ఘనమైన ఉపాధికి... గణాంకం
Sakshi Education
స్టాటిస్టిక్స్ (గణాంకాలు).. ప్రస్తుత గ్లోబలైజేషన్ నేపథ్యంలో అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో కీలకంగా మారింది.
గణాంకాల ఆధారంగానే ఆయా సంస్థలు తమ పనితీరును విశ్లేషించుకోవడానికి, లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి వీలవుతుంది. అంతటి కీలకమైన గణాంకాల రూపకల్పన సాదాసీదా అంశం కాదు. సంబంధిత అంశంలో నైపుణ్యం కావాలి. అలాంటి వారి కోసం ఇప్పుడు కంపెనీలు అన్వేషిస్తున్నాయి. స్టాటిస్టిక్స్‌లో సర్టిఫికెట్ హోల్డర్లకు కంపెనీలురెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. రూ. వేలల్లో జీతాలు అందిస్తున్నాయి. ఇంతటి సమున్నత అవకాశాలు కల్పించే సాటిస్టిక్స్‌పై స్పెషల్ ఫోకస్..
మ్యాథమెటిక్స్‌లోని...ఒక ప్రధాన విభాగం స్టాటిస్టిక్స్. ఇందులో గణాంకాలు, సేకరణ, విశ్లేషణ, వివరణ, వ్యాఖ్యానం వంటి అంశాలు ఉంటాయి. ఇది కేవలం ఒక రంగం లేదా పరిశ్రమకో పరిమితం కాదు. ప్రతి వ్యాపార సంస్థలోనూ అవసరమైన విభాగం. స్టాటిస్టిక్స్‌లో నిష్ణాతులైన వారిని స్టాటిిస్టీషియన్ అంటారు. వీరు తమ విభాగానికి చెందిన డేటాను సేకరిస్తారు. దాన్ని వివిధ పద్ధతుల ద్వారా విశ్లేషించి ఆ రంగంలోని సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవటానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు బిజినెస్ స్టాటిస్టిక్స్(వ్యాపార గణంకాలు) సహాయంతో ఆర్థిక వేత్తలు (ఎకనమిస్ట్), గణాంక నిపుణులు(స్టాటిస్టిషియన్స్).. రాబోయే కాలంలో మార్కెట్ ధోరణులు ఎలా ఉంటాయి? అనే అంశాన్ని అంచనా వేస్తారు.
అన్ని రంగాల్లో
స్టాటిస్టిక్స్ అవసరం కేవలం ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి అంతర్జాతీయ స్థాయి సంస్థల వరకు ఉంటుంది. ఆయా రంగాల్లో ప్రగతిని (ప్రోగ్రెస్) తెలుసుకోవడానికి.. చేపట్టాల్సిన చర్యలను సూచించడానికి మూలాధారంగా స్టాటిస్టిక్స్ నిలుస్తాయి. ఈ క్రమంలో విభిన్న రకాల బ్రాంచ్‌లు ఉంటాయి. అవి.. క్రైమ్ స్టాటిస్టిక్స్, సెన్సెస్ స్టాటిస్టిక్స్, ఎకలాజికల్ స్టాటిస్టిక్స్, మెడికల్ స్టాటిస్టిక్స్, స్పోర్ట్స్ స్టాటిస్టిక్స్, ఎలక్షన్ స్టాటిస్టిక్స్, టూరిజం స్టాటిస్టిక్స్, ఆయిల్ స్టాటిస్టిక్స్, ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్, లేబర్ స్టాటిస్టిక్స్, మార్కెటింగ్ స్టాటిస్టిక్స్, ఫిల్మ్ స్టాటిస్టిక్స్, పాపులేషన్ స్టాటిస్టిక్స్, యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్, డిస్ట్రిక్ట్ స్టాటిస్టిక్స్, స్ట్టేట్ స్టాటిస్టిక్స్.
ప్రవేశం ఇలా
స్టాటిస్టిక్స్‌కు సంబంధించి డిప్లొమా నుంచి బ్యాచిలర్ వరకు పీజీ నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను ఎంచుకోవడం ద్వారా స్టాటిస్టిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేకంగా విభాగాలు ఉన్నట్లే స్టాటిస్టిక్స్‌లోనూ కొన్ని స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి.. డేటా అనాలిసిస్; బయో స్టాటిస్టిక్స్; బిజినెస్ స్టాటిస్టిక్స్; అప్లయిడ్ ఇన్ఫర్మేషన్ ఎకనామిక్స్; కెమోమెట్రిక్స్.
రాష్ట్రంలో
రాష్ట్రంలో బ్యాచిలర్ స్థాయి నుంచి స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్/అప్లికేషన్స్, కెమిస్ట్రీ/ఫిజిక్స్‌లతో ఒక ఆప్షన్‌గా బీఎస్సీలో స్టాటిస్టిక్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆసక్తి ఉంటే పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరొచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివరాలకు ఆయా వర్సిటీల వెబ్‌సైట్స్‌ను చూడొచ్చు.
జాబ్ ప్రొఫైల్స్
గణాంకశాస్త్రాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలంటే కొన్ని స్కిల్స్ తప్పనిసరి. ఎందుకంటే మిగతా రంగాలతో పోలిస్తే ఇందులో రాణించడానికి నైపుణ్యాలు కీలక పాత్ర వహిస్తాయి. తదనుగుణంగా కొన్ని స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి.
అవి..
అవకాశాలు
ప్రస్తుత కాలంలో స్టాటిస్టిక్స్ సంబంధం లేని రంగమంటూ ఏదీ లేదు. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ రంగ విభాగాల వరకు, సాధారణ కంపెనీల నుంచి మల్టీనేషనల్ కంపెనీ (ఎంఎన్‌సీ)ల వరకు ఇలా ప్రతి రంగానికి స్టాటిస్టిక్స్ అవసరం ఎంతగానో ఉంటోంది. ఆయా సంస్థలు చేపట్టే సర్వేలు, ఆపరేషన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అభివృద్ధి కార్యక్రమాలు, సంబంధిత అవసరాల కోసం స్టాటిస్టిషియన్స్ అవసరమవుతారు. ఈ నేపథ్యంలో స్టాటిస్టిక్స్ అభ్యర్థులకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ రంగంతో సమానంగా, ప్రభుత్వ రంగంలో కూడా అవకాశాలు కల్పిస్తున్న అరుదైన కోర్సుల్లో స్టాటిస్టిక్స్ ఒకటి. బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వ రంగ కంపెనీలు, రీసెర్చ్ ఫార్మ్స్, సోషియో-ఎకనమిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఆర్థిక-వ్యాపార, వాణిజ్య రంగాలతో ముడిపడిన అన్ని రకాల సంస్థలు స్టాటిస్టీషియన్స్‌కు ఉపాధి వేదికలుగా నిలుసున్నాయి. ఆసక్తి ఉంటే సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా/ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
వేతనాలు
వేతనాలు కూడా ఆకర్షణీయంగానే ఉంటాయి. ప్రైవేట్ రంగంలో కెరీర్ ప్రారంభంలో సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పేప్యాకేజ్‌లు ఉంటాయి. తర్వాత అనుభవం ఆధారంగా సంవత్సరానికి రూ.10 లక్షల వరకు సంపాదించవచ్చు. అదే అంతర్జాతీయ స్థాయి సంస్థలు..గోల్డ్‌మెన్ శాంక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి వాటిల్లో సంవత్సరానికి రూ. 15 లక్షల నుంచి రూ. 18 లక్షల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. భారీ పేప్యాకేజ్‌లను దక్కించుకోవాలంటే మాత్రం మాస్టర్స్, లేదా స్పెషలైజ్‌డ్ ఏరియాల్లో పీహెచ్‌డీ డిగ్రీలు తప్పనిసరి. ప్రభుత్వ రంగంలో వేతనాలు భారీగానే ఉంటున్నాయి. ఆయా హోదాలను బట్టి సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతలో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా సగటున రూ. 12 లక్షల వార్షిక వేతనం లభిస్తుండటమే ఈ కోర్సుకున్న డిమాండ్‌కు ప్రత్యక్ష నిదర్శనం.
టాప్ రిక్రూటర్స్
ప్రైవేట్ రంగం: ఇన్ఫోసిస్, హెచ్‌పీ టెక్నాలజీస్, జీఈ, హెచ్‌ఎస్‌బీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, గోల్డ్‌మెన్ శాంక్స్, మోర్గాన్ స్టాన్లీ, మెకంజీ, టీసీఎస్, విప్రో, నోవార్టీస్
ప్రభుత్వం రంగం: ప్లానింగ్ కమిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ మ్యాన్‌పవర్ రీసెర్చ్, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్, నేషనల్ శాంపిల్ ఆఫీస్, లేబర్ బ్యూరో , ఇక్రిశాట్, ఐసీఏఆర్‌డీఏ
టాప్ ఇన్‌స్టిట్యూట్స్
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లు
కోల్‌కతా- వెబ్‌సైట్: www.isical.ac.in
బెంగళూరు- వెబ్‌సైట్: www.isibang.ac.in
చెన్నై- వెబ్‌సైట్: www.isichennai.res.in
ఢిల్లీ- వెబ్‌సైట్: www.isid.ac.in
సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్-యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
వెబ్‌సైట్: www.crraoaimscs.org
ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.iasri.res.in
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్-ముంబై
వెబ్‌సైట్: www.iipsindia.org
సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్-పుణే యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.unipune.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్
వెబ్‌సైట్: www.iitk.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ముంబై
వెబ్‌సైట్: www.iitb.ac.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టాటిస్టిక్స్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.icmr.nic.in
ప్రత్యేక పరీక్షలు
పరీక్ష: ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్)
అర్హత: పీజీ ఇన్ స్టాటిస్టిక్స్/మ్యాథమ్యాటికల్ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్
హోదా: కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంబంధ శాఖలు, ప్లానింగ్ కమిషన్, తదితర విభాగాల్లో గ్రేడ్-4 కేడర్‌లో జూనియర్ టైం స్కేల్ హోదా ఆఫీసర్‌స నియామకం కోసం యూపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు అసిస్టెంట్ డెరైక్టర్, డెరైక్టర్ లెవల్-1, గ్రేడ్-1, రీసెర్చ్ ఆఫీసర్ హోదాలో (జూనియర్ టైం స్కేల్) కెరీర్ ప్రారంభించవచ్చు. అనుభవం, పనితీరు ఆధారంగా ప్రిన్సిపల్ అడ్వైజర్ లేదా చీఫ్ అడ్వైజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
వివరాలకు: www.upsc.gov.in
వేతనం: సంవత్సరానికి రూ. 4.5 లక్షల నుంచి రూ. 18 లక్షలు
పరీక్ష: సబార్డినేట్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఎస్‌ఎస్‌ఎస్)
అర్హత: గ్రాడ్యుయేషన్ (స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్)
హోదా: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టాటిస్టికల్ ఇన్వెస్ట్‌గేటర్ గ్రేడ్-1, 2 హోదా ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) రాత పరీక్ష నిర్వహిస్తుంది.
వివరాలకు: ssc.nic.in
వేతనం: సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షలు
పరీక్ష: ఏపీపీఎస్సీ- ఏఎస్‌ఓ
అర్హత:గ్రాడ్యుయేషన్ (స్టాటిస్టిక్స్) లేదా మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్/ కంప్యూటర్ సైన్‌స/ కామర్‌సలతో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా కనీసం ఒక సంవత్సరం అయిన చదివి ఉండాలి.
హోదా: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్.
వివరాలకు: www.apspsc.gov.in
వేతనం: నెలకు రూ. 11,530 నుంచి రూ. 33,200

- విశ్లేషణాత్మక సామర్థ్యం
- మ్యాథమెటికల్ ఎబిలిటీస్
- గ్రహణ సామర్థ్యం
- అనువర్తన సామర్థ్యం
- ప్రశ్నావళిని రూపొందించడం
- సర్వేలను నిర్వహించడం

ప్రాముఖ్యత పెరుగుతోంది స్టాటిస్టిక్స్ అవసరం కేవలం ఏదో ఒక రంగానికి పరిమితం కాలేదు. రాజకీయం రంగం నుంచి జియోగ్రాఫికల్, హైడ్రాలాజికల్.. ఇలా అన్ని రంగాల్లోనూ దీని ప్రాముఖ్యత పెరుగుతోంది. స్టాటిస్టిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి ప్రాక్టికల్‌గా డేటా అనాలిసిస్ చేయడం, ఇంటర్‌ప్రిటేషన్ చేయడం వంటి నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇందులో అత్యున్నత హోదాలో స్థిరపడాలంటే మాత్రం పీజీ డిగ్రీ తప్పనిసరి. దాంతోపాటు కంప్యూటర్స్ పరంగా స్టాట్స్ ప్యాకేజీలపై అవగాహన ఉండాలి. పీజీ తర్వాత ఎస్‌ఏఎస్, ఎస్‌పీఎస్‌ఎస్ వంటి యాడ్ ఆన్ కోర్సులను చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. డేటా అనాలిసిస్ వంటి స్పెషలైజేషన్స్‌తోపాటు ఎన్‌జీఆర్‌ఐ వంటి సంస్థల్లో రీసెర్చ్ పరంగా కూడా స్టాటిస్టిక్స్ అభ్యర్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. స్టాటిస్టిక్స్ అభ్యర్థులను టీసీఎస్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు బిజినెస్ ఎనలిస్ట్‌లుగా నియమించుకుంటున్నాయి. సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పే-ప్యాకేజ్‌లను అందిస్తున్నాయి. నోవార్టిస్ వంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ విభాగం కోసం స్టాట్స్ అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. -డాక్టర్ వి.వి.హరగోపాల్, ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఉస్మానియా యూనివర్సిటీ. |
ప్రత్యేక పరీక్షలు
పరీక్ష: ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్)
అర్హత: పీజీ ఇన్ స్టాటిస్టిక్స్/మ్యాథమ్యాటికల్ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్
హోదా: కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంబంధ శాఖలు, ప్లానింగ్ కమిషన్, తదితర విభాగాల్లో గ్రేడ్-4 కేడర్‌లో జూనియర్ టైం స్కేల్ హోదా ఆఫీసర్‌స నియామకం కోసం యూపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు అసిస్టెంట్ డెరైక్టర్, డెరైక్టర్ లెవల్-1, గ్రేడ్-1, రీసెర్చ్ ఆఫీసర్ హోదాలో (జూనియర్ టైం స్కేల్) కెరీర్ ప్రారంభించవచ్చు. అనుభవం, పనితీరు ఆధారంగా ప్రిన్సిపల్ అడ్వైజర్ లేదా చీఫ్ అడ్వైజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
వివరాలకు: www.upsc.gov.in
వేతనం: సంవత్సరానికి రూ. 4.5 లక్షల నుంచి రూ. 18 లక్షలు
పరీక్ష: సబార్డినేట్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఎస్‌ఎస్‌ఎస్)
అర్హత: గ్రాడ్యుయేషన్ (స్టాటిస్టిక్స్/అప్లయిడ్ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్)
హోదా: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టాటిస్టికల్ ఇన్వెస్ట్‌గేటర్ గ్రేడ్-1, 2 హోదా ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) రాత పరీక్ష నిర్వహిస్తుంది.
వివరాలకు: ssc.nic.in
వేతనం: సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షలు
పరీక్ష: ఏపీపీఎస్సీ- ఏఎస్‌ఓ
అర్హత:గ్రాడ్యుయేషన్ (స్టాటిస్టిక్స్) లేదా మ్యాథమెటిక్స్/ ఎకనామిక్స్/ కంప్యూటర్ సైన్‌స/ కామర్‌సలతో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా కనీసం ఒక సంవత్సరం అయిన చదివి ఉండాలి.
హోదా: అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్.
వివరాలకు: www.apspsc.gov.in
వేతనం: నెలకు రూ. 11,530 నుంచి రూ. 33,200
Published date : 08 Jun 2015 03:03PM