అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసే కోర్సు.. కంపెనీ సెక్రటరీ
Sakshi Education
పారిశ్రామిక సంస్థలు, ఇతర కార్పొరేట్ కంపెనీల్లో రోజు వారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం.. ఆయా సంస్థల్లోని అంతర్గత వ్యవహారాలను చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించడానికి నిపుణులైన మానవ వనరులు అవసరం. అటువంటి బాధ్యతలను నిర్వర్తించే వారే కంపెనీ సెక్రటరీ (సీఎస్)లు. దేశంలో వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు తగినంత మంది లేకపోడంతో ఈ కోర్సు ఉత్తీర్ణులకు జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సీఎస్ ఫౌండేషన్ కోర్సుకు సెప్టెంబర్ 30, ఎగ్జిక్యూటివ్ కోర్సుకు ఆగస్టు 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎస్ కోర్సు గురించిన వివరాలు...
సీఎస్ కోర్సును ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తుంది. పద్దులు, చిట్టా లెక్కల గణింపు అంటే ఆందోళన చెందే విద్యార్థులకు, కార్యనిర్వాహక నైపుణ్యాలు సొంతం చేస్తూ.. అత్యున్నత కెరీర్‌కు బాటలు వేసే కోర్సు సీఎస్.
దశలుగా:
సీఎస్ కోర్సును ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
మినహాయింపు:
సీఏ ఇంటర్, సీఏ ఫైనల్, సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పూర్తిచేసిన విద్యార్థలకు, కామర్‌స కోర్సుల్లో మాస్టర్‌స డిగ్రీలు కలిగి ఉన్న వారికి సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలోని కొన్ని పేపర్లు రాయాల్సిన అవసరం లేదు. ఆ మేరకు వీరికి మినహాయింపునిచ్చారు (పూర్తి వివరాలను సీఎస్ హెల్ప్ లైన్ నెంబర్ - 01141504444 ద్వారా తెలుసుకోవచ్చు).
కోచింగ్:
సీఎస్ ఔత్సాహికులకు కోచింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. సీఎస్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంతీయ కార్యాలయాల్లో లేదా చాప్టర్‌లలో ఓరల్ కోచింగ్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనే ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను కూడా ఇంటర్నెట్ ద్వారా అందిస్తుంది. ఈ లెర్నింగ్‌లో లైవ్ వర్చువల్ క్లాస్ రూమ్ విధానంలో లెక్చరర్‌సను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. కోర్సుకు సంబంధించిన సందేహాలను నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
అవకాశాలు:
మనదేశంలో ఒక మోస్తరు నుంచి భారీ స్థాయి కంపెనీలు లక్షల్లో ఉంటే.. అందుకు కావల్సిన కంపెనీ సెక్రెటరీల సంఖ్య వేలల్లో మాత్రమే ఉంది. ఈ గణాంకాలే డిమాండ్-సప్లయ్ వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 1956 కంపెనీల చట్టం ప్రకారం రూ. 5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. దీంతో రానున్న రోజుల్లో ప్రతి కంపెనీకి కంపెనీ సెక్రటరీ తప్పనిసరి. కాబట్టి సీఎస్ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలకు ఢోకా లేదని చెప్పొచ్చు. కార్పొరేట్ గవర్నెన్‌స అండ్ సెక్రటేరియల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. పారిశ్రామిక, వ్యాపార రంగాలు వృద్ధి చెందే కొద్దీ సీఎస్‌ల కెరీర్‌కు ఢోకా ఉండదు. ఇవే కాకుండా ఐసీఎస్‌ఐకు దేశవ్యాప్తంగా ఉన్న 76 చాప్టర్లలో పేర్లు నమోదు చేసుకుని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ కూడా జరుగుతున్నాయి. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ చేయవచ్చు.
హోదా:
కంపెనీ సెక్రెటరీలకు రకరకాల హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బోర్‌డ ఆఫ్ డెరైక్టర్‌సకి సలహాలు ఇవ్వడం, కంపెనీ రిజిస్ట్రార్‌గా, కంపెనీ న్యాయ సలహాదారుగా, కంపెనీ విధానాల రూపకర్త, కంపెనీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కంపెనీ ప్రిన్సిపల్ సెక్రటరీ, కంపెనీ యాజమాన్యానికి, వాటాదారులకు, రుణదాతలకు అనుసంధానకర్తగా అనేక హోదాల్లో సీఎస్ అభ్యర్థులు స్థిరపడొచ్చు. కంపెనీ సెక్రటరీలు చీఫ్ ఫైనాన్‌స ఆఫీసర్లుగా, బ్యాంక్ మేనేజర్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
విదేశాల్లో అవకాశాలు:
భారత ప్రభుత్వం, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, మారిషస్, యునెటైడ్ కింగ్‌డమ్ వంటి అనేక దేశాలతో ఆర్థిక వ్యవహారాల ద్వైపాక్షిక ఉమ్మడి పరస్పర సహకార ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని వల్ల కంపెనీ సెక్రటరీలకు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరిగాయి.
వేతనం:
కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్‌కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. బహుళ జాతి సంస్థల్లో పనిచేస్తున్నవారు 10 నుంచి 25 లక్షల రూపాయల వార్షిక వేతనాన్ని పొందుతున్నారు. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపె నీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ ప్రధాన, ప్రాంతీయ కార్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌సలో రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వేతనాన్ని ఆఫర్ చేశారు.
ఎవరిని సంప్రదించాలి?
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలు, చాప్టర్‌స(బ్రాంచీలు) అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. ఆయా కార్యాలయాలను సంప్రదించి కోర్సులో చేరొచ్చు. ఇంటర్నెట్ ద్వారా తగిన వివరాలను పొందొచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu
మొదటి దశ - ఫౌండేషన్
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సును పూర్తి చేసిన వారు ఏవరైనా (ఫైన్ ఆర్‌ట్స మినహాయిస్తే) ఫౌండేషన్ కోర్సులో చేరొచ్చు. దీని కోసం ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సీఎస్ ఫౌండేషన్ ప్రవేశ పరీక్షను కూడా సీఏ సీపీటీ మాదిరిగానే (2013 నుంచి) మల్టిఫుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 400 మార్కులు కేటాయించారు. ఈ పరీక్ష ఒకే రోజు రెండు భాగాలుగా, రెండు పూటలా జరుగుతుంది. ఉదయం రెండు పేపర్లు కలిపి 200 మార్కులకు, మధ్యాహ్నం రెండు పేపర్లు కలిపి 200 మార్కులకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్‌లకు, మధ్యాహ్నం బిజినెస్ ఎకనామిక్స్, ఫండమెంటల్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ సబ్జెక్ట్‌లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలో 400 మార్కులకుగాను 200 మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఈ పరీక్ష ఏడాది కి రెండు సార్లు జరుగుతుంది.
రెండో దశ - ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్
సీఎస్ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాయవచ్చు. సీఏ సీపీటీ ఉత్తీర్ణులు/ సీఎంఏ ఫౌండేషన్ ఉత్తీర్ణులు/ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఫౌండేషన్ కోర్సుతో అవసరం లేకుండా నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. వీటిని రెండు మాడ్యూల్స్‌గా విభజించారు. మాడ్యూల్-1లో 4 పేపర్లు, మాడ్యూల్-2లో 3 పేపర్లు ఉంటాయి. విద్యార్థి వీలును బట్టి రెండు మాడ్యూల్స్ అంటే 7 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కొక్క మాడ్యూల్‌ను విడిగా గానీ 6 నెలల తేడాతో రాయొచ్చు. ప్రతిపేపరుకు వంద మార్కులు కేటాయించారు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతీ పేపర్‌లో వంద మార్కులకు కనీసం 40 మార్కులు, మాడ్యూల్/ మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి సగటు 50 శాతం మార్కులు పొందాలి. ఈ పరీక్షను కూడా జూన్‌లో, డిసెంబర్‌లో సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు.
మూడో దశ - మేనేజ్‌మెంట్ ట్రైనింగ్
రెండోదశలో ఎగ్జిక్యూటివ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 15 నెలల మేనేజ్‌మెంట్ ట్రైనింగ్‌తోపాటు మూడు నెలలపాటు ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. ఈ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్‌ని ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ పూర్తి చేశాక కూడా చేసే సౌలభ్యం కూడా ఉంది. ట్రైనింగ్ కోసం ముందుగా సీఎస్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ప్రతిపాదించిన/అనుమతించిన కంపెనీ లేదా కంపెనీ సెక్రటరీల వద్ద ట్రైనింగ్ తీసుకోవచ్చు.
నాలుగో దశ - ప్రొఫెషనల్ ప్రోగ్రామ్
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు/ ఉత్తీర్ణత సాధించి మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు ప్రోఫెషనల్ ప్రోగ్రామ్ చదవడానికి అర్హులు. ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాసిన సంవత్సరం తర్వాత ఈ ప్రొఫెషనల్ పరీక్షకు హాజరు కావాలి. ఇందులో మొత్తం 9 పేపర్లను 3 మా డ్యూల్స్‌గా విభజించారు. విద్యార్థి వీలును బట్టి 9 పేపర్లు అంటే 3 మాడ్యూల్స్ ఒకేసారి లేదా ఒక్కో మాడ్యూల్‌ను ఒక్కోసారి విడివిడిగా 6 నెలలు తేడాతో రాయవచ్చు. 100 మార్కులకు ఉండే ప్రతి పేపర్‌లో కనీసం 40 మార్కులు, మాడ్యూల్/మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి సగటున 50 శాతం మార్కులను సాధిస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు.
అర్హత: 10+2/ఇంటర్మీడియెట్/డిగ్రీ
ఇన్‌స్టిట్యూట్: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ)
కాల వ్యవధి: డిగ్రీ తర్వాత రెండున్నరేళ్లు,10+2 తర్వాత మూడున్నరేళ్లు
పరీక్ష: ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో
ఫీజు: దాదాపు రూ. 25 వేలు

- ఫౌండేషన్ పరీక్షను డిసెంబర్‌లో రాయాలనుకుంటే.. ఆదే సంవత్సరం మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్ష ఫీజును సెప్టెంబర్ చివరిలోగా చెల్లించాలి.
- ఫౌండేషన్ పరీక్ష తర్వాతి సంవత్సరం జూన్‌లో రాయాలనుకుంటే.. ప్రస్తుత సంవత్సరం సెప్టెంబర్‌లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫీజును మార్చిలోగా చెల్లిచాలి.
- ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ కోర్సుల్లో అన్ని మాడ్యూల్స్ (గ్రూపులు) కలిసి డిసెంబర్‌లో పరీక్షకు హాజరు కావాలనుకుంటే అదే సంవత్సరం ఫిబ్రవరి నెలఖారులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాకాకుండా డిసెంబర్‌లో ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలో ఒక్క మాడ్యుల్ (గ్రూపు) పరీక్షలు మాత్రమే రాయాలనుకుంటే మే చివరిలోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన పరీక్షలను డిసెంబర్‌లో రాయాలనుకుంటే సెప్టెంబర్‌లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.
- ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ పరీక్షల తర్వాతి సంవత్సరం జూన్‌లో అన్ని మాడ్యూల్స్ (గ్రూపులు) రాయాలంటే ప్రస్తుత సంవత్సరం ఆగస్టు 31లోగా అలాగే ఒక మాడ్యూల్ (గ్రూపు)ను తర్వాతి సంవత్సరం జూన్‌లో రాయాలంటే నవంబర్ చివర్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ పరీక్షలకు జూన్‌లో హాజరు కావాలనుకుంటే మార్చి 25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి.
అర్హత: 10+2/ఇంటర్మీడియెట్/డిగ్రీ
ఇన్‌స్టిట్యూట్: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ)
కాల వ్యవధి: డిగ్రీ తర్వాత రెండున్నరేళ్లు,10+2 తర్వాత మూడున్నరేళ్లు
పరీక్ష: ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో
ఫీజు: దాదాపు రూ. 25 వేలు
వెబ్‌సైట్: www.icsi.edu
Published date : 28 Aug 2014 03:11PM