పదిలమైన కెరీర్‌కు...కామర్స్ కోర్సులు
Sakshi Education
పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో తీసుకునే గ్రూపుపైనే భవిష్యత్ కెరీర్ ఆధారపడి ఉంటుంది. అందుకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. బాగా ఆలోచించాకే గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలంటున్నారు నిపుణులు.
ఇంటర్మీడియెట్‌లో కామర్స్‌ను తీసుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని చెబుతున్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు, డిజిటల్ లావాదేవీలు పెరగడం తదితరాల వల్ల దేశంలో కామర్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న కామర్స్ గ్రూపులు, ప్రొఫెషనల్ కోర్సులు, కెరీర్ అవకాశాల వివరాలు..
ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ (ఎంఈసీ); సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ (సీఈసీ) గ్రూపులకు మంచి ఆదరణ ఉంది. కామర్స్ కోర్సుల (సీఏ, సీఎస్, సీఎంఏ..) ద్వారా భవిష్యత్తులో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు ఈ గ్రూప్‌లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో ఓ సంస్థను ఏర్పాటు చేయాలన్నా, వ్యాపారవేత్తగా స్థిరపడాలన్నా కామర్స్ పరిజ్ఞానం అత్యంత ఆవశ్యకం. ఎంఈసీ/సీఈసీ చదవడం వల్ల వ్యాపారానికి అవసరమైన ఆర్థిక, వాణిజ్య అంశాలపై పట్టు సాధించొచ్చు. మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉన్న కామర్స్ ఔత్సాహికులు ఎంఈసీ తీసుకోవచ్చు. మ్యాథ్స్ అంటే భయపడి, కామర్స్ దిశగా వెళ్లాలనుకునేవారు సీఈసీ ఎంపిక చేసుకోవచ్చు.
ప్రొఫెషనల్ కోర్సులు..
కామర్స్ కోర్సుల్లో చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), సీఎంఏ(కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ)లను ముఖ్య ప్రొఫెషనల్ కోర్సులుగా చెప్పొచ్చు.
సీఏ :
ఇంటర్ ఎంఈసీ తర్వాత భవిష్యత్తులో చదివేందుకు అవకాశమున్న కోర్సులు, పరీక్షలు..
కామర్స్‌కు కొలువులెక్కడ..?
ప్రస్తుతం అన్ని రంగాలు, అన్ని పరిశ్రమలు.. ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నవే! ఆయా రంగాల్లో, కంపెనీల్లో వివిధ విభాగాల్లో అకౌంటింగ్, ఫైనాన్స్ బాధ్యతలు నిర్వహించేందుకు కామర్స్ నిపుణుల అవసరం ఉంటుంది. దాంతోపాటు సదరు సంస్థల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఉన్నతాధికారులకు సరైన సలహాలు ఇచ్చేందుకు, అవసరమైతే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సీఏ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు చదివిన నిపుణుల సేవలు తప్పనిసరి. కామర్స్ రంగంలో కెరీర్ కోరుకునే విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ముఖ్యంగా ఈ రంగంలో ఎదగాలనుకునేవారు వాణిజ్య వ్యాపార రంగాల్లో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్‌డేట్ అవుతుండాలి.
సీఎంఏ :
కంపెనీ సెక్రటరీ (సీఎస్) :
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కొత్త సిలబస్..
మాడ్యూల్ 1: జ్యూరిస్‌స్ప్రుడెన్స్, ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాస్; కంపెనీలా; సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అండ్ క్లోజర్; ట్యాక్స్ లాస్.
మాడ్యూల్ 2: కార్పొరేట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్; సెక్యూరిటీస్ లాస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్; ఎకనామిక్స్, బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్; ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
సీఎస్-ప్రొఫెషనల్ ప్రోగ్రాం కొత్త సిలబస్..
మాడ్యూల్ 1: గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, కంప్లయన్సెస్ అండ్ ఎథిక్స్; అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ లాస్; డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్ అండ్ అపియరెన్సెస్.
మాడ్యూల్ 2: సెక్రటేరియల్ ఆడిట్, కంప్లయన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డ్యూ డెలిగెన్స్; కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, ఇన్‌సాల్వెన్సీ, లిక్విడేషన్ అండ్ వైండింగ్ అప్; రిసల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్, నాన్ కంప్లయన్సెస్ అండ్ రెమిడీస్.
మాడ్యూల్ 3: కార్పొరేట్ ఫండింగ్ అండ్ లిస్టింగ్స్ ఇన్ స్టాక్ ఎక్స్ఛేంజ్; మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీస్; ఎలక్టివ్ పేపర్ (బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్/ఇన్సూరెన్స్-లా అండ్ ప్రాక్టీస్/ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్-లాస్ అండ్ ప్రాక్టీసెస్/ఫోరెన్సిక్ ఆడిట్/డెరైక్ట్ ట్యాక్స్ లా అండ్ ప్రాక్టీస్/వాల్యుయేషన్ అండ్ బిజినెస్ మోడలింగ్/ఇన్‌సాల్వెన్సీ లా అండ్ ప్రాక్టీస్.
అవకాశాలు..
సీఎస్ కోర్సు పూర్తిచేసిన వారు కంపెనీ రిజిస్ట్రార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ తదితర హోదాల్లో పనిచేయొచ్చు.

- కోర్సులో కొత్త సంస్కరణల అమలు వల్ల సీఏలకు ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక తొలి మూడు నెలల్లో పన్ను గణన, అకౌంటింగ్, డేటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు కొత్తగా లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన సీఏలకు విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
- ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌తో పాటే సీఏ కోర్సు చదవడం ప్రారంభించొచ్చు. ఇంటర్ ఎంఈసీ/ఎంపీసీ/బైపీసీ/సీఈసీ/హెచ్‌ఈసీ.. ఇలా ఏ గ్రూప్ వారైనా సీఏ కోర్సు చదవొచ్చు. ఇంటర్‌తో పాటే సీఏ చదవడం వల్ల ప్రాథమిక అంశాలపై పట్టు చిక్కుతుంది. భవిష్యత్తులో చదవబోయే సీఏ కోర్సులోని దశలకు గట్టి పునాది ఏర్పడుతుంది.
- సీఏ కోర్సులోని మొదటి దశ సీఏ ఫౌండేషన్. ఇంటర్మీడియెట్/10+2 పరీక్షలు రాసిన వారెవరైనా ఫౌండేషన్‌కు నమోదు చేయించుకోవచ్చు. ఆ తర్వాత నాలుగు నెలలకు పరీక్ష రాయొచ్చు. పరీక్షలో 50 శాతం మార్కులను డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు, మరో 50 శాతం మార్కులను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు కేటయించారు. ఫౌండేషన్ కోర్సులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్ (100 మార్కులు); బిజినెస్ లాస్ (60 మా.), బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్ (40 మా.); బిజినెస్ మ్యాథమెటిక్స్ (40 మా.), లాజికల్ రీజనింగ్ (20 మా.), స్టాటిస్టిక్స్ (40 మా.); బిజినెస్ ఎకనామిక్స్ (60 మా.), బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ (40 మా.).
- సీఏ ఫౌండేషన్ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి. ఇందులో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అన్ని పేపర్లకు కలిపి 50 శాతం మార్కులు సాధించాలి.
- సీఏ ఫౌండేషన్ పూర్తిచేసిన వారు సీఏ ఇంటర్మీడియెట్ చదివేందుకు అర్హులు. ఇందులో రెండు గ్రూపులుంటాయి. ఒక్కో గ్రూప్‌లో 4 చొప్పున మొత్తం 8 పేపర్లు రాయాల్సి ఉంటుంది. వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపును ఆర్నెల్ల వ్యత్యాసంతో రాయొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు; గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులు సాధించాలి. ఈ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి.
- సీఏ ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన వారు ప్రాక్టీసింగ్ సీఏ దగ్గర లేదా ఆడిట్ సంస్థలో మూడేళ్లపాటు ఆర్టికల్‌షిప్ (ప్రాక్టికల్ ట్రైనింగ్) చేయాలి. కొత్త విధానంలో ఇంటర్మీడియెట్‌లోని రెండు గ్రూపులు లేదా ఏదైనా ఒక గ్రూపు పూర్తిచేసిన వారు ప్రాక్టికల్ శిక్షణ పొందొచ్చు. శిక్షణ సమయంలో ప్రాంతాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు స్టైపెండ్ పొందొచ్చు.
- రెండున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణ పొందినవారు సీఏ మూడోదశ ఫైనల్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఫైనల్ పరీక్షలో 8 పేపర్లు (ఒక్కో గ్రూప్‌లో నాలుగు పేపర్లు) ఉంటాయి. ఈ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి.
- కెరీర్ అవకాశాలు: సీఏ కోర్సు పూర్తిచేసిన వారు కంపెనీలకు మేనేజింగ్ డెరైక్టర్, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, ప్లాంట్ అకౌంటెంట్ తదితర అవ కాశాలు అందిపుచ్చుకోవచ్చు. ట్రస్టీ, అడ్మిని స్ట్రేటర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ట్యాక్స్ కన్స ల్టెంట్ తదితర ఉద్యోగాలూ పొందొచ్చు. ప్రారంభంలో నెలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు.
ఇంటర్ ఎంఈసీ తర్వాత భవిష్యత్తులో చదివేందుకు అవకాశమున్న కోర్సులు, పరీక్షలు..
ప్రొఫెషనల్ కోర్సులు | జనరల్ కోర్సులు | కాంపిటీటివ్ పరీక్షలు | |
సీఏ | బీకామ్ | ఎంబీఏ | గ్రూప్స్ |
సీఎంఏ | బీబీఎం | ఎంకామ్ | సివిల్స్ |
సీఎస్ | బీఏ | ఎంసీఏ | బ్యాంక్ ఎగ్జామ్స్ |
లా | బీఎస్సీ | ఎంఎస్సీ | డీఎస్సీ.. |
కామర్స్‌కు కొలువులెక్కడ..?
ప్రస్తుతం అన్ని రంగాలు, అన్ని పరిశ్రమలు.. ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నవే! ఆయా రంగాల్లో, కంపెనీల్లో వివిధ విభాగాల్లో అకౌంటింగ్, ఫైనాన్స్ బాధ్యతలు నిర్వహించేందుకు కామర్స్ నిపుణుల అవసరం ఉంటుంది. దాంతోపాటు సదరు సంస్థల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఉన్నతాధికారులకు సరైన సలహాలు ఇచ్చేందుకు, అవసరమైతే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సీఏ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు చదివిన నిపుణుల సేవలు తప్పనిసరి. కామర్స్ రంగంలో కెరీర్ కోరుకునే విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ముఖ్యంగా ఈ రంగంలో ఎదగాలనుకునేవారు వాణిజ్య వ్యాపార రంగాల్లో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్‌డేట్ అవుతుండాలి.
సీఎంఏ :
- సీఏ కోర్సును వద్దనుకునే వారు సీఎంఏను ఎంపిక చేసుకోవచ్చు. పదో తరగతి తర్వాత కేవలం నాలుగేళ్లలో, ఇంటర్ ఎంఈసీతో పాటు సీఎంఏ చదివిన విద్యార్థులు ఇంటర్ తర్వాత రెండేళ్లలో; ఇంటర్ తర్వాత సీఎంఏ చదవడం ప్రారంభించిన వారు రెండున్నరేళ్లలో కోర్సు పూర్తిచేయొచ్చు. ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ వారైనా సీఎంఏ చదవొచ్చు.
- సీఎంఏ కోర్సులో తొలిదశ ఫౌండేషన్. ఇందులో నాలుగు పేపర్లుంటాయి. ప్రతి పేపర్‌కు 100 మార్కులుంటాయి. పరీక్షలో ఉత్తీర్ణతకు 50 శాతం మార్కులు సాధించాలి. ఈ పరీక్ష ఏటా జూన్, డిసెంబర్‌లో జరుగుతుంది.
- ఫౌండేషన్ పూర్తిచేసిన వారు సీఎంఏ ఇంటర్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇందులో రెండు గ్రూపులుంటాయి. ఒక్కో గ్రూపులో నాలుగు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. విద్యార్థులు వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి, విడివిడిగా ఒక్కో గ్రూపు ఆర్నెల్ల వ్యత్యాసంతో రాయొచ్చు.
- సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆర్నెల్ల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. శిక్షణ సమయంలో ప్రాంతాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు స్టైపెండ్ పొందొచ్చు. ప్రాక్టికల్ శిక్షణ తర్వాత ఫైనల్ పరీక్ష రాయొచ్చు. ఇందులో రెండు గ్రూపులుంటాయి. వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపును ఆర్నెల్ల వ్యత్యాసంతో రాయొచ్చు.
- సీఎంఏ కోర్సు పూర్తిచేసిన వారు చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్, కాస్ట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కంట్రోలర్ వంటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
కంపెనీ సెక్రటరీ (సీఎస్) :
- ఇంటర్‌లో ఏ గ్రూపు వారైనా సీఎస్ కోర్సు చదవొచ్చు. సీఎస్ కోర్సులో తొలిదశ ఫౌండేషన్. ఇది ఏటా జూన్, డిసెంబర్‌లో జరుగుతుంది. పరీక్షలో నాలుగు సబ్జెక్టులుంటాయి.
- ఫౌండేషన్‌లో బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ అండ్ లా; బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎథిక్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; బిజినెస్ ఎకనామిక్స్; ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ సబ్జెక్టులుంటాయి. పరీక్షలో 200 ప్రశ్నలకు 400 మార్కులుంటాయి.
- సీఎస్ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణులైనవారు నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్ష (రెండు మాడ్యూల్స్‌గా 8 పేపర్లు) రాయొచ్చు. ఈ పరీక్ష కూడా ఏడాదికి రెండుసార్లు జూన్, డిసెంబర్‌లో జరుగుతుంది.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కొత్త సిలబస్..
మాడ్యూల్ 1: జ్యూరిస్‌స్ప్రుడెన్స్, ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాస్; కంపెనీలా; సెట్టింగ్ అప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ అండ్ క్లోజర్; ట్యాక్స్ లాస్.
మాడ్యూల్ 2: కార్పొరేట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్; సెక్యూరిటీస్ లాస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్; ఎకనామిక్స్, బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్; ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
- సీఎస్ కోర్సు పూర్తిచేసే క్రమంలో రాతపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా తప్పనిసరిగా అప్రెంటీస్‌షిప్ పేరుతో ఉండే ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాలి. దీని గరిష్ట వ్యవధి మూడేళ్లు.
- ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాసిన ఏడాది తర్వాత ప్రొఫెషనల్ పరీక్ష (మూడు మాడ్యూళ్లలో 9 పేపర్లు) రాయాల్సి ఉంటుంది.
సీఎస్-ప్రొఫెషనల్ ప్రోగ్రాం కొత్త సిలబస్..
మాడ్యూల్ 1: గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, కంప్లయన్సెస్ అండ్ ఎథిక్స్; అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ లాస్; డ్రాఫ్టింగ్, ప్లీడింగ్స్ అండ్ అపియరెన్సెస్.
మాడ్యూల్ 2: సెక్రటేరియల్ ఆడిట్, కంప్లయన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డ్యూ డెలిగెన్స్; కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, ఇన్‌సాల్వెన్సీ, లిక్విడేషన్ అండ్ వైండింగ్ అప్; రిసల్యూషన్ ఆఫ్ కార్పొరేట్ డిస్ప్యూట్స్, నాన్ కంప్లయన్సెస్ అండ్ రెమిడీస్.
మాడ్యూల్ 3: కార్పొరేట్ ఫండింగ్ అండ్ లిస్టింగ్స్ ఇన్ స్టాక్ ఎక్స్ఛేంజ్; మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీస్; ఎలక్టివ్ పేపర్ (బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీస్/ఇన్సూరెన్స్-లా అండ్ ప్రాక్టీస్/ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్-లాస్ అండ్ ప్రాక్టీసెస్/ఫోరెన్సిక్ ఆడిట్/డెరైక్ట్ ట్యాక్స్ లా అండ్ ప్రాక్టీస్/వాల్యుయేషన్ అండ్ బిజినెస్ మోడలింగ్/ఇన్‌సాల్వెన్సీ లా అండ్ ప్రాక్టీస్.
అవకాశాలు..
సీఎస్ కోర్సు పూర్తిచేసిన వారు కంపెనీ రిజిస్ట్రార్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ తదితర హోదాల్లో పనిచేయొచ్చు.
Published date : 01 Jun 2018 04:57PM