కెరీర్ గైడెన్స్.. క్రెడిట్ అనలిస్ట్
Sakshi Education
ఓ వ్యాపార సంస్థ.. కార్యకలాపాల విస్తరణ దష్ట్యా బ్యాంకు రుణానికి దరఖాస్తు చేసుకుంది. అయితే.. ఆ సంస్థ సత్తా ఏంటి? తిరిగి రుణం చెల్లించే స్థోమత ఉందా? బ్యాంకు అధికారులకు సాధారణంగా తలెత్తే సందేహాలు.
ఓ వ్యాపార సంస్థ.. మరో సంస్థను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చింది. మరి టేకోవర్ చేయాలనుకుంటున్న సంస్థ పనితీరు ఏంటి? టేకోవర్ చేస్తే పరిణామాలేంటి? అనే విషయం తెలుసుకోవడం ఎలా?
ఈ రెండు సందర్భాల్లో ఆర్థిక పరమైన విశ్లేషణలు చేసి సరైన సలహానిచ్చే వారే.. క్రెడిట్ అనలిస్ట్‌లు. కేవలం బ్యాంకు రుణాలు, టేకోవర్ సందర్భాలు మాత్రమే కాకుండా..ప్రతి సంస్థలో సదరు సంస్థ ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళికలకు సంబంధించి క్రెడిట్ అనలిస్ట్‌ల పాత్ర ఎంతో కీలకం.
విధులివే:
ఆయా సంస్థలు, క్లెంట్‌లు ఇచ్చే ఆర్థిక సమాచారాన్ని విశ్లేషించి వాస్తవ పరిస్థితిని గ్రహించడం..సంబంధిత రిపోర్ట్, ప్రెజేంటేషన్స్‌ను రూపొందించడం..ఒక సంస్థ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేస్తూ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించడం.. లాభాలను ఆర్జించడానికి అనుసరించాల్సిన విధానాలను సిఫార్సు చేయడం తదితర విధులను క్రెడిట్ అనలిస్ట్‌లు నిర్వర్తిస్తుంటారు.
కావాల్సిన స్కిల్స్:
ఈ విభాగంలో స్థిరపడాలనుకునే వారికి కొన్ని స్కిల్స్ తప్పనిసరి. అవి.. చక్కటి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ స్కిల్స్
విశ్లేషణ సామర్థ్యం
ఆర్గనైజింగ్ స్కిల్స్ (నిర్వహణ సామర్థ్యం)
ప్రభావవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్
ఎక్సలెంట్ రిటెన్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్ (రిపోర్ట్ ప్రిపరేషన్, ప్రెజెంటేషన్ కోసం)
మల్టీ టాస్క్ టేకింగ్ స్కిల్స్
సమయస్ఫూర్తి
కెరీర్ గ్రోత్:
ట్రెనీ అనలిస్ట్ ్ట/జూనియర్ అనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సీనియర్ అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్, మేనేజర్ రేటింగ్స్ వంటి హోదాలు పొందొచ్చు. ప్రతిభ ఆధారంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)/ మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ)/తత్సమాన స్థాయికి చేరుకోవచ్చు. ఈ స్థాయికి చేరుకోవడంలో అనుభవం కూడా కీలక పాత్ర వహిస్తుంది.
కెరీర్ అవెన్యూస్:
బ్యాంకులు
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు
ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్
మ్యూచువల్ ఫండ్ హౌసెస్
ప్రెవేట్ ఈక్విటీ ఫర్మ్స్
నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (కెపీఓ) సెక్టర్
వేతనం:
ఎంట్రీ లెవల్‌లో ట్రెనీలుగా నెలకు రూ. 15 వేల ప్రారంభ జీతం ఉంటుంది. అర్హత అనుభవం ఆధారంగా స్వల్ప కాలంలోనే ఏడాదికి 5 నుంచి 6 లక్షల రూపాయల ఆదాయం పొందొచ్చు. సీఈఓ స్థాయికి చేరుకుంటే ఏడాదికి 40 లక్షల వేతనం ఉంటుంది.
కోర్సులు
క్రెడిట్ అనలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటే.. ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో మాస్టర్స్ కోర్సుల్లో (మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఎంబీఏ-ఫైనాన్స్, ఎంకాం తదితర) ఉత్తీర్ణత సాధించాలి. ఈ రంగంలో జాబ్ రిక్రూటర్స్ బీకామ్, బీటెక్, సీఏ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే ఈ ఫీల్డ్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే మాత్రం మాస్టర్ డిగ్రీ తప్పనిసరి. ముఖ్యంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్‌ఏ), ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ (ఎఫ్‌ఆర్‌ఎం) వంటి అర్హతలు ఉండడం కెరీర్ పరంగా అవకాశాలను విస్త్రతం చేస్తుంది.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్స్:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం).
వీటిల్లో క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వివరాలకు: www.catiim.in
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
వెబ్‌సైట్: www.du.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ-ఢిల్లీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్)
వెబ్‌సైట్: www.iitd.ac.in
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా
వెబ్‌సైట్: www.icai.org
నార్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ముంబై
వెబ్‌సైట్: https://nmims.edu
ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్-ముంబై
వెబ్‌సైట్: www.spjimr.org
జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-భువనేశ్వర్
వెబ్‌సైట్: www.ximb.ac.in
ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.imi.edu

Published date : 21 Jan 2013 03:51PM