గ్రామీణాభివృద్ధి నిపుణులు పల్లె ప్రగతికి.. మార్గ నిర్దేశకులు
Sakshi Education
2011 జనాభా లెక్కల ప్రకారం దేశ గ్రామీణ జనాభా 83.3 కోట్లు..
ఇంతటి జన ఘనమైన గ్రామీణ భారతం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి పథాన పయనిస్తుంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతను.. ఇలా అనేక సమస్యల్ని రూపుమాపేందుకు రకరకాల కార్యక్రమాలు అమలు చేస్తోంది. కానీ, వీటికి సంబంధించిన వనరుల్లో చాలా వరకు వృథా అవుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌లో 18 శాతం మాత్రమే లక్షిత కుటుంబాలకు చేరువవుతోంది. సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణం. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇవ్వాలంటే పల్లె గడప తొక్కి, వారికి సరైన మార్గనిర్దేశనం చేసే నిపుణులు అవసరం. ఇటీవలి కాలంలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇలాంటి నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.
‘గ్రామీణ’ కోర్సులు:
గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన పథకాల రచన, అమలు, పర్యవేక్షణ, ఫలితాల విశ్లేషణ, ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామీణాభివృద్ధి నిపుణులు అవసరం. దీన్ని గుర్తించిన విశ్వవిద్యాలయాలు, గ్రామీణాభివృద్ధి సంస్థలు ప్రత్యేక కోర్సులకు రూపకల్పన చేసి, ఔత్సాహికులకు అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులున్నాయి.
ఇంతటి జన ఘనమైన గ్రామీణ భారతం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి పథాన పయనిస్తుంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, నిరక్షరాస్యతను.. ఇలా అనేక సమస్యల్ని రూపుమాపేందుకు రకరకాల కార్యక్రమాలు అమలు చేస్తోంది. కానీ, వీటికి సంబంధించిన వనరుల్లో చాలా వరకు వృథా అవుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌లో 18 శాతం మాత్రమే లక్షిత కుటుంబాలకు చేరువవుతోంది. సరైన పంపిణీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణం. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇవ్వాలంటే పల్లె గడప తొక్కి, వారికి సరైన మార్గనిర్దేశనం చేసే నిపుణులు అవసరం. ఇటీవలి కాలంలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇలాంటి నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది.
‘గ్రామీణ’ కోర్సులు:
గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన పథకాల రచన, అమలు, పర్యవేక్షణ, ఫలితాల విశ్లేషణ, ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామీణాభివృద్ధి నిపుణులు అవసరం. దీన్ని గుర్తించిన విశ్వవిద్యాలయాలు, గ్రామీణాభివృద్ధి సంస్థలు ప్రత్యేక కోర్సులకు రూపకల్పన చేసి, ఔత్సాహికులకు అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులున్నాయి.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ- హైదరాబాద్).. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందిస్తోంది. రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోర్సు ఫీజు: ఓపెన్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1.60 లక్షలు. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.1.40 లక్షలు.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం-జైపూర్)..
వెబ్‌సైట్: www.iirm.ac.in
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్(ఆనంద్)..
వెబ్‌సైట్: www.irma.ac.in
- అమిటీ స్కూల్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.amity.edu
- జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్..
వెబ్‌సైట్: www.xiss.ac.in
- టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్..
వెబ్‌సైట్: www.tiss.edu
- గ్రాడ్యుయేషన్ అర్హతతో వివిధ కోర్సుల్లో ప్రవేశించొచ్చు.
- రూరల్ గవర్నెన్స్.
- రూరల్ సొసైటీ, ఎకనామిక్స్.
- రూరల్ సర్వీసెస్, ఇన్‌స్టిట్యూషన్స్
- అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్.
- రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపుల్స్.
- ప్రధానంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి విధానాలు, కార్యక్రమాలు, సంస్థలు, పనితీరుకు సంబంధించిన అంశాలు కరిక్యులంలో ఉంటాయి.
- కోర్సులో క్లాస్‌రూం టీచింగ్‌తో పాటు క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టులు కీలకంగా ఉంటాయి.
గ్రామీణాభివృద్ధి కోర్సులు పూర్తిచేసిన వారికి కళాశాలలు క్యాంపస్ నియామకాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ప్రాధాన్యం పెరగడంతో కార్పొరేట్ సంస్థలు అధిక వేతనాలతో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.
టాప్ రిక్రూటర్‌స:
రెడ్‌క్రాస్ సొసైటీ, వరల్డ్ బ్యాంకు, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటెగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఐఐఆర్‌డీ), టాటా స్టీల్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఆదిత్యా బిర్లా, విప్రో, జిందాల్ తదితర సంస్థలు.
ఉద్యోగాలు లభించే విభాగాలు:
రూరల్ డెవలప్‌మెంట్/ మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్న సంస్థలు; కేంద్ర ప్రభుత్వ సంక్షేమ శాఖలు/ విభాగాలు; రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి సంస్థలు; స్టేట్ లైవ్లీహుడ్ డెవలప్‌మెంట్ సంస్థలు; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో-ఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐపీసీసీడీ), సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు; వివిధ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు తదితరాల్లో ఉద్యోగాలను పొందొచ్చు.
- ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలలో అధిక అవకాశాలు ఉంటాయి.
జాబ్ ప్రొఫైల్స్: - ప్రాజెక్టు కోఆర్డినేటర్.
- ప్రాజెక్టు మేనేజర్.
- రూరల్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలుంటాయి.
- పరిశోధన సంస్థలలో రీసెర్చర్‌గా అడుగుపెట్టొచ్చు.
- ప్రాజెక్టుల రూపకల్పనకు ఫ్రీలాన్సింగ్ సేవలు అందించవచ్చు. లేదా సొంత ప్రాజెక్టులు చేపట్టవచ్చు.
ప్రారంభంలో రూ.20 వేల వరకు అందుకోవచ్చు. ప్రతిష్టాత్మక సంస్థల్లో కోర్సులు పూర్తిచేసిన వారిలో ప్రారంభంలోనే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అందుకుంటున్న వారూ ఉన్నారు.
అవసరమైన నైపుణ్యాలు:
- కమ్యూనికేషన్.
- భిన్న నేపథ్యమున్న ప్రజలతో మమేకం కాగలగడం.
- గ్రామీణ ప్రజలకు సేవ చేయాలన్న తపన.
- ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం.
- ఏ సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండటం.
గ్రామీణాభివృద్ధి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు భవిష్యత్తు బంగారుమయం అనడంలో సందేహం లేదు. కేవలం ప్రభుత్వ రంగంలోనే లక్షల్లో అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో 15.75 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒక్క అంశాన్నే పరిగణనలోకి తీసుకుంటే అంతమందికి తగిన మార్గ నిర్దేశనం చేయడానికి గ్రామీణాభివృద్ధిలో సుశిక్షితులైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమ అమలుకు, సోషల్ అడిట్ నిర్వహణ తదితర అంశాలకు కూడా రూరల్ డెవలప్‌మెంట్ ఉత్తీర్ణులే అవసరమవుతారు. ఇక ప్రైవేటు రంగంలో ఇటీవలే ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తప్పనిసరి చేసింది. దీంతో అన్ని కార్పొరేట్ సంస్థలు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి. వీటికి కూడా సుశిక్షితులైన రూరల్ డెవలప్‌మెంట్ అభ్యర్థులే సరితూగుతారు.
ఎన్‌ఐఆర్‌డీ- పీజీడీఆర్‌డీఎం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ).. ఏడాది కాల వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌డీఎం) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత:
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు. అయితే వీరు గ్రాడ్యుయేషన్‌ను 2014, ఆగస్టు 1లోపు పూర్తిచేయాలి. కోర్సులో 50 మందికి ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
మూడు దశల్లో ఉంటుంది. అవి..
- అఖిల భారత స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష.
- గ్రూప్ డిస్కషన్.
- పర్సనల్ ఇంటర్వూ. వీటిలో ఉత్తీర్ణులైన వారితో తుది జాబితాను రూపొందిస్తారు.
Ex:
- The bookstore is just ___ the corner
a) around
b) across
c) over
d) opposite
e) fill
- Choose the pair of words in the answer choices that best expresses a relationship similar to that expressed in the original pair.
ALCOHOL: INTOXICATION
a) sleep : insomnia
b) Narcotic : Drowsiness
c) Drug : Addiction
d) Food : Hunger
e) Stamps: Hobby
- The largest 4 digit number exactly divisible by 88 is?
a) 9944
b) 9768
c) 9988
d) 8888
e) 1145
- దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2014.
- దరఖాస్తులను ఆన్‌లైన్ లేదా పోస్టల్ ద్వారా పంపుకోవచ్చు.
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.300. మిగిలిన వారికి రూ.500.
- ఎన్‌ఐఆర్‌డీ.. పీజీడీఆర్‌డీఎం కోర్సును రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారు.
- వెబ్‌సైట్: www.nird.org.in
దేశంలో గ్రామీణాభివృద్ధి దిశగా ఎన్నో పథకాలు అమలవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాటిని సమర్థంగా నిర్వహించే నైపుణ్యాలను అందించే కోర్సు పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్. ఎన్‌ఐఆర్‌డీ ఆధ్వర్యంలో 2008లో ప్రారంభమైన ఈ కోర్సుకు జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులోనూ అవకాశాల విషయంలో ఆందోళన అనవసరం. కారణం.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ప్రైవేటు సంస్థలు కచ్చితంగా సామాజిక అభివృద్ధికి చేయూతనందించాలనే నిబంధన నేపథ్యంలో.. ప్రైవేటు రంగంలో అనేక అవకాశాలు లభించడం ఖాయం. ఇక కోర్సు బోధన కూడా ఆసాంతం వైవిధ్యంగా ఉంటుంది. విద్యార్థులకు అకడెమిక్ స్థాయిలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించే విధంగా కోర్సు వ్యవధిలో అయిదారు రోజులు నిర్దేశిత గ్రామీణ ప్రాంతాల్లో ఉండి అక్కడి పరిస్థితులపై ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ స్కిల్స్ అలవడేలా ఇతర ప్రముఖ సంస్థల నిపుణుల లెక్చర్స్‌ను, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ను కూడా అందిస్తున్నాం. ఫలితంగా కోర్సు పూర్తయ్యే నాటికి ఈ రంగంలో సుశిక్షితులుగా రూపొందుతారు.
Published date : 10 Apr 2014 05:12PM