స్పెషల్ ఎడ్యుకేషన్.. ఉపాధికి లేదు ఢోకా!
Sakshi Education
ఏదో చెప్పాలనుంటుంది.. ఏమీ చెప్పలేని నిస్సహాయత. ఆకలేస్తుంది.. కానీ నోరు తెరచి అడగలేరు. పుట్టుకతోనే విధి చిన్నచూపుతో నిస్సహాయంగా కళ్లెదుట కన్నబిడ్డల వేదనచూసి ఎలా అర్థంచేసుకోవాలో తెలియక మౌనవేదన అనుభవించే తల్లిదండ్రులు మన చుట్టూ ఎందరో కనిపిస్తుంటారు. చిన్నారుల అంతరంగాన్ని అర్థం చేసుకొని.. మనందరిలాగే సాధారణ పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రీ మెచ్యూర్డ్ బేబీస్, జెనెటికల్ డిజార్డర్స్ వంటి రకరకాల కారణాలతో ప్రత్యేక అవసరాల పిల్లల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. మన రాష్ర్టంలో మొత్తం 25 కాలేజీలు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో సుమారు 2,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నిపుణుల కొరత:
పపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం- ప్రపంచ జనాభాలో 11 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నారు. వీరిలో 3.6 శాతం మంది సరిగా మాట్లాడలేని, వినికిడి లోపంతో ఉన్నారు. ఇంతమంది అవసరాలకు తగినట్లుగా స్పెషల్ ఎడ్యుకేషన్ నిపుణులు లేకపోవటం పెనుశాపంగా మారింది. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్‌సీఐ) అంచనా ప్రకారం- ఈ రంగంలో సేవలందించేందుకు మన దేశంలో స్పీచ్, ఆడియాలజీ విభాగంలో 4,500 మంది, స్పెషల్ టీచర్స్ 10,000 మంది అవసరం. లోపాలతో జన్మించిన పిల్లలకు సకాలంలో అవసరమైన శిక్షణను అందించకపోవడం వల్ల వారు శాశ్వత వైకల్యంతో జీవితాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది.
పెరుగుతున్న ఆదరణ:
మానసికంగా, శారీరకంగా ఎదగని పిల్లలను తీర్చిదిద్దేందుకు శాస్త్రీయంగా శిక్షణ పొందినవారు చాలా అవసరం. దాంతో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. చెవిటి, మూగ, మనోవైకల్యం తదితర సమస్యలకు అనుగుణంగా డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు ఆదరణ లభిస్తోంది. ఆయా కోర్సులు పూర్తిచేసినవారికి దేశ, విదేశాల్లోనూ ఉపాధి, ఉద్యోగావకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. డిప్లొమా, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ కొలువులకూ అర్హత ఉండటంతో చాలామంది ఇటువైపు దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా.. స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకూ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపచేయడంతో మరింత ఎక్కువ మంది ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కోర్సులు:
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్‌సీఐ) ఆధ్వర్యంలో.. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహిస్తున్నారు. విజువల్ ఇంపెయిర్‌మెంట్, హియరింగ్ ఇంపెయిర్‌మెంట్, మెంటల్ రిటార్డేషన్, లెర్నింగ్ డిజెబిలిటీ, రిహాబిలిటేషన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ, ప్రోస్థటిక్స్/ ఆర్థోటిక్స్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, రిహాబిలిటేషన్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, స్పీచ్ అండ్ హియరింగ్, లోకోమోటర్ అండ్ సెరిబరెల్‌పాల్‌సే, ఆటిజమ్ స్పెక్ట్రమ్ అండ్ డిజార్డర్, రిహాబిలిటేషన్ థెరపీ, రిహాబిలిటేషన్ సోషల్ వర్క్/అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో... దేశవ్యాప్తంగా సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులు,డిగ్రీ కోర్సులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో పలు స్పెషల్ కోర్సులను ఆర్‌సీఐ పరిధిలోని వివిధ కళాశాలలు అందిస్తున్నాయి.
సర్టిఫికెట్ కోర్సులు:
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: పదో తరగతి/ఐటీఐ/10+2
డిప్లొమా కోర్సులు:
డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), డిప్లొమా ఫర్ ఇన్ఫర్మేషన్ అసిస్టివ్ టెక్నాలజీస్ ఫర్ ఇన్‌స్ట్రక్టర్స్ ఆఫ్ డెఫ్‌బ్లైండ్ అండ్ డెఫ్ విత్ లో విజన్, డిప్లొమా ఇన్ టీచింగ్ యంగ్(డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్), డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్(లెవెల్ ఏ,బీ,సీ), డిప్లామా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్(మెంటల్ రిటార్డేషన్), డిప్లొమా ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ రిపేర్ అండ్ హియర్ మౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ బేసిక్ డెవలప్‌మెంట్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ, డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్, బ్లైండ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(సెరిబ్రల్ పాల్‌సే), డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(ఆటిజం స్పెక్ట్రమ్).
డిప్లొమా కోర్సుల కాలవ్యవధి: ఏడాది
అర్హత: 10+2/ఇంటర్మీడియెట్
ప్రవేశం: కొన్ని కోర్సులకు అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, డీఈడీ వంటి మరికొన్ని కోర్సులకు రాత పరీక్ష ఆధారంగా సంబంధిత యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నిబంధనల మేరకు ప్రవేశం కల్పిస్తారు.
బ్యాచిలర్ కోర్సులు:
బ్యాచిలర్ ఆఫ్ మొబిలిటీ సైన్స్(బీఎంఎస్సీ), బీఏ, బీఈడీ(విజువల్ ఇంపెయిర్‌మెంట్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్‌మెంట్), బీఎస్సీ (స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (మెంటల్ రిటార్డేషన్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (లెర్నింగ్ డిజాబిలిటీస్), బ్యాచిలర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (లోకోమోటర్ అండ్ న్యూరోలాజికల్ డిజార్డర్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (మల్టిపుల్ డిజాబిలిటీస్), బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్), బ్యాచిలర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్.
బీఈడీ కోర్సుల కాలవ్యవధి: ఏడాది
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
ప్రవేశం: అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, లేదా ఆయా యూనివర్సిటీ నిబంధనల మేరకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
పీజీ కోర్సులు:
ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(విజువల్ ఇంపెయిర్‌మెంట్), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్‌మెంట్), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(మెంటల్ రిటార్డేషన్), ఎంఎస్సీ డిజాబిలిటీ స్టడీస్(ఎర్లీ ఇంటర్వెన్సన్), మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, మాస్టర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, మాస్టర్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్, ఎంఎస్సీ సైకో సోషల్ రిహాబిలిటేషన్, మాస్టర్ ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్.
ఎంఈడీ కోర్సుల కాలవ్యవధి: ఏడాది.
అర్హత: బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.

పీజీ డిప్లొమా కోర్సులు:
పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్స్‌న్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ ఇంజనీరింగ్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్(మల్టిపుల్ డిజాబిలిటీస్: ఫిజికల్ అండ్ న్యూరోలాజికల్), పీజీ డిప్లొమా ఇన్ డెవలప్‌మెంటల్ థెరపీ(మల్టిపుల్ డిజాబిలిటీస్: ఫిజికల్ అండ్ న్యూరోలాజికల్), పీజీ డిప్లొమా ఇన్ డిజాబిలిటీ రిహాబిలిటేషన్ అండ్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సులకు వేటికవే ప్రత్యేకంగా ఆయా యూనివర్సిటీల నిబంధనల మేరకు అర్హతలు నిర్ణయించి, రాత పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
దూరవిద్య కోర్సులు:
బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హెచ్‌ఐ/వీఐ/ఎంఆర్/ఎల్‌ఐ అండ్ సీపీ), పీజీ ప్రొఫెషనల్ డిప్లొమా(ఇన్‌సర్వీసు టీచర్స్ కోసం, ఏడాది), పీజీ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ డిజాబిలిటీ ఫర్ డాక్టర్స్, డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, ఫౌండేషన్ కోర్సు ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ (3 నెలలు), ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ.. తదితర కోర్సులను ఇగ్నో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి.
అవకాశాలు అనేకం:
బాధితులు పెరుగుతున్నకొద్దీ ఆయా విభాగాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దేశ, విదేశాల్లో మూగ, చెవుడు, మానసిక వైకల్యం తదితర సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నిపుణుల సేవలు తప్పనిసరి. అందుకే కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు కార్పొరేటు, ప్రభుత్వ రంగాల్లో కొలువులు స్వాగతం పలుకుతున్నాయి. ఇటీవల స్పెషల్ బీఈడీ చేసిన వారికి డీఎస్సీలో అవకాశం కల్పించడంతో ఈ కోర్సుకు మరింత డిమాండ్ పెరిగింది. స్పీచ్, ఆడియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి కార్పొరేటు ఆసుపత్రుల్లో అవకాశాలు మెరుగయ్యాయి. ఎన్జీవోలు, ఆసుపత్రులు, ఆసుపత్రి నిర్వహణలో ఉపాధి లభించడంతోపాటు ప్రత్యేక అవసరాల పిల్లలకు సేవ చేస్తున్నామనే సంతృప్తి కూడా వీరికి లభిస్తుంది. కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో ఉండటంతోపాటు విదేశాల్లోనూ కొలువు సంపాదించే అవకాశం ఉంది. మన రాష్ట్రంలోనే స్పీచ్, ఆడియాలజీ విభాగంలో నెలకు రూ.16 వేల నుంచి వేతనాలు అందిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి బోధన నిపుణులుగా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నిపుణులుగా రూ.20 వేల నుంచి ప్రారంభ వేతనం లభిస్తోంది. ఇక విదేశాల్లో విద్యార్హతల ఆధారంగా జీతాలు లభిస్తున్నాయి.
ఆర్‌సీఐ పోర్టల్:
దేశవ్యాప్తంగా రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్న విద్యాసంస్థలు, కళాశాలలు, ఫీజులు, కోర్సులకు సంబంధించిన సిలబస్ తదితర వివరాలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) వెబ్‌సైట్ www.rehabcouncil.nic.in ద్వారా తెలుసుకోవచ్చు.
స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తోన్న విద్యాసంస్థలు

- ఠాకూర్ హరిప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్, వివేకానందనగర్, దిల్‌సుఖ్‌నగర్.
- స్వీకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్, సికింద్రాబాద్, వైఎస్సార్ కడప జిల్లా, గుంటూరు, తాండూరు.
- హెలెన్‌కిల్లర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిజాబుల్డ్ చిల్డ్రన్, సికింద్రాబాద్.
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్టణం.
- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.
- కాలేజీ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆంధ్రమహిళాసభ, ఓయూ క్యాంపస్.
- నవజీవన్ రెసిడెన్షియల్ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్, నంద్యాల, కర్నూలు జిల్లా.
- దుర్గాబాయి దేశ్‌ముఖ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, విద్యానగర్, హైదరాబాద్.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్.
------------------------------------------------------------------------------------------ డిమాండ్ పెరుగుతోంది
స్పెషల్ కోర్సులకు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. కార్పొరేట్ రంగాలతోపాటు ప్రభుత్వ సంస్థల్లోనూ అవకాశాలు మెరుగవుతున్నాయి. సేవ చేస్తున్నామనే సంతృప్తితోపాటు ఉపాధి లభిస్తుండటం కూడా ఈ కోర్సుల పట్ల ఆసక్తికి కారణం. ముఖ్యంగా స్పీచ్, ఆడియాలజీలో నిపుణుల కొరత ఉంది. వినికిడి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఆంధ్ర మహిళా సభలో డీఎడ్ (హియర్ ఇంపైర్డ్, మెంటల్ రిటార్డ్) రెండేళ్ల కోర్సు. ఒక్కోదానిలో 25 సీట్లున్నాయి. గతంలో సీట్లు భర్తీ అయ్యేవి కాదు. నాలుగైదేళ్ల నుంచి సీట్లు మిగలట్లేదు.
-పి. కృష్ణవేణి,ప్రిన్సిపల్,
కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్,
ఆంధ్రమహిళాసభ.
------------------------------------------------------------------------------------------
అవకాశాలు పుష్కలం
మానసికంగా, శారీరకంగా ఎదగని పిల్లలు, వ్యక్తులను తీర్చిదిద్దడంలో నిపుణులు చూపే ప్రేమ అనిర్వచనీయం. మనసులోకి తొంగిచూసి, అంతరంగాన్ని అర్థంచేసుకుని అలాంటి వారిని సాధారణ వ్యక్తులుగా మార్చడంలో నిపుణుల సేవలు కీలకం. ఏటేటా వైకల్యంతో జన్మిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ, అవసరాలకు అనుగుణంగా నిపుణులు లేరు. అందుకే కోర్సు పూర్తిచేసిన వారికి వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశ, విదేశాల్లో కూడా పుష్కలమైన అవకాశాలున్నాయి. ప్రారంభ వేతనం కూడా బాగుండటంతో యువత ఇప్పుడిప్పుడే ఈ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. సొంత ప్రాక్టీసు, ఎన్జీవోలు, ఆసుపత్రుల్లో పనిచేసే వీలుంది. సర్వశిక్షాభియాన్ ద్వారా ప్రభుత్వం కూడా వినికిడి, మూగ, మనోవైకల్యంతో బాధపడే చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది. కాస్త ఓర్పు, నేర్పు ఉంటే ఇలాంటి కోర్సులతో జీవితంలో స్థిరపడొచ్చు.
- డాక్టర్ పి. హనుమంత రావు,చైర్మన్,
స్వీకార్-ఉపకార్.

Published date : 05 Sep 2013 04:32PM