Skip to main content

ఏపీ డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డీఈఈసెట్-2016కు నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఈఈసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిస్టిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ - ట్రైనింగ్‌లు (డైట్‌లు), ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రెండేళ్ల వ్యవధిలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత లేదా ఆయా కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అడ్మిషన్ సమయానికి అర్హత కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు డీఈఈసెట్ దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
  • ఓసీ, బీసీ కేటగిరీలకు సంబంధించి డీఈఈసెట్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులనే పరిగణలోకి తీసుకుంటారు. కనీసం 45 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులతో ఆయా కేటగిరీల్లోని సీట్లను భర్తీ చేస్తారు.
  • ఓసీ/ఎన్‌సీసీ/క్యాప్/స్పోర్ట్స్ కేటగిరీల్లోని సీట్లకు పోటీ పడాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల అభ్యర్థులు డీఈఈసెట్ రాసేందుకు అనర్హులు.
వయసు: డీఈఈసెట్‌కు సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. 2016, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు పూర్తిచేసుకోనున్న అభ్యర్థులంతా డీఈఈసెట్‌కు హాజరుకావొచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: deecetap.cgg.gov.in
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.500. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా (పేమెంట్ గేట్ వే ) ద్వారా చెల్లించవచ్చు.

ముఖ్యసమాచారం
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 20, 2016
  • ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: ఏప్రిల్ 20, 2016,
  • హాల్ టిక్కెట్ల జారీ ప్రారంభం (ఆన్‌లైన్): మే 1, 2016
  • హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు చివరితేదీ(ఆన్‌లైన్): మే 8, 2016
  • డీఈఈసెట్ తేదీ: మే 15, 2016 (3 దశల్లో)
  • ఫలితాల వెల్లడి: మే 25, 2016
పరీక్ష విధానం
డీఈఈసెట్ 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రం రెండు పార్ట్ (ఎ - బి)లుగా ఆబ్జెక్టివ్ విధానంలోఉంటుంది. పార్ట్ ఎ- 60 మార్కులకు; పార్ట్ బి- 40 మార్కులకు ఉంటుంది. డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ పార్ట్ ఎ కామన్‌గా ఉంటుంది.

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

టీచింగ్ ఆప్టిట్యూడ్

05

05

జనరల్ నాలెడ్జ్

05

05

ఇంగ్లిష్

10

10

తెలుగు

10

10

గణితం

10

10

జనరల్ సైన్స్

10

10

సాంఘికశాస్త్రం

10

10

మొత్తం

60

60

  • పదోతరగతి సిలబస్ స్థాయి నుంచి ప్రశ్నలు వస్తాయి. దీనికోసం అభ్యర్థులు 8, 9, 10 తరగతుల్లోని పాఠ్యాంశాలను చదవాల్సి ఉంటుంది.
  • పార్ట్ బి: ఈ విభాగం అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు (ఆప్షనల్) ఆధారంగా ఉంటుంది. ఇంటర్‌లోని ఆయా సబ్జెక్టుల నుంచి 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
  • ఒక్కో ఆప్షనల్‌కు 25 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు.
మ్యాథ్స్
ఇంటర్‌లో మాథ్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివుండాలి.

ఇంటర్

ప్రశ్నలు

మార్కులు

ఫస్ట్ ఇయర్

20

20

సెకండియర్

20

20

మొత్తం

40

40


ఫిజికల్ సైన్స్
ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివిన వారు అర్హులు.

ఇంటర్

ప్రశ్నలు

మార్కులు

ఫస్ట్ ఇయర్-సెకండియర్
ఫిజిక్స్

20

20

ఫస్ట్ ఇయర్- సెకండియర్
కెమిస్ట్రీ

20

20

మొత్తం

40

40


బయలాజికల్ సైన్స్
ఇంటర్‌లో బోటనీ, జువాలజీ సబ్జెక్టులు చదివుండాలి.

ఇంటర్

ప్రశ్నలు

మార్కులు

ఫస్ట్ ఇయర్- సెకండియర్
బోటనీ

20

20

ఫస్ట్ ఇయర్- సెకండియర్
జువాలజీ

20

20

మొత్తం

40

40


సోషల్ స్టడీస్
సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్‌ల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టులను ఇంటర్‌లో చదివుండాలి.

ఇంటర్

ప్రశ్నలు

మార్కులు

ఫస్ట్ ఇయర్- సెకండియర్
హిస్టరీ

13

13

ఫస్ట్ ఇయర్- సెకండియర్
ఎకానమీ

13

13

ఫస్ట్ ఇయర్- సెకండియర్
సివిక్స్

13

13

హిస్టరీ/ఎకానమీ/సివిక్స్

1

1

మొత్తం

40

40


ప్రిపరేషన్ ప్రణాళిక:
ఈసారి నూతన సిలబస్ ఆధారంగా డీఈఈసెట్‌ను నిర్వహించనున్నారు.

టీచింగ్ ఆప్టిట్యూడ్
టీచింగ్ ఆప్టిట్యూడ్ విభాగంలో ఉపాధ్యాయ వృత్తి, తరగతిగది నిర్వహణ, పాఠశాల వాతావరణం, బోధనా సామర్థ్యం వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నలకు తార్కికంగా ఆలోచించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ఉదాహరణ:
1. మొత్తం విద్యావ్యవస్థ ప్రక్షాళనకు మార్గనిర్దేశం చేసిన కమిటీ?
1) యశపాల్ కమిటీ
2) ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ
3) కొఠారీ కమిటీ
4) లార్డ్ మెకాలే కమిటీ
సమాధానం: 3

జనరల్ నాలెడ్జ్
పరీక్షలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి. క్రీడలు, అవార్డులు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక, భౌగోళిక పరమైన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఉదాహరణ:
1. 2016లో ఒలింపిక్స్‌ను ఏ దేశంలో నిర్వహించనున్నారు?
1) ఇంగ్లండ్
2) బ్రెజిల్
3) ఫ్రాన్స్
4) అర్జెంటీనా
సమాధానం: 2

ఇంగ్లిష్
ఇంగ్లిష్ గ్రామర్ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. పదోతరగతి స్థాయి ఇంగ్లిష్ గ్రామర్‌ను ప్రిపేర్ అయితే సరిపోతుంది.
ఉదాహరణ:
1. Insert suitable article in the blank given.
He was ____ Napoleon of his age.
1) a
2) the
3) an
4) zero article
Answer: 2

తెలుగు
తెలుగులో 80 శాతం ప్రశ్నలు వ్యాకరణం నుంచి వస్తాయి. సంధులు, చందస్సు, సమాసాలు, నానార్థాలు, పర్యాయ పదాలు తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి.
ఉదాహరణ:
1. కింది వాటిలో జాతి పద్యం ఏది?
1) సీసం
2) తేటగీతి
3) కంద
4) చంపకమాల
సమాధానం: 3

గణితం
సమితులు, బహుపదులు, ఘాతాలు, ఘాతాంకాలు, రేఖాగణితం, క్షేత్రగణితం, త్రికోణమితి, వర్గమూలాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వ స్తాయి. షార్ట్‌కట్ విధానాల ద్వారా ప్రాక్టీస్ చేస్తే గణితంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు.
ఉదాహరణ:
1. ఒక త్రిభుజానికి గీయగలిగిన అంతర బాహ్యవృత్తాల సంఖ్య?
1) 4
2) 3
3) 1
4) 2
సమాధానం: 1

జనరల్ సైన్స్
పదోతరగతి స్థాయిలోని భౌతిక, రసాయన శాస్త్రాలు, బోటనీ, జువాలజీల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఉదాహరణ:
1. మధుమేహానికి సంబంధించిన గ్రంథి?
1) థైరాయిడ్
2) క్లోమ
3) అధివృక్క
4) పీయూష
సమాధానం: 2

సోషల్ స్టడీస్
పదోతరగతి స్థాయిలోని చరిత్ర, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రాల నుంచి 10 ప్రశ్నలు వస్తాయి.
ఉదాహరణ:
1. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించేది?
1) ఎస్‌బీఐ
2) నాబార్డ్
3) ఆర్బీఐ
4) ఎఫ్‌సీఐ
సమాధానం: 3

విజయసూత్రాలు
  • అభ్యర్థులంతా పార్ట్ ఎలో మెరుగైన స్కోర్ చేస్తే మంచి ర్యాంకు సాధించే అవకాశాలు మెరుగవుతాయి. దీని కోసం గత డీఈఈసెట్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
  • పార్ట్ ఎ కోసం అన్ని సబ్జెక్టులను ప్రాథమిక స్థాయి నుంచి ప్రిపేర్‌కావాలి. దీనికోసం ప్రతి సబ్జెక్టుకు సమయాన్ని కేటాయించాలి.
  • పార్ట్ బిలోని ఆప్షనల్ సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ఇంటర్ రెండు సంవత్సరాల తెలుగు అకాడెమీ పుస్తకాలను చదవాలి. ఇందులో భాగంగా ఇంటర్ రెండేళ్లలో కామన్‌గా ఉన్న చాప్టర్లను ముందుగా చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది.
  • ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన సినాప్సిస్‌తో కూడిన నోట్స్‌ను తయారుచేసుకోవాలి. ఈ పరీక్షను తొలిసారి ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు కాబట్టి విద్యార్థులందరూ తగిన కంప్యూటర్ పరిజ్ఞానంతో పరీక్ష గదిలోకి అడుగుపెట్టాలి.
Published date : 14 Apr 2016 05:40PM

Photo Stories