షైనింగ్ కెరీర్‌కు..సీఎంఏ
Sakshi Education
ఆర్థిక కార్యకలాపాల ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తు తయారీ, సేవారంగ పరిశ్రమలకు వనరుల సమర్ధ నిర్వహణ కీలకంగా మారింది.
ఈ క్రమంలో అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించే కాస్ట్ అకౌంటెంట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్‌లు పెట్టుబడులు, ప్రణాళిక రూపకల్పన, లాభాల వ్యూహాలు, ప్రాజెక్టు నిర్వహణ తదితరాల్లో సేవలందిస్తారు. ప్రస్తుతం చాలామంది కాస్ట్ అకౌంటెంట్‌లు సంస్థల్లో కీలక పదవులైన చైర్మన్, సీఈవో/సీఎఫ్‌వో, ఎండీ, ఫైనాన్స్ డెరైక్టర్, ఫైనాన్స్ కంట్రోలర్ తదితర హోదాల్లో సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) కోర్సు వివరాలు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
ప్రస్తుత ప్రొఫెషనల్ కామర్స్ కోర్సుల్లో సులువుగా పూర్తిచేసుకోగలిగే కోర్సు సీఎంఏ. కోర్సు వ్యవధి చాలా తక్కువ కావడం, జీవితంలో త్వరగా స్థిరపడేందుకు అవకాశం ఉండటం వల్ల విద్యార్థులు సీఎంఏ వైపు మొగ్గుచూపుతున్నారు. పదో తరగతి తర్వాత కేవలం నాలుగేళ్లలో కోర్సు పూర్తిచేయొచ్చు. ఇంటర్ ఎంఈసీతోపాటు సీఎంఏ చదవడం ప్రారంభిస్తే ఇంటర్ తర్వాత కేవలం రెండేళ్లలో ముగించొచ్చు. అదే విధంగా ఇంటర్ తర్వాత చదవడం ప్రారంభిస్తే రెండున్నరేళ్లలో కోర్సును పూర్తిచేయొచ్చు. ఏ గ్రూప్‌లో ఇంటర్/డిగ్రీ పూర్తిచేసినా సీఎంఏ చేయొచ్చు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు కూడా అర్హులే. డిగ్రీ/ఇంజనీరింగ్ తర్వాత కోర్సు పూర్తిచేసేందుకు రెండేళ్లు పడుతుంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. సీఎంఏ కోర్సుకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది.
రిజిస్ట్రేషన్ విధానం
సీఎంఏ ఫౌండేషన్
సీఎంఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ అనే మూడు దశలు ఉంటాయి. తొలిదశ ఫౌండేషన్ (2016, ఆగస్టు సిలబస్ ప్రకారం)లో నాలుగు పేపర్లు ఉంటాయి. రోజుకో పేపర్‌కు పరీక్ష జరుగుతుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది.
సీఎంఏ ఇంటర్ (ఎగ్జిక్యూటివ్)
ప్రాక్టికల్ శిక్షణ
సీఎంఏ ఫైనల్ రాయాలంటే ఆర్నెల్ల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. సీఎంఏ ఇంటర్ (ఎగ్జిక్యూటివ్)లో ఉత్తీర్ణత సాధించినవారు గుర్తింపు పొందిన సంస్థలో నిర్దేశించిన విభాగంలో లేదా ప్రాక్టీసింగ్ అకౌంటెంట్ దగ్గర శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రాంతాన్నిబట్టి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు స్టైపెండ్ పొందొచ్చు.
సీఎంఏ ఫైనల్
అపార అవకాశాలు -ఎం.ఎస్.ఎస్. ప్రకాశ్ డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్
సీఎంఏ పూర్తిచేసిన వారికి అవకాశాలు విస్తృతం. ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్లు.. కాస్ట్ రికార్డులు, కాస్ట్ ఆడిట్‌ను (కంపెనీల చట్టం 2013 ప్రకారం) నిర్వహించడం; ట్యాక్స్ కన్సల్టెన్సీ సేవలు; ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సేవలు; ఇంటర్నల్ ఆడిట్ తదితర విధులు నిర్వర్తిస్తారు. సీఎంఏలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత హోదాలతో అవకాశాలు లభిస్తున్నాయి. 2018, ఏప్రిల్-మేలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సీఎంఏలకు సగటున రూ.7 లక్షల వార్షిక వేతనంతో, గరిష్టంగా రూ.18 లక్షలతో ఆఫర్లు లభించాయి. ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్, ఐటీసీ, కేపీఎంజీ తదితర 40 సంస్థలు పాల్గొన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు కూడా దూరవిద్య ద్వారా సీఎంఏ కోర్సు పూర్తిచేసి ఇంక్రిమెంట్ పొందొచ్చు.

- ఇంజనీరింగ్‌కు సమాంతరంగా సీఎంఏ కోర్సును పూర్తిచేసేలా కొత్త విధానంపై కసరత్తు జరుగుతోంది.
- సాధారణంగా ఇంజనీరింగ్/డిగ్రీ పూర్తిచేసిన వారిలో కొందరు మంచి ఉద్యోగావకాశాల కోసం ఎంబీఏ వైపు వెళ్తారు. ఇలాంటివారు సీఎంఏ చేయడం ద్వారా విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ విధానం
- సీఎంఏ చదవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి ఇంటర్మీడియెట్/10+2లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- సీఎంఏ ఫౌండేషన్ చదవాలంటే ముందుగా రూ.4000 డీడీని కోల్‌కతాలో ఏదైనా షెడ్యూల్డు బ్యాంకులో చెల్లేలా తీయాలి. దీన్ని పూర్తిచేసిన రిజిస్ట్రేషన్ దరఖాస్తుతో పాటు సీఎంఏ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతాకు పంపాలి. లేదంటే సీఎంఏ అనుబంధ సంస్థలోనూ ఇవ్వొచ్చు.
- సీఎంఏ అనుబంధ సంస్థలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, కొత్తగూడెం, రాజమండ్రిలో ఉన్నాయి. జూన్‌లో ఫౌండేషన్ పరీక్ష రాయాలంటే అదే సంవత్సరం జనవరి 31లోపు; డిసెంబర్‌లో రాయాలనుకుంటే అదే సంవత్సరం జూలై 31 లోపు పేరు నమోదు చేయించుకోవాలి.
సీఎంఏ ఫౌండేషన్
సీఎంఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ అనే మూడు దశలు ఉంటాయి. తొలిదశ ఫౌండేషన్ (2016, ఆగస్టు సిలబస్ ప్రకారం)లో నాలుగు పేపర్లు ఉంటాయి. రోజుకో పేపర్‌కు పరీక్ష జరుగుతుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది.
సీఎంఏ ఇంటర్ (ఎగ్జిక్యూటివ్)
- సీఎంఏ ఫౌండేషన్ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు సీఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏడాది తర్వాత పరీక్ష రాసేందుకు అర్హులు.
- డిగ్రీ ఉత్తీర్ణులు, ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు సీఎంఏ ఫౌండేషన్ రాయకుండానే నేరుగా సీఎంఏ ఇంటర్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌లో పరీక్షలు జరుగుతాయి.
- సీఎంఏ ఇంటర్‌లో రెండు గ్రూపులు ఉంటాయి. గ్రూప్-1లో ఫైనాన్షియల్ అకౌంటింగ్; లాస్ అండ్ ఎథిక్స్; డెరైక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించారు. ఉత్తీర్ణత సాధించాలంటే ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు; మొత్తంమీద 50 శాతం మార్కులు రావాలి.
- గ్రూప్-2లో ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్; కాస్ట్ -అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; ఇన్‌డెరైక్ట్ ట్యాక్సేషన్; కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్ సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించారు. ఉత్తీర్ణత సాధించాలంటే ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు; మొత్తంమీద 50 శాతం మార్కులు రావాలి.
ప్రాక్టికల్ శిక్షణ
సీఎంఏ ఫైనల్ రాయాలంటే ఆర్నెల్ల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. సీఎంఏ ఇంటర్ (ఎగ్జిక్యూటివ్)లో ఉత్తీర్ణత సాధించినవారు గుర్తింపు పొందిన సంస్థలో నిర్దేశించిన విభాగంలో లేదా ప్రాక్టీసింగ్ అకౌంటెంట్ దగ్గర శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రాంతాన్నిబట్టి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు స్టైపెండ్ పొందొచ్చు.
సీఎంఏ ఫైనల్
- ప్రాక్టికల్ శిక్షణ పూర్తయిన తర్వాత ఫైనల్ పరీక్ష రాయొచ్చు. ఇందులో రెండు గ్రూపులు (3, 4) ఉంటాయి. వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఆర్నెల్ల వ్యత్యాసంతో రాయొచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌లో పరీక్షలు జరుగుతాయి.
- సీఎంఏ ఫైనల్, తర్వాత ఇన్‌స్టిట్యూట్ వారి కంప్యూటర్ శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్‌లుగా పరిగణిస్తారు. వీరు నేరుగా ఉద్యోగంలో చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయాలంటే మరో రెండున్నరేళ్లు ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. ఇది పూర్తయితే సీఎంఏ ఇన్‌స్టిట్యూట్.. సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) అందిస్తుంది.
అపార అవకాశాలు -ఎం.ఎస్.ఎస్. ప్రకాశ్ డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్
సీఎంఏ పూర్తిచేసిన వారికి అవకాశాలు విస్తృతం. ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్లు.. కాస్ట్ రికార్డులు, కాస్ట్ ఆడిట్‌ను (కంపెనీల చట్టం 2013 ప్రకారం) నిర్వహించడం; ట్యాక్స్ కన్సల్టెన్సీ సేవలు; ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సేవలు; ఇంటర్నల్ ఆడిట్ తదితర విధులు నిర్వర్తిస్తారు. సీఎంఏలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత హోదాలతో అవకాశాలు లభిస్తున్నాయి. 2018, ఏప్రిల్-మేలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సీఎంఏలకు సగటున రూ.7 లక్షల వార్షిక వేతనంతో, గరిష్టంగా రూ.18 లక్షలతో ఆఫర్లు లభించాయి. ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్, ఐటీసీ, కేపీఎంజీ తదితర 40 సంస్థలు పాల్గొన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు కూడా దూరవిద్య ద్వారా సీఎంఏ కోర్సు పూర్తిచేసి ఇంక్రిమెంట్ పొందొచ్చు.
Published date : 19 Jul 2018 06:22PM