Skip to main content

వ్యవసాయ డిప్లొమాలు

దేశం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇప్పటికీ దేశ జనాభాలో దాదాపు 60% మంది ప్రజలు వ్యవసాయం.. దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. టెక్నాలజీ అండతో వ్యవసాయం కొంతపుంతలు తొక్కుతోంది. బహుళజాతి సంస్థలు కూడా ఈ రంగంలో ప్రవేశించడంతో అగ్రికల్చర్.. ఉద్యోగావకాశాల కల్పతరువుగా మారింది. కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతోనే ఈ కోర్సుల్లో చేరొచ్చు. పదో తరగతి తర్వాత అగ్రికల్చర్ కోర్సులు.. అర్హతలు.. అవకాశాలు..
కోర్సులు
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
వ్యవధి:
రెండేళ్లు
తెలంగాణ కళాశాలలు: ప్రభుత్వ - 7, ప్రైవేటు - 7
సీట్లు: ప్రభుత్వ - 265, ప్రైవేటు- 420
ఆంధ్రప్రదేశ్ కళాశాలలు: ప్రభుత్వ - 14, ప్రైవేటు - 15
సీట్లు: ప్రభుత్వ - 435, ప్రైవేటు- 900

డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ
వ్యవధి:
రెండేళ్లు
తెలంగాణ కళాశాలలు: ప్రభుత్వ -1, ప్రైవేటు -1
సీట్లు: ప్రభుత్వ -60, ప్రైవేటు -60
ఆంధ్రప్రదేశ్ కళాశాలలు: ప్రభుత్వ - 1, ప్రైవేటు - 2
సీట్లు: ప్రభుత్వ - 25; ప్రైవేటు 120

డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
వ్యవధి:
మూడేళ్లు
తెలంగాణ కళాశాలలు: ప్రభుత్వ -1, ప్రైవేటు -3
సీట్లు: ప్రభుత్వ - 30, ప్రైవేటు - 90
ఆంధ్రప్రదేశ్ కళాశాలలు: ప్రభుత్వ - 2; ప్రైవేటు- 5
సీట్లు: ప్రభుత్వ - 60, ప్రైవేటు - 150

నోట్: కళాశాలలు, సీట్ల వివరాలు గతేడాది నోటిఫికేషన్ ఆధారంగా.

అర్హతలు
  • ఓసీ, బీసీ విద్యార్థులు 5.0 గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 4.0 జీపీఏతో పదో తరగతి ఉత్తీర్ణత. ఒకటి నుంచి పదో తరగతి వరకు కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో (నాన్ మునిసిపల్ ఏరియాల్లో) చదివుండాలి.
  • వయోపరిమితి: ఆగస్టు 31 నాటికి 15 ఏళ్లు పూర్తయి ఉండాలి. అదేవిధంగా 22 ఏళ్లు మించరాదు.

ఉన్నత విద్య
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ కోర్సుల ఉత్తీర్ణులు నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరొచ్చు. బీఎస్సీ (అగ్రికల్చర్) తర్వాత పీజీ, పీహెచ్‌డీ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు ప్రవేశపరీక్ష ద్వారా నేరుగా నాలుగేళ్ల బీటెక్ (అగ్రి ఇంజనీరింగ్) సెకండియర్‌లో ప్రవేశించొచ్చు.

కెరీర్
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు ప్రభుత్వ రంగంలో వ్యవసాయ విస్తరణాధికారులుగా పనిచేయొచ్చు. ప్రైవేటు రంగంలో వ్యవసాయ పరికరాలు, విత్తన తయారీ సంస్థల్లో, ఎరువులు, రసాయనాల కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేలతో కెరీర్ ప్రారంభమవుతుంది. తర్వాత పనితీరును బట్టి నెలకు రూ.25 వేలు పొందొచ్చు.

ప్రవేశ ప్రకటన : మే చివరి వారం/జూన్
వివరాలకు:  www.pjtsau.ac.in, www.angrau.ac.in చూడొచ్చు.

పదో తరగతి మార్కుల ఆధారంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లో ప్రవేశం కల్పిస్తారు. ముఖ్యంగా ఈ కోర్సుని అభ్యసించాలనుకునేవారు కనీసం నాలుగేళ్లపాటు నాన్ మున్సిపల్ ప్రాంతంలో చదివి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు వ్యవసాయంపై అవగాహన కల్పించడం, వారికి వ్యవసాయ రంగంపై మక్కువ ఏర్పడే లా చేయడం ఈ కోర్సుల ప్రధాన ఉద్దేశం. ఈ రంగంలో ఉన్నత చదువులు చదవాలనుకునే వారు అగ్రిసెట్ ద్వారా బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో ప్రవేశం పొందొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అనేక పథకాలను ప్రవేశపెట్టడం వల్ల ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి అనేక అవకాశాలున్నాయి.
డా॥పి.రఘురామిరెడ్డి, ప్రిన్సిపాల్, అసోసియేట్ డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఆర్‌ఏఆర్‌ఎస్ - వరంగల్

అగ్రికల్చర్ కోర్సులు ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం వైపు ప్రోత్సహించడానికి రూపొందించారు. విత్తన, ఫర్టిలైజర్ సంస్థలు అగ్రి ఉత్తీర్ణులను ఎంపిక చేసుకుంటున్నాయి. వీరికి అగ్రికల్చర్ బీఎస్సీలో 15 శాతం సీట్లను కేటాయించారు. అర్హత గల వారిని ప్రభుత్వం అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఏఈఓ)లుగా నియమిస్తోంది.
డా॥ఎ.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, అసోసియేట్ డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్, ఆర్‌ఏఆర్‌ఎస్ - పాలెం.
Published date : 10 May 2016 05:19PM

Photo Stories