ఆన్‌లైన్ పరీక్షా కాలం!
Sakshi Education
ఆన్‌లైన్ టెస్ట్ (Online Test).. ఈ మధ్య కాలంలో ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలకు సిద్ధమవుతున్న వారి నోటి నుంచి బాగా వినిపిస్తున్న మాట ఇది! ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సంప్రదాయ పేపర్-పెన్సిల్ పరీక్ష స్థానంలో ఆన్‌లైన్ పరీక్ష వచ్చి చేరింది. ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్, ఐఐటీలలో ఎంఈ, ఎంటెక్, నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలకు వీలుకల్పించే గేట్ తదితర పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకు ఉద్యోగ నియామకాల పరీక్షలతో బాగా ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్ పరీక్ష ధోరణి వివరాలతో పాటు విజయ వ్యూహాలపై ఫోకస్...
ఆన్‌లైన్ పరీక్ష ఎందుకు?
పరీక్షల నిర్వాహకులు ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష విధానం వైపు మొగ్గు చూపడానికి కారణాలు..
ఏదైనా ఓ పోటీ పరీక్షకు ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేసేవారు. ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష విధానం రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ఆయా పరీక్షలకు సంబంధించి మోడల్ పేపర్ల స్థానంలో ఇప్పుడు ‘ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్’ వచ్చి చేరింది. శిక్షణ సంస్థలు.. తమ అభ్యర్థులకు వీటిని అందుబాటులో ఉంచుతున్నాయి. ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల వాస్తవ పరీక్ష విధానానికి అలవాటుపడొచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.
నెట్ తోడుగా ప్రాక్టీస్:
ఆన్‌లైన్ పరీక్షలకు అలవాటుపడేందుకు, పరిజ్ఞానం సంపాదించుకునేందుకు ఉపయోగపడే మరో మార్గం.. ఇంటర్నెట్. ఉద్యోగ నియామక పరీక్షలు, ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇప్పుడు అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్‌లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకుsakshieducation.comలో బ్యాంకు పరీక్షలు, గ్రూప్స్ తదితర పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కు ప్రాక్టీస్ పరీక్షలు ఉన్నాయి. వీటిని రాయాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వీలున్నప్పుడు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల సహాయంతో లాగిన్ అయి ఈ పరీక్షలు రాయొచ్చు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్).. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో క్లరికల్, ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇది ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన పెంపొందించుకునేందుకు వీలుగా ప్రాక్టీస్ ఆన్‌లైన్ మాక్ టెస్ట్ లింక్‌ను www.ibps.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రోల్ నెం, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి పరీక్ష రాయొచ్చు.
ఆన్‌లైన్ పరీక్ష ఎందుకు?
పరీక్షల నిర్వాహకులు ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష విధానం వైపు మొగ్గు చూపడానికి కారణాలు..
- పరీక్ష నిర్వహణ ఖర్చు తగ్గుతుంది:
ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. ఉదాహరణకు ఒక జాతీయ స్థాయి పరీక్షను నిర్వహించాలంటే దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రశ్నపత్రాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షల వల్ల ఇలాంటి అవసరం ఉండదు.
- భద్రత:
ప్రశ్నపత్రాల ముద్రణ సమయంలో లేదంటే వాటిని పరీక్ష కేంద్రాలకు చేరవేసేటప్పుడు లీక్ చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆన్‌లైన్ విధానం వల్ల ఇలాంటి లీక్‌లకు కళ్లెం వేయొచ్చు. అవసరమనుకుంటే చివరి నిమిషంలో కూడా ప్రశ్నలు మార్చడానికి వీలుంటుంది. కరెంటు పోయినా, ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడినా డేటాకు నష్టం ఉండదు. మొత్తంమీద భద్రతకు, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పరీక్షను నిర్వహించవచ్చు.
- అభ్యర్థులకు అనువుగా:
నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న తేదీలో, సమయంలో పరీక్ష రాసే స్వేచ్ఛ ఉంటుంది. Exam Slot Booking ద్వారా ఈ సౌకర్యం పొందొచ్చు.
- తేలిగ్గా మూల్యాంకనం:
పేపర్-పెన్సిల్ విధానంలో పేపర్లను దిద్దడం, మార్కులను సంగ్రహపరచడం.. ఇదంతా జరిగి, ఫలితాలు వెల్లడించడానికి చాలా సమయం తీసుకుంటుంది. అదే ఆన్‌లైన్ పరీక్ష అయితే ఒక్క క్లిక్‌తో అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసిపోతుంది. చాలా త్వరగా ఫలితాల వెల్లడికి వీలుంటుంది.
- పచ్చని పరీక్ష:
కాగితాలను కలప గుజ్జుతో తయారు చేస్తారు. సాధారణంగా ఓ చెట్టు నుంచి 17 రీమ్‌ల కాగితాలను తయారు చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షల విధానం వల్ల కాగితాల వాడకం తగ్గి, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ఏదైనా ఓ పోటీ పరీక్షకు ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేసేవారు. ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష విధానం రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ఆయా పరీక్షలకు సంబంధించి మోడల్ పేపర్ల స్థానంలో ఇప్పుడు ‘ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్’ వచ్చి చేరింది. శిక్షణ సంస్థలు.. తమ అభ్యర్థులకు వీటిని అందుబాటులో ఉంచుతున్నాయి. ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల వాస్తవ పరీక్ష విధానానికి అలవాటుపడొచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.
నెట్ తోడుగా ప్రాక్టీస్:
ఆన్‌లైన్ పరీక్షలకు అలవాటుపడేందుకు, పరిజ్ఞానం సంపాదించుకునేందుకు ఉపయోగపడే మరో మార్గం.. ఇంటర్నెట్. ఉద్యోగ నియామక పరీక్షలు, ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇప్పుడు అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్‌లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకుsakshieducation.comలో బ్యాంకు పరీక్షలు, గ్రూప్స్ తదితర పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కు ప్రాక్టీస్ పరీక్షలు ఉన్నాయి. వీటిని రాయాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వీలున్నప్పుడు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల సహాయంతో లాగిన్ అయి ఈ పరీక్షలు రాయొచ్చు.
- వివిధ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పరీక్షలు రాసిన తర్వాత వచ్చిన స్కోర్, తప్పుగా సమాధానం గుర్తించిన ప్రశ్నలు-వాటికి సరైన సమాధానాలు, వివరణ ఇలా వివిధ అంశాలు ఒక్క క్లిక్‌తో తెరపై ప్రత్యక్ష మవుతాయి.
- కొంత మొత్తాన్ని వసూలు చేసి, ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్న వెబ్‌సైట్లు ఉన్నా యి. వీటిలో ప్రతి ప్రశ్న కింద ‘వ్యూ ఆన్సర్’; ‘వర్క్‌స్పేస్’; ‘రిపోర్ట్’; డిస్కస్ ఇన్ ఫోరమ్ (ఇందులో వివరణతో పాటు అదనపు సమాచారం తెలుసుకునేందుకు లింక్ కూడా ఇస్తున్నాయి).
- కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)
- గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్
- ఎస్‌బీఐ ఉద్యోగ నియామక పరీక్షలు
- మ్యాట్, సీమ్యాట్ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షలు
- జేఈఈ మెయిన్, బిట్‌శాట్ తదితర పరీక్షలు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్).. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో క్లరికల్, ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇది ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన పెంపొందించుకునేందుకు వీలుగా ప్రాక్టీస్ ఆన్‌లైన్ మాక్ టెస్ట్ లింక్‌ను www.ibps.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రోల్ నెం, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి పరీక్ష రాయొచ్చు.
నిపుణుల మాట అభ్యర్థులకు సూచనలు..
వాణి ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్. |
Published date : 08 Aug 2014 10:34AM