కెరీర్‌కు టికెట్.. ఎయిర్ టికెటింగ్
Sakshi Education
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పలు ఫ్లైట్స్ షెడ్యూల్స్, ఎయిర్ టారిఫ్, టూర్ ప్లానింగ్ సంబంధిత వివరాల కోసం నేడు చాలా మంది ట్రావెల్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటం కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీల ప్రాముఖ్యాన్ని పెంచుతోంది. దీంతో ఎయిర్ టికెటింగ్ కోర్సు చేసిన అభ్యర్థులకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.
కోర్సు స్వరూపం
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎయిర్ టికెటింగ్ కోర్సు చేసిన వారు టూర్ గైడ్‌గా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఈ కోర్సులో విమాన టికెట్ల ను రిజర్వ్ చేయడం నుంచి హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ సంబంధిత అంశాలను బోధిస్తారు. సాధారణంగా ఇందులో మూడు మాడ్యూల్స్ ఉంటాయి. మొదటి మాడ్యూల్-ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్. ఇందులో ప్రయాణానికి సంబంధించి ఉపయో గించే జియోగ్రాఫికల్ కోడ్స్, ట్రావెల్ ఫార్మాలిటీస్, టికెట్ల రిజర్వేషన్ విధానాలు, ట్రావెల్ ఏజెన్సీ మేనేజ్‌మెంట్ వంటి అంశాలుంటాయి. రెండో మాడ్యూల్- కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్. దీనిలో టైమ్ టేబుల్ చెక్, విమానాల లభ్యత, క్రియేటింగ్ పీఎన్‌ఆర్, హోటల్ రిజర్వేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇక.. కోర్సులో కీలక విభాగమైన కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్‌లో కస్టమర్లతో వ్యవహరించే విధానం, రెజ్యుమె ప్రిపరేషన్, ఇంటర్వ్యూ టెక్నిక్స్,సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ వంటి అంశాలుంటాయి.
అర్హత: కొన్ని సంస్థలు పదో తరగతి అర్హతతో సర్టిఫికెట్ కోర్సును.. మరికొన్ని సంస్థలు 10+2/ఇంటర్ అర్హతతో ఎయిర్ టికెటింగ్ కోర్సు కు సంబంధించి డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. కాల వ్యవధి ఆయా కోర్సులను బట్టి 2 నుంచి 6 నెలలు లేదా ఏడాది పాటు ఉంటుంది.
కావాల్సిన స్కిల్స్:
కేవలం స్వదేశీ ప్రయాణికులే కాకుండా అంతర్జాతీయ ప్రయాణికుల తో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్ (మాట్లా డడం, రాయడం) తప్పనిసరి. మ్యాథమెటిక్స్‌లో ప్రాథమిక అంశాల పై పట్టు.. పలు రకాల వ్యక్తులతో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం కూడా ఎంతో. కేవలం టికెట్ల ను బుక్ చేయడమే కాకుండా ఒక ట్రావెల్ గైడ్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసే సామర్థ్యం ఉండాలి.
అవకాశాలు
ప్రస్తుతం విమానయాన రంగంలోకి పలు సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీంతో అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ ఎయిర్‌లైన్ కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ట్రావెల్ ఏజెన్సీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ట్రాఫిక్ అసిస్టెంట్, రెవెన్యూ అకౌంటెంట్స్ వంటి అవకాశాలుంటాయి. అంతే కాకుండా వివిధ ఎయిర్‌లైన్ సంస్థల్లో ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూ టివ్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎగ్జిక్యూటివ్స్, చెక్-ఇన్ అండ్ టికెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
ఆఫర్ చేస్తోన్న సంస్థలు
- క్యువోనీ అకాడెమీ -
వెబ్‌సైట్: www.kuoniacademy.co.in
- (ఈ ఇన్‌స్టిట్యూట్‌కు హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా 18 ట్రైనింగ్ సెంటర్లున్నాయి.)
- ట్రేడ్-వింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ముంబై)-
వెబ్‌సైట్: www.onlinetraveledu.com
- ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అకాడెమీ -
వెబ్‌సైట్: www.airlinesacademy.com
- ఎవలాన్ అకాడెమీ ఆఫ్ ఏవియేషన్(చెన్నై)-
వెబ్‌సైట్: www.avalonacademy.in
- అడ్వెంచెర్ స్కూల్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ -అబిడ్స్, హైదరాబాద్.
వెబ్‌సైట్: www.adventuretourstravels.com

Published date : 12 Mar 2012 03:25PM