సామాజికంగా కెరీర్‌లో మెరవాలంటే...
Sakshi Education
మానవుడు సాంకేతికంగా ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. రోదసిని జయించినా.. చుట్టూ ఉన్న సమాజాన్ని, మానవ సంబంధాలను, చారిత్రక సంపదను, సాంస్కృతిక ఔన్నత్యాన్ని అవగాహన చేసుకోలేకుంటే.. ఎంత ప్రగతి సాధించినా నిష్పప్రయోజనమే.. ముఖ్యంగా కాలంతో పోటీపడుతూ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో.. సామాజిక అవగాహనను పెంచుకోవాల్సిన అవశ్యకత ఎంతో.. అప్పుడే మానవుడు పరిపూర్ణ మూర్తిమత్వం మూర్తీభవించిన పౌరుడిగా భవిష్యత్ గమనానికి బాటలు వేసుకోవడం సాధ్యమవుతుంది.. ఆ దిశగా నడిపించేవే సోషల్ సెన్సైస్ కోర్సులు...
అత్యంత ఆదరణ కలిగిన కోర్సుల్లో సోషల్ సెన్సైస్ కోర్సులు ముందంజలో ఉంటాయి. సోషల్ సెన్సైస్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ విభాగాల్లో వందల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలో అత్యధిక మంది విద్యార్థులు ఎన్‌రోల్ అవుతున్న విభాగం సోషల్ సెన్సైస్. ఇందులోని 168 విభిన్న కోర్సుల్లో 6 మిలియన్ల మంది విద్యార్థులున్నారు.
సోషల్ సెన్సైస్ అంటే.. సమాజం, చుట్టు ఉన్న మనుషులు, చరిత్ర, వారసత్వ సంపద, సామాజిక- మానవ సంబంధాలు, నాగరికత, సంస్కృతి, పాలన వ్యవహారాలు, రాజనీతి, విశ్వం, భూగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రాలు వంటి పలు అంశాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడమే సోషల్ సెన్సైస్. హ్యూమానిటీస్ కోర్సులు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాము? మన చరిత్ర ఏమిటి? చుట్టూ ఉన్న ప్రజలతో మనకున్న సంబంధం?సామాజిక బాధ్యత? ఏ విధంగా ఒక సమాజంగా మనుగడ సాగించాలి? వంటి అంశాలను తెలుసుకోవడం ద్వారా పరిపూర్ణ మూర్తిమత్తత్వానికి పునాది వేసుకోవడం.. ఈ కోర్సులతోనే సాధ్యం.
పాఠశాల నుంచే
సోషల్ సెన్సైస్ కోర్సులకు పునాది పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతుంది. పరిసరాల విజ్ఞానం పేరిట ప్రాథమిక తరగుతుల నుంచి విద్యార్థులకు సోషల్ సెన్సైస్ కోర్సులను బోధిస్తారు. తర్వాత హైస్కూల్ స్థాయిలో సాంఘికశాస్త్రం పేరిట భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం విభాగాలుగా ఉంటుంది. ఇవి సోషల్ సెన్సైస్ కోర్సుల పట్ల ఒక ప్రాథమిక అవగాహనను కల్పించడానికి దోహదం చేస్తాయి. తర్వాత పాఠశాల దశ నుంచి కళాశాల స్థాయికి వచ్చే సరికి సబ్జెక్ట్ పరిధి విస్తృతం కావడంతోపాటు క్రమంగా స్పెషలైజ్డ్ కోర్సుల ప్రాధాన్యత పెరుగుతోంది. సోషల్ సెన్సైస్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్‌లో హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపులు అందుబాటులో ఉంటాయి. తర్వాత డిగ్రీలో బీఏ కోర్సులుగా వ్యవహరిస్తారు. ఇందులో పలు రకాలు కాంబినేషన్లు ఉంటాయి. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంప్రదాయ సబ్జెక్ట్‌లతోపాటు స్టాటిస్టిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, లింగ్విస్టిక్స్, రూరల్ ఇండస్ట్రీలైజేషన్, రూరల్ బ్యాంకింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ అండ్ మీడియా స్టడీస్, బిజినెస్ ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ స్టడీస్ వంటి ఎన్నో నూతన ఆప్షన్స్‌ను ప్రవేశ పెట్టారు. అంతేకాకుండా బీఎలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి.. బీఏ హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్. అంతేకాకుండా కొన్ని యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అవి.. ఉస్మానియా యూనివర్సిటీ అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (వెబ్‌సైట్: www.osmania.ac.in), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఎంఏ (ఏకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, వెబ్‌సైట్: www.uohyd.ac.in) కోర్సులు.
డిగ్రీ తర్వాత
డిగ్రీని పూర్తి చేసిన తర్వాత పీజీ, అటుపై పీహెచ్‌డీ కోర్సులను ఎంచుకోవచ్చు. ఆయా కోర్సుల్లో డిగ్రీ మాదిరిగా పలు సబ్జెక్ట్‌లను కాకుండా ఆసక్తి ఉన్న ఏదో ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నో సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఇందులో హిస్టరీ, ఎకానమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ వంటి సంప్రదాయ సబ్జెక్ట్‌లేకాకుండా మారుతున్న అవసరాలకనుగుణంగా కాలక్రమేణా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని సోషల్ సెన్సైస్ కోర్సుల్లో కూడా నూతన సబ్జెక్ట్‌లకు చోటు కల్పించారు. అవి.. అంత్రోపాలజీ, డెవలప్‌మెంట్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఆర్కియాలజీ, సోషియాలజీ, సోషల్‌వర్క్, సైకాలజీ, పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్ తదితరాలు. ఇతర రంగాలకు ధీటుగా కార్పొరేట్ అవకాశాలను అందుకునే విధంగా ఈ సబ్జెక్ట్‌ల కరిక్యులాన్ని రూపొందించారు.
పరిశోధన దిశగా పీహెచ్‌డీ
ఆసక్తి ఉన్న రంగంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయడానికి పీహెచ్‌డీ కోర్సులు దోహదం చేస్తాయి. పీహెచ్‌డీ కోసం జాతీయ స్థాయిలో నెట్, రాష్ట్ర స్థాయిలో సెట్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కాలేజ్‌లు/యూనివర్సిటీలు/తత్సమాన ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు భర్తీ చేసే డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్/సెట్‌లలో క్వాలిఫై అయి ఉండాలి. నెట్‌లో జేఆర్‌ఎఫ్‌నకు ఎంపికైన అభ్యర్థులకు యూజీసీ నిబంధనల మేరకు ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి పరిగణించే అర్హతల్లో నెట్/జేఆర్‌ఎఫ్ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. కేవలం నెట్ ద్వారానే కాకుండా పరిశోధన కోర్సుల్లో చేరే అవకాశాన్ని కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు కల్పిస్తున్నాయి. అవి.. టిస్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్), సీఎస్‌డీఎస్ (సెంటర్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ సోషల్ డెవలపింగ్ సొసైటీస్), ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్, ఐసీపీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫిలాసఫికల్ రీసెర్చ్-హిస్టరీ అభ్యర్థులకు), ఐసీఎస్‌ఎస్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్), తదితరాలు. అభ్యర్థులు పంపించిన ప్రాజెక్ట్ ప్రపోజల్ ఆధారంగా ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఫెలోషిప్‌ను కూడా అందజేస్తున్నాయి.
ఐఐటీల్లో కూడా
సోషల్ సెన్సైస్ కోర్సులు కేవలం సంప్రదాయ విశ్వవిద్యాలయాలకే పరిమితం కాలేదు. వీటి ప్రాముఖ్యతను గుర్తించిన పలు ఐఐటీలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి.అవి.. ఐఐటీ-మద్రాస్ ఐదేళ్ల ఎంఏ (ఇంటిగ్రేటెడ్ -డెవలప్‌మెంట్ స్టడీస్) కోర్సును ఆఫర్ చేస్తుంది. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.hss.iitm.ac.in. ఐఐటీ-కాన్పూర్, నాలుగేళ్ల బీఎస్-ఎకనామిక్స్ కోర్సును ఆఫర్ చేస్తుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా ప్రవేశం. వివరాలకు: www.iitk.ac.in. ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐదేళ్ల ఎంఎస్సీ (ఎకనామిక్స్)కోర్సును ఆఫర్ చేస్తుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా ప్రవేశం. వివరాలకు: www.iitkgp.ac.in. అంతేకాకుండా విద్యార్థులకు టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు చుట్టూ ఉన్న సమాజం, మానవ సంబంధాలు సంబంధిత అంశాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఐఐటీలు, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్‌ఎం), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు.. ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ వంటి సోషల్ సెన్సై స్ అంశాలను ఇంటర్ డిసిప్లినరీ పద్ధతిలో బోధిస్తున్నాయి.
సోషల్ సెన్సైస్‌లో కెరీర్ పరంగా ముందంజలో ఉన్న సబ్జెక్ట్‌లు
పబ్లిక్‌పాలసీ మేనేజ్‌మెంట్
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారాలను రాజ్యాంగ పరిమితులకు లోబడి చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో ప్రజా సమస్యల నిర్వహణ, వాటి పరిష్కార అమలును ఒక శాస్త్రీయ పద్ధతిలో అమలు చేసే అంశాలను బోధించేది పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్. ఈ కోర్సు పీజీ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది. సివిల్ సర్వీసెస్ ఔత్సాహికులు, సాంఘిక, మౌలిక రంగాల్లో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సును రూపొందించారు. ఈ కోర్సును పూర్తి చేసిన ఎన్‌జీవోలు, ప్రైస్‌వాటర్ కూపర్స్, డెలాయిట్, మెకన్సీ వంటి ఎంఎస్‌సీలు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వ రంగంలో కూడా అవకాశాలు ఉంటాయి. ఐఐఎం-బెంగళూరు (వెబ్‌సైట్: www.iimb.ernet.in), యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (వెబ్‌సైట్: www.du.ac.in), మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-గుర్గావ్ (వెబ్‌సైట్: www.mdi.ac.in), టెరీ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.teriuniversity.ac.in), ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ-హర్యానా (వెబ్‌సైట్: www.jgu.edu.in) ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
సోషల్ వర్క్
సేవా దృక్ఫధం ఉన్న వారికి సరిగ్గా సరిపోయే కోర్సు సోషల్ వర్క్. ఇటీవల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న కోర్సుల్లో ఇది ఒకటి. సామాజిక సమస్యలు, మావన హక్కులు, వాటితో ముడిపడి ఉన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సోషల్ వర్క్. ఈ విభాగానికి సంబంధించి ఎంబీఏ రూరల్ డెవలప్‌మెంట్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ), పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ కోర్సును పూర్తి చేసిన వారికి పబ్లిక్, ప్రైవేట్, ఎన్‌జీవో సంస్థల్లో అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. అదే సందర్భంలో ఆర్థిక సంస్కరణల తర్వాత.. దేశాభివృద్ధిలో కార్పొరేట్ సంస్థల పాత్ర పెరిగిన నేపథ్యంలో.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) చట్ట రూపాన్ని సంతరించుకోవడం.. సోషల్ వర్క్ అభ్యర్థుల అవకాశాలను రెట్టింపు చేసిందని చెప్పొచ్చు. సోషల్ వర్క్ అభ్యర్థులకు పని చేసే సంస్థ, నిర్వహించే ప్రాజెక్ట్‌లను బట్టి వివిధ హోదాలు ఉంటాయి. అవి.. కేపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఫీల్డ్ కో-ఆర్డినేటర్, అకడమిక్ రిసోర్సెస్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, కమ్యూనికేషన్ మేనేజర్, ప్రోగ్రామ్ అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. వేతనాల విషయానికొస్తే.. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో ఉండే కో-ఆర్డినేటర్, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.15 నుంచి 20 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ. 30 నుంచి రూ. 50 వేలకు పైగానే సంపాదించవచ్చు.
కార్పొరేట్ కంపెనీల్లో సీఎస్‌ఆర్ తప్పనిసరిగా మారిన నేపథ్యంలో సంబంధిత నిపుణులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయని చెప్పొచ్చు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్‌జీఓ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాల్లో సోషల్ అడిటింగ్, కమ్యూనిటీ మొబిలైజేషన్ వంటి విధులను నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రంగంలో కెరీర్ ప్రారంభించాలంటే మాత్రం పీజీ స్థాయిలో ఉండే సోషల్ వర్క్, సంబంధిత కోర్సులను ఎంచుకోవాలి. ఈ క్రమంలో కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. సమాజ మార్పు దిశగా ఆలోచించే తత్వం, ఆశావహ దృక్ఫథం, ప్రజలతో స్నేహంగా వ్యవహరించే సామర్థ్యం ఉన్న వారు ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు.
-ప్రొఫెసర్ లక్ష్మి లింగం,
డిప్యూటీ డెరైక్టర్, టిస్-హైదరాబాద్ క్యాంపస్.
డెవలప్‌మెంటల్ స్టడీస్
గత కొంతకాలంగా అన్ని రంగాల్లో విస్తృతంగా వినిపిస్తున్న పదం ‘డెవలప్‌మెంట్’. ఈ శాస్త్రానికి సంబంధించిన మూలాలు ఎకనామిక్స్ (ఆర్థికశాస్త్రం)లో ఉన్నాయి. ఇది ఒక మల్టిడిసిప్లినరీ సబ్జెక్ట్. ఇందులో తత్వ శాస్త్రం, మానవ శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఎకాలజీ, చరిత్ర, అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయ శాస్త్రం, ప్రజా నిర్వహణ, సామాజిక శాస్త్ర అనువర్తనాలు ఉంటాయి. అభివృద్ధికి సంబంధించిన సామాజిక, ఆర్థిక అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ప్రవేశపెట్టింది డెవలప్‌మెంట్ స్టడీస్. ఈ కోర్సును అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ స్థాయిలో అందిస్తున్నాయి. ఈ కోర్సును ఎంఏ (డెవలప్‌మెంట్ స్టడీస్)గా వ్యవహరిస్తారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరొచ్చు. దీన్ని పూర్తి చేసిన వారికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అవకాశాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా మనదేశంలో. వీరికి ప్రభుత్వ రంగంలో, ఎన్‌జీవో, ప్రైవేట్ కన్సల్టెన్సీస్, మీడియా, వరల్డ్ బ్యాంక్, ఐక్యరాజ్యసమితి తదితర సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై (వెబ్‌సైట్: www.tiss.edu), ఐఐటీ-మద్రాస్ (వెబ్‌సైట్: www.iitm.ac.in), ఐఐటీ-ఢిల్లీ (వెబ్‌సైట్: www.iitd.ac.in), మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్-చెన్నై (వెబ్‌సైట్: www.mids.ac.in), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్- త్రివేండ్రం (వెబ్‌సైట్: www.cds.edu), ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్-ముంబై (వెబ్‌సైట్: www.igidr.ac.in) సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో రూ. 30 నుంచి 40 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ. లక్షకు పైగానే సంపాదించవచ్చు.
ఎకనామిక్స్
ప్రపంచీకరణ నేపథ్యంలో శరవేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక, కార్పొరేట్ రంగా ఫలితంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఆర్థికశాస్త్రం పట్టభద్రులకు. ఎకనమిక్ ఎనలిస్ట్, రీసెర్చర్స్, కన్సల్టెంట్ వంటి విభాగాల్లో అవసరమైన స్థాయిలో మానవవనరులు లభించడం లేదు. ఎకనమిక్స్ సంబంధిత కోర్సులు పూర్తి చేసిన వారు బ్యాంకులు, వాణిజ్యం, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్, పారిశ్రామిక రంగాల్లో వివిధ స్థిర పడొచ్చు. ఈ క్రమంలో ఎకనమిస్ట్, రీసెర్చర్, ఎగ్జిక్యూటివ్, ఎనలిస్ట్, మేనేజర్, ఎకనోమెట్రీషియన్, అడ్వైజర్ వంటి హోదాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ విషయానికొస్తే.. యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనమిక్ సర్వీసెస్ పరీక్షకు హాజరుకావచ్చు. ఎగ్జామ్ ద్వారా ప్రణాళిక సంఘం, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-ఎ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ అవకాశాలను అందుకోవాలంటే మాత్రం కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి.. విశ్లేషణ సామర్థ్యం, గణిత-సాంఖ్యక శాస్త్ర పరిజ్ఞానం, వేగంగా నిర్ణయం తీసుకునే నేర్పు, కష్టించే తత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్. ఎకనామిక్స్‌కు సంబంధించి పలు నూతన సబ్జెక్ట్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అవి.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్ తదితరాలు. వీటిని ఎంచుకోవడం ద్వారా మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఎకనామిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పని చేస్తున్న సంస్థను బట్టి ప్రారంభ స్థాయిలో రూ.15 నుంచి 25 వేల మధ్య వేతనం లభిస్తుంది. తర్వాత హోదా, అనుభవం, పనితీరు ఆధారంగా రూ. 30 నుంచి రూ. 50 వేలకు పైగానే సంపాదించవచ్చు.
సోషియాలజీ
ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. సోషియాలజీ. మన రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది. అంతేకాకుండా సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఐఐటీలు కూడా సోషియాలజీని కోర్ సబ్జెక్ట్‌గా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ) అందిస్తున్నాయి. అవి.. ఐఐటీ-కాన్పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్‌డీ.ఐఐటీ-ఢిల్లీ; కోర్సులు: పీజీ, పీహెచ్‌డీ. ఐఐటీ- ఖరగ్‌పూర్; కోర్సులు: పీజీ, పీహెచ్‌డీ. సోషియాలజీలో ఉమెన్ డవలప్‌మెంట్, రూరల్ డవలప్‌మెంట్, ట్రైబల్ డవలప్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందుకోవచ్చు. పీహెచ్‌డీ పూర్తిచేసి అకడమిక్‌తో పాటు వివిధ రంగాల్లో డేటా అనలిస్ట్, సర్వే రీసెర్చర్, ప్రాజెక్టు మేనేజర్ వంటి ఉన్నత ఉద్యోగావకాశాలను చేజిక్కించుకోవచ్చు. సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారు అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలను దక్కించుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో, ప్రభుత్వ పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. ఆఫీస్‌లో వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ కల్పించడం ద్వారా ఉద్యోగులతో మరింత ప్రభావవంతంగా పని చేయించుకోవడానికి.. ఎంఎన్‌సీలు కూడా సోషియాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం వంటి విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీ చేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో కనీసం రెండు లక్షల వార్షిక వేతనం ఉంటుంది. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు. ఇలా గంటకు రూ. వేయి నుంచి రూ.5 వేల వరకు ఫీజు పొందుతున్న వారూ ఉన్నారు.
పస్తుతం సోషియాలజీ కోర్సులను అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ ఎన్‌జీవోలతోపాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లోని పలు విభాగాల్లో ఉద్యోగావకాశాలను దక్కించుకోవచ్చు. రాష్ట్రస్థాయిలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సీడీపీవో, సూపర్‌వైజర్, ఉమెన్ ఎక్స్‌టెన్షన్ హోదాల్లో స్థిరపడొచ్చు. ఉపాధి హమీ పథకం, నేషనల్ రూరల్ లైవ్లీహూడ్స్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) లలో సోషియాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నారు. అవకాశాలను దక్కించుకోవాలంటే మాత్రం తదనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. సబ్జెక్ట్ స్కిల్స్, రిపోర్ట్ రైటింగ్, అభివృద్ధి పధకాలను సమాజంతో అన్వయించే నేర్పును సొంతం చేసుకోవాలి.
-ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్,
ప్రొఫెసర్ అండ్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషియాలజీ,
ఉస్మానియా యూనివర్సిటీ.
ఆంత్రోపాలజీ
మావన సంస్కృతి, నాగరికత, అచార, సంప్రదాయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేది ఆంత్రోపాలజీ. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి మ్యూజియం, లైబ్రరీలు, గ్యాలరీలు, ఆర్కివ్స్, పబ్లిషింగ్ హౌసెస్, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ హౌసెస్ సంబంధిత సంస్థలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐసీఎంఆర్ వంటి జాతీయ సంస్థలతోపాటు యూనిసెఫ్, యూనెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థల్లో వివిధ హోదాల్లో స్థిరపడొచ్చు. తూర్పు దేశాల్లో వీరికి కూడా అవకాశాలు ఎక్కువ. వేతనాల విషయానికొస్తే.. పని చేస్తున్న సంస్థను బట్టి రూ. 15 వేల నుంచి 25 వేల మధ్య వేతనం ప్రారంభంలో లభిస్తుంది.
ఫైన్ ఆర్ట్స్
ఇతర రంగాలకు భిన్నంగా.. కళాత్మాక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి చక్కని వేదికగా నిలుస్తోన్నాయి.. ఫైన్ ఆర్ట్స్ కోర్సులు. డిజైన్, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, ఇంటిరీయర్ డిజైన్, డ్రామా, ఫోటోగ్రఫి, స్కల్‌ప్చ్‌ర్, యానిమేషన్ వంటి విభాగాలు ఇందులో ఉంటాయి. వీటికి సంబంధించి మన రాష్ట్రంలోని జేఎన్‌ఏఎఫ్‌యూ, తెలుగు విశ్వవిద్యాలయం సహా మరి కొన్ని యూనివర్సిటీలు బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మ్యూజియం, పబ్లికేషన్స్, యూనివర్సిటీలు, అడ్వర్‌టైజింగ్, టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్, మీడియా సంస్థలు, ఫ్యాషన్ హౌసెస్, డ్రామా థియేటర్స్, ఆర్ట్ స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్‌లలో పలు హోదాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 10-15 వేలకు తక్కువ కాకుండా వేతనం అందుకోవచ్చు.
లాంగ్వేజెస్
భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తున్న ప్రభావవంతమైన సాధనాల్లో భాష ఒకటి. అలాంటి భాష నేడు పలు రకాల ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. తెలుగు, ఇంగ్లిష్ వంటి భాషలను బ్యాచిలర్, పీజీ స్థాయిల్లో అధ్యయనం చేయడం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీలుగా స్థిర పడొచ్చు. ద ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌యూ-న్యూఢిల్లీ వంటి యూనివర్సిటీలు సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. విదేశీ భాషలను నేర్చుకోవడం అవకాశాలను మరింత విస్తృతం చేస్తుంది. ఈ క్రమంలో ట్రాన్స్‌లేషన్, డాక్యుమెంటేషన్, ఇంటర్‌ప్రిటేషన్, టీచింగ్, రీసెర్చ్, రాయబార కార్యాలయాలు, టూరిజం సెక్టర్, వివిధ ఎంఎన్‌సీలలో పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో నెలకు రూ. 15 వేలకు తక్కువ కాకుండా వేతనం అందుకోవచ్చు.
ఇతర అవకాశాలు

- సోషల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు మిగతా అభ్యర్థులు మాదిరిగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.
- టీచింగ్‌పై ఆసక్తి ఉంటే బీఈడీ, డీఈఈసెట్, పీఈసెట్, లాంగ్వేజ్ పండిట్స్ పరీక్షలకు హాజరుకావచ్చు. సంబంధిత కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు/ కాలేజీలు/ యూనివర్సిటీలలో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించవచ్చు.
- మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.
- మేనేజ్‌మెంట్ కోర్సులపై ఆసక్తి ఉంటే బీబీఏ/బీబీఎం, ఎంబీఏ కోర్సులను ఎంచుకోవచ్చు.
- లా: సోషల్ సెన్సైస్‌లలో అత్యధిక మంది అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ తర్వాత లా కోర్సులను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ‘లా’ కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్), జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్), ఏఐఎల్‌ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా (ఎల్‌శాట్) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు.
- పోటీ పరీక్షల ప్రపంచంలో బీఏ విద్యార్థులదే పైచేయి అని ఎన్నోసార్లు రుజువైంది. నియామక పరీక్షలైనా, ఉన్నత విద్య కోసం నిర్వహించే ‘సెట్’లైనా.. బీఏ విద్యార్థులు ముందంజలో ఉంటారు. సమకాలీన అంశాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై వీరికి పట్టు ఉండటమే అందుకు కారణం. సమాజ స్థితిగతులను అవగతం చేసుకునే అవకాశం వీరికున్నంతగా మరెవరికీ లేదు. కాబట్టి సివిల్స్, గ్రూప్స్ లక్ష్యంగా కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే కష్టపడితే వీటిల్లో సులభంగానే విజయం సాధించవచ్చు.
- ఆర్కీయాలజీ: వివిధ తవ్వకాలు ఇతర మార్గాల ద్వారా లభించిన.. పూర్వం మానవులు ఉపయోగించిన పనిముట్ల నుంచి సంస్కృతి తదితర అంశాలను అధ్యయనం చేసేదే ఆర్కియాలజీ. చారిత్రక అంశాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి సరిపోయే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ రంగంలో ఆర్కీయాలజికల్ శాఖలు, ప్రైవేట్ రంగంలోని సంబంధిత విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.
- పొలిటికల్ సైన్స్: ఇందులో రాజకీయ విలువలు, సంస్థలు, అవి పని చేసేతీరు, రాజ్యాంగం వంటి అంశాలు ఉంటాయి. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి టీచింగ్, రీసెర్చ్, పబ్లిషింగ్, బిజినెస్, జర్నలిజం రంగాల కేంద్రీకృతంగా అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుతం అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. అయితే ఆ అవకాశాలను అందుకోవాలంటే కేవలం అకడమిక్ పరిజ్ఞానమే సరిపోదు. తదనుగుణంగా స్వీయ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అవి.. రైటింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, నిరంతర అధ్యయనం, సామాజిక అంశాలపై అవగాహన, అన్వేషించే గుణం, విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే విశ్లేషణ సామర్థ్యం, కంప్యూటర్స్‌పై కనీస అవగాహన. కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఈ నైపుణ్యాలను పెంచుకునే దిశగా ప్రయత్నించడం ప్రయోజనకరం.
పరిధి విస్తృతం.. అవకాశాలు అపారం
ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్ విభాగాల్లో అకడెమిక్ కోర్సుల పరిధి ఎంతో విస్తృతం. అదే సమయంలో అవకాశాలు కూడా అపారంగా లభిస్తున్నాయి. ఆర్ట్స్ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ మాత్రమే అనే పరిధిలు వీడుతున్నాయి. లింగ్విస్టిక్స్ నుంచి ప్రొఫెషనల్ ‘లా’ కోర్సుల వరకు ఈ విభాగంలో ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ విభాగాల్లో భవిష్యత్తుల్లో ఉన్నత స్థానాలు కోరుకునే విద్యార్థులు.. ఇంటర్మీడియెట్ దశ నుంచే నిర్దిష్ట లక్ష్యంతో తమకు అనుగుణమైన గ్రూప్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు ప్రభుత్వోద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుంటే ఇంటర్మీడియెట్ స్థాయిలో హెచ్‌ఈసీ, డిగ్రీ స్థాయిలో బీఏ వంటి కోర్సులు ఎంతో లాభిస్తాయి. అదే విధంగా నేడు లాంగ్వేజ్ కోర్సు ఉత్తీర్ణులకు కూడా జాబ్ మార్కెట్‌లో బాగా డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా లింగిస్ట్విక్స్ విభాగంలో జర్మన్, ఫ్రెంచ్ కోర్సుల్లో సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌కు పలు బీపీఓలు, ఫార్మాస్యుటికల్ సంస్థలు, ఆయా ఎంబసీల్లో ఇంటర్‌ప్రిటేటర్స్‌గా ఉపాధి లభిస్తోంది. నాలుగైదేళ్ల క్రితం వరకు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలకే పరిమితమైన క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్.. ఆర్ట్స్ విభాగాల్లోనూ మొదలయ్యాయి. ఫలితంగా ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఎంఎన్‌సీలు, ఎన్‌జీఓలు, కార్పొరేట్ సంస్థల్లో సీఎస్‌ఆర్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. విద్యార్థులు కోర్సులో చేరే సమయంలో తమ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేటు ఉద్యోగమా అని నిర్దిష్ట లక్ష్యం ఏర్పరచుకుని ఆ దిశగా ప్రిపరేషన్ సాగిస్తే ఆశించిన గమ్యం సులభంగా చేరుకోవచ్చు.
- ఎస్. మల్లేశ్, ప్రిన్సిపాల్,
ఓయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సెన్సైస్
Published date : 05 Jun 2014 03:42PM