులకు అనేక రకాల వినూత్న కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కంప్యూటర్ కోర్సుల గురించి. నెల వ్యవధి ఉన్న ఏడాది వ్యవధి ఉన్న కోర్సులను సెట్విన్ ఆఫర్ చేస్తోంది.
కోర్సులు: డెస్క్‌టాప్ పబ్లిషింగ్, సీ, సీ++, ఒరాకిల్, యూనిక్స్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, ఆటో క్యాడ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ హార్‌‌డవేర్, సర్టిఫికెట్ కోర్‌‌స ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ (బేసిక్, అడ్వాన్‌‌సడ్), పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, జావా, డిప్లొమా ఇన్ అడ్వాన్‌‌స క్యాడ్/క్యామ్, కాల్ సెంటర్ ట్రైనింగ్ వంటి కోర్సులను మన రాష్ర్టంలో సెట్విన్ అందిస్తోంది.
అర్హత: కోర్సును బట్టి పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు.
కెరీర్: ఈ కోర్సులు పూర్తిచేసివారికి సెట్విన్ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. అంతేకాకుండా స్వయంఉపాధికి అవసరమైన గెడైన్‌‌సను కూడా అందిస్తోంది.
వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.8,000 నుంచి 10,000 వరకు వేతనాలు ఉంటాయి. అనుభవాన్ని బట్టి నెలకు 20,000 వరకు అందుకోవచ్చు.
వెబ్‌సైట్: www.setwinapgov.org

ఆప్టోమెట్రీ
‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అన్నారు పెద్దలు. అంటే అన్ని ఇంద్రియాల్లో కన్ను అతి ముఖ్యం. ఆప్టోమెట్రీ కోర్సులు పూర్తిచేసినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. కళ్లకు సంబంధించిన ప్రాథమిక జాగ్రత్తలు, వ్యాధులు, వాటిని గుర్తించే పద్ధతులను బోధించేందుకు రూపొందించిన కోర్సే.. ఆప్టోమెట్రీ.
కోర్సులు:
  • డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్: ఈ కోర్సును ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ (వెబ్‌సైట్: www.appmb.org ) ఆధ్వర్యంలో దాదాపు 382 కళాశాలలు అందిస్తున్నాయి.
    అర్హత: ఇంటర్మీడియెట్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హైదరాబాద్‌లో ఉన్న సరోజినిదేవీ కంటి ఆస్పత్రి ఈ కోర్సును అందిస్తోంది.
స్కిల్స్:
  • ఓపిక , సహనం ఉండాలి. కళ్లకు సంబంధించిన సమస్యలను వెంటనే గుర్తించగల నైపుణ్యం ఉండాలి.
కెరీర్: ఆప్టోమెట్రీ కోర్సులు చేసినవారికి వివిధ ఆస్పత్రుల్లో, ఆప్టికల్ షోరూమ్‌ల్లో, కళ్లజోళ్ల తయారీ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి.
వేతనాలు: ఆప్టోమెట్రీ కోర్సులు పూర్తిచేసినవారికి ప్రారంభంలో రూ. 10,000 వేతనం అందుతుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి మరింత ఆదాయం పొందొచ్చు. సొంతంగా క్లినిక్ నిర్వహిస్తే ఎక్కువ ఆదాయాన్ని గడించొచ్చు.

టీచింగ్
చక్కని పనిగంటలతోపాటు.. భావి భారత పౌరులను తీర్చిదిద్దే సువర్ణావకాశం ఉపాధ్యాయవృత్తి. ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా ఉండే అతికొద్ది రంగాల్లో టీచింగ్ ఒకటి.

డిప్ల్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ):
అర్హత:
ఇంటర్మీడియెట్. మన రాష్ట్రంలో నిర్వహించే డైట్‌సెట్ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
అవకాశాలు: ఈ కోర్సు పూర్తిన చేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో టీచర్‌గా స్థిరపడొచ్చు.
ప్రీ-ప్రైమరీ కోర్సులు:
  • డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్ హయ్యర్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్
  • ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్
  • పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్
అర్హత: పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు. ఆంధ్ర మహిళ సభ-హైదరాబాద్, మాంటిస్సోరి ఇన్‌స్టిట్యూట్ (www.indianmontessoricentre.org ), సెట్విన్, ఇగ్నో మొదలైన సంస్థలు వివిధ స్థాయిల్లో ఈ కోర్సులను అందిస్తున్నాయి.
అవకాశాలు: కిండర్ గార్డెన్ స్కూల్స్, నర్సరీ స్కూల్స్‌లో అవకాశాలు ఉంటాయి.

స్పెషల్ ఎడ్యుకేషన్:
కోర్సులు:
విజువల్, హియరింగ్ ఇంపెయిర్‌మెంట్, స్పీచ్ థెరపీ, ఆటిజం అండ్ స్పెక్ట్రమ్, రిహాబిలిటేషన్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ విభాగంలో పలు డిప్లొమా కోర్సులు.
అర్హత: ఇంటర్మీడియెట్.
వెబ్‌సైట్ www.rehabcouncil.nic.in చూడొచ్చు.
అవకాశాలు: ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలు, సర్వశిక్షా అభియాన్ పాఠశాలలు, ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో అవకాశాలు లభిస్తాయి.

ఫిజికల్ ఎడ్యుకేషన్:
కోర్సులు:
అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ) అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం వీటిలో ప్రవేశానికి మన రాష్ర్టంలో పీఈసెట్ రాయాలి.

హోటల్ మేనేజ్‌మెంట్
శరవేగంగా విస్తరిస్తున్న ఆతిథ్య రంగం.. వేలాది అవకాశాల తరంగంగా వూరుతోంది.. పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో.. అదే స్థారుులో.. హాస్పిటాలిటీ రంగంలో వూనవ వనరులకు విపరీతమైన డివూండ్ ఏర్పడుతోంది.. దాంతో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ను కెరీర్‌గా ఎంచుకునే వారి సంఖ్య కూడా అధికమవుతుంది.
ప్రవేశం: హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులను బట్టి అర్హతలు ఉంటాయి. సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులకు పదో తరగతి, బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు అర్హులు. మన రాష్ట్రంలో సెట్విన్.. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా (వ్యవధి: మూడేళ్లు), పీజీ డిప్లొమా (వ్యవధి:ఏడాది), హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ టూరిజంలో పీజీ డిప్లొమా (వ్యవధి: ఏడాది) అందిస్తోంది.
అవకాశాలు: హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అండ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్‌లో స్థిరపడొచ్చు. ఈ క్రమంలో హోటల్/హాస్పిటాలిటీ సంబంధిత పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, కిచెన్ మేనేజ్‌మెంట్/హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సేల్స్, గెస్ట్/కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఎగ్జిక్యూటివ్‌గా జాబ్ పొందొచ్చు.
స్కిల్స్:
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
  • మేనేజీరియల్ నైపుణ్యాలు
  • సేల్స్ అండ్ మార్కెటింగ్‌కు స్కిల్స్
వేతనాలు: కెరీర్ ప్రారంభంలోనే ఐదంకెల జీతాన్ని సొంతం చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీగా అయితే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్‌వైజర్‌కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది.

యానిమేషన్, మల్టీమీడియా
సూక్ష్మ పరిశీలన.. సృజనాత్మకత.. కొత్త అంశాలను నేర్చుకోవాలనే తపన.. సాంకేతిక పరిజ్ఞానం పట్ల అభిరుచి ఉన్న అభ్యర్థులకు చక్కగా సరిపోయే రంగం యూనిమేషన్. ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోన్న ప్రస్తుత తరుణంలో యూనిమేషన్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.
ఈ రంగాలను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి సృజనాత్మకత, పరిశీలనా దృక్పథం ఉండాలి. ప్రభుత్వ రంగ, అనుబంధ సంస్థలైన సెట్విన్, ఎన్‌ఐ- ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ వంటి సంస్థలతోపాటు పలు ప్రైవేటు సంస్థలు కోర్సులను నిర్వహిస్తున్నారుు. యూనిమేషన్, మల్టీమీడియూ కోర్సుల్లో చేరాలనుకునే వారు తమ ఆసక్తి, అభిరుచిని బట్టి ఆయూ కోర్సులను ఎంపిక చేసుకోవాలి.
ఉద్యోగావకాశాలు: యానిమేటర్లకు దేశ విదేశాల్లో అనేక ఉద్యోగావకాశాలున్నాయి. అడ్వర్‌టైజింగ్,టీవీ బ్రాడ్‌కాస్టింగ్, ఫిల్మ్, టీవీ ప్రోగ్రామ్స్, గేమ్స్, ఆర్కిటెక్చర్, వెబ్, ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అప్లికేషన్స్, స్పేస్ ఎక్ప్‌ప్లోరేషన్స్, మెడికల్ ఇమేజింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండ్ ఇంజనీరింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో జాబ్స్ పుష్కలం.
జీతభత్యాలు: ప్రారంభంలో ట్రైనీ, లేదా జూనియర్ యానిమేటర్‌గా రూ. 8,000-15,000 లతో కెరీర్ ప్రారంభమవుతుంది. మూడు నుంచి ఐదేళ్ల అనుభవంతో రూ. 25,000-40,000 ల వరకూ సంపాదించొచ్చు.

కోర్సులు:
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ 2డి యూనిమేషన్
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ 3డి యూనిమేషన్
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ 2డి, 3డి యూనిమేషన్
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ విజువల్ ఎఫెక్ట్స్
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఆడియో-వీడియో ఎడిటింగ్
  • అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా
వెబ్‌సైట్: www.nimsme.org

స్టాక్ ఎనలిస్ట్
తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలంటే మార్గం.. స్టాక్ మార్కెట్. సంప్రదాయ పొదుపు పథకాలైన బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లు ఒక స్థాయి వరకు మాత్రమే ఆదాయాన్ని అందిస్తాయి. కానీ స్టాక్ మార్కెట్‌లో మనం పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు సంపాదించొచ్చు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే ఔత్సాహికులకు సరైన సలహాలు, సూచనలు అవసరం. వ్యక్తులు లేదా సంస్థల సెక్యూరిటీల క్రయవిక్రయాల విషయంలో స్టాక్ బ్రోకర్ డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా వ్యవహరిస్తాడు.
స్కిల్స్
  • వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అవగాహన ఉండాలి.
  • ఎప్పటికప్పుడు వివిధ కంపెనీల వ్యాపార వ్యవహారాలను, లావాదేవీలను పరిశీలిస్తూ ఉండాలి.
  • రానున్న రోజుల్లో, సంవత్సరాల్లో ఏ రంగానికి సంబంధించిన షేర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందో విశ్లేషించగలగాలి.
కోర్సులను అందిస్తున్న సంస్థలు:
సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా...
సర్టిఫికెట్ ఇన్ సెక్యూరిటీస్ ‘లా’స్:
ఈ కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు.
అర్హత: ఏదైనా డిగ్రీ.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్: ఏడాది వ్యవధి
    అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
    వెబ్‌సైట్: www.nseindia.com
  • ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ముంబై:
    సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కమోడిటీ అండ్ కరెన్సీ మార్కెట్, సర్టిఫికెట్ కోర్‌‌స ఇన్ కరెన్సీ మార్కెట్ కోర్సులతోపాటు సంబంధిత కోర్సులను అందిస్తోంది.
    వెబ్‌సైట్: www.bseindia.com
కెరీర్- వేతనాలు: ఈ కోర్సులు పూర్తిచేసినవారికి వివిధ స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లోనూ, బ్యాంకుల్లోనూ అవకాశాలు ఉంటాయి. వేతనం నెలకు కనీసం రూ.15,000 నుంచి 20,000 వరకు ఉంటోంది.
Published date : 13 May 2015 01:47PM

Photo Stories